sadan
-
నా క్యారెక్టర్‌కు కనెక్ట్ అవుతున్నారు
సదన్, ప్రియాంకా ప్రసాద్ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘ప్రణయ గోదారి’. పీఎల్ విఘ్నేష్ దర్శకత్వంలోపారమళ్ళ లింగయ్య నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 13న విడుదలైంది. ఈ చిత్రం సక్సెస్‌మీట్‌లో పీఎల్ విఘ్నేష్ మాట్లాడుతూ– ‘‘మా సినిమా చూసిన ప్రతి ఒక్కరూ బాగుందని చెప్పడం హ్యాపీగా ఉంది’’ అన్నారు.‘‘ఈ సినిమాలో నాపాత్రకు ఆడియన్స్ కనెక్ట్ అవుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది’’ అన్నారు ప్రియాంకా ప్రసాద్. ‘‘ఈ సినిమాపాటలకు మంచి స్పందన లభిస్తోంది’’ అన్నారు సంగీత దర్శకుడు మార్కండేయ. -
‘ప్రణయ గోదారి’ మూవీ రివ్యూ
టైటిల్: ప్రణయ గోదారినటీనటులు: సదన్, ప్రియాంక ప్రసాద్, సాయి కుమార్, పృథ్వి, సునిల్, జబర్థస్త్ రాజమౌళి తదితరులునిర్మాణ సంస్థ: పీఎల్వీ క్రియేషన్స్నిర్మాత: పారమళ్ల లింగయ్యదర్శకత్వం: పీఎల్ విఘ్నేష్సంగీతం: మార్కండేయఎడిటర్: కొడగంటి వీక్షిత వేణువిడుదల తేది: డిసెంబర్ 13, 2024కథేంటంటే..గోదారికి చెందిన పెదకాపు(సాయి కుమార్) వెయ్యి ఎకరాల ఆసామి. చుట్టూ ఉన్న 40 గ్రామాలకు ఆయనే పెద్ద. ఆయన చెప్పిందే న్యాయం. ప్రేమ వివాహం చేసుకున్న పెదకాపు చెల్లి..భర్త చనిపోవడంతో కొడుకు శ్రీను(సదన్ హాసన్)తో కలిసి అన్నయ్య దగ్గరకు వస్తుంది. తన కూతురు లలిత(ఉష శ్రీ)ని మేనల్లుడు శ్రీనుకి ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటాడు పెదకాపు. కానీ శ్రీను ఆ ఊరి జాలరి అమ్మాయి గొయ్య లక్ష్మి ప్రసన్న అలియాస్ గొయ్యని(ప్రియాంక ప్రసాద్)ఇష్టపడతాడు. గోచిగాడు(సునిల్)తో కలిసి రోజు గోదారి ఒడ్డుకు వెళ్లి గొయ్యని కలుస్తుంటాడు. వీరిద్దరి ప్రేమ విషయం పెదకాపుకు తెలుస్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది? పరువు కోసం ప్రాణాలు ఇచ్చే పెదకాపు మేనల్లుడి ప్రేమను అంగీకరించాడా లేదా? గొయ్య, శ్రీనులను కలిపేందుకు గోచి తీసుకున్న సంచలన నిర్ణయం ఏంటి? చివరకు గొయ్య, శ్రీనులు కలిశారా లేదా? అనేదే మిగతా కథ.ఎలా ఉందంటే.. పరువు హత్యల నేపథ్యంలో ఇప్పటికే చాలా సినిమాలు వచ్చాయి. ప్రణయ గోదారి కూడా ఆ కోవకు చెందిన చిత్రమే. ' పునర్జన్మ నేపథ్యంతో హృద్యమైన ప్రేమకథగా ఈ చిత్రాన్ని దర్శకుడు పీఎల్ విఘ్నేష్. దర్శకుడు ఎంచుకున్న పాయింట్ బాగున్నప్పటికీ..దాన్ని తెరపై చూపించడంలో కొంతవరకు మాత్రమే సఫలం అయ్యాడు. సినిమా ప్రారంభం రొటీన్‌గా ఉంటుంది. ప్లాష్‌బ్యాక్ స్టోరీ స్టార్ట్ అయిన తర్వాత కథపై ఆసక్తి పెరుగుతుంది. . గొయ్యతో శ్రీను ప్రేమలో పడడం.. తన ప్రేమ విషయాన్ని చెప్పడం శ్రీను చేసే ప్రయత్నాలు ఆకట్టుకుంటాయి. మధ్య మధ్య గోచి పాత్ర చేసే కామెడీ సీన్లు నవ్వులు పూయిస్తాయి. ఫస్టాఫ్ మొత్తం గొయ్య, శ్రీనుల ప్రేమ చుట్టునే కథనం సాగుతుంది. ఇంటర్వెల్ ట్విస్ట్ ఆకట్టుకుంటుంది. ఇక సెకండాఫ్‌లో కథనం కాస్త ఎమోషనల్‌గా సాగుతుంది. ప్రేమ విషయం పెద కాపుకు తెలియడం.. మరోవైపు గొయ్యకి వేరే వ్యక్తితో పెళ్లికి చేసేందుకు రెడీ అవ్వడంతో ఏం జరుగుతుందనే క్యూరియాసిటీ ప్రేక్షకుల్లో కలుగుతుంది. గోచి పాత్ర ఇచ్చే ట్విస్ట్ ఆకట్టుకుంటుంది. ఇక క్లైమాక్స్‌లో సాయి కుమార్ చెప్పే డైలాగ్స్ ఆలోచింపజేస్తాయి. స్క్రీన్‌ప్లేని ఇంకాస్త బలంగా రాసుకొని, తెలిసిన నటీనటులను పెట్టుకొని ఉంటే సినిమా ఫలితం మరోలా ఉండేవి. ఎవరెలా చేశారంటే..సదన్, ప్రియాంక ప్రసాద్ కొత్తవాళ్లే అయినా.. చక్కగా నటించారు. సిటీ యువకుడు, పల్లెటూరి అబ్బాయిగా రెండు విభిన్నమైన పాత్రలు పోషించిన సదన్.. ప్రతి పాత్రలోనూ వేరియేషన్ చూపించి ఆకట్టుకున్నాడు. ఇక గొయ్యగా ప్రియాంత తెరపై అందంగా కనిపించింది. ఈమె పాత్ర సినిమా మొత్తం ఉంటుంది. వీరిద్దరి తర్వాత ఈ సినిమాలో బాగా పండిన పాత్ర సాయి కుమార్‌ది. పెదకాపు పాత్రలో ఆయన జీవించేశాడు. ఆయన పాత్ర సినిమాకు స్పెషల్ అట్రాక్షన్. సినిమా చూసిన వారు గోచి పాత్రను మరచిపోరు. ఆ పాత్రలో సునిల్ ఒదిగిపోయాడు. సినిమా మొత్తం నవ్విస్తూ.. చివరిలో ఎమోషనల్‌కు గురి చేస్తాడు. జబర్థస్త్ రాజమౌళి తనదైన కామెడీతో నవ్వించాడు. పృథ్వి తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. సాంకేతికంగా సినిమా బాగుంది. మార్కండేయ అందించిన పాటలు సినిమాకు ప్రధాన బలం. అన్ని పాటలు వినసొంపుగా ఉన్నాయి. నేపథ్య సంగీతం పర్వాలేదు. సినిమాటోగ్రఫీ బాగుంది. గోదావరి అందాలను తెరపై చక్కగా చూపించాడు. ప్రతి ఫ్రేమ్‌ని చాలా రిచ్‌గా చూపించే ప్రయత్నం చేశాడు. ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి. రేటింగ్: 2.5/5 -
కలలో బీట్ బాగుంది: సంగీతదర్శకుడు కోటి
