తెరవెనుక థ్రిల్‌ | Tera Venuka Movie First Look Launch | Sakshi
Sakshi News home page

తెరవెనుక థ్రిల్‌

Published Fri, Sep 18 2020 7:18 AM | Last Updated on Fri, Sep 18 2020 7:18 AM

Tera Venuka Movie First Look Launch - Sakshi

హీరోయిన్‌ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ సోదరుడు అమన్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘తెరవెనుక’. విశాఖ ధిమాన్, దీపిక రెడ్డి హీరోయిన్లుగా, ఆనంద చక్రపాణి , నిట్టల శ్రీరామమూర్తి , టీఎన్నార్, శ్వేతా వర్మ, సంపత్‌ రెడ్డి ముఖ్య పాత్రలు చేస్తున్నారు. విజయలక్ష్మి మురళి మచ్చ సమర్పణలో మురళి జగన్నాథ్‌ మచ్చ నిర్మించిన ఈ చిత్రం ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను ప్రముఖ దర్శకులు ఎన్‌. శంకర్‌ విడుదల చేసి, మాట్లాడుతూ –‘‘ఈ చిత్రదర్శకుడు ప్రవీణ్‌ చంద్ర నాకు 25 ఏళ్లుగా తెలుసు. ఈ సినిమాతో తను మంచి దర్శకుడిగా పేరు తెచ్చుకోవాలని కోరుకుంటున్నాను’’ అన్నారు. నెలుట్ల ప్రవీణ్‌ చంద్ర మాట్లాడుతూ –‘‘సామాజిక స్పహ కలిగిన క్రైమ్‌ థ్రిల్లర్‌ కథాంశంతో ఈ చిత్రాన్ని రూపొందించాం. నిర్మాత మురళి జగన్నాథ్‌ గారు నన్ను నమ్మి ఈ సినిమా నాకు ఇవ్వడంతో బాధ్యత పెరిగింది. త్వరలో ఈ సినిమా టీజర్‌ ను విడుదల చేస్తాం’’ అని తెలిపారు. ఈ చిత్రానికి కథ–మాటలు:  బాబా, కెమెరా: రాము కంద, సంగీతం: రఘురామ్‌. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement