Deepika Reddy
-
Kuchipudi: మూడుతరాల నాట్యోత్సాహం
అది ఆదివారం సాయంత్రం. రవీంద్రభారతి ఆడిటోరియం. అందెలరవళి మధ్య శ్లోక ఆరంగేట్రం. కూచిపూడి సాధనలో మూడవతరం ఆమెది. పదహారేళ్ల నాట్యసాధనకు ప్రతీక ఆ అరంగేట్రం. హైదరాబాద్‌లోని రవీంద్ర భారతిలో మొన్నటి రోజున ఆరంగేట్రం చేసిన శ్లోకారెడ్డి కూచిపూడి నాట్యసాధనను తన ఆరవ ఏట మొదలు పెట్టింది. పదకొండవ ఏట ‘బాల చైతన్య అకాడమీ అవార్డు’ అందుకుంది. నాట్యమే శ్వాసగా అడుగులు వేస్తూ గడిచిన బాల్యాన్ని గుర్తు చేసుకుంటూ ‘భారత ప్రభుత్వ సాంస్కృతిక మంత్రిత్వ శాఖ నుంచి సీసీఆర్టీ స్కాలర్షిప్కు ఎంపిక కావడం గర్వకారణంగా భావిస్తున్నట్లు’ చెప్పారు. ఆరంగేట్రం సందర్భంగా ఆమె ‘సాక్షి’తో మాట్లాడారు. ‘‘నా నాట్యగురువు అమ్మే. అమ్మ దీపాంజలి నాట్యసంస్థను ప్రారంభించి నాట్యంలో శిక్షణతోపాటు నాట్య ప్రదర్శనలు ఇస్తోంది. అలా నాకు ఆ ప్రదర్శనల్లో నాట్యం చేసే అవకాశం దక్కింది. గోదాకల్యాణం, స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ ప్రారంభోత్సవం సందర్భంగా నాట్య ప్రదర్శన, జీ ట్వంటీ సదస్సు, గ్లోబల్ ఎంటర్ప్రెన్యూర్ సమ్మిట్, ప్రపంచ తెలుగు మహాసభలు, రాజ్‌భవన్, ఖజురహో, హంపి, నిశగంధి, కింకిణి డాన్స్ ఫెస్టివల్స్, త్యాగబ్రహ్మ గానసభ, దుబాయ్‌లో భారత పర్యాటక రంగం ప్రదర్శన, భారత 70వ స్వాతంత్య్రదినోత్సవ వేడుకల సందర్భంగా టర్కీలోని ఇండియన్ ఎంబసీ నిర్వహించిన కార్యక్రమం, లెజెండరీ పర్సనాలిటీ మ్యాస్ట్రో పండిట్ బిర్జు మహారాజ్ డాన్స్ ఫెస్టివల్ ... ఇలా అమ్మతోపాటు, ఆమె ఆధ్వర్యంలో లెక్కలేనన్ని ప్రదర్శనల్లో నాట్యం చేయగలిగాను. అమ్మ ప్రధాన పాత్ర పోషిస్తున్న ప్రదర్శనల్లో నేను కూడా వేదికమీద ఉండడం వల్ల చాలా నేర్చుకున్నాను. శిక్షణ సమయంలో, వేదిక మీద ప్రదర్శనలిచ్చేటప్పుడు మాత్రమే గురువు. క్లాస్ నుంచి బయటకు వచ్చి ఇంట్లో అడుగుపెట్టగానే అమ్మలోని గురువు మాయమై అమ్మ బయటకు వస్తుంది. మేము ఏం తినాలి, హోమ్‌వర్క్ గురించి తెలుసుకుని మర్నాటి స్కూల్‌కి సిద్ధం చేయడంలో మునిగిపోయేది. అమ్మ బాగా గారం చేస్తుంది, కానీ నాకు నాన్న దగ్గరే ఎక్కువ చనువు. అమ్మమ్మ అడుగుజాడల్లో మా ఇంట్లో నాట్యసాధనకు అంకితమైన మూడవ తరం నాది. మా అమ్మమ్మ రాధిక, అమ్మ దీపిక, నేను. మేము ముగ్గురమూ ఒకే వేదిక మీద కనిపించడం సంతోషకరం. రుద్రమదేవి, భద్రకాళి అష్టకం, గోదాదేవి, కృష్ణలీలలు ప్రదర్శించాను. అమ్మమ్మ రవీంద్రభారతి ప్రారంభోత్సవ కార్యక్రమం(1961, మే, 11వ తేదీ) లో నాట్యప్రదర్శన ఇచ్చింది. ఇప్పుడు అదే వేదిక మీద నా ఆరంగేట్రం జరగడం నా అదృష్టం. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా భరతనాట్య కళాకారిణి పద్మభూషణ్ గ్రహీత అలర్మేల్వల్లి గారు రావడం నా పూర్వజన్మ సుకృతం. మరో ఆసక్తికరమైన విషయమేమిటంటే... నాకు సమాజం పట్ల శ్రద్ధ కలగడానికి కారణం కూడా నాట్యమే. నాట్యం గొప్ప మాధ్యమం. ఈ మాధ్యమం ద్వారా పౌరాణిక, ఇతిహాసాలతోపాటు జాతీయాంశాలు, సామాజికాంశాలను కూడా సామాన్యులకు చేరవేయగలుగుతాం. ఒక కొత్త ఇతివృత్తాన్ని రూపొందించడానికి సమాజాన్ని చదువుతాం. కాబట్టి సమాజంలో ఉండే సమస్యలు అవగతమవుతాయి. వాటి మీద నాట్య రూపకాన్ని ప్రదర్శించి అంతటితో మిన్నకుండిపోవడం స్వార్థమే అవుతుంది. కళాకారులుగా మేము సమాజానికి మా వంతుగా తిరిగి ఇవ్వాలి కూడా. మన సమాజంలో సాంస్కృతిక కళల పట్ల ఆసక్తి ఉండి కూడా ప్రోత్సాహం కరవైన వాళ్లెంతోమంది ఉన్నారు. వాళ్లలో కొందరికైనా నేను చేయగలిగిన సహాయం చేయాలనేది నా కోరిక. కోవిడ్ సమయంలో వైద్యరంగంలో పనిచేసే వారి పట్ల సానుకూలంగా వ్యవహరించడం మీద చేసిన నాట్యరూపకం యూ ట్యూబ్‌లో బాగా వైరల్ అయింది. ప్రకృతి పరిరక్షణ, ప్రపంచశాంతి కోసం నాట్య రూపకాలను రూపొందిస్తున్నాను. లలితకళల ఇతివృత్తంగా చిత్రీకరించిన మ్యూజిక్ స్కూల్ ద్విభాషా చిత్రానికి అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌గా లండన్‌కు చెందిన ప్రముఖ కొరియోగ్రాఫర్ ఆడమ్ మర్రేతో పనిచేయడం నా కెరీర్లో మరో ఆణిముత్యం అనే చెప్పాలి. ఆరంగేట్రంలో రుద్రమ పాత్రను ఎంచుకోవడానికి కారణం మహిళాసాధికారత పట్ల చైతన్యవంతం చేయడం కూడా. నా భవిష్యత్తు రూపకాలు కూడా సమాజం, ప్రకృతితోపాటు మహిళల భద్రత, మహిళాభ్యుదయం మీద ఉంటాయి’’ అని వివరించారు శ్లోకా రెడ్డి. సంగీతమూ ఇష్టమే! నేను పుట్టింది, పెరిగింది అంతా హైదరాబాద్‌లోనే. పాఠశాల విద్య చిరక్ ఇంటర్నేషనల్ స్కూల్. సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజ్ నుంచి గ్రాడ్యుయేషన్ తర్వాత లండన్‌లో క్వీన్ మేరీ యూనివర్సిటీ నుంచి డిజిటల్ మార్కెటింగ్‌లో మాస్టర్స్ చేశాను. మన కల్చర్ కోసం పనిచేయడం స్కూల్లోనే మొదలైంది. స్కూల్ కల్చరల్ కమిటీకి డిప్యూటీ హెడ్‌ని. డాన్స్, మ్యూజిక్ రెండూ ఇష్టమే. తమ్ముడితోపాటు ఏడేళ్లు కర్ణాటక సంగీతం కూడా సాధన చేశాను. కానీ నా స్ట్రెస్ బస్టర్ మాత్రం బుక్ రీడింగే. ‘స్పందన’ చిల్డ్రన్హోమ్లోని పిల్లలతో గడపడం కూడా నాకిష్టం. ‘యట్–రైజ్’ అనే నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ స్థాపించి కళాభిరుచి ఉన్నవారితోపాటు గ్రామాల్లో కనీస అవసరాల కోసం పోరాడుతున్న వాళ్లకు ఆసరాగా నిలుస్తున్నాను. క్లెన్లీనెస్ డ్రైవ్, మెడికల్ క్యాంపులు, ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనలో నా వంతుగా కొంతమేర సహకారం అందిస్తున్నాను. – శ్లోకారెడ్డి, కూచిపూడి నాట్యకారిణి – వాకా మంజులారెడ్డి సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
అద్భుతం.. ‘అనన్య’ నృత్యం..
గన్‌ఫౌండ్రీ (హైదరాబాద్): దీపాంజలి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నృత్యగురువు దీపికారెడ్డి శిష్యురాలు అనన్య పొలసాని కూచిపూడి నృత్య అరంగేట్రం శనివారం రవీంద్రభారతిలో కన్నుల పండువగా జరిగింది. ఈ సందర్భంగా ఆమె చక్కటి హావభావాలతో నర్తించిన పుష్పాంజలి, భామాకలాపం ప్రదర్శనలు ఆహూతులను ఆకట్టుకున్నాయి. సీఎం కేసీఆర్ సతీమణి శోభ, మంత్రులు శ్రీనివాస్‌గౌడ్ గంగుల కమలాకర్, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, ఎంపీ సంతోష్ కుమార్ తదితరులు హాజరై అనన్యను అభినందించారు. అనన్య ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ మేనకోడలు. -
భారీ తారాగణం రిలీజయ్యేది అప్పుడే!
సదన్, దీపికా రెడ్డి, రేఖ నిరోషి కీలక పాత్రలు పోషించిన చిత్రం ‘భారీ తారగణం’. శేఖర్ ముత్యాల దర్శకత్వంలో బివిఆర్ పిక్చర్స్ బ్యానర్‌పై బి.వి రెడ్డి నిర్మిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈ నెల 23న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా శనివారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో దర్శకుడు మాట్లాడుతూ.. ‘‘నేను రాసిన కథను నమ్మి నిర్మాత అవకాశం ఇచ్చారు. సినిమా మీదున్న నమ్మకంతో విడుదలకు నెల రోజుల ముందే నేను డిస్ట్రిబ్యూటర్లు, సన్నిహితులకు షో వేసి చూపించాం. మంచి స్పందన వచ్చింది. కథ బాగుండటంతో పీవీఆర్ ఉదయ్‌గారు సినిమాను విడుదల చేయడానికి ముందుకొచ్చారు. సినిమా ప్రారంభం నుంచి అలీగారు ఇచ్చిన సపోర్ట్ మరచిపోలేను. ఈ నెల 23న వస్తున్న ఈ చిత్రాన్ని ఆదరిస్తారని నమ్ముతున్నా. నాకు ఎంతో సహకరించిన నా టీమ్‌కు కృతజ్ఞతలు’’ అని అన్నారు. నిర్మాత మాట్లాడుతూ ‘‘ఆస్ట్రేలియాలో బిజినెస్‌లో ఉన్న నాకు దర్శకుడు శేఖర్ పరిచయమయ్యారు. ఆయన చెప్పిన కథ నాకు కనెక్ట్ అయింది. వెంటనే ఓకే చేసి షూటింగ్ మొదలుపెట్టాం. లవ్, కామెడీ ఎంటర్టైనర్గా ఈ చిత్రం రూపొందింది. చిన్న సినిమాలను ఆదరిస్తే మరిన్ని మంచి చిత్రాలొస్తాయి. అన్ని వర్గాలను ఆకట్టుకునే చిత్రమిది. కథ, కథనంతోపాటు సంగీతం, అలీ, 7ఆర్ట్స్ సరయు చేసిన ప్రత్యేక గీతం సినిమాకు హైలైట్ అవుతాయి' అన్నారు. చదవండి: రామరామ.. హనుమంతుడి నోట అటువంటి డైలాగ్సా? స్పందించిన రైటర్ -
ప్రేమ ఇంత భారమా..?
సదన్ , దీపికా రెడ్డి, రేఖ నిరోషి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘భారీ తారాగణం’. శేఖర్ ముత్యాల దర్శకత్వంలో బీవీఆర్ పిక్చర్స్‌పై బీవీ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది. ఈ సినిమాలోని ‘రెండే రెండు అక్షరాల ప్రేమ ఇంత భారమా..’ అనే పాట లిరికల్ వీడియోను విడుదల చేశారు మేకర్స్. ఈ చిత్ర సంగీత దర్శకుడు సుక్కూ రచించిన ఈ పాటను జయశ్రీ పాల్యం ఆలపించారు. ‘‘లవ్ అండ్ కామెడీ ఎంటర్టైనర్గా రూపొందిన చిత్రం ‘భారీ తారాగణం’. ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుంది’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ఈ సినిమాకు సహ నిర్మాత: చంద్రశేఖర్ గౌడ్.వి, నేపథ్య సంగీతం: సాహిత్య సాగర్. -
'చూసిన ప్రతి అమ్మాయిని హేట్ చేస్తున్నాడు'.. ఆసక్తిగా 'భారీ తారాగణం' ట్రైలర్
సదన్, దీపికా రెడ్డి, రేఖ నిరోష నటీ నటులుగా శేఖర్ ముత్యాల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'భారీ తారాగణం’. బీవీఆర్ పిక్చర్స్ బ్యానర్‌పై బీవీ రెడ్డి నిర్మించారు. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలకు మంచి ప్రేక్షకాదరణ లభించింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని విడుదలకు సిద్దమైన సందర్బంగా చిత్ర ట్రైలర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ కార్యక్రమానికి ప్రముఖ దర్శకులు ఎస్వీ కృష్ణా రెడ్డి, నిర్మాత అచ్చిరెడ్డి, కమెడియన్ ఆలీ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఎస్వీ కృష్ణారెడ్డి మాట్లాడుతూ..' దర్శకుడు శేఖర్, నిర్మాత బివి.రెడ్డి మంచి కథను తెరకెక్కించారు..ఈ సినిమాకు సుక్కు అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు అలీ ఏ పాత్ర ఇచ్చినా ఒదిగిపోతారు. నాకు ఇష్టమైన బాబా కుమారుడు హీరోగా చేయడం చాలా సంతోషం. ఈ చిత్రంలో అందరూ కూడా చాలా బాగా నటించారు. ఈ సినిమా హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా.' అని అన్నారు. నిర్మాత అచ్చిరెడ్డి మాట్లాడుతూ.. 'ట్రైలర్ చూస్తుంటే చాలా అట్రాక్టివ్‌గా కనిపిస్తోంది. ఆలీ ఈ సినిమాలో చాలా చక్కగా నటించాడు. దర్శక నిర్మాతలకు ఈ చిత్రం ద్వారా మంచి పేరు వస్తుంది. ప్రతి ఒక్కరూ చాలా చక్కగా నటించారు. త్వరలో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా బిగ్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా.' అని అన్నారు ఆలీ మాట్లాడుతూ.. 'మంచి కంటెంట్‌తో తీసిన ఈ సినిమా బిగ్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అలాగే ఈ చిత్రంలో మా అన్న తమ్ముడు సదన్ హీరోగా చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇందులో నాకు మంచి పాత్ర లభించింది. ఇలాంటి మంచి సినిమాలో నటించినందుకు చాలా హ్యాపీగా ఉంది.' అని అన్నారు. -
నాట్య దీపిక.. దీపికారెడ్డి
నవరసాలను పలికించే కళ్లు. చూపు తిప్పుకోనివ్వని ఆహార్యం. అకుంఠిత దీక్ష... నిరంతర సాధన. అంతకు మించిన అంకితభావం. యాభై ఏళ్ల కిందట కట్టిన మువ్వలు నేటికీ లయబద్ధంగా రవళిస్తూనే ఉన్నాయి. కూచిపూడి నాట్యానికి... ఆమె చేయాల్సింది ఏదో మిగిలి ఉన్నట్లుంది. నటరాజు మరింతగా సేవ కోరుకుంటున్నాడు. సంగీత నాటక అకాడమీ బాధ్యతనిచ్చాడు. కూచిపూడి నాట్యం కోసం జీవితాన్ని అంకితం చేసిన దీపికారెడ్డి పౌరాణిక కథాంశాలకే పరిమితం కాకుండా ఆధునిక సామాజికాంశాలకు రూపకల్పన చేస్తున్నారు. ‘తెలంగాణ రాష్ట్రం, సంగీత నాటక అకాడమీ చైర్పర్సన్’గా నియమితురాలైన సందర్భంగా ఆమె సాక్షితో మాట్లాడుతూ ‘నాట్యం అనేది అద్భుతమైన కళ. ఈ భారతీయ కళను ప్రపంచదేశాలకు పరిచయం చేయాలి. మనం ఎన్ని ప్రదర్శనలిచ్చాం అని లెక్కపెట్టుకోవడం కాదు, మనం ఎంతమంది కళాకారులను తయారు చేశామనేది ముఖ్యం. కళాకారులు నటరాజుకు సమర్పించే నమస్సుమాంజలి కళను విస్తరింపచేయడం ద్వారానే’ అన్నారు. ‘నాట్యం, సంగీతం వంటి కళలన్నీ నగరాల్లో కేంద్రీకృతమైపోతున్నాయి. గ్రామాల్లో, పట్టణాల్లో ఉన్న పిల్లలకు సరిగ్గా అందడం లేదు. ఈ కొత్త బాధ్యత ద్వారా ఈ కళలను జిల్లాల వారీగా ప్రణాళికలు వేసుకుని గ్రామాలకు చేరుస్తానని’ చెప్పారామె. కళ ఇచ్చిన మధుర జ్ఞాపకాలు! ‘‘కూచిపూడి కళ కోసం జీవితాన్ని అంకితం చేశాననే మాట నిజమే. కానీ ఈ కళ నాకు ఇచ్చిన మధురమైన జ్ఞాపకాలు ఎన్నో. ఖజురహో డాన్స్ ఫెస్టివల్స్‌లో నా పెర్ఫార్మెన్స్ చూసిన ఒక క్రిటిక్ మా అమ్మానాన్న దగ్గరకు వచ్చి ‘మీకు సరస్వతీదేవి పుట్టింది’ అన్నారు. ఆ ప్రశంస గుర్తొచ్చిన ప్రతిసారీ ఆయనకు మనసులోనే ప్రణమిల్లుతుంటాను. మరొకటి... ఢిల్లీలో నేషనల్ డాన్స్ ఫెస్టివల్లో ద్రౌపది పాత్ర అభినయించాను. ఆ మరుసటి రోజు ఆడియెన్స్ గ్యాలరీకి వెళ్తున్నప్పుడు... ముందు రోజు నా ప్రోగ్రామ్ చూసిన వాళ్లు గుర్తు పట్టి ఎక్సైట్మెంట్తో ‘ద్రౌపదిరెడ్డీ... ద్రౌపది రెడ్డీ’ అని గట్టిగా పిలిచారు. వీటన్నింటినీ మించిన జ్ఞాపకం సెర్బియాలో జరిగింది. సెర్బియా– టర్కీ టూర్లో బెల్గ్రేడ్లో ప్రదర్శన, విపరీతమైన చలి. నాట్యం చేసేటప్పుడు పాదరక్షలేవీ ఉండవు కదా. నాట్యం ఎలాగో చేసేశాను. కానీ ఫెలిసిటేషన్ సమయంలో పాదాలు నేల మీద ఆన్చలేకపోయాను. ఒక పాదం నేల మీద ఉంటే మరో పాదం నేలను తాకకుండా పాదాలను మార్చుకుంటూ ఇబ్బంది పడుతున్నాను. అప్పుడు ఒక పెద్దాయన వచ్చి తన కోటు తీసి నేల మీద పరిచి ఆ కోటు మీద నిలబడమన్నాడు. ఇవన్నీ ఈ నాట్యం ఇచ్చిన మధురానుభూతులే కదా! ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారైతే ‘రుక్మిణి– కృష్ణ’ ప్రదర్శన చూసి ‘దిస్ ఈజ్ ద బెస్ట్ డాన్స్ డ్రామా ఐ హావ్ సీన్’ అంటూ ‘న్యత్యభారతి’ అని ప్రశంసించారు. అంతకంటే ఇంకేం కావాలి. నేను అందుకున్న అవార్డులు ఇచ్చిన సంతోషానికి మించిన ఆనందక్షణాలివి. ఎస్పీబీగారు మెసేజ్‌లు పెట్టరు. మాట్లాడి వాయిస్ రికార్డు పంపిస్తారు. అలా నాకు పంపిన వాయిస్ రికార్డులన్నీ దాచుకున్నాను. నాట్యమే ఊపిరి నాకు హాబీ అంటూ ప్రత్యేకంగా ఏదీ లేదు. నాట్యం చేయడం, కొత్త ప్రయోగాల గురించి ఆలోచించడం, నాట్యం గురించి మాట్లాడడం... ఇష్టం. రాత్రి అందరూ పడుకున్న తర్వాత ఏ మధ్య రాత్రిలోనో ఓ కొత్త ఐడియా వస్తుంది. అప్పుడే ఆ ఐడియాను పేపర్ మీద రాసుకుని, నాట్యం చేస్తూ ఫోన్లో రికార్డు చేసుకోవడం, ఉదయానికంతా కొత్త రూపకాన్ని సిద్ధం చేయడం నాకలవాటు. కోవిడ్ సందర్భంగా రూపకం, ప్రకృతి సంరక్షణ కోసం ప్రకృతి రక్షతి రక్షితః, శాంతి జీవనం, రితు సంహార, తెలంగాణ వైభవం, వైద్యో నారాయణో హరి... వంటివన్నీ అలా రూపొందినవే. ఆరోగ్యం పెట్టిన పరీక్ష మహిళలకు అందరికీ మల్టీ టాస్కింగ్ వెన్నతో పెట్టిన విద్య అనే చెప్పాలి. ఇల్లు, పిల్లలను ఒకవైపు తన వృత్తి ప్రవృత్తులను మరో వైపు బాలెన్స్ చేసుకోవడంలో సక్సెస్ అవుతాం. కానీ తల్లిగా నేను బిడ్డ దగ్గర ఉండాల్సిన క్షణాల్లో ఉండలేకపోయానే అనే గిల్ట్ పారిస్ టూర్ సమయంలో ఎదురైంది. నిజానికి ఆ టూర్ రెండు రకాలుగా పరీక్ష పెట్టింది. బయలుదేరే సమయానికి పాపకు జ్వరం. అలాగే వదిలి వెళ్లాల్సి వచ్చింది. అక్కడ ఇరవై ప్రదర్శనలిచ్చాం. ఒకరోజు నాకు నాలుగు నూట నాలుగు జ్వరం. మందులు వేసుకున్నా కూడా కంట్రోల్ కాలేదు. మేకప్ వేసుకుంటుంటే చేతులు