విజయవాడలో నిలిచిపోయిన ట్రాఫిక్
సాక్షి, విజయవాడ: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేపట్టిన ధర్మ పోరాట దీక్ష సాధారణ ప్రజానీకాన్ని తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. ముఖ్యమంత్రి చేస్తున్న దీక్షకు జనాన్ని తరలించడానికి వందలాది బస్సులను ప్రభుత్వం ఉపయోగిస్తోంది. దీంతో బస్సులు లేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విజయవాడలోని పలు ఆర్టీసీ బస్టాండుల్లో బస్సుల కోసం ప్రయాణికులు పడిగాపులు కాస్తున్నారు. ఈక్రమంలో చంద్రబాబు దీక్షపై తీవ్ర స్థాయిలో ప్రయాణికులు మండిపడుతున్నారు. దీక్షల పేరుతో ప్రజలను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత నాలుగేళ్లుగా గుర్తుకు రాని ప్రత్యేక హోదా ఇప్పుడు గుర్తుకువచ్చిందా అని వారు ప్రశ్నిస్తున్నారు.
కిలోమీటర్ల మేర జామ్
మరోవైపు హనుమాన్ జంక్షన్‌లో ట్రాఫిక్‌కు పూర్తిగా అంతరాయం ఏర్పడింది. చంద్రబాబు దీక్ష నేపథ్యంలో వాహనాల మళ్ళింపుకు ముందస్తు చర్యలు తీసుకోకపోవడంతో జాతీయ రహదారిపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. జంక్షన్ కూడలి నుంచి ఏలూరు వైపు సుమారు 5 కిలోమీటర్ల పొడవునా వాహనాలు ఆగిపోయి ట్రాఫిక్ స్తంభించిపోయింది. ఓ పక్క అధిక స్థాయిలో ఎండలు.. మరో పక్క కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌తో ప్రయాణికులు నరకం అనుభవిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment