కందుకూరు (మహేశ్వరం): భార్యను గొంతు నులిమి చంపిన భర్తను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ సంఘటన కందుకూరు పీఎస్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ విజయ్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం... మండలంలోని దాసర్లపల్లి పరిధిలోని పెద్దమ్మతండాకు చెందిన రమావత్ రవీందర్(30), కోటి దంపతులు.
వివాహేతర సంబంధం అనుమానంతో శుక్రవారం తన భార్య కోటిని గొంతు నులిమి చంపి ఆత్మహత్య చేసుకుందని నమ్మించే ప్రయత్నం చేశాడు. విషయం తెలిసిన తర్వాత పోలీసులు దర్యాప్తు చేసి ఆమెను భర్తే హత్య చేశాడని నిర్థారించి అతన్ని అదుపులోకి తీసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు శనివారం నిందితుడు రవీందర్‌ను రిమాండ్‌కు తరలించారు.