శ్రీమఠంలో సంగీత దర్శకుడు కోటి
మంత్రాలయం : శ్రీరాఘవేంద్రస్వామి దర్శనార్థం తెలుగు సినీ సంగీత దర్శకుడు కోటి గురువారం మంత్రాలయం వచ్చారు. ముందుగా ఆయన గ్రామ దేవత మంచాలమ్మకు అర్చన సహిత హారతులు పట్టారు. శ్రీరాఘవేంద్రస్వామి మూల బృందావనం చేరుకుని ప్రత్యేక పూజలు చేసుకున్నారు. ఆయనకు మఠం అసిస్టెంట్‌మేనేజర్ ఐపీ నరసింహమూర్తి, ధార్మిక సహాయక అధికారి వ్యాసరాజాచార్ మఠం మర్యాదలతో ఆహ్వానం పలికారు. అనంతరం పీఠాధిపతి సుభుదేంద్రతీర్థులు రాఘవేంద్రుల జ్ఞాపిక, శేషవస్త్రం, ఫల, పూల మంత్రాక్షితలతో ఆశీర్వదించారు.