![- - Sakshi](/styles/webp/s3/article_images/2024/01/1/brothers.jpg.webp?itok=4cKXpWTw)
మహబూబాబాద్: బోరుబావి వివాదంలో సొంత అన్నపై తమ్ముడు దాడి చేయగా తీవ్రంగా గాయపడిన సంఘటన మండలంలోని సూర్యబండా తండాలో ఆదివారం జరిగింది. తండావాసులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. తండాకు చెందిన భూక్యా సదన్‌లాల్‌కు ఇద్దరు కుమారులు, కూతురు ఉన్నారు. కాగా సదన్‌లాల్ తనకున్న వ్యవసాయ భూమిని, బోరు మోటరును కుమారులు రవీందర్, రమేశ్‌కు ఇవ్వడంతో దానిని ఉమ్మడిగా వాడుకుంటున్నారు.
కాగా కొంతకాలంగా బోరుబావి విషయంలో అన్నదమ్ముల మధ్య పంచాయితీ నెలకొంది. ఈక్రమంలో ఆదివారం అన్నదమ్ముల మధ్య సయోధ్యకు పెద్దమనుషులు ప్రయత్నిస్తుండగా తమ్ముడు రమేశ్ పొలం వద్ద ఉన్న పారతో అన్న రవీందర్‌పై దాడి చేసి తీవ్రంగా గాయపరిచి పారిపోయాడు. బాధితుడి ఫిర్యాదు మేర రమేశ్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రీకాంత్ తెలిపారు.
ఇవి చదవండి: ఆర్టీసీ బస్సు, డీసీఎం ఘోర రోడ్డు ప్రమాదం! పొగ మంచు, అతివేగమే కారణమా?
Comments
Please login to add a commentAdd a comment