koti
-
కోఠిలో కలకలం.. ప్రభుత్వ వైద్యుడిపై తోటి డాక్టర్ల దాడి
సాక్షి, హైదరాబాద్: నగరంలోని కోఠి డీఎంఈ కార్యాలయం వద్ద కలకలం రేగింది. ప్రభుత్వ వైద్యుడిపై తోటి వైద్యులు దాడికి పాల్పడ్డారు. దీంతో డీఎంఈ కార్యాలయం ముందు బాధిత వైద్యుడు డాక్టర్ శేఖర్ ఆందోళనకు దిగారు.సాధారణ బదిలీలపై ప్రభుత్వం ఇచ్చిన జీవో మేరకు అమలు చేయాలని డీఎంఈకు వినతి పత్రం ఇచ్చేందుకు వచ్చానని.. ఈ జీవో అమలు చేస్తే హైదరాబాద్‌లో పని చేస్తున్న వైద్యులు జిల్లాలకు, జిల్లాలలో పని చేస్తున్న వాళ్లు హైదరాబాద్‌కు 40 శాతం మేర బదిలీలు జరుగుతాయి. ఈ బదిలీ లను అడ్డుకునేందుకు డాక్టర్ పల్లం ప్రవీణ్ కుమార్, బొంగు రమేష్, రాథోడ్ , వినోద్ కుమార్‌లు కుట్ర చేస్తున్నారని డాక్టర్ శేఖర్ ఆరోపించారు.తాను డీఎంఈకు వినతి పత్రం ఇవ్వకుండా తనను అడ్డుకుని. తనపై దాడి చేశారన్నారు. తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం ముసుగులో ఎన్నో ఏళ్లుగా హైదరాబాద్ సిటీ లోనే తిష్ట వేశారు. వాటిపై ప్రశ్నించినందుకు తనపై దాడి చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడికి పాల్పడిన నలుగురు వైద్యులపై చర్యలు తీసుకొనేంత వరకు తాను డీఎంఈ కార్యాలయం ముందే బైఠాయిస్తానని వైద్యుడు శేఖర్ చెబుతున్నారు. -
మ్యూజిక్ డైరెక్టర్ కోటి చేతుల మీదుగా 'ప్రణయగోదారి' సాంగ్ విడుదల
సరికొత్తగా ఆవిష్కరిస్తున్న కథలకు, నాచురల్ లొకేషన్స్‌లో షూట్ చేస్తున్న సినిమాలకు ఈ రోజుల్లో మంచి డిమాండ్ ఉంటోంది. సరిగ్గా ఇదే పాయింట్ బేస్ చేసుకొని ఓ డిఫరెంట్ కంటెంట్‌తో 'ప్రణయగోదారి' అనే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. పిఎల్ విఘ్నేష్ దర్శకత్వంలో ఫీల్ గుడ్ ఎంటర్టైనర్గా ఈ సినిమా రూపొందుతోంది. ఈ సినిమాలో ప్రముఖ కమెడియన్ అలీ ఫ్యామిలీ నుంచి వచ్చిన నటుడు సదన్, ప్రియాంక ప్రసాద్, సునీల్ రావినూతల, 30 ఇయర్స్ పృథ్వీ, సాయి కుమార్ ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు.పిఎల్‌వి క్రియేషన్స్‌పై ఎంతో ప్రతిష్టాత్మకంగా పారమళ్ల లింగయ్య ఈ ‘ప్రణయగోదారి’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలతో బిజీగా ఉన్న యూనిట్.. జోరుగా ప్రమోషన్స్ కూడా చేస్తున్నారు. ఇందులో భాగంగా తాజాగా ఈ మూవీలో నుంచి ఫీల్ గుడ్ సాంగ్ లాంచ్ చేశారు. ప్రముఖ సంగీత దర్శకులు కోటి చేతుల మీదుగా ఈ సాంగ్ లాంచ్ చేశారు. కలలో కలలో.. అంటూ సాగిపోతున్న ఈ ప్రేమ గీతంలో లవ్ బీట్ అదిరిపోయిందని చెప్పుకోవాలి.ఈ సాంగ్ లాంచ్ చేసిన మ్యూజిక్ డైరెక్టర్ కోటి మాట్లాడుతూ.. ప్రణయగోదారి నుంచి ఈ సాంగ్ చూస్తుంటే ఫ్రెష్ ఫీలింగ్ కలుగుతోందని, అన్ని వర్గాల ఆడియన్స్ మెచ్చేలా ఈ సాంగ్ షూట్ చేశారని అన్నారు. పాటలోని లిరిక్స్, బీట్, అందుకు తగ్గ సన్నివేశాలు, నటీనటుల వేషధారణ అన్నీ కూడా చాలా బాగా కుదిరాయని అన్నారు. ఈ మేరకు చిత్రయూనిట్ మొత్తానికి ఆల్ ది బెస్ట్ చెప్పారు. -
కోఠిలోని డీఎంఈ కార్యలయాన్ని ముట్టడించిన ఆశా వర్కర్లు
-
‘హలో బేబీ’కథ విని ఆశ్చర్యపోయాను: మ్యూజిక్ డైరెక్టర్ కోటి
‘హలో బేబీ’కథ విని ఆశ్చర్యపోయాను. ఇలాంటి చిత్రానికి నేను సంగీతం అందించలేకపోయినందుకు బాధపడుతున్నాను’ అన్నారు ప్రముఖ సంగీత దర్శకుడు కోటి. భారతదేశంలోనే మొట్టమొదటి హాకింగ్ సోలో క్యారెక్టర్ చిత్రంగా హలో బేబీ తెరకెక్కుతుంది. ఎస్ కె ఎమ్ ఎల్ మోషన్ పిక్చర్స్ నిర్మాణంలో రాబోతున్న ఈ చిత్రంలోని ఒక పాటను కోటి లాంచ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ మూవీ కథ చాలా బాగుంది. ప్రతిఒక్కరికి ఈ చిత్రం నచ్చుతుంది. ఇంతగొప్ప చిత్రాన్ని నిర్మించినందుకు నిర్మాత కాండ్రేగుల ఆదినారాయణ ,యూనిట్‌కి అభినందనలు. ఈ చిత్రాన్ని విజయంవంతం కావాలని కోరుకుంటున్నాను’ అన్నారు. రాంగోపాల్ రత్నం దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కావ్య కీర్తి ప్రధాన పాత్ర పోషించింది. త్వరలోనే ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు నిర్మాత తెలిపారు. -
హైదరాబాద్‌లో అగ్ని ప్రమాదం
హైదరాబాద్‌లో అగ్ని ప్రమాదం జరిగింది. కోఠీ గుజరాత్ గల్లిలోని ఓ గోదాంలో ఈ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. అది సీసీటీవీల గోదాం అని తెలుస్తుంది. ఈ ప్రమాదంలో భారీగా సీసీటీవీలు దగ్ధమైనట్టు సమాచారం. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్ధలానికి చేరుకున్నట్టు సమాచారం. మొత్తం మూడు ఫైర్ ఇంజన్లుతో అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నట్టు తెలుస్తోంది. -
హైదరాబాద్: మహిళా ప్రయాణికులకు ఆర్టీసీ గుడ్‌న్యూస్
సాక్షి, హైదరాబాద్: మహిళా ప్రయాణికులకు టీఎస్ఆర్టీసీ గుడ్‌న్యూస్ చెప్పింది. లేడీస్ స్పెషల్ ట్రిప్‌లో భాగంగా.. లేడీస్ స్పెషల్ బస్సులను మళ్లీ రోడ్లపై పరుగులు పెట్టించబోతోంది. ఈ క్రమంలో.. కోఠి-కొండాపూర్ మార్గంలో లేడీస్ స్పెషల్ బస్సు ఏర్పాటు చేసింది. లేడీస్ స్పెషల్ బస్సును ఈ నెల 21 (సోమవారం) నుంచి ప్రారంభం కానుంది. ప్రతి రోజు ఉదయం 8.50 గంటలకు కోఠి నుంచి బయలుదేరి.. లక్డికాపుల్, మసబ్ ట్యాంక్, ఎమ్మెల్యే కాలనీ, ఉషాకిరణ్, గుట్టల బేగంపేట్, శిల్పారామం, కొత్తగూడ ఎక్స్‌రోడ్స్ మీదుగా కొండాపూర్‌కి వెళ్తుంది. తిరిగి సాయంత్రం 5:45 గంటలకు కొండాపూర్ నుంచి అదే మార్గంలో కోఠికి వస్తుంది. మహిళా ప్రయాణికులు ఈ సదుపాయాన్ని వినియోగించుకుని క్షేమంగా, సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తన ట్విట్టర్ ద్వారా తెలిపారు. చదవండి: కాంగ్రెస్ రూట్లో కమలం.. సర్ప్రైజ్ అందుకే! ఇదిలా ఉంటే.. నగరంలో మహిళల ప్రత్యేక బస్సులు కొత్తేం కాదు. గతంలోనూ ఆర్డినరీ బస్సులు సైతం కొన్ని ఎంపిక చేసిన రూట్లలో తిరుగుతుండేవి. కాలక్రమేణా అవి తగ్గిపోతూ వచ్చాయి. నగరవాసులు సొంత వాహనాలకు ప్రాధాన్యత ఇవ్వడం, అదే సమయంలో మెట్రో రైలు.. ఆర్టీసీ ఆదాయానికి బాగా గండికొట్టింది. సజ్జనార్ ఆర్టీసీ ఎండీ అయ్యాక.. ఆక్యుపెన్సీని పెంచేందుకు రకరకాల పద్ధతులను తెరపైకి తెస్తున్నారు. ఈ క్రమంలో నగరవాసులు బస్సు ప్రయాణాలకు ప్రాధాన్యత ఇచ్చేలా రకరకాల స్కీమ్‌ల్ని తీసుకొస్తున్నారు. మహిళా ప్రయాణికులకు శుభవార్త. కోఠి-కొండాపూర్ మార్గంలో లేడీస్ స్పెషల్ బస్సును #TSRTC ఏర్పాటు చేసింది. 127K నంబర్ ప్రత్యేక బస్సు ఈ నెల 21 (సోమవారం) నుంచి ప్రారంభం కానుంది. ప్రతి రోజు ఉదయం 8.50 గంటలకు కోఠి నుంచి బయలుదేరుతుంది. లక్దికాపుల్, మసబ్ ట్యాంక్, ఎమ్మెల్యే కాలనీ, ఉషా కిరణ్,… pic.twitter.com/EhpJg85VUb — VC Sajjanar - MD TSRTC (@tsrtcmdoffice) August 18, 2023 -
హైదరాబాద్: కోఠిలో అగ్ని ప్రమాదం
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ కోఠి లోని ట్రూప్ బజార్ లో అగ్నిప్రమాదం సంభవించింది. ట్రూప్ బజార్ లోని ఎల్.ఈ.డి లైట్స్ గోదాంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హాటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో 4 ఫైర్ ఇంజన్లు మంటలను ఆర్పే పనిలో నిమగ్నమయ్యాయి. ప్రమాద సమయానికి గోదాంలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. మూడు అంతస్తుల ఈ భవనంలో రెండు అంతస్తులలో మాటలు వ్యాపించాయి.. దీంతో స్థానికులు.. వ్యాపారులు భయాందోళకు గురయ్యారు. ఈ అగ్నిప్రమాదం ఎలక్ట్రిక్ షాట్ సర్క్యూట్ వల్లనే జరిగిందని.. ప్రాధమికంగా నిర్దారించారు. చదవండి: HYD: తనను పెళ్లి చేసుకోవాలని నా భర్తను వేధించింది.. మమత కీలక వ్యాఖ్యలు -
వివేకా లేఖపై సునీతకు సీబీఐ ప్రశ్నలు
సాక్షి, హైదరాబాద్: వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ దర్యాప్తు వేగం పుంజుకుంది. కేసులో కీలకంగా భావిస్తున్న వివేకా రాసిన లేఖపై ఇవాళ వివేకా కూతురు సునీతారెడ్డిని సీబీఐ ప్రశ్నించింది. వివేకా కేసులో సునీతారెడ్డి సీబీఐ విచారణకు హాజరయ్యారు. కోఠిలోని సీబీఐ కార్యాలయానికి సునీతను పిలిపించుకుని లేఖపై ఆరా తీశారు సీబీఐ అధికారులు. ఆమె కూడా భర్త నర్రెడ్డి రాజశేఖర్‌రెడ్డి ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఈ కేసులో ఇప్పటికే పలుమార్లు ఆమెను పిలిపించుకుని స్టేట్మెంట్ నమోదు చేసింది సీబీఐ. మరోవైపు వివేకా కేసులో పలువురు సాక్షులను సైతం సీబీఐ ప్రశ్నిస్తోంది. రక్తపు మరకల లేఖ.. ఎందుకు గోప్యంగా ఉంచారు? వివేకా గుండెపోటుతో చనిపోయారని ప్రచారం చేసేందుకుగాను పక్కా కుట్ర ఒకటి జరిగినట్టు ఇటీవల కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి ఆరోపించారు. వివేకా కుమార్తె సునీత, అల్లుడు నర్రెడ్డి రాజశేఖరరెడ్డి, పెద్ద బావమరిది నర్రెడ్డి శివ ప్రకాశ్‌రెడ్డి దీని వెనక ఉన్నట్టు కొన్ని ఆధారాలు బయటపెట్టారు. వైఎస్ వివేకాపై తీవ్రంగా దాడిచేసిన తరువాత హంతకులు ఆయన చేత బలవంతంగా లేఖ రాయించినట్టు తేలింది. హంతకులు బెదిరించడంతో.. డ్రైవర్ ప్రసాద్ తనపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడని ఆ లేఖలో వివేకా రాశారు. ఆ లేఖను మొదటగా అంటే ఆ రోజు ఉదయం 6.10లోపే చూసిన ఆయన పీఏ కృష్ణారెడ్డి.. ఆ విషయాన్ని సునీత భర్త నర్రెడ్డి రాజశేఖరరెడ్డికి చెప్పారు. రక్తపు మరకలున్న ఆ లేఖ చూసినవారెవరికైనా.. వివేకాది హత్యేనని తెలిసిపోతుంది. కానీ లేఖ విషయాన్ని కృష్ణారెడ్డి చెప్పగానే.. తాము వచ్చే వరకు ఆ లేఖను, వివేకా సెల్‌ఫోన్‌ను ఎవ్వరికీ ఇవ్వవద్దని, దాచి ఉంచాలని నర్రెడ్డి రాజశేఖరరెడ్డి చెప్పినట్టు కృష్ణారెడ్డి వెల్లడించారు, అదే విషయాన్ని దర్యాప్తులోనూ చెప్పారు. ఆ తరవాతే నర్రెడ్డి మరో అడుగు ముందుకేసి శివ ప్రకాశ్ రెడ్డి ద్వారా అవినాష్‌రెడ్డికి చెప్పించారు. అవినాష్ కాల్ డేటా చూస్తే ఈ విషయం నిర్ధారణ అవుతుంది కూడా. అవినాశ్ అక్కడకు చేరాక కూడా ఆయనకు లేఖ చూపించలేదు. అసలు లేఖ ఉందన్న విషయం కూడా చెప్పలేదు. వాస్తవానికి వారు గనక ఆ లేఖను వెంటనే పోలీసులకు ఇవ్వాలని చెప్పి ఉంటే వివేకా హత్యకు గురయ్యారన్నది వెంటనే అందరికీ తెలిసిపోయేది. హత్య జరిగిందని తెలిస్తే ఎవ్వరూ మృతదేహాన్ని తాకేవారే కాదు. కానీ లేఖను ఉద్దేశపూర్వకంగానే గోప్యంగా ఉంచారు. ఆ రోజు మధ్యాహ్నం 1 గంట సమయంలో పులివెందుల చేరుకున్న సునీత, ఆమె భర్త నర్రెడ్డి రాజశేఖరరెడ్డికి ఆ లేఖతోపాటు వివేకా సెల్‌ఫోన్‌ను కృష్ణారెడ్డి ఇచ్చారు. ఆ లేఖను చదివారు కానీ.. వెంటనే పోలీసులకు ఇవ్వలేదు. సునీత ఆదేశాలతో సాయంత్రం 5 గంటలకు కృష్ణారెడ్డి ఆ లేఖను, సెల్‌ఫోన్‌ను పోలీసులకు అప్పగించారు. ఆ లేఖను సునీత, ఆమె భర్త నర్రెడ్డి రాజశేఖరరెడ్డి ఎందుకు గోప్యంగా ఉంచారన్నదే ఈ హత్య కేసులో కీలకం కానుంది. ఇదే విషయాన్ని ఇప్పటికే ఎంపీ అవినాష్‌రెడ్డి సిబీఐ దృష్టికి తీసుకెళ్లారు కూడా. -
చరిత్ర సృష్టించబోతున్న సంగీత దర్శకుడు కోటి
తెలుగు సినిమా చరిత్రలో మొట్టమొదటి సారి ఒక సంగీత దర్శకుడికి పర దేశ (ఆస్ట్రేలియాలోని న్యూ సౌత్ వేల్స్) పార్లమెంట్లో గౌరవ జీవిత సాఫల్య పురస్కారం లభించబోతోంది. అది మరెవరికో కాదు, మూడున్నర దశాబ్దాల పాటు తెలుగు పాటల ప్రపంచాన్ని ఉర్రూతలూగించి, మన అభిమాన హీరోల సినిమాకి అద్భుతమైన సంగీతాన్ని అందించి, మన గుండెల్లో ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకున్న సాలూరి రాజేశ్వరరావు గారి అబ్బాయి కోటికి! కోటి తెలుగు సినిమా సంగీతానికి చేసిన సేవలకు గాను గుర్తింపుగా ఆస్ట్రేలియా ఇండియన్ స్పోర్ట్స్ ఎడ్యుకేషన్ అండ్ కల్చరల్ సొసైటీ ఈ జీవిత సాఫల్య పురస్కారాన్ని అందించనుంది. అంతే కాకుండా కోటి అక్కడ ఉన్న మన తెలుగు గాయనితో ఒక పాట కూడా పాడించబోతున్నారు. ఆ గాయని మరెవరో కాదు, తన మొదటి పాటతోనే ఆసియా రికార్డు పుస్తకంలో స్థానం దక్కించుకున్న మన తెలుగింటి ఆడపడుచు సుస్మిత రాజేష్. హరుడే వరుడై, హర హర శంభో తర్వాత మరో వినూత్నమైన పాటతో, కొత్త కలయికతో మన ముందుకు వస్తున్నారు సుస్మిత. ఈ సందర్భంగా ఆస్ట్రేలియాలోని AISECS అడ్వైజర్ రాజేష్ ఉప్పల మాట్లాడుతూ.. ఇటువంటి కార్యక్రమాలు ఇరుదేశాల మధ్య సాంస్కృతిక సంబంధాలు మరింత పెంపొందించడానికి దోహదపడతాయన్నారు. 4 వేల పాటల మైలురాయిని దాటిన కోటిని ఆస్ట్రేలియాలోని పార్లమెంట్లో గెస్ట్ ఆఫ్ హానర్‌గా పిలవడం తమకెంతో ఆనందంగా ఉందని తెలియజేశారు. చదవండి: పెళ్లికి ముందు, నాకూ, నా భర్తకు వేరేవాళ్లతో ఎఫైర్లు: ప్రియాంక చోప్రా -
Antheema Theerpu: మంగ్లీ ‘టిప్ప.. టిప్ప’ సాంగ్ అదిరిందిగా..
సాయి ధన్సిక, విమలారామన్, గణేష్ వెంకట్రామన్, అమిత్ తివారీ కీలక పాత్రధారులుగా రూపొందుతున్న చిత్రం ‘అంతిమ తీర్పు’. అభిరాం దర్శకత్వంలో సిద్ధి వినాయక డి.రాజేశ్వరరావు నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో ‘టిప్పా టిప్పా..టిప్ప.. టిప్పర్ లారీ నా ఒళ్లే.. రప్ప..రప్ప.. రప్ప వత్తే యాక్సిడేంటేలే’ అంటూ సాగే పాటను సాంగ్ ఇటీవల విడుదల చేశారు. కోటి సంగీతం అందించారు. (చదవండి: ఒకప్పటిలా కాదు.. హీరోయిన్స్ అంటే వాటికే పరిమితం కాదు) కాసర్ల శ్యామ్ రచించిన పాట ఇది. మంగ్లీ ఆలపించారు. అమిత్‌తివారీ, స్నేహా గుప్తా ఆ పాటలో ఆడాపాడారు. ఈశ్వర్ పెంటి ఈ పాటకు డాన్స్ కొరియోగ్రఫీ చేశారు. మంగ్లీ హస్కీ వాయిస్‌తో పాడిన ఈ పాట సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. దర్శకనిర్మాతలు మాట్లాడుతూ ‘చక్కని కథాంశంతో రూపొందిన చిత్రమిది. చిత్రీకరణ పూర్తయింది. మంగ్లీ ఆలపించిన పాటకు మంచి స్పందల లభిస్తోంది. త్వరలోనే లో సెకెండ్ లిరికల్ సాంగ్, టీజర్‌ను విడుదల చేస్తాం’ అన్నారు. -
Hyderabad: ఐకానిక్ డబుల్ డెక్కర్ బస్సులు.. వచ్చేస్తున్నాయ్!
సాక్షి, హైదరాబాద్: సిటీ ఆర్టీసీ ప్రయాణికులకు శుభవార్త. త్వరలో ఐకానిక్ డబుల్ డెక్కర్ బస్సులు భాగ్యనగర రహదారులపై పరుగులు పెట్టనున్నాయి. ఈసారి గతానికి భిన్నంగా ఎలక్ట్రిక్ బస్సులు సేవలు అందించనున్నాయి. హైదరాబాద్ అంటే చార్మినార్, గోల్కొండ, హుస్సేన్ సాగర్ మాత్రమే కాదు. డబుల్ డెక్కర్ బస్సులు కూడా గుర్తొస్తాయి. 1990వ దశకంలో పుట్టినవారు డబుల్ డెక్కర్ బస్సుల్లో తిరిగిన జ్ఞాపకాలను ఇప్పటికీ గుర్తు చేసుకుంటారు. మళ్లీ హైదరాబాద్ రోడ్లపైకి డబుల్ డెక్కర్ బస్సుల్ని తీసుకురావాలన్న డిమాండ్ చాలాకాలంగా ఉంది. సిటీలో డబుల్ డెక్కర్ బస్సుల్ని తిప్పాలంటూ మంత్రి కేటీఆర్‌ను ట్విటర్లో నెటిజన్లు రిక్వెస్ట్ చేస్తూనే ఉంటారు. హైదరాబాద్‌లో డబుల్ డెక్కర్ బస్సుల్ని తిప్పుతామని కేటీఆర్ హామీ కూడా ఇచ్చారు. అందుకు అనుగుణంగా ప్రణాళికలు ప్రారంభించాలని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్‌ను కోరారు. దీంతో నగరంలో మళ్లీ డబుల్ డెక్కర్ బస్సుల్ని తిప్పేందుకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా కార్పొరేషన్ చర్యలు ప్రారంభించింది. ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్సుల్ని నడపనుంది. అద్దె ప్రాతిపదికన తీసుకుని.. ► ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్సులను అద్దెకు తీసుకొని నడిపేందుకు టీఎస్ఆర్టీసీ ప్రణాళికలు రూపొందిస్తోంది. సిటీలో మూడు వేర్వేరు రూట్లలో 10 ఈ– డబుల్ డెక్కర్ బస్సుల్ని అద్దెకు తీసుకొని నడపనుంది. ఇందుకు సంబంధించిన టెండర్‌ను మరో వారంలో ఆహ్వానించనుంది. అద్దె ప్రాతిపదికన ఈ బస్సులను నడపడానికి ఆసక్తి ఉన్న కంపెనీలు తమ బిడ్లను నమోదు చేసుకోవాలని టీఎస్ఆర్టీసీ ఆహ్వానించనుంది. బిడ్ గెలుచుకున్న కంపెనీ ఈ బస్సులను అద్దె ప్రాతిపదికన ఇచ్చేందుకు టీఎస్ఆర్టీసీతో ఒప్పందం చేసుకుంటుంది. ఆ కంపెనీకి టీఎస్ఆర్టీసీ అద్దెను ఫిక్స్‌డ్‌గా చెల్లిస్తుంది. ► చార్జీలు, రూట్లు లాంటి నిర్ణయాలన్నీ టీఎస్ఆర్టీసీ తీసుకుంటుంది. ప్రస్తుతం నష్టాల్లో ఉన్న ఆర్టీసీ ప్రయాణికుల రద్దీని పెంచి లాభాలవైపు పరుగులు తీసుకేందుకు టీఎస్ఆర్టీసీ అనేక చర్యల్ని తీసుకుంటున్న సంగతి తెలిసిందే. పెద్దమొత్తంలో డబ్బు ఖర్చుపెట్టి బస్సుల్ని కొనకుండా అద్దెకు తీసుకొని నడపడం ద్వారా భారాన్ని తగ్గించుకుంటుంది. ఇక ఈ– డబుల్ డెక్కర్ బస్సుల్ని ఏ రూట్లో నడపాలన్నదానిపై ఇప్పటికే ఆర్టీసీ అధికారులు అధ్యయనం జరిపారు. హైదరాబాద్‌లో పలు చోట్ల ఫ్లైఓవర్లు ఉన్న సంగతి తెలిసిందే. ఫ్లైఓవర్లతో ఇబ్బంది లేని రూట్లోనే డబుల్ డెక్కర్ బస్సులు తిరిగే అవకాశం ఉంది. ప్రస్తుతానికి మూడు రూట్లు ఫైనలైజ్ చేశారని వార్తలొస్తున్నాయి. ► పటాన్చెరు– కోఠి, జీడిమెట్ల–సీబీఎస్, అఫ్జల్‌గంజ్– మెహిదీపట్నం రూట్లలో డబుల్ డెక్కర్ బస్సులు తిరిగే అవకాశాలున్నాయి. ఇక ముంబైలో ఇప్పటికే ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్సులు తిరుగుతున్నాయి. స్విచ్ మొబిలిటీ 22 మోడల్ బస్సుల్ని ముంబైలో ప్రజా రవాణా కోసం తిప్పుతున్నాయి. ఈ ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్సుల్ని ఇండియాలోనే డిజైన్ చేసి తయారు చేయడం విశేషం. బృహత్ ముంబై ఎలక్ట్రిక్ సప్లై అండ్ ట్రాన్స్పోర్ట్ ఆధ్వర్యంలో ఈ బస్సులు నడుస్తున్నాయి. (క్లిక్ చేయండి: బస్టాప్‌లో బస్సు ఆపొద్దంటూ బోర్డు.. పాపం ప్రయాణికులు..) -
కోఠి ప్రాంతంలో మహిళ హంగామా
-
‘పగ పగ పగ’.. ఫస్ట్‌డే ఫస్ట్ షో ఫ్రీ
ఏ సినిమాకైనా మొదటి రోజు మొదటి ఆట ఎంతో ముఖ్యం. మౌత్ టాక్‌తో బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచిన చిత్రాలెన్నో ఉన్నాయి. అయితే ఫస్ట్ డే ఫస్ట్ షోను ఉచితంగా వేస్తున్నారంటే.. సినిమా మీద ఎంత నమ్మకం ఉండాలి. ఇప్పుడు పగ పగ పగ సినిమా యూనిట్ కూడా అదే నమ్మకంతో ఉన్నట్టుంది. ప్రముఖ సంగీత దర్శకుడు కోటి మొదటి సారిగా ఓ విలక్షణ పాత్రలో కనిపిస్తోన్న చిత్రం పగ పగ పగ. సుంకర బ్రదర్స్ వారి సమర్పణలో అభిలాష్ సుంకర, దీపిక ఆరాధ్య హీరో హీరోయిన్లుగా పగ పగ పగ చిత్రం రాబోతోంది. వినోదాత్మకంగా కొనసాగే క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. డైరెక్టర్ రవి శ్రీ దుర్గా ప్రసాద్ ఈ చిత్రాన్ని వినూత్నంగా రూపొందించారు. నిర్మాత సత్య నారాయణ సుంకర ఈ చిత్రాన్ని భారీ ఎత్తున నిర్మించారు. ఈ చిత్రం సెప్టెంబర్ 22న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అయితే ఈ మూవీ ఫస్ట్ డే ఫస్ట్ షో అందరికీ ఫ్రీగా చూపించాలని నిర్ణయించుకున్నారు మేకర్స్. సినిమా మీదున్న నమ్మకంతోనే ఇలాంటి నిర్ణయం తీసుకున్నామని నిర్మాతలు తెలిపారు. బెనర్జీ, జీవీకే నాయుడు, కరాటే కళ్యాణి, భరణి శంకర్, రాయల్ హరిశ్చంద్ర, సంపత్, జబర్దస్త్ వాసు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్న నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం కోటి అందించారు. -
హైదరాబాద్‌లో ఉరుములు, మెరుపులతో భారీ వర్షం
నైరుతి రుతుపవనాల ప్రవేశంలో తెలంగాణలో పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. కాగా, బుధవారం సాయంత్రం హైదరాబాద్‌లో ఆకాశం మేఘావృతమైంది. దీంతో నగరంలోని పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. నాంపల్లి, బషీర్‌బాగ్, కోఠి, అబిడ్స్, అంబర్పేట్, సుల్తాన్‌బజార్, బేగంబజార్, ఎల్బీ నగర్, వనస్థలిపురం, హయత్ నగర్, అబ్దుల్లాపూర్‌మెట్, దిల్సుఖ్ నగర్, చైతన్యపురి, కొత్తపేట, సరూర్ నగర్, మీర్పేట్, అత్తాపూర్, రాజేంద్రనగర్, నార్సింగి, గండిపేట్, మణికొండ, పుప్పాలగూడ, కాటేదాన్, పలు చోట్ల భారీ వర్షం కురుస్తోంది. #15JUNE 7:45PM⚠️ Massive Rains Ahead Tonight in Entire #Telangana⛈️🥳 👉South #Hyderabad already Seeing Good Rains&More Rains Ahead in coming Hours 🌧️#HyderabadRains pic.twitter.com/ygx5SEoTru — Hyderabad Rains (@Hyderabadrains) June 15, 2022 -
వాహనాలు అక్కడ పార్కింగ్ చేస్తున్నారా.. డబుల్ జరిమానా తప్పదు
సాక్షి, సిటీబ్యూరో: బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, హిమాయత్‌నగర్, అమీర్‌పేట, కోఠి... ఇలా నగరంలోని అనేక వాణిజ్య ప్రాంతాల్లో నిత్యం ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురవుతుంటాయి. ఆయా మార్గాల్లోని వర్తకులకు ట్రాఫిక్ పోలీసులు ఎన్నిసార్లు చెప్పినా అక్రమ పార్కింగ్స్, ఇబ్బందికర పార్కింగ్ తప్పట్లేదు. ఫలితంగా రద్దీ వేళల్లో ఆయా మార్గాల్లో వాహనచోదకులు నరకాన్ని చవి చూడాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో సిటీ ట్రాఫిక్ పోలీసులు ఆయా ప్రాంతాలను ట్రాఫిక్ పరంగా సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించాలని నిర్ణయించారు. ఈ ఏరియాల్లో పార్కింగ్ ఉల్లంఘనలకు పాల్పడే వాహనచోదకులకు రెట్టింపు జరిమానా విధించడంతో పాటు ఆయా దుకాణాలు, వ్యాపార సంస్థల నిర్వాహకులపై చర్యలకు మార్గాలు అన్వేషిస్తున్నామని ట్రాఫిక్ చీఫ్ ఏవీ రంగనాథ్ గురువారం వెల్లడించారు. వర్తక, వ్యాపార సముదాయాలు, దుకాణాల కారణంగా ట్రాఫిక్ ఇబ్బందులకు కారణమవుతున్న ప్రాంతాలను సమస్యాత్మక ప్రాంతాలుగా (కంజెషన్ జోన్) గుర్తించాలని నిర్ణయించారు. అక్షాంశ, రేఖాంశాల ఆధారంగా పక్కా సాంకేతికంగా వీటిని మార్క్ చేయనున్నారు. ఈ ప్రాంతాల్లో ఉన్న అక్రమ పార్కింగ్, ఇబ్బందికర పార్కింగ్‌పై అనునిత్యం ప్రత్యేక దృష్టి పెట్టనున్నారు. ఈ ప్రాంతాల్లో ఇలాంటి పార్కింగ్స్కు పాల్పడిన ఉల్లంఘనులకు ఇతర ప్రాంతాల్లో విధించే జరిమానాకు రెట్టింపు వేయాలని యోచిస్తున్నారు. ఫలితంగా వారిలో మార్పునకు ప్రయత్నాలు చేయనున్నారు. నో పార్కింగ్, ఇబ్బందికర పార్కింగ్‌లను ప్రస్తుతం వేరుగా చూడట్లేదు. ఈ కారణంగా జమానాల్లోనూ మార్పులు లేవు. అయితే సమస్యాత్మక ప్రాంతాల గుర్తింపు పూర్తయిన తర్వాత ఆ రెంటికీ వేర్వేరుగా జరిమానాలు విధించనున్నారు. నో పార్కింగ్ కంటే ఇబ్బందికర పార్కింగ్‌కు ఎక్కువ మొత్తం ఉండనుందని సమాచారం. ఇప్పటి వరకు పార్కింగ్ ఉల్లంఘనపై కేవలం వాహనచోదకులకే జరిమానా పడుతోంది. అయితే వీరితో పాటు ఆయా వ్యాపార సంస్థలు, దుకాణాల నిర్వాహకులనూ బాధ్యులను చేయాలని ట్రాఫిక్ పోలీసులు నిర్ణయించారు. దీనికి సంబంధించి జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి విధివిధానాలు ఖరారు చేయనున్నారు. మోటారు వాహనాల చట్టం ప్రకారం నిర్వాహకులపై చర్యలకు ఆస్కారం లేదు. సిటీ పోలీసు యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేసినా నామమాత్రపు జరిమానాలే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే నిర్వాహకులపై చర్యలకు చట్టం తీసుకురావాలని యోచిస్తున్నారు. నగర వ్యాప్తంగా ఉన్న ఇలాంటి పార్కింగ్ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా ట్రాఫిక్ పోలీసులు కసరత్తు చేస్తున్నారు. ఇది కూడా చదవండి: ‘స్పీడ్’ రూల్స్ ఇక పక్కా! -
కోటి తనయుడి సినిమాకు రామ్ పోతినేని సాయం
ప్రముఖ సంగీత దర్శకుడు కోటి తనయుడు రాజీవ్ సాలూరి హీరోగా నటించిన చిత్రం ‘11:11’. ‘కౌంట్ డౌన్ స్టార్ట్స్’ అనేది క్యాప్షన్. ఆర్కే నల్లూరి దర్శకత్వంలో ఈ చిత్రాన్ని గాజుల వీరేష్ నిర్మించారు. తాజాగా ఈ చిత్రంలోని ‘ఏమయ్యిందో..’ అనే పాట లిరికల్ వీడియోను హీరో రామ్ రిలీజ్ చేసి చిత్రయూనిట్‌కు ఆల్ ది బెస్ట్ చెప్పి, సినిమా సక్సెస్ కావాలని ఆకాంక్షించారు. ‘ఏమయ్యిందో మనసైపోయే మాయం.. ఏమౌతుందో ఇకపై నా హృదయం’ అంటూ సాగే ఈ పాటకు రాకేందు మౌళి లిరిక్స్ అందించగా అర్మాన్ మాలిక్ ఆలపించారు. ఈ సినిమాకు మణిశర్మ మ్యూజిక్ డైరెక్టర్. ‘‘రాజీవ్, వర్ష లవ్ చేసుకుంటుంటారు. ఆ ఇద్దరి మధ్య ఓ వ్యక్తి అనూహ్యంగా ఎంటర్ అవుతాడు. కానీ ఆ వ్యక్తి హత్య చేయబడతాడు. ఆ తర్వాత ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయన్నదే కథ’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. -
కోఠి కాలేజ్ భవితవ్యం ఏమిటి?
హైదరాబాద్‌లోని ‘కోఠి మహిళా కళాశాల’ను ప్రభుత్వం ‘యూనివర్సిటీ’గా ప్రకటించింది. దీన్ని అందరం ఆహ్వానించాల్సిందే, కానీ ప్రభుత్వం నుండి ఒక స్పష్టమైన విధానపరమైన ప్రకటన రాకపోవడం విచారకరం. నూతనంగా ఏర్పాటయ్యే ‘కోఠి మహిళా విశ్వవిద్యాలయం’లో పెట్టే కోర్సులు, ఆర్థిక వనరులు, టీచింగ్, నాన్–టీచింగ్ పోస్టుల పూర్తిస్థాయి భర్తీ ప్రక్రియ, యూని వర్సిటీ ఎప్పుడు ప్రారంభమవుతుంది వంటి విషయాలు అస్పష్టం గానే ఉండిపోయాయి. యూనివర్సిటీ నిర్వహణకు కనీసం రెండు వందల ఎకరాల సువిశాలమైన భూమి ఉండాలి. ఇప్పటివరకు ఉన్న మహిళా కళాశాలను యూనివర్సిటీగా కొంతకాలం నిర్వహించి, తర్వాత వరంగల్‌లో కానీ, విజయవాడ రహదారి పక్కన కానీ భూమి కేటాయిస్తారని ప్రచారం జరుగుతోంది. అలా కేటా యిస్తే... ఇప్పుడున్న మహిళా కళాశాల భూములను, భవనాలను కార్పొరేట్, ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టకుండా... మంచి రీసెర్చ్ సెంటర్‌ని అభివృద్ధి చేయాలి. (క్లిక్: తొలి మహిళా వర్సిటీగా కోఠి ఉమెన్స్ కాలేజీ) ఇప్పటికే రాష్ట్రంలో విశ్వవిద్యాలయాల పరిస్థితి అందరికీ తెలిసిందే. నిధుల్లేక కునారిల్లుతున్నాయి. బోధన, బోధనేతర సిబ్బంది లేక క్లాసులు జరగడం లేదు. విద్యార్థులకు ఇవ్వాల్సిన ఫెలోషిప్‌లు, స్కాలర్షిప్లు ఇవ్వడం లేదు. ప్రతిష్ఠాత్మకమైన ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ, మహాత్మా గాంధీ యూనివర్సిటీ, పాలమూరు యూనివర్సిటీ, జేఎన్టీయూ లాంటి విశ్వవిద్యాలయాలు నిర్వీర్యమవుతున్నాయి. దీనికి తోడు తెలంగాణ ప్రభుత్వం ప్రైవేటు యూనివర్సిటీల ఏర్పాటుకు అను మతి ఇచ్చింది. ఫలితంగా ఉన్నత విద్యా వ్యాపారం యథేచ్ఛగా సాగుతోంది. ఈ నేపథ్యంలో కొత్తగా ప్రకటించిన ‘కోఠి మహిళా విశ్వవిద్యాలయం’ ఎలా రూపుదిద్దుకుంటుందో చూడాలి! (క్లిక్: మరీ ఇంత రుసుమా.. ఉద్యోగాలకు అప్లై చేయాలా వద్దా?) – పి. మహేష్ పీడీఎస్‌యూ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి -
Hyderabad: ఐదో అంతస్తు నుంచి దూకి యువకుడి ఆత్మహత్య
-
Hyderabad: ఐదో అంతస్తు నుంచి దూకి యువకుడి ఆత్మహత్య
సాక్షి,హైదరాబాద్: హైదరాబాద్‌లోని కోఠి ఆంధ్ర బ్యాంక్ చౌరస్తాలో ఉన్న బిల్డింగ్‌పై నుంచి దూకి ఓ యువకుడి ఆత్మహత్య చేసుకున్నాడు. నూతనంగా నిర్మించిన శ్రీకృష్ణ షాపింగ్ మాల్ సెంటర్ బిల్డింగ్ ఐదో అంతస్తు నుంచి దూకిన ఆ యువకుడిని ప్రకాశం జిల్లాకు చెందిన డానియల్(25)గా పోలీసులు గుర్తించారు. పెళ్లి కావడంలేదనే మనస్తాపంతో గత కొంత కాలంగా మానసిక ఆందోళనతో ఉన్నట్లు సుల్తాన్ బజార్ సీఐ తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా హాస్పిటల్‌కు తరలించారు. -
దొర అహంకారానికి బలైన ఓ అమాయకురాలి కథే ‘1997’
‘‘ఒక దొర అహంకారానికి బలైన ఓ అమాయకురాలి కథను చెప్పే ప్రయత్నమే ‘1997’ సినిమా. అంటరానితనం గురించి మా సినిమాలో ప్రశ్నిస్తున్నాం’’ అని నటుడు, దర్శక–నిర్మాత డా. మోహన్ అన్నారు. నవీన్ చంద్ర, డా. మోహన్, శ్రీకాంత్ అయ్యంగార్, కోటి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘1997’. డా. మోహన్ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 26న విడుదలవుతోంది. ఈ సందర్భంగా మోహన్ మాట్లాడుతూ– ‘‘1997లో జరిగిన సంఘటనలను మా తాతగారు నాకు చెప్పారు.. వాటి స్ఫూర్తితో కథ రాసుకున్నాను. అత్యాచారానికి గురైన మహిళ పడే మానసిక వేదన, ముఖ్యంగా ఆమె తల్లి తాలూకు భావోద్వేగాలను ఈ సినిమాలో చూపించాం. మొదటి సినిమాకే నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా చేయడం రిస్కే.. నిజం చెప్పాలంటే వేరే దారిలేక నేనే చేయాల్సి వచ్చింది. ఈ సినిమా విషయంలో నటుడిగా, దర్శకుడిగా సంతృప్తి ఉంది. కోటిగారి సంగీతం, నేపథ్య సంగీతం సినిమాకు ప్రధాన ఆకర్షణ’’ అన్నారు. -
ఆ సినిమా తర్వాత అందుకే చిరంజీవితో పని చేయలేదు: కోటి
Music Director Koti Comments On Clash With Chiranjeevi Goes Viral: మ్యూజిక్ డైరెక్టర్ కోటి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. ఎన్నో సూపర్‌హిట్ సినిమాలకు బ్లాక్ బస్టర్ సాంగ్స్‌ను అందించారు. ఇక మెగాస్టార్ చిరంజీవి-కోటి కాంబినేషన్లో పదహారేళ్ల వయసు, అందమా అందుమా, ప్రియ రాగాలే.. వంటి ఎన్నో సూపర్‌హిట్ సాంగ్స్ వచ్చాయి. ఆ సమయంలో ఇద్దరికి మంచి అనుబంధం ఉండేదని, అయితే ఓ సంఘటన కారణంగా కొంత గ్యాప్ వచ్చిందని కోటి అన్నారు. తాజాగా ఓ యూట్యూబ్ చానల్‌కు ఇంటర్వ్యూలో ఇందుకు ఇద్దరి మధ్య ఎందుకు బ్రేక్ వచ్చిందో తెలిపారు. చదవండి: వీకెండ్ ఎపిసోడ్లో నాగార్జున వేసుకున్న షర్ట్ అంత ఖరీదా? 'ఓ సినిమా 100డేస్ ఫంక్షన్ ఓంగోలులో జరిగింది. అది మా అత్తగారి ఊరు కావడంతో ఒకరోజు ముందుగానే అక్కడికి వెళ్లా. అయితే హఠాత్తుగా నాకు హైఫీవర్ రావడంతో ఫంక్షన్‌కు రాలేకపోయాను. కానీ నేను కావాలనే ఫంక్షన్‌కు రాలేదని కొందరు చిరంజీవికి ఉన్నవి, లేనివి చెప్పారు. ఆ తర్వాత నేను అసలు విషయం చెప్పడానికి ఆఫీసుకు వెళ్లితే, అప్పుడు ఆయన మాట్లాడే మూడ్‌లో లేనని అన్నారు. చిరంజీవి అలా రియాక్ట్ కావడంలో తప్పులేదనిపించింది. దీంతో వెనక్కు వచ్చేశాను.హిట్లర్ తర్వాత మళ్లీ చిరంజీవితో పని చేయలేదు. అలా ఆ ఫంక్షన్ నన్ను ఆయనకి దూరం చేసింది' అంటూ చెప్పుకొచ్చారు. చదవండి: నిన్ను నమ్మినవాళ్లను మోసం చేయొద్దు : వెంకటేశ్ దానికోసం అవసరమైతే గుండు కొట్టించుకుంటా : అనసూయ -
సంగీత దర్శకుడు కోటి తనయుడికి చిరు సాయం
