టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య నటిస్తోన్న తాజా చిత్రం 'బ్యాడ్ బాయ్ కార్తీక్'. ఈ మూవీ విధి హీరోయిన్‌గా కనిపించనుంది. ఈ చిత్రానికి రామ్ దేశినా (రమేష్) దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ వైష్ణవి ఫిల్మ్స్ బ్యానర్‌పై శ్రీనివాసరావు చింతలపూడి నిర్మిస్తున్నారు. ఇవాళ నాగశౌర్య పుట్టినరోజు సందర్భంగా ఈ మూవీ టైటిల్, ఫస్ట్ లుక్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు.
ఈ చిత్రానికి 'బ్యాడ్ బాయ్ కార్తీక్' అనే పవర్ ఫుల్ టైటిల్ ఖరారు చేశారు. ఫస్ట్ లుక్ పోస్టర్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ పోస్టర్ చూస్తే హీరో నుదిటిపై రక్తంతో కూడిన "మూడు గోవింద నామాలు", చేతులపై రక్తపు మరకలు కనిపిస్తున్నాయి. ఈ మూవీ ఫుల్ యాక్షన్ థ్రిల్లర్‌గానే తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో సముద్రఖని, సీనియర్ నరేష్, సాయికుమార్, వెన్నెల కిషోర్, మైమ్ గోపి, శ్రీదేవి విజయ్ కుమార్, వెన్నెల కిషోర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకు హారిస్ జయరాజ్ సంగీతమందిస్తున్నారు.
ది డెవిల్స్ ఛైర్ ఫస్ట్ లుక్ పోస్టర్..
జబర్దస్త్ అభి, ఛత్రపతి శేఖర్, స్వాతి మందల్ ప్రధాన పాత్రల్లో వస్తోన్న చిత్రం ది డెవిల్స్ చైర్ (The Devils chair). ఈ సినిమాను గంగ సప్త శిఖర దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీని బాబీ ఫిలిమ్స్, ఓం సాయి ఆర్ట్స్, సీఆర్ఎస్ క్రియేషన్స్ బ్యానర్లపై కేకే చైతన్య, వెంకట్ దుగ్గి రెడ్డి, చంద్ర సుబ్బగారి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం మొదటి పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు.
ఈ సందర్భంగా దర్శకుడు గంగ సప్త శిఖర మాట్లాడుతూ..'సరైన హారర్ చిత్రం వచ్చి చాలా రోజులు అయింది. తెలుగు ప్రేక్షకులు కూడా మంచి హారర్ చిత్రం కోసం ఎదురు చూస్తున్నారు. హారర్ చిత్రాలు ఇష్టపడే ప్రేక్షకులకు ది డెవిల్స్ చైర్ పర్ఫెక్ట్ సినిమా. సరికొత్త పాయింట్‌తో అద్భుతంగా ఉండే చిత్రాన్ని రూపొందిస్తున్నాం. మా చిత్రం మంచి హిట్ అవ్వాలి" అని కోరుకుంటున్నట్లు తెలిపారు.
అనంతరం చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ..'ది డెవిల్స్ చైర్ చిత్రం మంచి కంటెంట్ ఉన్న చిత్రం. అద్భుతమైన ఏఐ టెక్నాలజీతో సరికొత్త కథతో నిర్మిస్తున్నాం. ప్రతి సీన్ అద్భుతంగా రిచ్ విజువల్స్ తో రూపొందిస్తున్నాం. షూటింగ్ అంతా పూర్తయింది. మా చిత్రాన్ని ఫిబ్రవరి చివరి వారంలో విడుదల చేస్తాం" అని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment