ప్రేమ ఇంత భారమా..? | Bhari Taraganam Lyrical Video Release | Sakshi
Sakshi News home page

ప్రేమ ఇంత భారమా..?

Published Mon, Jun 5 2023 3:53 AM | Last Updated on Mon, Jun 5 2023 12:04 PM

Bhari Taraganam Lyrical Video Release - Sakshi

సదన్ , దీపికా రెడ్డి

సదన్ , దీపికా రెడ్డి, రేఖ నిరోషి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘భారీ తారాగణం’. శేఖర్‌ ముత్యాల దర్శకత్వంలో బీవీఆర్‌ పిక్చర్స్‌పై బీవీ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది. ఈ సినిమాలోని ‘రెండే రెండు అక్షరాల ప్రేమ ఇంత భారమా..’ అనే పాట లిరికల్‌ వీడియోను విడుదల చేశారు మేకర్స్‌.

ఈ చిత్ర సంగీత దర్శకుడు సుక్కూ రచించిన ఈ పాటను జయశ్రీ పాల్యం ఆలపించారు. ‘‘లవ్‌ అండ్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన చిత్రం ‘భారీ తారాగణం’. ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుంది’’ అని చిత్రయూనిట్‌ పేర్కొంది. ఈ సినిమాకు సహ నిర్మాత: చంద్రశేఖర్‌ గౌడ్‌.వి, నేపథ్య సంగీతం: సాహిత్య సాగర్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement