
జూలై 13వ తేది శనివారం రాత్రి 11.30 గంటల సమయంలో శ్రుతి మిస్సయింది. ఎవరా శ్రుతి? ఏంటా కథ? అనే కథాంశంతో రూపొందిన చిత్రం ‘మిస్సింగ్’. హర్ష నర్రా, నికిషా రంగ్‌వాలా, మిషా నారంగ్ ముఖ్యపాత్రల్లో నటించిన చిత్రం ఇది. సెర్చ్ వర్సెస్ రివెంజ్ అనేది ఉపశీర్షిక. బజరంగబలి క్రియేషన్స్ పతాకంపై శ్రీని జోస్యుల దర్శకత్వంలో భాస్కర్ జోస్యుల, శేషగిరిరావు నర్రా నిర్మించారు.
బుధవారం ఈ చిత్రంలోని హీరో ఫస్ట్ లుక్ పోస్టర్‌ను దర్శకుడు అనిల్ రావిపూడి విడుదల చేశారు. ఇందులో హీరో పేరు గౌతమ్. మిస్సయిన శ్రుతి కోసం గౌతమ్ చేసే అన్వేషణే ఈ చిత్రకథ. పూర్తిస్థాయి థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. థియేటర్లు ఓపెన్ చేయగానే సినిమాను విడుదల చేయాలనుకుంటున్నామని చిత్రబృందం తెలిపింది.