వణుకుతున్నాయి. కళ్ల నుంచి నీళ్లు కారుతున్నాయి. నిలబడితే కాళ్లు వణుకుతున్నాయి. ఆర్గనైజర్స్ మొత్తం సిద్ధం చేశాక ‘నాకు జ్వరం, డాన్స్ చేయలేను’ అనడానికి మనసొప్పుకోలేదు. ఆర్కెస్ట్రా వాళ్లతో ‘ఒకవేళ నేను కళ్లు తిరిగిపడిపోతే వెంటనే లైట్లు ఆఫ్ చేయండి’ అని చెప్పి నాట్యం మొదలుపెట్టాను. పళ్లెం మీద నాట్యం అది. ఆ నటరాజే నాతో చేయించాడని నమ్ముతాను ఇప్పటికీ’’ అంటూ కళ్లు మూసుకుని దణ్ణం పెట్టుకున్నారు దీపికారెడ్డి. అమ్మమ్మ తాతయ్యల పెంపకం దీపికారెడ్డి తాత నూకల రామచంద్రారెడ్డి మాజీ మంత్రి. తండ్రి వీఆర్ రెడ్డి న్యాయవిద్యలో సంస్కరణలు తెచ్చిన విద్యావేత్త, అడిషనల్ సొలిసిటర్ జనరల్‌గా బాధ్యతలు నిర్వహించారు. ఆమెకు ఆర్థిక బాధలు లేవు. కానీ, పేదరికం తెచ్చే కష్టాలు తెలుసన్నారామె. ‘‘వరంగల్‌లో తాతగారింట్లో పెరగడం వల్ల పేదవాళ్లకు ఆయన చేసిన సహాయాన్ని స్వయంగా చూశాను. నాట్య సాధన కోసం కొంతకాలం మా గురువుగారు వెంపటి చినసత్యం గారింట్లో ఉన్నాను. వాళ్లు నన్ను చాలా బాగా చూసు కున్నారు. అక్కడ నాట్యంతోపాటు చక్కటి డిసిప్లిన్ కూడా అలవడింది. నేలమీద పడుకోవడం, బావిలో నీరు తోడటం అలవాటయ్యాయి. తాత గాంధేయవాది. మమ్మల్ని అధికారిక వాహనాల్లో తిరగనివ్వలేదు. మా ప్రయాణం సైకిల్ రిక్షా, సిటీ బస్సులోనే. అమ్మమ్మ, తాత, గురువుగారు... ఈ ముగ్గురి స్ఫూర్తితో నన్ను నేను తీర్చిదిద్దుకున్నాను. నా శిష్యులకూ అదే నేర్పాను. నాట్యం నేర్చుకోవడానికి ఫీజు కట్టలేని అమ్మాయిలకు ఫ్రీగా నేర్పిస్తున్నాను. దేశం నలుమూలలా ప్రదర్శనలిచ్చాను, అలాగే విదేశాల్లోనూ. నా శిష్యులు కూడా వివిధ రాష్ట్రాల్లో, విదేశాల్లో పెర్ఫార్మెన్స్ ఇస్తున్నారు, డాన్స్ స్కూళ్లు నడుపుతూ కళాకారులను తీర్చి దిద్దుతున్నాను. కళ ఎంతగొప్పదంటే కళాకారులు గురువును మర్చిపోరు. గురుపూర్ణిమ రోజు వచ్చిన మెసేజ్‌లకు రిప్లయ్ ఇవ్వడానికి సమయం సరిపోలేదు. ప్రదర్శన ఉన్న రోజుల్లో బంధువులు, స్నేహితుల ఇళ్లలో వేడుకలకు వెళ్లలేకపోయేదాన్ని. నాట్యం కారణంగా దూరమైన సంతోషాలకంటే నాట్యం కారణంగా అందిన సంతోషాలే ఎక్కువ’’ అన్నారామె. నటరాజు కొలువైన ఆలయం జూబ్లీ హిల్స్‌లో ఉన్న ‘దీపాంజలి ఇన్స్టిట్యూట్ ఆఫ్ కూచిపూడి’ లో అడుగుపెట్టగానే దీపికారెడ్డి యాభై ఏళ్ల నాట్యప్రపంచం కళ్ల ముందు ఆవిష్కారమైనట్లు ఉంటుంది. ఆమె గురువు వెంపటి చినసత్యం ఫొటో, 1976లో రంగప్రవేశం చేసినప్పటి ఫొటోతో మొదలు జ్ఞానపీఠ సినారె, ఇద్దరు రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతి, మాజీ ప్రధాని, ఐదుగురు గవర్నర్లు, ముఖ్యమంత్రులు, కేంద్రమంత్రులు, స్పీకర్లు, రాష్ట్రమంత్రుల చేతుల మీదుగా అందుకున్న పురస్కారాల చిత్రాలు కొలువుదీరి ఉన్నాయి. నాట్యం చేస్తున్న పరమశివుడి విగ్రహం నిత్యపూజలందుకుంటోంది. ఆమె శిష్యులు నేడు రవీంద్రభారతిలో ఇవ్వా ల్సిన ప్రదర్శన కోసం రిహార్సల్స్ చేస్తున్నారు. అమ్మానాన్నల సంతోషం! అత్యంత సంతోషకరమైన క్షణాలలో మొదటగా చెప్పాల్సింది సంగీత నాటక అకాడమీ అవార్డు అందుకోవడమే. రాష్ట్రపతి భవన్లో, రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతుల మీదుగా అవార్డు అందుకుంటున్నప్పుడు మా అమ్మానాన్న కళ్లలో సంతోషం చూశాను. అమ్మానాన్నలు అంతగా సంతోషపడిన ఆ సందర్భమే నాకు మరపురాని క్షణం. ఇక ఎప్పుడూ సంతోషపడే విషయం ఏమిటంటే భర్త, పిల్లలు నాకు ప్రోత్సాహమిస్తూ సపోర్టుగా ఉండడం. తల్లిదండ్రులకు నేను చెప్పేదొక్కటే. పిల్లలకు సంగీతం, నాట్యం... ఏదో ఒక కళను సాధన చేయించండి. అది జ్ఞాపకశక్తిని, క్రమశిక్షణను, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుంది. సాధనతో ఏకాగ్రత అలవడుతుంది. ఏ రంగంలో అయినా చక్కగా రాణించగలుగుతారు. నా స్టూడెంట్స్ అందరూ ర్యాంక్ హోల్డర్సే. అలాగే కళ కోసం చదువుని మాత్రం నిర్లక్ష్యం చేయవద్దు. – దీపికారెడ్డి, చైర్పర్సన్, సంగీత నాటక అకాడమీ, తెలంగాణ – వాకా మంజులారెడ్డి ఫొటోలు : గడిగె బాలస్వామి -
సంగీత నాటక అకాడమీ చైర్‌పర్సన్‌గా దీపికారెడ్డి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సంగీత నాటక అకాడమీ చైర్‌పర్సన్‌గా నృత్య కళాకారిణి దీపికారెడ్డి నియమితులయ్యారు. ఈమేరకు సాంస్కృతిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కూచిపూడి కళాకారిణిగా గుర్తింపు తెచ్చుకున్న దీపికారెడ్డి.. 2017లో కేంద్ర సంగీత నాటక అకాడమీ పురస్కారాన్ని పొందారు. తెలుగు రాష్ట్ర ప్రభుత్వాల పురస్కారాలు, పలు ప్రైవేటు సంస్థల నుంచి కూడా అవార్డులు అందుకున్నారు. ఆమె దీపాంజలి పేరుతో నృత్య శిక్షణ సంస్థను నిర్వహిస్తున్నారు. కాగా, ఈ పోస్టులో దీపికారెడ్డి రెండేళ్ల పాటు కొనసాగనున్నారు. -
ఆలోచింపజేసే చిత్రం
‘‘తెరవెనుక’ సినిమా ట్రైలర్ బాగుంది. ఒక ఆడపిల్ల తండ్రి తన కూతురికి జరిగిన అన్యాయం గురించి ఫిర్యాదు ఇవ్వడానికి పోలీస్ స్టేషన్‌కు వచ్చినప్పుడు, ఓ లేడీ పోలీస్ వివరించే విధానం బాగుంది. మహిళలపై జరుగుతున్న అంశాలను ఈ సినిమాలో చూపించినట్లు తెలుస్తోంది’’ అని తెలంగాణ పోలీసు ఉన్నతాధికారిణి సుమతి (డీఐజీ – ఉమెన్ సేఫ్టీ వింగ్) అన్నారు. హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ కథానాయకుడిగా, విశాఖ ధిమాన్, దీపికా రెడ్డి కథానాయికలుగా తెరకెక్కిన చిత్రం ‘తెర వెనుక’. నెల్లుట్ల ప్రవీణ్ చంద్ర దర్శకత్వంలో జయలక్ష్మి మురళి మచ్చ సమర్పణలో మురళీ జగన్నాథ్ మచ్చ నిర్మించారు. ఈ సినిమా ఆడియోను డీఐజీ సుమతి విడుదల చేయగా, దర్శకుడు ఎన్.శంకర్, సుచిర్ ఇండియా లయన్ కిరణ్, నిర్మాత గురురాజ్, సంఘసేవకుడు రేగొండ నరేష్, నటుడు శివారెడ్డి తదితరులు పాటలను విడుదల చేశారు. ఈ నెల 25న ఈ చిత్రం థియేటర్స్‌లో విడుదల కానుంది. నెల్లుట్ల ప్రవీణ్ చంద్ర మాట్లాడుతూ– ‘‘సమాజంలో జరుగుతున్న సంఘటనలను తీసుకొని ఈ సినిమా చేశాను. సామాజిక స్పృహ కలిగిన క్రైమ్ థ్రిల్లర్ కథాంశంతో రూపొందించాం’’ అన్నారు. ‘‘ప్రేక్షకులను ఆలోచింపజేసే చిత్రమిది’’ అన్నారు మురళీ జగన్నాథ్ మచ్చ. -
భారీ తారాగణం షురూ
భారీ తారాగణం అనగానే స్టార్ హీరోలు, స్టార్ హీరోయిన్లతో పాటు పేరున్న నటీనటులు నటిస్తున్నారనుకోవడం సహజం. అయితే తాజాగా ప్రారంభమైన ‘భారీ తారాగణం’ సినిమా ద్వారా హాస్యనటుడు అలీ భార్య జుబేదా బేగం సోదరి తనయుడు సదన్ హీరోగా పరిచయమవుతున్నారు. శేఖర్ ముత్యాల దర్శకత్వంలో బీవీఆర్ పిక్చర్స్ పతాకంపై బీవీ రెడ్డి నిర్మిస్తున్నారు. దీపికా రెడ్డి, రేఖా నిరోష కథానాయికలుగా నటిస్తున్నారు. హీరో హీరోయిన్లపై తీసిన మొదటి సన్నివేశానికి దర్శకుడు ఎస్వీ కష్ణారెడ్డి కెమెరా స్విచ్చాన్ చేయగా, నిర్మాత అచ్చిరెడ్డి క్లాప్ ఇచ్చారు. తొలి షాట్‌కి అలీ గౌరవ దర్శకత్వం వహించగా, సంగీత దర్శకురాలు ఎమ్ఎమ్. శ్రీలేఖ జ్యోతి ప్రజ్వలన చేశారు. శేఖర్ ముత్యాల మాట్లాడుతూ– ‘‘కామెడీ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోన్న చిత్రమిది. నన్ను నమ్మి ఈ అవకాశం ఇచ్చిన బీవీ రెడ్డిగారికి ధన్యవాదాలు’’ అన్నారు. ‘‘మంచి కథ, కథనాలతో ‘భారీ తారాగణం’ రూపొందుతోంది’’ అన్నారు సదన్. ‘‘ఈ నెల 25న రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించి, మేలో సినిమా విడుదల చేస్తాం’’ అన్నారు బీవీ రెడ్డి. ఈ చిత్రానికి కెమెరా: ఎమ్.వి.గోపి, సంగీతం: సుక్కు. -
తెరవెనుక థ్రిల్
హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘తెరవెనుక’. విశాఖ ధిమాన్, దీపిక రెడ్డి హీరోయిన్లుగా, ఆనంద చక్రపాణి , నిట్టల శ్రీరామమూర్తి , టీఎన్నార్, శ్వేతా వర్మ, సంపత్ రెడ్డి ముఖ్య పాత్రలు చేస్తున్నారు. విజయలక్ష్మి మురళి మచ్చ సమర్పణలో మురళి జగన్నాథ్ మచ్చ నిర్మించిన ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్‌ను ప్రముఖ దర్శకులు ఎన్. శంకర్ విడుదల చేసి, మాట్లాడుతూ –‘‘ఈ చిత్రదర్శకుడు ప్రవీణ్ చంద్ర నాకు 25 ఏళ్లుగా తెలుసు. ఈ సినిమాతో తను మంచి దర్శకుడిగా పేరు తెచ్చుకోవాలని కోరుకుంటున్నాను’’ అన్నారు. నెలుట్ల ప్రవీణ్ చంద్ర మాట్లాడుతూ –‘‘సామాజిక స్పహ కలిగిన క్రైమ్ థ్రిల్లర్ కథాంశంతో ఈ చిత్రాన్ని రూపొందించాం. నిర్మాత మురళి జగన్నాథ్ గారు నన్ను నమ్మి ఈ సినిమా నాకు ఇవ్వడంతో బాధ్యత పెరిగింది. త్వరలో ఈ సినిమా టీజర్ ను విడుదల చేస్తాం’’ అని తెలిపారు. ఈ చిత్రానికి కథ–మాటలు: బాబా, కెమెరా: రాము కంద, సంగీతం: రఘురామ్. -
ఆశలను చిదిమేసిన మృత్యువు
అమీర్‌పేట: ఆ యువతికి మరో రెండు రోజుల్లో వివాహ నిశ్చితార్థం జరగనుంది. అంతలోనే ఆమెను ఆర్టీసీ బస్సు రూపంలో మృత్యువు కబళించింది. ఆనందం వెల్లివిరియాల్సిన ఆ ఇంట్లో విషాదాన్ని నింపింది. మృతురాలి కుటుంబ సభ్యులకు కన్నీటి సంద్రంలో ముంచింది. ఆర్టీసీ బస్సు ఢీకొన్న ప్రమాదంలో యువతి దుర్మరణం పాలైన ఘటన మంగళవారం ఎస్ఆర్నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. మృతురాలి కుటుంబ సభ్యులు, పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. పెద్దఅంబర్‌పేటకు చెందిన లక్ష్మీరెడ్డికి ఇద్దరు కూతుళ్లు. చిన్న కుమార్తె సాయి దీపికారెడ్డి (24) ఓ రియల్ ఎస్టేట్ సంస్థలో సేల్స్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తోంది. సనత్‌నగర్‌లో స్నేహితులతో కలిసి ఉంటోంది. ఈ క్రమంలో దీపిక మంగళవారం ఉదయం 8.30 గంటల సమయంలో తన ద్విచక్రవాహనంపై విధులకు బయలుదేరింది. అమీర్‌పేట మైత్రీవనం నుంచి యూసుఫ్‌గూడ మీదుగా జూబ్లీహిల్స్‌లోని కార్యాలయానికి వెళుతుండగా స్టేట్ హోం సమీపంలో వెనక నుంచి వచ్చిన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ డిపోనకు చెందిన ఆర్టీసీ బస్సు ఢీకొంది. బస్సు వెనక చక్రాలు పైనుంచి వెళ్లడంతో దీపి క అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. ఘటన స్థలానికి చేరుకున్న ఎస్సై నరేష్ ప్రమాద కారణాలపై విచారణ జరిపి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని గాంధీ మార్చురీకి తరలించారు. మృతురాలి మామ రవీందర్‌రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. బస్సు డ్రైవర్ అబ్దుల్ రవూఫ్‌ను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నామని చెప్పారు. దీపిక వెళుతున్న యాక్టివా వాహనం అదుపు తప్పి బస్సు కిందకు వెళ్లిందా.. లేక డ్రైవర్ నిర్లక్ష్యం కారణమా? అనే కోణాల్లో కేసు దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై నరేష్ తెలిపారు. -
ప్రతిభా మూర్తులు పోరాట యోధులు
అవార్డు గుర్తింపును తెస్తుంది. అవార్డుకే గుర్తింపు తెచ్చారు ఈ మహిళలు. దాదాపు ప్రతి రంగంలోనూ.. ఈ ఏడాది నారీ శక్తి ప్రతిఫలించింది. పోరాట పటిమ ప్రస్ఫుటించింది. వీళ్ల స్ఫూర్తి కదిలిస్తుంది. ముందు తరాలనూ నడిపిస్తుంది. 1. దీపికారెడ్డి, నృత్యకారిణి ప్రముఖ కూచిపూడి నృత్యకారిణి దీపికారెడ్డికి ప్రతిష్టాత్మకమైన సంగీత నాటక అకాడమీ అవార్డు లభించింది. రాష్ట్రపతి భవన్లో ఫిబ్రవరి 6న రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నుంచి ఆమె ఈ అవార్డును అందుకున్నారు. హైదరాబాద్‌కు చెందిన దీపికారెడ్డి గత 47 సంవత్సరాలుగా కూచిపూడి నాట్య రంగంలో సేవలను అందిస్తున్నారు. ‘దీపాంజలి’ పేరుతో నృత్య పాఠశాలను కూడా ప్రారంభించారు. 2. ప్రియాంక దూబే, పాత్రికేయురాలు బీబీసీ ఢిల్లీ బ్యూరో ద్విభాషా వ్యాఖ్యాత, ప్రముఖ పాత్రికేయురాలు ప్రియాంక దూబే ప్రతిష్టాత్మక చమేలీదేవి జైన్ అవార్డు–2018కు ఎంపికయ్యారు. పరిశోధనాత్మక జర్నలిజంలో ఉత్తమప్రతిభ కనబరిచినందుకుగాను ప్రియాంకకు ఈ అవార్డు దక్కింది. 3. రాధా దేవి, మున్నుస్వామి శాంతి టీటీడీ మహిళా క్షురకుల సంఘం అధ్యక్షురాలు కగ్గనపల్లి రాధాదేవి, ఇస్రో మహిళా శాస్త్రవేత్త మున్నుస్వామి శాంతిలకు ‘నారీశక్తి పురస్కారం’ లభించింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మార్చి 8న ఢిల్లీలో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ వీరికి ఈ అవార్డులను ప్రదానం చేశారు. మహిళా సాధికారతకు, లింగ సమానత్వానికి చేస్తున్న కృషికి గుర్తింపుగా వీరికి ఈ అవార్డు దక్కింది. 4. జోఖా అల్హార్తి, రచయిత్రి ఒమన్ రచయిత్రి జోఖా అల్హార్తి (40) మాన్ బుకర్ ప్రైజ్–2019 గెలుపొందారు. ఆమె రాసిన ‘సెలస్టియల్ బాడీ’ నవలకు ఈ ప్రైజ్ దక్కింది. ఈ అవార్డును గెలుచుకున్న తొలి అరబ్ మహిళగా ఆమె చరిత్ర సృష్టించారు. బ్రిటన్ నుంచి 1951లో స్వాతంత్య్రం పొందాక ఒమన్‌లో చోటుచేసుకున్న మార్పులను, బానిసత్వ పరిస్థితులను ఈ నవలలో అల్హార్తి వర్ణించారు. 5. గ్రెటా థన్‌బర్గ్, ఉద్యమకారిణి స్వీడన్‌కు చెందిన టీనేజ్ పర్యావరణ ఉద్యమకారిణి గ్రెటా థన్‌బర్గ్‌కు అమ్నెస్టీ ఇంటర్నేషనల్ ప్రతిష్టాత్మక మానవ హక్కుల పురస్కారం ‘అంబాసిడర్ ఆఫ్ కన్సైన్స్’ లభించింది. అలాగే ఆమె ‘రైట్ టు లైవ్లీహుడ్’ అవార్డుకు ఎంపికైంది. నోబెల్ శాంతి బహుమతికి కూడా నామినేట్ అయింది. 6. పి.టి. ఉష, అథ్లెట్ భారత మాజీ అథ్లెట్, దిగ్గజ ఒలింపియన్ పి.టి. ఉష అంతర్జాతీయ అథ్లెటిక్స్ సమాఖ్య (ఐఏఏఎఫ్) ప్రతిష్టాత్మక ‘వెటరన్ పిన్’ అవార్డుకు ఎంపికయ్యారు. ప్రపంచ అథ్లెటిక్స్‌లో సుదీర్ఘ కాలం పాటు చేసే సేవలకు గుర్తింపుగా ఐఏఏఎఫ్ వెటరన్ పిన్ అవార్డును అందజేస్తారు. పి.టి. ఉష పూర్తి పేరు పిలావుళ్లకండి తెక్కేపఱంబిల్ ఉష. 7. అస్కా సలోమీ, ప్రిన్సిపాల్ ప్రభుత్వ వైద్యంలో నర్సింగ్ వృత్తిలో విశేష సేవలందించినందుకు అస్కా సలోమీకి ‘జాతీయ ఫ్లోరెన్స్ నైటింగేల్ నర్సెస్ అవార్డు–2019’ లభించింది. అస్కా సలోమీ 2009లో గాంధీ నర్సింగ్ కళాశాల నుంచి ప్రధానాచార్యులుగా పదవీ విరమణ పొందారు. 8. పాయల్ జంగిడ్, సామాజిక కార్యకర్త బాల్య వివాహాల నిర్మూలనకు కృషి చేసిన పాయల్ జంగిడ్‌కి బిల్ అండ్ మెలిందా గేట్స్ ఫౌండేషన్ ఇచ్చే ‘ఛేంజ్మేకర్–2019’ అవార్డు లభించింది. రాజస్థాన్‌లోని హిన్‌స్లా గ్రామానికి చెందిన 17 ఏళ్ల పాయల్.. బాల్య వివాహాలు, బాలకార్మిక వ్యవస్థను రూపుమాపేందుకు, ఆడపిల్లలు చదువుకునేందుకు కృషి చేస్తోంది. 9. ఓల్గా, పర్యావరణవేత్త సాహితీ రంగంలో విశేషంగా చేసిన ప్రముఖ పర్యావరణ వేత్త, స్త్రీవాది, మేధావి, నవలా రచయిత్రి ఓల్గా టోర్కార్క్విజ్కు (పోలెండ్) నోబెల్ బహుమతి లభించింది. ఆమె రాసిన ‘ద బుక్స్ ఆఫ్ జాకోబ్‘ అనే నవలకు గానూ 2018 సంవత్సరానికి ఈ బహుమతి లభించింది. (గత ఏడాది అవార్డును ఈ ఏడాది ప్రకటించారు) -