‘‘కలలో... కలలో.. .’ పాట చాలా ఫ్రెష్‌గా ఉంది. ఈ పాట బీట్, లిరిక్స్, నటీనటుల వేషధారణ, నటన అన్నీ బాగా కుదిరాయి. ఈ చిత్రబృందానికి శుభాకాంక్షలు’’ అన్నారు సంగీతదర్శకుడు కోటి. నటుడు అలీ ఫ్యామిలీ నుంచి సదన్ హీరోగా పరిచయమవుతున్న ‘ప్రణయ గోదారి’ చిత్రంలోని ‘కలలో... కలలో...’ అంటూ సాగే పాటను కోటి రిలీజ్ చేశారు.పీఎల్ విఘ్నేష్ దర్శకత్వంలో పారమళ్ల లింగయ్య నిర్మించిన ఈ చిత్రంలో ప్రియాంకా ప్రసాద్ హీరోయిన్. ‘‘ఫీల్ గుడ్ లవ్‌స్టోరీతో రూపోందించిన ఈ చిత్రంలోని ‘కలలో..’ అంటూ సాగే ప్రేమ పాటను సహజమైన లొకేషన్స్‌లో చిత్రీకరించాం. వీనుల విందుగా, కనువిందుగా ఉంటుంది. త్వరలో సినిమాని విడుదల చేస్తాం ’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: మార్కండేయ, కెమెరా: ఈదర ప్రసాద్. -
పొలం వద్ద ఉన్న పారతో అన్నను తమ్ముడు దారుణంగా..
మహబూబాబాద్: బోరుబావి వివాదంలో సొంత అన్నపై తమ్ముడు దాడి చేయగా తీవ్రంగా గాయపడిన సంఘటన మండలంలోని సూర్యబండా తండాలో ఆదివారం జరిగింది. తండావాసులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. తండాకు చెందిన భూక్యా సదన్లాల్కు ఇద్దరు కుమారులు, కూతురు ఉన్నారు. కాగా సదన్లాల్ తనకున్న వ్యవసాయ భూమిని, బోరు మోటరును కుమారులు రవీందర్, రమేశ్‌కు ఇవ్వడంతో దానిని ఉమ్మడిగా వాడుకుంటున్నారు. కాగా కొంతకాలంగా బోరుబావి విషయంలో అన్నదమ్ముల మధ్య పంచాయితీ నెలకొంది. ఈక్రమంలో ఆదివారం అన్నదమ్ముల మధ్య సయోధ్యకు పెద్దమనుషులు ప్రయత్నిస్తుండగా తమ్ముడు రమేశ్ పొలం వద్ద ఉన్న పారతో అన్న రవీందర్‌పై దాడి చేసి తీవ్రంగా గాయపరిచి పారిపోయాడు. బాధితుడి ఫిర్యాదు మేర రమేశ్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రీకాంత్ తెలిపారు. ఇవి చదవండి: ఆర్టీసీ బస్సు, డీసీఎం ఘోర రోడ్డు ప్రమాదం! పొగ మంచు, అతివేగమే కారణమా? -
‘భారీ తారాగణం’ మూవీ రివ్యూ
టైటిల్: భారీ తారాగణం నటీ నటులు: సదన్, దీపికా రెడ్డి, రేఖ నిరోష, తదితరులు దర్శకత్వం: శేఖర్ ముత్యాల నిర్మాత: బి.వి.రెడ్డి కెమెరా: ఎం.వి గోపి ఎడిటర్: మార్తండ్ కె. వెంకటేశ్ సంగీతం: సుక్కు నేపథ్య సంగీతం: సాహిత్య సాగర్ కో-ప్రొడ్యూసర్: చంద్రశేఖర్ గౌడ్.వి కొరియోగ్రాఫర్: శ్రీవీర్ దేవులపల్లి పాటలు: సుక్కూ, సాహిత్య, కమల్ విహాస్, శేఖర్ బ్యానర్: బివిఆర్ పిక్చర్స్ బివిఆర్ పిక్చర్స్ బ్యానర్‌పై సదన్, దీపికా రెడ్డి, రేఖ నిరోష ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం భారీ తారాగణం. శేఖర్ ముత్యాల దర్శకత్వం వహించిన ఈ సినిమాను బి.వి రెడ్డి నిర్మించాడు. ఈ నెల 23న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. కథ ఒక కూతురు , ఒక వైఫ్, ఒక లవర్, ఒక పి.ఎ, ఒక ఫ్రెండ్.. ఇలా ఐదుగురు అమ్మాయిలు వారి వారి జీవితాలో ఎటువంటి సమస్యలు ఎదుర్కొన్నారు? ఆ ప్రాబ్లం నుంచి వారు ఎలా బయట పడ్డారు? ఒకరికి హెల్ప్ చేస్తే అది ఎలాగైనా తిరిగి మనదగ్గరకు వస్తుందనేదే కథ. విశ్వనాధ్ (కేదార్ శంకర్), రఘు (తోటమల్లి మధు) మంచి స్నేహితులు. అయితే విశ్వనాధ్ కొడుకు సదన్(హీరో), రఘు కూతురు ధనలక్ష్మి,(రేఖ నిరోషా)లు చిన్నప్పటి నుంచి ఒకే స్కూల్లో చదువుతూ ఎంతో ఆప్యాయంగా ఉన్న వీరిద్దరినీ చూసి పెద్దయిన తరువాత వీరిద్దరికీ పెళ్లి చేయాలనుకుంటారు. అయితే ఉన్నత చదువుల కోసం పట్నం వచ్చి బి.టెక్ లో జాయిన్ అవుతాడు సదన్. అదే కాలేజీలో చదువుతూ ఎదుటివారికి సహాయం చేయడంలో ముందున్న తార (దీపిక రెడ్డి) ను చూసిన మొదటి చూపులోనే ప్రేమలో పడతాడు. సదన్ చేసే పనులతో ఆ తార కూడా సదన్‌ను ఇష్టపడుతుంది. అయితే తారకు అనుకొని సంఘటనలు ఎదురుకావడంతో సదన్‌కు దూరంగా ఉంటుంది. తన ప్రేమను రిజెక్ట్ చేసిందనే భావనతో అమ్మాయిలు అందరూ అంతే అని తిరిగి తన విలేజ్‌కు వస్తాడు. అయితే రఘు తన కూతురు ధనలక్ష్మి కి పెళ్లి చేయాలని ఎన్ని సంబంధాలు చూసినా ఆమె రిజెక్ట్ చేస్తుంది. చివరికి చిన్నప్పటి ఫ్రెండ్ సదన్‌ను కూడా పెళ్లి చేసుకోను అంటుంది. మరో వైపు చిట్టెమ్మ దాబా నడుపుతున్న చిట్టెమ్మ (సరయు) కూడా ఎన్నో ఇబ్బందులు పడుతుంటుంది. ఇలా శాంతి (సాహితీ దాసరి), ధనలక్ష్మి,(రేఖ నిరోషా) పరిమళ (స్మైళీ ) అనే ఐదుగురు అమ్మాయిల వారి వారి జీవితాలలో వేరే వేరే సందర్భాల్లో వారు పడుతున్న ప్రాబ్లమ్స్ నుంచి తెలివిగా ఎలా బయట పడ్డారు? అనుకోని విధంగా హీరో వీరందరికీ ఎలాంటి సహాయం చేశాడు? సదన్ కు ఈ ఐదుగురు అమ్మాయిలతో ఉన్న లింకేమిటి? అనేది తెలుసుకోవాలి అంటే కచ్చితంగా "భారీ తారాగణం" సినిమా చూడాల్సిందే.. నటీ నటుల పనితీరు సదన్ పాత్రలో నటించిన అలీ అన్న కొడుకు సదన్ కు ఇది మెదటి చిత్రమైనా నటుడిగా ప్రూవ్ చేసుకున్నాడు. హీరోయిన్ పాత్రల్లో నటించిన తార (దీపిక రెడ్డి) తన గ్లామర్‌తో ఆకట్టుకుంది. సెకెండ్ హీరోయిన్గా నటించిన ధనలక్ష్మి(రేఖ నిరోషా) కూడా తన నటనతో పర్వాలేదనిపించింది. చిట్టెమ్మ పాత్రలో సరయు, డాక్టర్‌కు పీఏ పాత్రలో నటించిన పరిమళ (స్మైళీ )లు తమ పాత్రల మేర మెప్పించారు. సైకాలజీ డాక్టర్ గా శశిధర్ పాత్రలో సమీర్, చిట్టెమ్మ దాబా ఓనర్‌గా శ్రీను పాత్రలో (ఛత్రపతి శేఖర్), హీరోహీరోయిన్స్ తల్లిదండ్రులు విశ్వనాధ్ (కేదార్ శంకర్), రఘు (తోటమల్లి మధు), ఇలా అందరూ తమ నటనతో మెప్పించారు. హీరోకు ఫ్రెండ్స్ గా నటించిన సన్నీ, సత్యలు చాలా చోట్ల నవ్వించే ప్రయత్నం చేశారు. ఇందులో ఆలీ ఒక పాటలో నటించడం విశేషం. పొలిటీషియన్‌గా పోసాని పాత్ర చిన్నదే అయినా కథకు చాలా ఇంపార్టెన్స్ ఉంది. సాంకేతిక నిపుణుల పనితీరు ఆడవారు వారి వారి జీవితాలో ఎటువంటి సమస్యలతో ఇబ్బంది పడుతుంటారు? వాటి నుంచి ఎలా బయట పడాలి? అనే కాన్సెప్ట్‌ను సెలెక్ట్ చేసుకొని దీనికి లవ్,కామెడీ థ్రిల్లర్ ను జోడించాడు డైరెక్టర్ శేఖర్ ముత్యాల. సినిమాకు కావాల్సిన డైలాగ్స్ కొత్త రకంగా ఉండేలా స్క్రీన్ ప్లే రాసుకున్నాడు. తాను రాసుకున్న కథ కథనాలు తెర మీద చూపించడంలో కొంతమేర సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. కానీ కొన్ని సన్నివేశాలు మరీ సాగదీసినట్లుగా అనిపించక మానవు. సాహిత్య సాగర్ నేపథ్య సంగీతం పర్వాలేదు. సినిమాటోగ్రాఫర్ ఎం.వి గోపి తన కెమెరాతో మంచి విజువల్స్ అందించాడు. దేవరాజ్ స్టంట్స్ ఓ మోస్తరుగా ఉన్నాయి. మార్తండ్ కె. వెంకటేశ్. ఎడిటింగ్ ఇంకాస్త మెరుగ్గా ఉండాల్సింది. బి.వి.రెడ్డి నిర్మాణ విలువలు బాగున్నాయి. -
భారీ తారాగణం రిలీజయ్యేది అప్పుడే!
సదన్, దీపికా రెడ్డి, రేఖ నిరోషి కీలక పాత్రలు పోషించిన చిత్రం ‘భారీ తారగణం’. శేఖర్ ముత్యాల దర్శకత్వంలో బివిఆర్ పిక్చర్స్ బ్యానర్‌పై బి.వి రెడ్డి నిర్మిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈ నెల 23న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా శనివారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో దర్శకుడు మాట్లాడుతూ.. ‘‘నేను రాసిన కథను నమ్మి నిర్మాత అవకాశం ఇచ్చారు. సినిమా మీదున్న నమ్మకంతో విడుదలకు నెల రోజుల ముందే నేను డిస్ట్రిబ్యూటర్లు, సన్నిహితులకు షో వేసి చూపించాం. మంచి స్పందన వచ్చింది. కథ బాగుండటంతో పీవీఆర్ ఉదయ్‌గారు సినిమాను విడుదల చేయడానికి ముందుకొచ్చారు. సినిమా ప్రారంభం నుంచి అలీగారు ఇచ్చిన సపోర్ట్ మరచిపోలేను. ఈ నెల 23న వస్తున్న ఈ చిత్రాన్ని ఆదరిస్తారని నమ్ముతున్నా. నాకు ఎంతో సహకరించిన నా టీమ్‌కు కృతజ్ఞతలు’’ అని అన్నారు. నిర్మాత మాట్లాడుతూ ‘‘ఆస్ట్రేలియాలో బిజినెస్‌లో ఉన్న నాకు దర్శకుడు శేఖర్ పరిచయమయ్యారు. ఆయన చెప్పిన కథ నాకు కనెక్ట్ అయింది. వెంటనే ఓకే చేసి షూటింగ్ మొదలుపెట్టాం. లవ్, కామెడీ ఎంటర్టైనర్గా ఈ చిత్రం రూపొందింది. చిన్న సినిమాలను ఆదరిస్తే మరిన్ని మంచి చిత్రాలొస్తాయి. అన్ని వర్గాలను ఆకట్టుకునే చిత్రమిది. కథ, కథనంతోపాటు సంగీతం, అలీ, 7ఆర్ట్స్ సరయు చేసిన ప్రత్యేక గీతం సినిమాకు హైలైట్ అవుతాయి' అన్నారు. చదవండి: రామరామ.. హనుమంతుడి నోట అటువంటి డైలాగ్సా? స్పందించిన రైటర్ -
ప్రేమ ఇంత భారమా..?
సదన్ , దీపికా రెడ్డి, రేఖ నిరోషి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘భారీ తారాగణం’. శేఖర్ ముత్యాల దర్శకత్వంలో బీవీఆర్ పిక్చర్స్‌పై బీవీ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది. ఈ సినిమాలోని ‘రెండే రెండు అక్షరాల ప్రేమ ఇంత భారమా..’ అనే పాట లిరికల్ వీడియోను విడుదల చేశారు మేకర్స్. ఈ చిత్ర సంగీత దర్శకుడు సుక్కూ రచించిన ఈ పాటను జయశ్రీ పాల్యం ఆలపించారు. ‘‘లవ్ అండ్ కామెడీ ఎంటర్టైనర్గా రూపొందిన చిత్రం ‘భారీ తారాగణం’. ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుంది’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ఈ సినిమాకు సహ నిర్మాత: చంద్రశేఖర్ గౌడ్.వి, నేపథ్య సంగీతం: సాహిత్య సాగర్. -
'చూసిన ప్రతి అమ్మాయిని హేట్ చేస్తున్నాడు'.. ఆసక్తిగా 'భారీ తారాగణం' ట్రైలర్
సదన్, దీపికా రెడ్డి, రేఖ నిరోష నటీ నటులుగా శేఖర్ ముత్యాల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'భారీ తారాగణం’. బీవీఆర్ పిక్చర్స్ బ్యానర్‌పై బీవీ రెడ్డి నిర్మించారు. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలకు మంచి ప్రేక్షకాదరణ లభించింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని విడుదలకు సిద్దమైన సందర్బంగా చిత్ర ట్రైలర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ కార్యక్రమానికి ప్రముఖ దర్శకులు ఎస్వీ కృష్ణా రెడ్డి, నిర్మాత అచ్చిరెడ్డి, కమెడియన్ ఆలీ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఎస్వీ కృష్ణారెడ్డి మాట్లాడుతూ..' దర్శకుడు శేఖర్, నిర్మాత బివి.రెడ్డి మంచి కథను తెరకెక్కించారు..ఈ సినిమాకు సుక్కు అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు అలీ ఏ పాత్ర ఇచ్చినా ఒదిగిపోతారు. నాకు ఇష్టమైన బాబా కుమారుడు హీరోగా చేయడం చాలా సంతోషం. ఈ చిత్రంలో అందరూ కూడా చాలా బాగా నటించారు. ఈ సినిమా హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా.' అని అన్నారు. నిర్మాత అచ్చిరెడ్డి మాట్లాడుతూ.. 'ట్రైలర్ చూస్తుంటే చాలా అట్రాక్టివ్‌గా కనిపిస్తోంది. ఆలీ ఈ సినిమాలో చాలా చక్కగా నటించాడు. దర్శక నిర్మాతలకు ఈ చిత్రం ద్వారా మంచి పేరు వస్తుంది. ప్రతి ఒక్కరూ చాలా చక్కగా నటించారు. త్వరలో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా బిగ్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా.' అని అన్నారు ఆలీ మాట్లాడుతూ.. 