‘కర్మ స్థలం’లో నటించడంతో చాలా సంతృప్తి కలిగింది: హీరోయిన్ అర్చన | Actress Archana Talks About Karmasthalam Movie At First Look Poster Launch Event | Sakshi
Sakshi News home page

‘కర్మ స్థలం’లో నటించడంతో చాలా సంతృప్తి కలిగింది: హీరోయిన్ అర్చన

Published Mon, Feb 3 2025 2:33 PM | Last Updated on Mon, Feb 3 2025 3:18 PM

Actress Archana Talks About Karmasthalam Movie At First Look Poster Launch Event

అర్చన శాస్త్రి, మితాలి చౌహాన్, వినోద్ అల్వా, కలకేయ ప్రభాకర్, బాలగం సంజయ్, నాగ మహేష్, దిల్ రమేష్, చిత్రం శ్రీను ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం ‘కర్మ స్థలం’(Karmasthalam).రాయ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై శ్రీనివాస్ సుబ్రహ్మణ్య నిర్మాణంలో రాకీ షెర్మన్ తెరకెక్కించిన చిత్రం ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ని తాజాగా రిలీజ్‌ చేశారు.

కర్మస్థలం అంటూ రిలీజ్ చేసిన ఈ పోస్టర్‌లో కనిపించిన పాత్రలు, ఆ పోస్టర్‌ను డిజైన్ చేసిన తీరు ఆకట్టుకునేలా ఉంది. ఇక అర్చనా లుక్, గెటప్ ఈ పోస్టర్‌లో హైలెట్ అవుతోంది. బ్యాక్ గ్రౌండ్‌లో అమ్మవారి షాడో కనిపించడం చూస్తుంటే.. ఈ చిత్రానికి ఏ రేంజ్‌లో వీఎఫ్ఎక్స్‌ను వాడారో అర్థం చేసుకోవచ్చు. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్‌తో సినిమా మీద అంచనాలు పెంచేశారు. ఫస్ట్ లుక్ లాంచ్ చేసిన అనంతరం..

హీరోయిన్ అర్చన మాట్లాడుతూ.. ‘మహిషాసుర మర్దిని కాన్సెప్ట్‌తో ఈ మూవీని తెరకెక్కించారు. ఇంత మంచి సబ్జెక్ట్‌ని, కర్మ స్థలం వంటి అద్భుతమైన టైటిల్‌తో సినిమాను తెరకెక్కించిన రాకీ గారికి థాంక్స్. కథను చెప్పేందుకు వచ్చినప్పుడు రాకీని చూసి కొత్త వాడు కదా.. ఎలా తీస్తారో అని అనుకున్నాను. కానీ కథను అద్భుతంగా నెరేట్ చేశారు. కథను చాలా మంది అద్భుతంగా చెబుతారు. కానీ దాన్ని తెరపైకి తీసుకురావడంలో తడబడుతుంటారు. కానీ నిర్మాత శ్రీనివాస్ గారి సహకారంతో దర్శకుడు సినిమాను అద్భుతంగా తెరకెక్కించారు. క్వాలిటీ పరంగా ఈ మూవీ పాన్ ఇండియ స్థాయిలో ఉంటుంది. ఈ సినిమా పట్ల చాలా సంతోషంగా, సంతృప్తిగా ఉన్నాను. ఈ మూవీ నాకు చాలా ప్రత్యేకం. నా హృదయానికి ఎంతో దగ్గరైన చిత్రమిది. ఫస్ట్ లుక్ అద్భుతంగా ఉంది. ఆ రోజు జరిగిన షూటింగ్ నాకు ఇంకా గుర్తుంది. ఫైట్ సీక్వెన్స్ అద్భుతంగా వచ్చాయి. పోస్టర్ ఎంత ప్రభావం చూపిస్తోందో.. సినిమా కూడా అంతే ప్రభావం చూపించబోతోంది. ఈ సినిమాకు పని చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్’ అని అన్నారు.

దర్శకుడు రాకీ షెర్మన్ మాట్లాడుతూ.. ‘‘కర్మ స్థలం’ సినిమాకి మేం అంతా ప్రాణం పెట్టి, ఎంతో ఇష్టంతో పని చేశాం. వీఎఫ్ఎక్స్ పనుల వల్ల ఈ చిత్రం ఆలస్యం అవుతూ వచ్చింది. పాన్ ఇండియా రేంజ్‌లో ఆకట్టుకునేలా ఈ సినిమా ఉంటుంది. నిర్మాత శ్రీనివాస్ గారు నా వెన్నంటి ఉండి నడిపించారు. అర్చన గారు ఈ సినిమా కోసం ఎంతో కష్టపడ్డారు. ఆమె అందించిన సహకారం ఎప్పటికీ మర్చిపోలేను. ఎం.ఎల్ రాజా మంచి సంగీతాన్ని అందించారు. ఈ చిత్రానికి పని చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్’ అని అన్నారు.

నిర్మాత శ్రీనివాస్ సుబ్రహ్మణ్య మాట్లాడుతూ.. ‘‘కర్మ స్థలం’ సినిమాను ఎంతో కష్టపడి చేశాం. మా దర్శకుడు ఈ మూవీని పాన్ ఇండియా రేంజ్‌లో అందరినీ ఆకట్టుకునేలా చేశారు. అర్చన గారు అద్భుతంగా నటించారు. మా సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement