- సంగీత దర్శకుడు కోటి
ప్రస్తుతం సంగీత ప్రియులు కొత్తదనాన్ని ఆశిస్తున్నారని ప్రముఖ సంగీత దర్శకుడు కోటి అన్నారు. పాత తరం సంగీతాన్ని నేటికీ మరచిపోలేకున్నారన్నారు. ఓజిలి సమీపంలో తన మామిడి తోటలో సోమవారం ‘న్యూస్‌లైన్’తో తన అభిప్రాయాలను కోటి పంచుకున్నారు.
- న్యూస్‌లైన్, ఓజిలి
న్యూస్‌లైన్: ఎన్ని సినిమాలకు సంగీతం అందించారు?
కోటి: 1983లో తెలుగుచిత్రసీమకు పరిచయం అయ్యా. ప్రళయ గర్జన చిత్రం రాజ్‌తో కలసి తెలుగులో తొలి సినిమా చేశా. తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో మొత్తం 475కు పైగా చిత్రాలకు సంగీతం అందించా.
న్యూస్‌లైన్: రాజ్‌తో కలసి భవిష్యత్తులో సినిమాలు చేస్తారా?
కోటి: పదేళ్ల పాటు రాజ్‌తో కలసి సినిమాలు చేశా. కొత్తగా ఫీల్డ్‌కు పరిచమైనప్పుడు సంగీతంలో నూతన ట్రెండ్‌ను తీసుకొచ్చా. పదేళ్ల అనంతరం రాజ్, నేను ఫ్రెండ్లీగా 1993లో విడిపోయాం. (రాజ్‌తో కలసి పనిచేయడంపై సున్నితంగా తిరస్కరించారు.)
న్యూస్‌లైన్: అత్యంత ప్రజాదరణ తెచ్చిన చిత్రాలేవీ?
కోటి: పెదరాయుడు, నువ్వేకావాలి, యముడికి మొగుడు, అరుంధతి, నువ్వు నాకు నచ్చావ్ వంటి సినిమాలు అత్యంత ప్రజాదరణ పొందాయి.
న్యూస్‌లైన్: ఖైదీ నం 786 వంటి చిత్రాలిచ్చిన సంగీతం ప్రస్తుతం రాకపోవడానికి కారణం?
కోటి: కాలాన్ని బట్టి సంగీతం మారిపోతుంది. అప్పట్లో ఖైదీనంబర్ 786 సినిమాలోని గువ్వా గోరింక పాట సినిమా ప్రియులను ఎంతగానో ఆకట్టుకుంది. యువత కొత్తదనాన్ని కోరుకుంటున్నారు. అందుకు తగ్గట్టుగానే సంగీతం అందిస్తున్నా.
కొత్త దనాన్ని ఆశిస్తున్నారు
Published Tue, Feb 18 2014 5:35 AM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM
Advertisement
Advertisement