'మంచి కంటెంట్‌తో తీసిన ఈ సినిమా బిగ్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అలాగే ఈ చిత్రంలో మా అన్న తమ్ముడు సదన్ హీరోగా చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇందులో నాకు మంచి పాత్ర లభించింది. ఇలాంటి మంచి సినిమాలో నటించినందుకు చాలా హ్యాపీగా ఉంది.' అని అన్నారు. -
భారీ తారాగణం షురూ
భారీ తారాగణం అనగానే స్టార్ హీరోలు, స్టార్ హీరోయిన్లతో పాటు పేరున్న నటీనటులు నటిస్తున్నారనుకోవడం సహజం. అయితే తాజాగా ప్రారంభమైన ‘భారీ తారాగణం’ సినిమా ద్వారా హాస్యనటుడు అలీ భార్య జుబేదా బేగం సోదరి తనయుడు సదన్ హీరోగా పరిచయమవుతున్నారు. శేఖర్ ముత్యాల దర్శకత్వంలో బీవీఆర్ పిక్చర్స్ పతాకంపై బీవీ రెడ్డి నిర్మిస్తున్నారు. దీపికా రెడ్డి, రేఖా నిరోష కథానాయికలుగా నటిస్తున్నారు. హీరో హీరోయిన్లపై తీసిన మొదటి సన్నివేశానికి దర్శకుడు ఎస్వీ కష్ణారెడ్డి కెమెరా స్విచ్చాన్ చేయగా, నిర్మాత అచ్చిరెడ్డి క్లాప్ ఇచ్చారు. తొలి షాట్‌కి అలీ గౌరవ దర్శకత్వం వహించగా, సంగీత దర్శకురాలు ఎమ్ఎమ్. శ్రీలేఖ జ్యోతి ప్రజ్వలన చేశారు. శేఖర్ ముత్యాల మాట్లాడుతూ– ‘‘కామెడీ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోన్న చిత్రమిది. నన్ను నమ్మి ఈ అవకాశం ఇచ్చిన బీవీ రెడ్డిగారికి ధన్యవాదాలు’’ అన్నారు. ‘‘మంచి కథ, కథనాలతో ‘భారీ తారాగణం’ రూపొందుతోంది’’ అన్నారు సదన్. ‘‘ఈ నెల 25న రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించి, మేలో సినిమా విడుదల చేస్తాం’’ అన్నారు బీవీ రెడ్డి. ఈ చిత్రానికి కెమెరా: ఎమ్.వి.గోపి, సంగీతం: సుక్కు. -
బాలసదన్‌కు బాలిక అప్పగింత
యాదగిరిగుట్ట : యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో తప్పిపోయిన ఓ బాలికను బాలసదన్‌కు అప్పగించారు. ఆదివారం సెలవు దినం కావడంతో యాదాద్రిలో భక్తుల రద్దీ పెరిగింది. ఈ క్రమంలో ఓ బాలిక ఏడ్చుతూ తిరువీధుల వెంట తిరుగుతుంది. స్థానికులు, వ్యాపారస్తులు యాదగిరిగుట్ట ఎస్ఐ రాజశేఖర్‌రెడ్డికి సమాచారం అందించారు. ఈ మేరకు ఆయన ఆ బాలికను పోలీస్ స్టేషన్‌కు తరలించారు. 5 నుంచి 7 సంవత్సరాల మధ్య వయస్సులో ఉన్న ఆ బాలిక తల్లిదండ్రులు, ఊరు పేర్లను వెల్లడించడం లేదని ఎస్ఐ తెలిపారు. దీంతో భువనగిరి బాలసదన్‌కు సమాచారం అక్కడి ఐసీడీఎస్ అధికారులకు అప్పగించినట్లు ఎస్ఐ తెలిపారు.