
అభినందిస్తున్న సీఎం కేసీఆర్ సతీమణి శోభ, కవిత, శ్రీనివాస్‌గౌడ్, పల్లా రాజేశ్వర్‌రెడ్డి
గన్‌ఫౌండ్రీ (హైదరాబాద్): దీపాంజలి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నృత్యగురువు దీపికారెడ్డి శిష్యురాలు అనన్య పొలసాని కూచిపూడి నృత్య అరంగేట్రం శనివారం రవీంద్రభారతిలో కన్నుల పండువగా జరిగింది. ఈ సందర్భంగా ఆమె చక్కటి హావభావాలతో నర్తించిన పుష్పాంజలి, భామాకలాపం ప్రదర్శనలు ఆహూతులను ఆకట్టుకున్నాయి.
సీఎం కేసీఆర్ సతీమణి శోభ, మంత్రులు శ్రీనివాస్‌గౌడ్ గంగుల కమలాకర్, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, ఎంపీ సంతోష్ కుమార్ తదితరులు హాజరై అనన్యను అభినందించారు. అనన్య ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ మేనకోడలు.
Comments
Please login to add a commentAdd a comment