కలలో బీట్‌ బాగుంది: సంగీతదర్శకుడు కోటి Popular Music Director Koti Launched song From Pranayagodari | Sakshi
Sakshi News home page

కలలో బీట్‌ బాగుంది: సంగీతదర్శకుడు కోటి

Published Sun, Jun 23 2024 12:48 AM | Last Updated on Sun, Jun 23 2024 12:48 AM

Popular Music Director Koti Launched song From Pranayagodari

‘‘కలలో... కలలో.. .’ పాట చాలా ఫ్రెష్‌గా ఉంది. ఈ పాట బీట్, లిరిక్స్, నటీనటుల వేషధారణ, నటన అన్నీ బాగా కుదిరాయి. ఈ చిత్రబృందానికి శుభాకాంక్షలు’’ అన్నారు సంగీతదర్శకుడు కోటి. నటుడు అలీ ఫ్యామిలీ నుంచి సదన్‌ హీరోగా పరిచయమవుతున్న ‘ప్రణయ గోదారి’ చిత్రంలోని ‘కలలో... కలలో...’ అంటూ సాగే పాటను కోటి రిలీజ్‌ చేశారు.

పీఎల్‌ విఘ్నేష్‌ దర్శకత్వంలో పారమళ్ల లింగయ్య నిర్మించిన ఈ చిత్రంలో ప్రియాంకా ప్రసాద్‌ హీరోయిన్‌. ‘‘ఫీల్‌ గుడ్‌ లవ్‌స్టోరీతో రూపోందించిన ఈ చిత్రంలోని ‘కలలో..’ అంటూ సాగే ప్రేమ పాటను సహజమైన లొకేషన్స్‌లో చిత్రీకరించాం. వీనుల విందుగా, కనువిందుగా ఉంటుంది. త్వరలో సినిమాని విడుదల చేస్తాం ’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: మార్కండేయ, కెమెరా: ఈదర ప్రసాద్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement