కోఠిలోని బగ్గా వైన్స్ ఎదుట రోడ్డుపై వెళ్తున్న కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి.
హైదరాబాద్: రోడ్డుపై వెళ్తున్న కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగి ట్రాఫిక్ అంతరాయం ఏర్పడిన ఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది.. శుక్రవారం మధ్యాహ్నం కోఠిలోని బగ్గా వైన్స్ ఎదుట.. వేగంగా వెళ్తున్న ఫోర్డ్ కారులో మంటలు చెలరేగాయి. దీంతో కారులో ఉన్న వారు కారును ఆపి బయటకు దూకారు. స్థానికులు నీరు చల్లినా మంటలు అదుపులోకి రాలేదు. సమాచారం అందటంతో ఫైరింజన్ అక్కడికి చేరుకుంది. ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పుతున్నారు. ఈ ఘటనతో ఆ రోడ్డులో ట్రాఫిక్ నిలిచిపోయింది.