
తెలుగు సినిమా చరిత్రలో మొట్టమొదటి సారి ఒక సంగీత దర్శకుడికి పర దేశ (ఆస్ట్రేలియాలోని న్యూ సౌత్ వేల్స్) పార్లమెంట్‌లో గౌరవ జీవిత సాఫల్య పురస్కారం లభించబోతోంది. అది మరెవరికో కాదు, మూడున్నర దశాబ్దాల పాటు తెలుగు పాటల ప్రపంచాన్ని ఉర్రూతలూగించి, మన అభిమాన హీరోల సినిమాకి అద్భుతమైన సంగీతాన్ని అందించి, మన గుండెల్లో ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకున్న సాలూరి రాజేశ్వరరావు గారి అబ్బాయి కోటికి!
కోటి తెలుగు సినిమా సంగీతానికి చేసిన సేవలకు గాను గుర్తింపుగా ఆస్ట్రేలియా ఇండియన్ స్పోర్ట్స్ ఎడ్యుకేషన్ అండ్ కల్చరల్ సొసైటీ ఈ జీవిత సాఫల్య పురస్కారాన్ని అందించనుంది. అంతే కాకుండా కోటి అక్కడ ఉన్న మన తెలుగు గాయనితో ఒక పాట కూడా పాడించబోతున్నారు. ఆ గాయని మరెవరో కాదు, తన మొదటి పాటతోనే ఆసియా రికార్డు పుస్తకంలో స్థానం దక్కించుకున్న మన తెలుగింటి ఆడపడుచు సుస్మిత రాజేష్. హరుడే వరుడై, హర హర శంభో తర్వాత మరో వినూత్నమైన పాటతో, కొత్త కలయికతో మన ముందుకు వస్తున్నారు సుస్మిత.
ఈ సందర్భంగా ఆస్ట్రేలియాలోని AISECS అడ్వైజర్ రాజేష్ ఉప్పల మాట్లాడుతూ.. ఇటువంటి కార్యక్రమాలు ఇరుదేశాల మధ్య సాంస్కృతిక సంబంధాలు మరింత పెంపొందించడానికి దోహదపడతాయన్నారు. 4 వేల పాటల మైలురాయిని దాటిన కోటిని ఆస్ట్రేలియాలోని పార్లమెంట్‌లో గెస్ట్ ఆఫ్ హానర్‌గా పిలవడం తమకెంతో ఆనందంగా ఉందని తెలియజేశారు.
చదవండి: పెళ్లికి ముందు, నాకూ, నా భర్తకు వేరేవాళ్లతో ఎఫైర్లు: ప్రియాంక చోప్రా
Comments
Please login to add a commentAdd a comment