కెరీర్ ఆరంభం నుంచే విలక్షణ కథలతో అలరిస్తున్న కోటి తనయుడు రాజీవ్ సాలూర్ హీరోగా టైగర్ హిల్స్ ప్రొడక్షన్, స్వస్తిక ఫిలిమ్స్ పతాకాలపై 'ప్రొడక్షన్ నెంబర్ 1'గా ఓ కొత్త సినిమా రూపొందుతోంది. కిట్టు నల్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు గాజుల వీరేష్ (బళ్లారి) నిర్మాతగా వ్యవహరిస్తుండగా.. వర్ష విశ్వనాథ్ హీరోయిన్గా నటిస్తోంది. చిత్రంలో ప్రముఖ సంగీత దర్శకుడు కోటి సాలూర్ ముఖ్య పాత్ర పోషిస్తుండటం విశేషం. సదన్, లావన్య, రాజా రవీంద్ర, రాజా శ్రీ తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుతున్నారు. తాజాగా ఈ డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాకు మెగా సపోర్ట్ లభించింది. ఈ మూవీ ఫస్ట్ లుక్ లాంచ్ మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా జరిగేలా ప్లాన్ చేశారు. నవంబర్ 11వ తేదీ సాయంత్రం 6 గంటలకు గ్రాండ్‌గా ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేయనున్నారు. తాజాగా ఈ విషయాన్ని ప్రకటిస్తూ స్పెషల్ పోస్టర్ వదిలింది చిత్రయూనిట్. ఈ సినిమాకు మణిశర్మ అందిస్తున్న సంగీతం మేజర్ అసెట్ కానుందని అంటున్నారు దర్శకనిర్మాతలు. తమ సంస్థ నుంచి ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నామని, చిత్రంలో రాజీవ్ సాలూర్ నటన హైలైట్ కానుందని అన్నారు నిర్మాత గాజుల వీరేష్ (బళ్లారి). రాజీవ్ సాలూర్, వర్ష విశ్వనాథ్ మధ్య కెమిస్ట్రీ నేటితరం ఆడియన్స్‌కి బాగా కనెక్ట్ అవుతుందని నమ్ముతున్నట్లు చెప్పారు. అతిత్వరలో ఈ సినిమా విడుదల తేదీ ప్రకటించనున్నారు. -
వాక్సినేషన్ లో కింగ్ కోఠి ఆసుపత్రిలో పరిస్థితి ఉద్రిక్తత
-
లేటెస్ట్ ఏమాయచేశావే పాట విన్నారా?
సముద్రాల సినీ క్రియేషన్స్ పతాకంపై బేబీ అన్య ఆనంద్ సమర్పణలో సముద్రాల మంత్రయ్య బాబు నిర్మిస్తున్న చిత్రం "లవ్ యు రా".. ప్రసాద్ ఏలూరి దర్శకుడు. చిను క్రిష్ హీరోగా గీతా రతన్ హీరోయిన్ గా నటిస్తున్నారు. ఇంట్రెస్టింగ్ పాయింట్ తో లవర్ స్టోరీ చిత్రంగా రాబోతున్న ఈ సినిమాలో శేఖర్, సాయినాధ్, మధు ప్రియ ప్రధాన పాత్రలు పోషిస్తుండగా ఈశ్వర్ పెరవళి సంగీతం, రవి బైపల్లి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను శరవేగంగా జరుపుకుంటోంది. వైవిధ్యమైన ప్రేమ కథాంశంతో యూత్ ఆడియన్స్ కి నచ్చేలా తెరకెక్కుతున్న ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని అతి త్వరలో రిలీజ్ కాబోతుంది. కాగా ఈ చిత్రంలోని "ఏమాయచేశావే" పాటను తాజాగా ప్రముఖ సంగీత దర్శకుడు కోటి రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ప్రముఖ సంగీత దర్శకుడు కోటి మాట్లాడుతూ.. లవ్ యూ రా సినిమా పాటను రిలీజ్ చేసినందుకు ఎంతో ఆనందంగా ఉంది. పాట చాల బాగుంది. మంచి కంపోజ్ చేశాడు సంగీత దర్శకుడు ఈశ్వర్.. వినగానే క్యాచీ గా అనిపించింది. హరిచరణ్ గారు పాడిన ఈ పాటను మీ అందరికి నచ్చుతుంది. విజువల్స్ బాగున్నాయి.. కొరియోగ్రఫీ, సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉన్నాయి. సాంగ్ వింటుంటే ఫ్రెష్ అనిపించింది.. టీం అందరికి అల్ ది బెస్ట్ అన్నారు.. చిను క్రిష్, గీతికా రతన్, శేఖర్, సాయినాధ్, మధు ప్రియ, తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి మ్యూజిక్; ఈశ్వర్ పెరవళి, కెమెరా; రవి బైపల్లి, సుధాకర్ నాయుడు, పాటలు; రాజరత్నం బట్లూరి, కొరియోగ్రఫీ; బ్రదర్ ఆనంద్, పోస్ట్ ప్రొడక్షన్ సి2సి స్టూడియో, ప్రొడక్షన్ మేనేజర్; వి.సుధాకర్, పీఆర్ఓ; సాయి సతీష్, నిర్మాత; సముద్రాల మంత్రయ్య బాబు, దర్శకత్వం; ప్రసాద్ ఏలూరి. -
కోఠిలో భారీ అగ్నిప్రమాదం
సాక్షి, హైదరాబాద్: కోఠిలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. షార్ట్ సర్క్కూట్ కారణంగా శనివారం రాత్రి ఆంధ్రాబ్యాంక్‌కు ఎదురుగా ఉన్న ఓ బట్టల దుకాణంలో ఒక్కసారిగా మంటలు చేలరేగాయి. ఒక దుకాణంలో మొదలైన మంటలు పక్కనే ఉన్న మరో నాలుగు షాపులకు వ్యాపించాయి. ప్రమాద సమాచారం అందుకున్న సుల్తాన్ బజార్ పోలీసులు, జీహెచ్ఎంసీ సిబ్బంది, ట్రాఫిక్ పోలీసులు వెంటనే అప్రమత్తమై మంటలు ఆర్పుతున్నారు. నాలుగు ఫైరింజన్ల సాయంతో మంటలను అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం. ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.