విదేశీ వేదికపై తెలుగు సంస్కృతీ వారధి
సాక్షి,సిటీబ్యూరో: తెలుగు నేలపై విరిసిన ప్రాచీన శాస్త్రీయ సంప్రదాయ నృత్యం కూచిపూడికిఆమె ఉద్యమం కెరటం. భారతీయ నాట్యాల్లో ఒకటై.. మన జీవన ప్రవాహంగా సాగుతున్న ఈ కళను భక్తి ఉద్యమంగా ప్రపంచ వేదికలపై తీసుకెళుతున్నారునగరానికి చెందిన ప్రముఖ నాట్య గురువు దీపికారెడ్డి. ‘దీపాంజలి’ సంస్థను స్థాపించి వందలాది మంది శిష్యులను తీర్చిదిద్ది.. కూచిపూడిని దశదిశలా వ్యాపింప జేస్తున్నారు. నాలుగున్నర దశాబ్దాలుగా నృత్యకళకు ఆమె చేస్తున్న సేవకుగాను కేంద్ర ప్రభుత్వం 2017 సంత్సరానికి ప్రతిష్టాత్మక సంగీత నాటక అకాడమీ పురస్కారంతో సత్కరించింది. ఇటీవల ఢిల్లీలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతుల మీదుగా అవార్డు అందుకొన్న ఆమె తన నాట్య ప్రస్థానాన్ని ‘సాక్షి’తో పంచుకున్నారు. ఆ వివరాలుదీపికారెడ్డి మాటల్లోనే.. అక్కినేని మెచ్చుకున్నారు ఆరేళ్ల ప్రాయంలోనే కాళ్లకు గజ్జె కట్టాను. రవీంద్రభారతిలో 1976లో అప్పటి ముఖ్యమంత్రి సమక్షంలో తొలి ప్రదర్శన ఇచ్చాను. ఆ ప్రోగ్రాంకు అక్కినేని నాగేశ్వరరావుతో పాటు చాలామంది ప్రముఖులు హాజరయ్యారు. అంతమంది ప్రముఖుల సమక్షంలో రంగప్రవేశం చేశా. నా నాట్యం చూసి అక్కినేని ‘దీపిక గొప్ప నర్తకి అవుతుంది. నాట్యం పట్ల ఉన్న భక్తి ఆపారమైనది. నిరంతరం కొనసాగించేలా తల్లిదండ్రులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి’ మెచ్చుకున్నారు. ఆయన సూచన ఎంత గొప్పదో అర్థమైంది. కొన్నాళ్లకు ఆయన చేతులతోనే ‘స్వర్ణకంకణం’ తొడిగించుకున్నాను. ప్రఖ్యాత నాట్యగురువు సుమతీ కౌశల్ నా తొలి గురువు. తర్వాత చెన్నై వెళ్లి వెంపటి చినసత్యం మాస్టారు వద్ద నాట్యకళను అభ్యసించాను. అదీ నా వివాహమైన తరువాత. ఇక 2004లో దీపాంజలి సంస్థను ప్రారంభించి శిష్యులను తీర్చిదిద్దుతున్నాను. ప్రయోగాలకు శ్రీకారం పౌరాణిక మహిళామూర్తుల్లో ద్రౌపది, మండోదరి, సావిత్రి, కైకేయి వంటి వారి గురించి లోతుగా అధ్యయనం చేశాను. ఆయా పాత్రల స్వభావం, భావోద్వేగాలను ఆకళింపు చేసుకున్నా. ఢిల్లీలో ‘ద్రౌపది’ ప్రదర్శన తర్వాత అక్కడి ప్రేక్షకులు నన్ను ఆ పాత్రతోనే పిలుస్తుంటే జీవితం సార్థకమైందనిపించింది. కూచిపూడిలో ఏ ప్రయోగం చేసినా మూలాలకు విఘాతం కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటాను. ఖజురహో, కోణార్క్, హంపీ, చిదంబరం, మహాబలిపురం, ముద్ర, చాళుక్య వంటి ప్రతిష్టాత్మక జాతీయస్థాయి నాట్యోత్సవాల్లో ప్రదర్శనలిచ్చా. సాంస్కృతిక రాయబారిగా ప్రభుత్వం తరఫున మాస్కో, ఫ్రాన్స్ అమెరికా, దక్షిణ కొరియా, బ్యాంకాక్ దేశాల్లో శిష్యులతో కలిసి స్వీయ దర్శకత్వంలో అనేక ప్రదర్శనలు ఇచ్చా. ఏపీ ప్రభుత్వం నిర్వహించిన సింగపూర్–ఇండోనేషియా పర్యటనల్లోను, రాష్ట్రపతి భవన్, ఉగాది రోజున రాజ్‌భన్, ఐఫా అవార్డుల వేడుక వేదికపైనా, ఓయూ శతాబ్ది ఉత్సవాల్లో, ప్రపంచ తెలుగు మహాసభల్లోనూ వివిధ నృత్యరీతుల్లో కూచిపూడి ప్రదర్శనలు ఇచ్చే అదృష్టం నాకు దక్కింది. గురువుగా బాధ్యతతో వ్యవహరిస్తా అలనాటి నాట్యకారిణి రాధికారెడ్డి, అదనపు సొలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియాగా పనిచేసిన వి.ఆర్.రెడ్డి నా తల్లిదండ్రులు. భర్త శ్యామ్‌గోపాల్ రెడ్డి నన్నెంతో ప్రోత్సహించారు. సామాజిక అంశాలకు సంబంధించి సందేహాలుంటే నివృత్తి చేస్తారు. మాకు అభినవ్, శ్లోక కవల పిల్లలు. అమ్మాయి నాట్యం నేర్చుకుంది. నాతో పాటే దేశ విదేశాల్లో ప్రదర్శనలిస్తోంది. శిక్షణాలయంలో ఓ గురువుగా బాధ్యతతో ఉంటాను. పిల్లలతో స్నేహంగా ఉంటాను. కొంతమందికి నాట్యం నేర్చుకోవాలని ఉన్నా రుసుం చెల్లించలేరు. వారికి ఉచితంగానే నేర్పిస్తాను. నా శిష్యుల్లో పెద్ద, చిన్న, పేద అన్న అంతరం లేకుండా కలిసిపోతారు. నాట్యంతోసామాజిక చైతన్యం నేను నాట్యాలయం ప్రారంభించిన తర్వాతే గురువు గొప్పదనం తెలిసింది. పిల్లలు అడిగే ప్రతి ప్రశ్నకు జవాబు మన దగ్గరుండాలి. అందుకే పురాణ ఇతిహాసాలను బాగా చదవడం మొదలు పెట్టా. మిడిమిడి జ్ఞానంతో ఏ చిన్న పొరపాటు చేసినా అభాసుపాలవుతాం కదా. హస్తకళలు, ప్రకృతి వర్ణాలు, వైద్యులపై రూపొందించిన ‘వైద్యో నారాయణ హరి’ వంటి సామాజిక అంశాలనూ కూచిపూడి నాట్యంలో ప్రదర్శించా. ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత ఇక్కడి చారిత్రక ప్రదేశాలు, పుణ్యక్షేత్రాలు, ఇతర విషయాలతో ‘తెలంగాణ వైభవాన్ని’ ప్రదర్శించా. విదేశీ పర్యాటకుల కోసం ‘దర్శనీయ హైదరాబాద్’ పేరిట రూపొందించి ఇచ్చిన నృత్యరూపకం అందరినీ ఆకట్టుకుంది. ఇందులో హైదరాబాద్ గొప్పతనం, వైభవంతో పాటు రాష్ట్రానికి సంబంధించి సంక్షిప్త చరిత్రను నాట్యం ద్వారా తెలియజెప్పాను. -
నా జీవితంలో మరిచిపోలేనివి ఆ సన్నివేశాలు..
తెలుగు వెలుగులు ప్రపంచానికి పంచుదాం.. తెలంగాణ ఖ్యాతిని దశదిశలా చాటుదాం అన్న నినాదాలతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన ప్రపంచ తెలుగు మహాసభల ముగింపు ఉత్సవంలో నిర్వహించిన ‘తెలంగాణ వైభవం’ గీతానికి ప్రముఖ నర్తకి దీపికారెడ్డి నృత్యానికి అంతర్జాతీయస్థాయిలో ప్రశంసల జల్లులు కురుస్తున్నాయి. తెలంగాణ భాషా, సాహిత్యాల గలగలలు.. కూచిపూడి మువ్వలు సవ్వడులై ప్రేక్షకులను పులకింపజేశాయి. ఆ పులకింతలు ఆనంద తాండవమై తెలుగు రస జగతిని పరవశింపజేశాయి. దీపికారెడ్డి బృందంలోని 200 మంది కళాకారులు సకల జనులను సమ్మోహనపరిచారు. నృత్య సాధన, ప్రశంసలపై దీపికారెడ్డి ఏమంటున్నారో ఆమె మాటల్లోనే.. నా నృత్య జీవితంలో మరుపురాని సందర్భం.. నా నృత్య జీవితంలో ఇప్పటివరకు చేసిన నృత్యాలు వేరు. తెలుగు సాహితీ వైతాళికులకు వందనం.. తెలుగు సాహితీ చరితకు తెలంగాణ విత్తనం.. జైజై తెలంగాణ ప్రపంచ మహాభలకు.. జై జై తెలంగాణ సాహితీ మహోన్నతులకు’.. అంటూ ‘తెలంగాణ వైభవం’ గీతానికి చేసిన నృత్యం వేరు. ఇప్పటికీ ఆ సందర్భాన్ని తలుచుకొంటే ఒళ్లు పులకరిస్తుంది. కరతాళ ధ్వనులు.. ఆనంద బాష్పాలు ప్రపంచ తెలుగు మహాసభలు. ఎల్బీ స్టేడియం నిండిపోయింది. జనసంద్రమైంది. ప్రారంభ నృత్యం మాదే. అంతే తల్లి, తండ్రి, గురువు, దైవాన్ని, తెలంగాణ వైతాళికులను ఒక క్షణం స్మరించుకున్నా. యుద్ధానికి వెళ్తున్నా.. ఆశీర్వదించాలని మనసులోనే ప్రార్థించా. వేదికపైకి 200 మందితో వెళ్లా. ఎలా చేశానో. అంతా అమ్మవారే చేయించారు. అర్ధగంట పాటు నృత్యం సాగింది. స్టేడియంలోని వేలాది మంది ఆకాశం దద్దరిల్లేలా కరతాళ ధ్వనులు చేశారు. నా కళ్ల వెంట ఆనందబాష్పాలు రాలాయి. ప్రాక్టీస్‌కు స్కూల్ గ్రౌండ్ ఎంచుకొన్నాం... చాలా పెద్ద స్టేజ్. అంతా స్టేజ్‌కి తగ్గట్లుగా ప్రాక్టీస్ ఉండాలి. చివరి ఓ స్కూల్ గ్రౌండ్‌ను ఎంచుకొన్నాం. స్టేజీ జాగా ఎంత ఉందో మరీ కొలిచి, టైమ్‌సెట్ ఏర్పాటు చేసుకొని ప్రాక్టీస్ చేశాం. ఆ ప్రశంస మరిచిపోలేని అనుభూతి.. నృత్యం ముగిసిన తర్వాత స్టేజీ దిగిపోతుంటే ఓ పోలీసు అధికారి.. ‘తెలంగాణ తల్లి అని విన్నామే కానీ ఇంత వరకు చూడలే. తెలంగాణ తల్లికి నమస్కారం.. మీ నృత్యం చూసిన తర్వాత.. అచ్చంగా తెలంగాణ తల్లిని చూసినట్లు అనిపించింది’ అని చెప్పడం నా జీవితంలో మరిచిపోలేని అనుభూతి. తక్కువ సమయంలోనే ప్రోగ్రాం ఫిక్స్.. కేవలం పదిరోజుల ముందే నా ప్రోగ్రాం ఫిక్స్ చేశారు. తెలంగాణ గడ్డ కోసమని చేశా. అంత పెద్ద ఈవెంట్, అంత తక్కువ రోజుల్లో చేయలేం. నా దగ్గర అంతమంది విద్యార్థులు ఉన్నారు కాబట్టి సరిపోయింది. మా దీపాంజలి సిబ్బంది 24 గంటల పాటు పనిచేశారు. క్యాస్టూమ్స్ స్పెషల్‌గా తయారు చేసుకున్నాం. వాటిని కలగలిపి చేశాను.. తెలంగాణ వైభవం నృత్యానికి కష్టపడినట్లు.. నా నృత్య జీవితంలో ఎప్పుడూ కష్టపడలేదు. గీతంలోని అంశాలకు తగ్గట్లు కొరియోగ్రఫీ చేసుకోవాల్సి వచ్చింది. నృత్యంలో భాగంగా తిరిగే లైన్లకు, భంగిమలకు చాలా జాగ్రత్తగా కొరియోగ్రఫీ చేశాను. ఫోక్ డ్యాన్స్, క్లాసికల్, బతుకమ్మ నృత్యాలు కలగలిపి చేశాను. 200 నృత్యకారుల్లో 40 మంది మగవారిని మాత్రమే వినియోగించాం. ఈ ప్రోగ్రాంను చూసి ప్రపంచవ్యాప్తంగా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ అవకాశం కల్పించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, అభిమానులకు, మా నాట్య బృందానికి కృతజ్ఞతలు. -
జయహో గోల్కొండ
-
జయహో గోల్కొండ
గోల్కొండ: అపురూప కూచిపూడి నృత్యంతో గోల్కొండ కోట పులకించింది. తన నృత్యాభినయంతో కోట చరిత్ర, తెలంగాణలోని చారిత్ర ప్రదేశాలను దీపికారెడ్డి బృందం అద్భుతంగా ఆవిష్కరించారు. బుధవారం రాత్రి జరిగిన ఈ వేడుకలో దీపికారెడ్డి తన 25 మంది శిష్యులతో కలిసి చేసిన నృత్యం ప్రేక్షకులను కట్టిపడేసింది. తొలుత జయహో గోల్కొండ నృత్య రూపకంలో కోట చరిత్ర, కుతుబ్‌షాహీల వైభవాన్ని కళ్లకు కట్టారు. తెలంగాణ వైభవంలో ఇక్కడి చారిత్రక కట్టడాల కథనాన్ని నృత్యంలో చూపారు. ఇలాంటి కార్యక్రమం నిర్వహించడం ఇదే తొలిసారని ఫిక్కి హైదరాబాద్ చాప్టర్ అధ్యక్షురాలు పద్మరాజగోపాల్ అన్నారు.