
ఆనంది, వరలక్ష్మిశరత్‌కుమార్ ప్రధాన పాత్రల్లో వస్తోన్న చిత్రం శివంగి. ఈ చిత్రాన్ని దేవరాజ్ భరణి ధరణ్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. ఫస్ట్ కాపీ మూవీస్ బ్యానర్‌పై నరేష్ బాబు నిర్మిస్తున్నారు. పవర్ ఫుల్ విమెన్ సెంట్రిక్ ఫిల్మ్‌గా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన అప్‌డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు.
సంక్రాంతికి వస్తున్నాం మూవీతో సూపర్ హిట్ కొట్టిన అనిల్ రావిపూడి చేతుల మీదుగా శివంగి ఫస్ట్ లుక్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చిత్ర బృందానికి అభినందనలు తెలిపారు. ఈ సినిమా గ్రాండ్ సక్సెస్ అవ్వాలని కోరారు. ఫస్ట్ లుక్ పోస్టర్ చూస్తుంటే పవర్ ఫుల్, సెన్సేషనల్ కథతో రూపొందించినట్లు తెలుస్తోంది. ఫస్ట్ లుక్ పోస్టర్ ఈ సినిమాపై మరింత క్యురియాసిటీని పెంచింది. సోఫాలో డైనమిక్ గా కూర్చున్న ఆనంది స్టన్నింగ్ లుక్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ చిత్రంలో జాన్ విజయ్, డాక్టర్ కోయ కిషోర్ కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రాన్ని మార్చి 7న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఈ చిత్రానికి ఏహెచ్ కాషిఫ్, ఎబినేజర్ పాల్ మ్యూజిక్ అందిస్తున్నారు.
Happy to Unveil the Title & First look Poster of #Shivangi Movie.
Congratulating the entire team for the grand success of the film.@anandhiActress @varusarath5 @Bharanidp #NareshBabuP #AHKaashif #SamjithMohammed #RaghuKulakarni @Teju_PRO @RainbowMedia_ @firstcopymovies pic.twitter.com/z5bXujUECT— Anil Ravipudi (@AnilRavipudi) February 19, 2025
Comments
Please login to add a commentAdd a comment