పాత కక్షలతో మహిళను గొడ్డలితో దారుణంగా.. | - | Sakshi
Sakshi News home page

పాత కక్షలతో మహిళను గొడ్డలితో దారుణంగా..

Published Thu, Jan 4 2024 1:14 AM | Last Updated on Thu, Jan 4 2024 12:52 PM

- - Sakshi

పద్మ (ఫైల్‌)

మహబూబాబాద్‌: పాత కక్షల నేపథ్యంలో ఓ మహిళపై గొడ్డలితో దాడికి పాల్పడగా ఆమె మృతి చెందింది. ఈ ఘటన మహదేవపూర్‌ మండలం అంబట్‌పల్లిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం పాత కక్షల నేపథ్యంలో అంబట్‌పల్లి అమరేశ్వర ఆలయంలో బుధవారం ఉదయం అయ్యప్ప మాలధారుడు పుట్ట నరసింహస్వామి.. మరో మాలధారుడు నల్ల అవినాశ్‌పై కత్తితో దాడికి పాల్పడగా స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటనను చూసిన సహా మాలధారులు ఇద్దరిని సముదాయించి ఇంటికి పంపించారు.

అనంతరం నరసింహస్వామి గొడ్డలితో అవినాశ్‌ ఇంటికి చేరకున్నాడు. అక్కడ అతడు కనిపించకపోవడంతో ఆగ్రహం చెందిన నరసింహస్వామి.. అవినాశ్‌ తల్లి పద్మ (40)పై దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతున్న పద్మను స్థానికులు మహదేవపూర్‌ సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందింది. దీంతో పద్మ మృతదేహానికి ఆరోగ్య కేంద్రంలో పోస్టుమార్టం నిర్వహించి అంబట్‌పల్లిలో అంత్యక్రియలు నిర్వహించారు. ఈ ఘటనపై మృతురాలి భర్త నల్ల భూమయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ కిరణ్‌కుమార్‌, ఎస్సై రాజ్‌కుమార్‌ తెలిపారు.

ఇవి చ‌ద‌వండి: బర్త్‌డేకు ఇదే నా చిన్న గిఫ్ట్‌ అంటూ.. సెల్ఫీతో యువ‌కుడి విషాదం!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement