వెంకటయ్య (ఫైల్)
మహబూబాబాద్: మానవ సంబంధాలు ఆర్థిక సంబంధాలుగా మారిన నేపథ్యంలో మనుషుల మధ్య బంధాలు తెగిపోతున్నాయి. ఆస్తుల కోసం బంధాలు తెంచుకుటున్నారు. అందుకు సాక్ష్యమే ఈ ఘటన. ఆస్తి కోసం కన్న తండ్రిని కొడుకు హత్య చేశాడు. ఈ ఘటన జనగామ జిల్లా పాలకుర్తి మండలం సిరిసన్నగుడెంలో చోటుచేసుకుంది. ఎస్సై తాళ్ల శ్రీకాంత్ కథనం ప్రకారం గ్రామానికి చెందిన గాయాల వెంకటమ్మ, వెంకటయ్య(70) దంపతులకు ఒక కుమారుడు, ముగ్గురు కూతుళ్లు ఉన్నారు.
అందరికీ కొన్ని సంవత్సరాల క్రితమే పెళ్లిళ్లయ్యాయి. వెంకటయ్యకు మొత్తం 8 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. 2 ఎకరాల భూమిని తను ఉంచుకుని మిగతా భూమి కుమారుడు పేరున పట్టా చేయించాడు. అప్పట్లో ఇద్దరు కూతుళ్లు తాళ్లపెల్లి రేణుక పేరున 20 గుంటలు, భాస్కుల లక్ష్మి పేరిట 20 గంటల భూమిని పట్టా చేయించాడు. మొత్తం ఎకరం భూమిని ఇద్దరి కూతుళ్లకు పసుపు, కుంకుమల కింద ఇస్తానని ఒప్పుకున్నాడు.
ఒప్పుకున్న ప్రకారమే గత నెలలో ఇద్దరి కూతుళ్లకు చెరో 20 గుంటల చొప్పున పట్టా చేయించాడు. అప్పటి నుంచి తండ్రి, కొడుకుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఆదివారం సాయత్రం పొలం వద్ద ఇరువురి మధ్య మాటలు పెరగడంతో ఆగ్రహానికి గురైన కుమారుడు నర్సింహ.. కర్రతో తండ్రి తలపై బలంగా కొట్టాడు. దీంతో వెంకటయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనపై కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
ఇవి కూడా చదవండి: దున్నపోతే చంపేసింది! ముత్యాన్ని కూడా పగబట్టిందంటున్న గ్రామస్తులు!
Comments
Please login to add a commentAdd a comment