
అల్లరి నరేశ్ హీరోగా విజయ్ కనకమేడల దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘నాంది’. ఎస్వీ 2 ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లో సతీష్ వేగేశ్న ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. హీరోగా 57వ చిత్రమైన ‘నాంది’లో అల్లరి నరేశ్ విలక్షణమైన పాత్రలో కనిపించనున్నారు. జూన్ 30న నరేశ్ బర్త్‌డే సందర్భంగా ఈ చిత్రం ఫస్ట్ ఇంపాక్ట్ రీవీల్(ఎఫ్‌ఐఆర్) అంటే చిన్నపాటి టీజర్‌ను విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. అంతేకాకుండా అభిమానులకు అడ్వాన్స్ బర్త్‌డే గిఫ్ట్‌గా హీరో ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేసింది. (వర్మ కొత్త సినిమా: పవర్ స్టార్ ఇతనే)
ఈ ఫస్ట్ లుక్ పోస్టర్‌లో నరేశ్‌ను గతంలో ఎప్పుడూ చూడని విధంగా కనిపించాడు. పోలీస్ స్టేషన్‌లో బట్టలు లేకుండా నగ్నంగా ఆందోళనగా కూర్చొని ఉండటం ఫస్ట్ లుక్ పోస్టర్‌లో చూడొచ్చు. తాజాగా ఈ చిత్రంలో మరో కీలక పాత్ర పోషిస్తున్న ప్రవీణ్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను కాసేపటి కిత్రం చిత్ర యూనిట్ విడుదల చేసింది. బాధ, కసి, కోపంతో ఉన్న సంతోష్ పాత్రలో ప్రవీణ్ అదుర్స్ అనిపించేలా ఉన్నాడు. ఇక ఇప్పటికే 80 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం లాక్‌డౌన్ సడలింపుల నేపథ్యంలో మిగతా షెడ్యూల్ త్వరలో పూర్తి చేయనుంది. వరలక్ష్మీ శరత్ కుమార్, నవమి, ప్రవీణ్, ప్రియదర్శి, దేవీప్రసాద్ తదితరులు నటిస్తున్నారు. శ్రీ చరణ్ పాకాల సంగీత దర్శకుడిగా పనిచేస్తున్న ఈ చిత్రానికి అబ్బూరి రవి మాటలు అందిస్తున్నారు. (మొన్న కార్తీక.. ఇవాళ తాప్సీ)
Comments
Please login to add a commentAdd a comment