Aman
-
ఒలింపిక్ పతక విజేతలకు షాకిచ్చిన రెజ్లింగ్ సమాఖ్య!
భారత స్టార్ రెజ్లర్లు సాక్షి మాలిక్, అమన్ సెహ్రావత్, గీతా ఫొగట్ కొత్త అవతారమెత్తారు. ఏకంగా రెజ్లింగ్ లీగ్ నిర్వహించే ఏర్పాట్లలో ఉన్నారు. భారత్‌లో రెజ్లింగ్ చాంపియన్స్ సూపర్ లీగ్ (డబ్ల్యూసీఎస్ఎల్) పేరిట పెద్ద ఎత్తున టోర్నమెంట్‌ను నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. ఒలింపిక్ పతక విజేతలు సాక్షి మాలిక్, అమన్ సెహ్రావత్, ప్రపంచ చాంపియన్ప్ కాంస్య పతక విజేత గీతా ఫొగట్ ఈ మేరకు లీగ్‌పై ప్రకటన చేశారు.షాకిచ్చిన భారత రెజ్లింగ్ సమాఖ్యఅయితే ‘ఆదిలోనే హంసపాదు’లా భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) లీగ్‌కు మోకాలడ్డుతోంది. రెజ్లర్లు నిర్వహించాలనుకునే ఈ టోర్నీకి ఆమోదం ఇవ్వబోమని ప్రకటించింది. సమాఖ్య మాజీ చీఫ్ బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని ఆరోపిస్తూ కొన్ని నెలల క్రితం సాక్షి... బజరంగ్ పూనియా, వినేశ్ ఫొగట్‌లతో కలిసి ఢిల్లీ రోడ్లపై నిరసన తెలిపిన సంగతి తెలిసిందే. అయితే ఇటీవల బజరంగ్, వినేశ్‌లు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వినేశ్ హరియాణా అసెంబ్లీ ఎన్నికలో బరిలో కూడా నిలిచింది.రెజ్లర్ల ప్రయోజనాల కోసమే లీగ్కానీ రియో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత సాక్షి మాత్రం రాజకీయాల్లో చేరలేదు. ‘చాలా రోజులుగా ఈ లీగ్ కోసం నేను, సాక్షి సంప్రదింపులు జరుపుతున్నాం. త్వరలోనే లీగ్‌కు తుదిరూపు తీసుకొస్తాం. అంతా అనుకున్నట్లు జరిగితే అప్పుడు క్రీడాకారులు మాత్రమే నిర్వహించే తొలి లీగ్‌గా రెజ్లింగ్ లీగ్ ఘనతకెక్కుతుంది. అయితే ఇప్పటివరకు సమాఖ్యతో మాట్లాడలేదు. కానీ ప్రభుత్వం, సమాఖ్య మాకు మద్దతు ఇస్తే బాగుంటుంది. పూర్తిగా రెజ్లర్ల ప్రయోజనాల కోసమే లీగ్ నిర్వహించబోతున్నాం’ అని గీతా ఫొగట్ తెలిపింది.త్వరలోనే ఆ వివరాలు వెల్లడిస్తాంఅదే విధంగా... ప్రపంచస్థాయి రెజ్లర్లు, కోచ్‌లు ఇందులో పాల్గొంటారని, దీని వల్ల దేశీయ రెజ్లర్లకు ఎంతో లబ్ధి చేకూరుతుందని, అంతర్జాతీయ స్థాయి రెజ్లర్లతో తలపడే అనుభవం వారికి లభిస్తుందని ఆమె చెప్పింది. ఇదివరకే కెరీర్‌కు వీడ్కోలు చెప్పిన సాక్షి మలిక్ మళ్లీ ఈ లీగ్‌తో రెజ్లింగ్‌కు దగ్గరవడం ఆనందంగా ఉందని చెప్పింది. అంకితభావం, నిబద్ధతతో లీగ్ విజయవంతం అయ్యేందుకు కృషి చేస్తామని తెలిపింది. వేదికలు, ప్రైజ్‌మనీ, విధివిధానాలు తదితర అంశాలన్నీ త్వరలోనే వెల్లడిస్తామని గీత పేర్కొంది.లీగ్‌కు గుర్తింపు లేదు కానీ డబ్ల్యూఎఫ్ఐ వాదన మరోలా ఉంది. ‘సమాఖ్య ఈ లీగ్‌కు ఆమోదం తెలపడం లేదు. మేం మూలనపడిన ప్రొ రెజ్లింగ్ లీగ్‌ను పునరుద్ధరించే పనిలో ఉన్నాం. త్వరలోనే పట్టాలెక్కిస్తాం. కావాలంటే రెజ్లర్లు వారి లీగ్ నిర్వహించుకోవచ్చు. క్రీడకు ప్రాచుర్యం తేవొచ్చు. అయితే మా లీగ్ వారి లీగ్‌తో కలువదు’ అని డబ్ల్యూఎఫ్ఐ అధ్యక్షుడు సంజయ్ సింగ్ తెలిపారు. చదవండి: కొరియాను కొట్టేసి... ఫైనల్లో భారత్ -
తదుపరి లక్ష్యం స్వర్ణ పతకం: అమన్
న్యూఢిల్లీ: వచ్చే ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించడమే తన లక్ష్యమని ‘పారిస్’ క్రీడల్లో కాంస్యం నెగ్గిన భారత రెజ్లర్ అమన్ సెహ్రావత్ పేర్కొన్నాడు. పురుషుల 57 కేజీల విభాగంలో కాంస్యం గెలవడం ద్వారా భారత్ తరఫున అతి పిన్న వయసులో ఒలింపిక్ మెడల్ సాధించిన అథ్లెట్‌గా రికార్డుల్లోకెక్కిన అమన్... భవిష్యత్తులో మరిన్ని పతకాలు సాధించేందుకు కృషి చేస్తానని అన్నాడు. ‘తదుపరి ఒలింపిక్స్‌లో పసిడి పతకం గెలవాలనుకుంటున్నా. దాని కోసం మరింత కఠిన సాధన చేస్తా. పారిస్ క్రీడల్లో కాంస్యం గెలవడం ఆనందంగా ఉంది. పతక పోరుకు ముందు బరువు పెరిగినా... పెద్దగా ఆందోళన చెందలేదు’ అని అమన్ అన్నాడు. మంగళవారం స్వదేశానికి చేరుకున్న అమన్‌ను కేంద్ర క్రీడా శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ సన్మానించి రూ. 30 లక్షల చెక్ అందజేశారు. -
అమన్ కంచు పట్టు.. కాంస్య పతకం గెలిచిన భారత రెజ్లర్
కుస్తీ క్రీడలో బీజింగ్ ఒలింపిక్స్ నుంచి మొదలైన భారత ‘పట్టు’ పారిస్ ఒలింపిక్స్‌లోనూ కొనసాగింది. వరుసగా ఐదో ఒలింపిక్స్‌లో రెజ్లింగ్ క్రీడాంశంలో భారత్‌కు పతకం లభించింది. పురుషుల ఫ్రీస్టయిల్ విభాగంలో ఈసారి భారత్ నుంచి అమన్ సెహ్రావత్ రూపంలో ఒక్కడే అర్హత సాధించాడు. ఆ ఒక్కడే పతక వీరుడయ్యాడు. 57 కేజీల విభాగంలో పోటీపడ్డ అమన్ కాంస్య పతకాన్ని సొంతం చేసుకున్నాడు. టోక్యో ఒలింపిక్స్‌లో 57 కేజీల విభాగంలోనే భారత్‌కు రజత పతకం అందించిన రవి దహియాను జాతీయ ట్రయల్స్‌లో ఓడించిన అమన్ తనలో ఒలింపిక్ పతకం తెచ్చే సత్తా ఉందని తాజా ప్రదర్శనతో నిరూపించాడు. అమన్ కాంస్యంతో పారిస్ ఒలింపిక్స్‌లో భారత్ ఖాతాలో ఆరో పతకం చేరింది.పారిస్: అంచనాలకు అనుగుణంగా రాణించిన భారత యువ రెజ్లర్ అమన్ సెహ్రావత్ పారిస్ ఒలింపిక్స్‌లో కాంస్య పతకాన్ని గెల్చుకున్నాడు. శుక్రవారం జరిగిన పురుషుల ఫ్రీస్టయిల్ 57 కేజీల విభాగం కాంస్య పతక బౌట్లో అమన్ 13–5 పాయింట్ల తేడాతో డారియన్ టోయ్ క్రూజ్ (ప్యూర్టోరికో)పై విజయం సాధించాడు. అండర్–23 విభాగంలో ప్రపంచ చాంపియన్ అయిన 21 ఏళ్ల అమన్ భారత్ నుంచి పురుషుల విభాగంలో ఒక్కడే ప్రాతినిధ్యం వహించాడు. డారియన్‌తో జరిగిన కాంస్య పతక బౌట్ ఆరంభంలో హోరాహోరీగా సాగింది. ఒకదశలో 2–3తో వెనుకబడ్డ అమన్ నెమ్మదిగా తన పట్టు ప్రదర్శించాడు. మూడు నిమిషాల నిడివిగల తొలి భాగం ముగిసేసరికి అమన్ 6–3తో ఆధిక్యంలోకి వెళ్లాడు. రెండో భాగంలోనూ అమన్ నేర్పుతో పోరాడాడు. మొదట్లో రెండు పాయింట్లు కోల్పోయినా... వెంటనే తేరుకొని పొరపాట్లకు తావివ్వకుండా వ్యూహాత్మకంగా ఆడాడు. ఈ క్రమంలో దూకుడు పెంచి డారియన్‌ను ఉక్కిరిబిక్కిరి చేసి వరుసగా 2,2,2,1 పాయింట్లు సాధించి 13–5తో ఆధిక్యంలోకి వెళ్లి విజయంతోపాటు కాంస్య పతకాన్ని ఖరారు చేసుకున్నాడు. 7 ఒలింపిక్స్ క్రీడల్లో పతకం సాధించిన ఏడో భారతీయ రెజ్లర్‌గా అమన్ గుర్తింపు పొందాడు. గతంలో ఖాషాబా జాదవ్ (1952 హెల్సింకి; కాంస్యం), సుశీల్ కుమార్ (2008 బీజింగ్; కాంస్యం... 2012 లండన్; రజతం), యోగేశ్వర్ దత్ (2012 లండన్; కాంస్యం), సాక్షి మలిక్ (2016 రియో; కాంస్యం), రవి దహియా (2020 టోక్యో; రజతం), బజరంగ్ పూనియా (2020 టోక్యో; కాంస్యం) ఈ ఘనత సాధించారు. -
Olympic 2024: అనాథగా వచ్చి అద్భుతం చేసి... అమన్ 'కాంస్య' కథ
‘గెలవడం అనేది నిజంగా అంత సులువే అయితే అందరూ అదే చేసేవాళ్లు’... ఢిల్లీలోని ప్రతిష్టాత్మక రెజ్లింగ్ శిక్షణా కేంద్రం ‘ఛత్రశాల్’లో అమన్ సెహ్రావత్ గదిలో అతని మంచం పక్కన చేతి రాతతో రాసుకున్న ఈ క్యాప్షన్ కనిపిస్తుంది. పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించినప్పుడు ‘క్వాలిఫైడ్ అథ్లెట్’ అంటూ ఇచ్చిన సర్టిఫికెట్ కూడా మరో పక్కన ఉంటుంది. ఒలింపిక్స్ ఐదు రింగులతో పాటు పతకం చిత్రాన్ని కూడా అక్కడ అతను అంటించుకున్నాడు. ఇప్పుడు అక్కడ బొమ్మ మాత్రమే కాదు అసలు ఒలింపిక్ పతకమే వేలాడనుంది! ఈ మెగా ఈవెంట్లో పతకం సాధించడమే లక్ష్యంగా బరిలోకి దిగిన 21 ఏళ్ల అమన్ తన తొలి ప్రయత్నంలోనే విజయం సాధించాడు. భారత్ తరఫున అన్ని కేటగిరీలు కలిపి పురుషుల విభాగంలో బరిలోకి దిగిన ఒకే ఒక్కడు ఇప్పుడు కాంస్యంతో మెరిశాడు. ఛత్రశాల్ సెంటర్లో యువ రెజ్లర్లకు స్ఫూర్తినివ్వడం కోసం దేశానికి కీర్తిని తెచ్చిన రెజ్లర్ల ఫొటోలను పెట్టారు.ఒలింపిక్స్‌లో పతకాలు సాధించిన సుశీల్ కుమార్, బజరంగ్ పూనియా, యోగేశ్వర్ దత్, రవి దహియాలతో పాటు వరల్డ్ చాంపియన్ షిప్లో పతకం గెలిచిన అతి పిన్న వయస్కుడైన అమిత్ దహియా ఫోటో కూడా ఉంటుంది. ప్రతీ రోజూ ప్రాక్టీస్ కోసం అక్కడి నుంచే నడిచే అమన్ తన గురించి కూడా కలకన్నాడు. అతను ఢిల్లీ చేరేసరికి అతని ఫొటో కూడా సిద్ధమైపోతుందేమో! తల్లిదండ్రులను కోల్పోయి... హరియాణాలోని బిరోహర్కు చెందిన అమన్ తొమ్మిదేళ్ల వయసులో నాన్న ప్రోత్సాహంతో మట్టిలో రెజ్లింగ్‌లో ఓనమాలు నేర్చుకున్నాడు. 2012 లండన్ ఒలింపిక్స్‌లో సుశీల్ రజతం గెలిచిన క్షణాన్ని టీవీలో చూసిన అతను ఎప్పటికైనా ఢిల్లీలో ఛత్ర్శాల్ స్టేడియానికి వెళ్లి గొప్ప రెజ్లర్‌ను అవుతానంటూ నాన్నకు చెప్పేవాడు. దురదృష్టవశాత్తూ ఏడాది తిరిగేలోగా అతని తల్లిదండ్రులు అనూహ్యంగా మరణించారు. దాంతో కొందరు సన్నిహితులు 11 ఏళ్ల వయసులో ఛత్రశాల్ స్టేడియంకు తీసుకొచ్చి చేర్పించారు. అప్పటి నుంచి అతనికి ఆ కేంద్రమే సొంత ఇల్లుగా, అతని లోకమంతా రెజ్లింగ్మయంగా మారిపోయింది. ప్రాక్టీస్ తప్ప మరో పని లేకుండా అమన్ గడిపేవాడు. కోచ్ లలిత్ కుమార్ అతడిని తీర్చిదిద్దాడు. అండర్–23 ప్రపంచ విజేతగా... 18 ఏళ్ల వయసులో తొలిసారి జాతీయ విజేతగా నిలిచిన అనంతరం అమన్ జూనియర్ స్థాయిలో పలు అంతర్జాతీయ పతకాలు గెలుచుకున్నాడు. ఆసియా క్యాడెట్స్, వరల్డ్ క్యాడెట్స్, ఆసియా అండర్–20, ఆసియా అండర్–23 చాంపియన్íÙప్లలో అతను సాధించిన విజయాలు అమన్‌కు గుర్తింపు తెచ్చి పెట్టాయి. అయితే 19 ఏళ్ల వయసులో అండర్–23 వరల్డ్ చాంపియన్íÙప్లో స్వర్ణం సాధించడంతో అతనిపై అందరి దృష్టి పడింది. భవిష్యత్తులో అద్భుతాలు చేయగల ఆటగాడిగా అందరూ అంచనాకు వచ్చారు. వేర్వేరు గ్రాండ్‌ప్రిలు, ఇన్విటేషన్ టోర్నీలలో కూడా వరుస విజయాలు సాధించడంతో ఆత్మవిశ్వాసం పెరిగింది. ఈ క్రమంలో సీనియర్ స్థాయిలో సత్తా చాటాల్సిన సమయం ఆసన్నమైంది. అమన్ ఎక్కడా తగ్గకుండా తన ఆటలో మరింత పదును పెంచుకున్నాడు. ఫలితంగా 2022 ఆసియా క్రీడల్లో కాంస్యం, గత ఏడాది ఆసియా చాంపియన్‌షిప్‌లో స్వర్ణం అతని ఖాతాలో చేరాయి. సుశీల్ ఫోన్ కాల్‌తో... ఆసియా క్రీడల సెమీఫైనల్లో, ఆ తర్వాత ఆసియా క్వాలిఫయిర్స్లో బలహీన డిఫెన్స్‌తో అమన్ పరాజయంపాలై కాస్త నిరాశ చెందాడు. ఆ సమయంలో అతనికి తీహార్ జైలు నుంచి ఒక ఫోన్ కాల్ వచ్చి0ది. అది చిరపరిచితమైన గొంతే. తన కెరీర్ ఆరంభంలో తనను ప్రోత్సహించి నువ్వు గొప్పవాడిని అవుతావని ఆశీర్వదించిన సుశీల్ కుమార్ చేసిన ఫోన్ అది. ‘నీ ఆటకు డిఫెన్స్ పనికిరాదు. అలా చేస్తే ఎప్పటికీ గెలవలేవు. ఒక్క సెకను కూడా డిఫెన్స్‌పై దృష్టి పెట్టకుండా ఆరంభం నుంచి అటాక్ చేస్తేనే నీకు సరిపోతుంది. సీనియర్ స్థాయిలో డిఫెన్స్ టెక్నిక్ చూడ్డానికి బాగానే ఉంటుంది కానీ ఫలితాన్ని ఇవ్వదు. నేను కూడా అలాగే చేశాను’ అంటూ సుశీల్ చెప్పడం అమన్‌లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. ఆ తర్వాత అతని ఆటలో దూకుడు మరింత పెరిగింది. గురువునే ఓడించి... పారిస్ ఒలింపిక్స్ అవకాశం అమన్‌కు అంత సులువుగా రాలేదు. ఛత్ర్శాల్లో తాను ఎంతో అభిమానించే రెజ్లర్ రవి దహియా. అతడిపై ఇష్టం కారణంగా అన్ని చోట్లా అతడినే అనుకరిస్తూ అతని శిష్యుడిగా తనను తాను భావించుకునేవాడు. కానీ గురువుతోనే పోటీ పడాల్సిన స్థితి వస్తే! అమన్‌కు అదే అనుభవం ఎదురైంది. రవి దహియా కేటగిరీ అయిన 57 కేజీల విభాగంలోనే తానూ పోటీ పడుతున్నాడు. పారిస్ ఒలింపిక్స్‌కు వెళ్లేందుకు ఒకరికే అవకాశం ఉంది. కామన్వెల్త్ క్రీడల ట్రయల్స్‌లో రవి చేతిలో 0–10తో అమన్ చిత్తుగా ఓడాడు. కానీ ఆ తర్వాత అర్థమైంది తాను గురుభావంతో చూస్తే పని కాదని, ఒక ప్రత్యర్థి గా మాత్రమే చూడాలని. 2024 ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్ ట్రయల్స్‌లో చెలరేగి రవిని ఓడించడంలో సఫలమైన అమన్... గురువు స్థానంలోకి వచ్చి కొత్త శకానికి శ్రీకారం చుట్టాడు. ఆ తర్వాత క్వాలిఫయర్స్‌లోనూ చెలరేగి ఒలింపిక్ బెర్త్‌ను సాధించాడు. ఈ క్రమంలో వాంగెలోవ్, ఆండ్రీ యెట్సెంకో, చోంగ్ సాంగ్వంటి సీనియర్లను అతను ఓడించగలిగాడు. ఘనమైన రికార్డుతో... ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన తర్వాత ప్రపంచ రెజ్లింగ్‌కు రాజధాని లాంటి ‘డేగిస్తాన్’లో అతను సన్నద్ధమయ్యాడు. ఛత్రశాల్లో మినహా అతని కెరీర్లో శిక్షణ తీసుకున్న మరో చోటు డేగిస్తాన్ (రష్యాకు సమీపంలో) మాత్రమే. అత్యుత్తమ సౌకర్యాలతో పాటు పలువురు చాంపియన్ ప్లేయర్ల మధ్య సాధన చేయడం, పదునైన స్పేరింగ్ పార్ట్నర్లు ఉండటంతో అమన్ ప్రాక్టీస్ జోరుగా సాగింది. చివరకు తాను అనుకున్న లక్ష్యాన్ని సాధించే వరకు అమన్ ఆగలేదు. ఫిబ్రవరి 2022లో సీనియర్ స్థాయిలో తొలిసారి అంతర్జాతీయ రెజ్లింగ్‌లో బరిలోకి దిగిన అమన్ అప్పటి నుంచి ఈ ఒలింపిక్స్‌కు ముందు వరకు 39 బౌట్లలో పాల్గొంటే 31 విజయాలు సాధించాడు. అంటే 79.4 విజయశాతం. ఇదే అతనిపై ఒలింపిక్ పతకం అంచనాలను పెంచింది. ఇప్పుడు తనకంటే ముందు ఒలింపిక్ పతకాలు సాధించిన తనలో స్ఫూర్తిని నింపిన దిగ్గజాల సరసన అతను సగర్వంగా నిలబడ్డాడు. –సాక్షి క్రీడా విభాగం -
కాంస్యం కోసం అమన్ పోరు
పారిస్: ఒలింపిక్స్‌లో పాల్గొంటున్న తొలి ప్రయత్నంలోనే పతకం సొంతం చేసుకునేందుకు భారత యువ రెజ్లర్ అమన్ సెహ్రావత్ ఒక విజయం దూరంలో నిలిచాడు. పురుషుల ఫ్రీస్టయిల్ 57 కేజీల విభాగంలో అమన్ సెమీఫైనల్లో ఓడిపోయి కాంస్య పతక పోరుకు అర్హత సాధించాడు. 2016 రియో ఒలింపిక్స్ రజత పతక విజేత రె హిగుచి (జపాన్)తో జరిగిన సెమీఫైనల్లో 21 ఏళ్ల అమన్ ‘టెక్నికల్ సుపీరియారిటీ’ పద్ధతిలో పరాజయం చవిచూశాడు. మూడు నిమిషాల నిడివిగల తొలి భాగంలో 2 నిమిషాల 14 సెకన్లలో రె హిగుచి 10–0తో ఆధిక్యాన్ని సంపాదించడంతో రిఫరీ బౌట్‌ను ముగించాడు. ఇద్దరి రెజ్లర్ల మధ్య 10 పాయింట్ల తేడా వచ్చిన వెంటనే రిఫరీ బౌట్‌ను నిలిపి వేసి పది పాయింట్ల ఆధిక్యం సాధించిన రెజ్లర్‌ను ‘టెక్నికల్ సుపీరియారిటీ’ పద్ధతిలో విజేతగా ప్రకటిస్తారు. నేడు జరిగే కాంస్య పతక బౌట్లో ప్యూర్టోరికో రెజ్లర్ దరియన్తో అమన్ తలపడతాడు. రెండు ఘనవిజయాలతో... అంతకుముందు అమన్ రెండు వరుస ఘనవిజయాలతో సెమీఫైనల్లోకి దూసుకెళ్లాడు. తొలి రౌండ్లో అమన్ 3 నిమిషాల 59 సెకన్లలో 10–0తో ‘టెక్నికల్ సుపీరియారిటీ’ పద్ధతిలో వ్లాదిమిర్ ఇగొరోవ్ (నార్త్ మెసడోనియా)ను ఓడించాడు. క్వార్టర్ ఫైనల్లో అమన్ 3 నిమిషాల 56 సెకన్లలో 12–0తో ‘టెక్నికల్ సుపీరియారిటీ’ పద్ధతిలో అబాకరోవ్ జెలీమ్ ఖాన్ (అల్బేనియా)పై గెలుపొందాడు. అబాకరోవ్ 2022 ప్రపంచ చాంపియన్‌షిప్‌లో 57 కేజీల విభాగంలో స్వర్ణం, 2023 ప్రపంచ చాంపియన్íÙప్లో కాంస్యం సాధించడం విశేషం. అమన్ తన సహజశైలిలో ఆడితే నేడు జరిగే కాంస్య పతక బౌట్లో దరియన్‌పై నెగ్గడం అంత కష్టమేమీ కాదు. అన్షు తొలి రౌండ్లోనే... మహిళల ఫ్రీస్టయిల్ 57 కేజీల విభాగంలో భారత రెజ్లర్ అన్షు మలిక్ తొలి రౌండ్లోనే నిష్క్రమించింది. హెలెన్ లూసీ మరూలిస్ (అమెరికా)తో జరిగిన బౌట్లో అన్షు 2–7 పాయింట్ల తేడాతో ఓడిపోయింది. అయితే హెలెన్ ఫైనల్ చేరుకోకపోవడంతో అన్షుకు రెపిచాజ్ రూపంలో కాంస్య పతకం కోసం పోటీ పడే అవకాశం చేజారింది. భారత్ ః పారిస్ ఒలింపిక్స్నాలుగో స్థానంలో నిలిచిన ప్లేయర్లులక్ష్య సేన్బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్అంకిత భకత్–బొమ్మదేవర ధీరజ్ఆర్చరీ మిక్స్డ్ టీమ్ మహేశ్వరీ చౌహాన్–అనంత్‌జీత్ సింగ్ షూటింగ్ స్కీట్ మిక్స్డ్ టీమ్ అర్జున్ బబూతాషూటింగ్ పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్మనూభాకర్ షూటింగ్ మహిళల 25 మీటర్ల పిస్టల్ 10 మీటర్ల వ్యక్తిగత, మిక్స్డ్ టీమ్ విభాగంలో రెండు కాంస్యాలు గెలిచింది.మీరాబాయి చానూవెయిట్ లిఫ్టింగ్ మహిళల 49 కేజీలు ఆ ఆరు వచ్చి ఉంటే ‘పది’ దాటేవాళ్లం...పారిస్ ఒలింపిక్స్‌లో అదృష్టం కూడా కలిసి వచ్చి ఉంటే భారత్ పతకాల సంఖ్య రెండంకెలు దాటేది. ఇప్పటికే ఐదు పతకాలు నెగ్గిన భారత్ త్రుటిలో నాలుగు కాంస్య పతకాలను కోల్పోయింది. షూటర్లు అదరగొట్టగా... ఆర్చరీ, బ్యాడ్మింటన్, రెజ్లింగ్, వెయిట్‌లిఫ్టింగ్‌లో మనవాళ్లు నిరాశ పరిచారు. కచ్చితంగా పతకాలు సాధిస్తారనుకున్న ఆటగాళ్లు తడబడగా... మరో ఆరుగురు ప్లేయర్లు నాలుగో స్థానంలో నిలిచి త్రుటిలో మెడల్ చేజార్చుకున్నారు. -
డ్రగ్స్ కేసులో కీలక మలుపు గుర్తించిన ఏడు పబ్బులు, రకుల్ తమ్ముని పాత్ర..
-
సాక్షి చేతిలో డ్రగ్స్ కేసు FIR 18 మందిలో రకుల్ తమ్ముడి పేరు
-
Hyderabad Drugs case: నాడు రకుల్... నేడు అమన్!
సాక్షి, సిటీబ్యూరో: టాలీవుడ్లో మరోసారి డ్రగ్స్ కలకలం రేగింది. గతంలో డ్రగ్స్ విక్రయం, వినియోగం ఆరోపణలపై అనేక మంది సినీ రంగానికి చెందిన వాళ్లు అరెస్టు అయ్యారు. కొన్నేళ్ల క్రితం ప్రముఖ నటి రకుల్ ప్రీత్‌సింగ్‌పై ఈ తరహా ఆరోపణలే రాగా...తాజాగా సోమవారం ఆమె సోదరుడు అమన్‌ప్రీత్ సింగ్ డ్రగ్స్ వినియోగిస్తున్నట్లు తేలడంతో అరెస్టు అయ్యాడు. ఇతడు మాదకద్రవ్యాలు ఖరీదు చేసిన పెడ్లర్స్ ముఠాలో అనేక మందిపై గతంలోనూ కేసులు ఉన్నట్లు రాజేంద్రనగర్ పోలీసులు ప్రకటించారు. పలువురిపై గతంలోనూ కేసులు...సోమవారం చిక్కిన ఐదుగురు డ్రగ్ పెడ్లర్స్‌లో కొందరిపై గతంలోనూ కేసులు ఉన్నట్లు వెలుగులోకి వచ్చింది. ప్రధాన సూత్రధారి అయిన డివైన్ ఎబుక సుజీపై వివిధ నగరాల్లో ఏడు డ్రగ్ కేసులు ఉన్నాయి. ఇతడికి ప్రధాన ఏజెంట్‌గా ఉన్న అనోహ బ్లెస్సింగ్‌పై 2019లో ధూల్‌పేట ఎకై ్సజ్ పోలీసులు ఇలాంటి కేసే నమోదు చేశారు. పెడ్లర్స్లోఒకడైన నిజాం కాలేజీ విద్యార్థి అజీజ్ నోహీమ్ అడెషోలా (నైజీరియన్) గతంలో ఉస్మానియా యూనివర్సిటీలో చదివాడు. అప్పట్లో ఫీజు చెల్లించడం కోసం నకిలీ డీడీ తయారు చేసి ఇచ్చి అరెస్టు అయ్యాడు. ఈ కేసులో కింది కోర్టు శిక్ష వేయగా.. ఉన్నత న్యాయస్థానంలో సవాల్ చేశాడు. అల్లం సత్య వెంకట గౌతమ్‌పై కేపీహెచ్‌బీ ఠాణాలో మహిళను వేధించిన కేసు, వరుణ్ కుమార్‌పై బండ్లగూడకు చెందిన ఈవెంట్స్ కొరియోగ్రాఫర్ మహ్మద్ మెహబూబ్ షరీఫ్‌లకు పంపిణీ చేస్తోంది. వరుణ్ కుమార్‌పై కేపీహెచ్బీలో, షరీఫ్‌పై జూబ్లీహిల్స్, మాదాపూర్‌ల్లో కేసులు ఉన్నాయి.రకుల్ వ్యవహారం ఇలా...నగరానికి చెందిన అనేక మంది ప్రముఖులు, సినీ రంగానికి చెందిన వారికి డ్రగ్స్ సరఫరా చేసిన కెల్విన్‌తో సహా మరికొందరిని ఎకై ్సజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు 2017 జూలై 2న అరెస్టు చేశారు. దీనికి సంబంధించిన కేసులు దర్యాప్తు చేసిన ప్రత్యేక దర్యాప్తు విభాగం (సిట్) అప్పట్లో 10 మంది సినీ ప్రముఖులతో పాటు అనేక మందికి నోటీసులు ఇచ్చి విచారించింది. ఆ జాబితాలో లేని రకుల్ పేరు ఆ తర్వాత చోటు చేసుకున్న అనూహ్య పరిణామాలతో వెలుగులోకి వచ్చింది. 2020లో బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ముంబైలో ఆత్మహత్య చేసుకున్నారు. ఈ వ్యవహారంలో డ్రగ్స్ కోణం వెలుగులోకి రావడంతో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) అధికారులు మరో కేసు నమోదు చేశారు. ఇందులో సుశాంత్ సింగ్ గర్ల్‌ఫ్రెండ్ రియా చక్రవర్తిని అరెస్టు చేశారు. ఈమె విచారణతో పాటు దర్యాప్తులో వెలుగులోకి వచ్చిన అంశాల ఆధారంగా దీపికా పదుకొణె, శ్రద్ధా కపూర్, సారా అలీఖాన్, రకుల్ ప్రీత్‌సింగ్ తదితరులకు సమన్లు జారీ చేశారు. అదే ఏడాది సెప్టెంబర్ 25న ముంబైలో ఎన్సీబీ విచారణకు రకుల్ హాజరయ్యారు. 2021 సెప్టెంబర్‌లో హైదరాబాద్ ఈడీ అధికారులు రకుల్‌ను సుదీర్ఘంగా ప్రశ్నించారు.కొకై న్ వినియోగదారుడిగా చిక్కిన అమన్...టీజీఏఎన్‌బీ, సైబరాబాద్ ఎస్ఓటీ, రాజేంద్రనగర్ పోలీసులు సోమవారం చేపట్టిన ఆపరేషన్‌లో నైజీరియన్లు డివైన్ ఎబుక సుజీ, ఫ్రాంక్లిన్ సూత్రధారులుగా ఉన్న డ్రగ్ నెట్‌వర్క్‌ను ఛేదించారు. ఈ ఇద్దరూ పరారీలో ఉండగా...అనోహ బ్లెస్సింగ్, అజీజ్, గౌతమ్, వరుణ్, షరీఫ్‌లను అరెస్టు చేసి 199 గ్రాముల కొకై న్ స్వాధీనం చేసుకున్నారు. వీరి విచారణ నేపథ్యంలో అమన్‌ప్రీత్ సింగ్‌తో పాటు కిషన్ రాఠి, అనికాంత్, యశ్వంత్, రోహిత్, శ్రీ చరణ్, ప్రసాద్, హేమంత్, నిఖిల్, మధు, రఘు, కృష్ణం రాజు, వెంకట్ పేర్లు వెలుగులోకి వచ్చాయి. వీళ్లు క్రమం తప్పకుండా తమ వద్ద నుంచి కొకై న్ ఖరీదు చేసి వినియోగిస్తున్నట్లు నిందితులు బయటపెట్టారు. దీంతో గాలించిన సైబరాబాద్ పోలీసులు అమన్ ప్రీత్ సింగ్‌తో సహా ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. తమ వద్ద ఉన్న కిట్ ద్వారా మూత్ర పరీక్ష చేయగా..వీళ్లు తరచు కొకై న్ వాడుతున్నట్లు రిపోర్టు వచ్చింది. దీంతో ఆస్పత్రిలో పరీక్షలు చేయించిన పోలీసులు వీరిని డ్రగ్స్ వినియోగదారులుగా చేర్చి అరెస్టు చేశారు. పరారీలో ఉన్న వినియోగదారుల్లోనూ సినీ, వ్యాపార ప్రముఖులు ఉన్నట్లు తెలుస్తోంది. -
డ్రగ్స్ కేసులో రకుల్ సోదరుడు అమన్ అరెస్టు
సాక్షి, హైదరాబాద్/గచ్చిబౌలి: టాలీవుడ్లో మరోసారి డ్రగ్స్ కలకలం రేగింది. తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో (టీజీఏఎన్‌బీ), సైబరాబాద్ స్పెషల్ ఆపరేషన్ టీమ్ (ఎస్ఓటీ), రాజేంద్రనగర్ పోలీసులు చేపట్టిన ఉమ్మడి ఆపరేషన్‌లో ఐదుగురు డ్రగ్ పెడ్లర్స్ చిక్కారు. వీరి విచారణలో ప్రముఖ నటి రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు, టాలీవుడ్ నటుడు అమన్ ప్రీత్ సింగ్ సహా 13 మంది పేర్లు వెలుగులోకి వచ్చాయి. వీరిలో అమన్ సహా ఐదుగురిని పరీక్షించగా, వారు డ్రగ్స్ వినియోగించినట్లు తేలింది. దీంతో ఈ ఐదుగురినీ నిందితులుగా చేర్చి అరెస్టు చేసినట్లు రాజేంద్రనగర్ డీసీపీ చింతమనేని శ్రీనివాస్ పేర్కొన్నారు. డ్రగ్ పెడ్లర్స్‌లో కొందరు స్థానికులూ ఉన్నారని, పరారీలో ఉన్న ఇద్దరు ప్రధాన సూత్రధారుల కోసం గాలిస్తున్నామని తెలిపారు. గచ్చిబౌలిలోని సైబరాబాద్ పోలీసు కమిషనరేట్‌లో ఆయన ఈ వివరాలను మీడియాకు వెల్లడించారు. విదేశాల నుంచి తెప్పించి... నైజీరియాకు చెందిన డివైన్ ఎబుక సుజీ, ఫ్రాంక్లిన్‌లు బిజినెస్, స్టడీ వీసాలపై హైదరాబాద్‌కు వచ్చారు. కొన్నాళ్లు నగరంలోని పారామౌంట్‌కాలనీలో ఉన్నప్పటికీ ప్రస్తుతం ఢిల్లీలో నివాసం ఏర్పాటు చేసుకున్నారు. విదేశాల నుంచి కొకైన్ సహా వివిధ రకాలైన డ్రగ్స్ ఖరీదు చేస్తున్న వీళ్లు తమ ఏజెంట్ల ద్వారా దేశవ్యాప్తంగా అనేక మంది పెడ్లర్స్‌కు సరఫరా చేస్తున్నారు. నైజీరియా నుంచి వచ్చి బెంగళూరులో హోమ్ సర్వీస్ పని చేస్తున్న అనోహ బ్లెస్సింగ్ వీరికి ప్రధాన ఏజెంట్‌గా ఉంది. ఈమె హైదరాబాద్‌తోపాటు ఢిల్లీ, ముంబై, గోవాల్లో ఉన్న పెడ్లర్స్, సెల్లర్స్‌కు మాదకద్రవ్యాలు సరఫరా చేసింది. ఏడాదిన్నర కాలంలో 20 సార్లు నగరానికి మాదకద్రవ్యాలు తెచ్చింది. డ్రగ్స్‌ను హ్యాండ్‌బ్యాగ్‌లో పెట్టుకుని, విమానాలు, రైళ్లలో తిరుగుతూ సప్లై చేస్తుంటుంది. ఈ డ్రగ్స్‌ను నిజాం కాలేజీ విద్యార్ధిగా ఉన్న నైజీరియన్ అజీజ్ నోహీమ్ అడెషోలా, బెంగళూరులో ఉంటూ ఓ కంపెనీకి లీడ్ కన్సల్టెంట్‌గా వ్యవహరిస్తున్న విశాఖ వాసి అల్లం సత్య వెంకట గౌతమ్, అమలాపురం నుంచి వచ్చి నగరంలో నివసిస్తున్న కారు డ్రైవర్ సనబోయిన వరుణ్ కుమార్, బండ్లగూడకు చెందిన ఈవెంట్స్ కొరియోగ్రాఫర్ మహ్మద్ మెహబూబ్ షరీఫ్‌లకు పంపిణీ చేస్తోంది. వీళ్లు తమ వినియోగదారులకు వీటిని విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. గ్రాముకు రూ.500 కమీషన్ 2018 నుంచి ఈ దందాలో ఉన్న అనోహ ఆఫ్రికా నుంచి జోయినా గోమెస్ పేరుతో నకిలీ పాస్‌పోర్టు తీసుకుని వినియోగిస్తోంది. తరచూ బెంగళూరు–హైదరాబాద్ మధ్య రాకపోకలు సాగిస్తున్న గౌతమ్... అనోహ ద్వారా అందుకున్న డ్రగ్స్‌ను పెడ్లర్స్‌కు సరఫరా చేస్తున్నాడు. ఒక్కో గ్రాముకు రూ.500 చొప్పున కమీషన్ తీసుకుంటూ డెలివరీ ఇస్తున్నాడు. ఇటీవలే ఇద్దరు నైజీరియన్లు ఇతడి బ్యాంకు ఖాతాలోకి రూ.13.24 లక్షల కమీషన్‌ను ట్రాన్స్ఫర్ చేశారు. ఇతడు ఐదు నెలల క్రితమే ఓ యువతిని వివాహం చేసుకున్నాడు. ఆమె బ్యాంకు ఖాతాలోకీ రూ.2.5 లక్షల కమీషన్ డిపాజిట్ చేయించాడు. ఇతడు గత ఏడు నెలల్లో 2.6 కేజీల కొకైన్ క్రయవిక్రయాలు చేసినట్లు పోలీసులు అంచనా వేస్తున్నారు. వరుణ్ కుమార్‌కు తన వినియోగదారుడైన మధు ద్వారా గౌతమ్‌తో పరిచయం ఏర్పడింది. అలా ఈ దందాలోకి వచ్చిన ఇతడు నైజీరియన్ల నుంచి గ్రాము రూ.8 వేలకు ఖరీదు చేసి, రూ.12 వేలకు విక్రయిస్తున్నాడు. ఇలా ఆరు నెలల కాలంలో రూ.7 లక్షల వరకు ఆర్జించాడు. నగరంలో 13 మంది... వీరి దందాపై టీజీఏఎన్‌బీ అధికారులకు సమాచారం అందింది. దీంతో సోమవారం హైదర్షాకోట్లోని ఓ అపార్ట్‌మెంట్‌పై దాడి చేశారు. అక్కడ ఎబుక, ఫ్రాంక్లిన్ మినహా మిగిలిన ఐదుగురూ చిక్కారు. వీరి నుంచి 199 గ్రాముల కొకైన్, వాహనాలు, సెల్ఫోన్లు స్వా«దీనం చేసుకున్నారు. ఈ పెడ్లర్స్ విచారణలో 13 మంది నగరవాసులు తమ నుంచి తరచూ డ్రగ్స్ ఖరీదు చేసి వినియోగిస్తున్నట్లు బయటపెట్టారు. వీరిలో బంజారాహిల్స్‌కు చెందిన బిల్డర్ అనికేత్ రెడ్డి, కన్స్ట్రక్షన్ వ్యాపారి ప్రసాద్, సినీ నటుడు అమన్‌ప్రీత్ సింగ్, మాదాపూర్ వాసి మధుసూదన్, పంజగుట్టకు చెందిన నిఖిల్ దావన్‌లను అదుపులోకి తీసుకున్న పోలీసులు డ్రగ్ టెస్ట్ చేయగా... కొకైన్ వాడుతున్నట్లు నిర్ధారణ అయింది. దీంతో వీరిని అరెస్టు చేసిన అధికారులు పరారీలో ఉన్న సూత్రధారుల కోసం గాలిస్తున్నారు. డ్రగ్స్‌పై సమాచారం తెలిస్తే 8712671111కు తెలపాలని కోరారు. ఎబుక, ఫ్రాంక్లిన్ సమాచారం అందిస్తే రూ.2 లక్షల రివార్డు ఇస్తామని పోలీసులు ప్రకటించారు. కాగా, సూత్రధారులిద్దరూ నైజీరియా పారిపోయి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. -
అమన్–ప్రగతి జోడీకి పసిడి పతకం
World University Games: ప్రపంచ విశ్వ విద్యాలయాల క్రీడల్లో భారత్‌కు నాలుగో స్వర్ణ పతకం లభించింది. ఆదివారం జరిగిన ఆర్చరీ ఈవెంట్లో కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ విభాగంలో అమన్ సైని–ప్రగతి (భారత్) జోడీ పసిడి పతకం సాధించింది. ఫైనల్లో అమన్ సైని–ప్రగతి ద్వయం 157–156తో సువా చో–సెయుంగ్హున్ పార్క్ (కొరియా) జోడీపై గెలిచింది. కాంపౌండ్ పురుషుల టీమ్ విభాగంలో భారత్‌కు కాంస్యం, మహిళల టీమ్ విభాగంలో భారత్‌కు రజత పతకం లభించాయి. ఎదురులేని సౌత్‌జోన్ పుదుచ్చేరి: దేవధర్ ట్రోఫీ దేశవాళీ జోనల్ వన్డే క్రికెట్ టోర్నీ లో సౌత్‌జోన్ జట్టు వరుసగా నాలుగో విజయం సాధించింది. ఈస్ట్‌జోన్ జట్టుతో ఆదివారం జరిగిన నాలుగో లీగ్ మ్యాచ్‌లో సౌత్‌జోన్ ఐదు వికెట్ల తేడాతో గెలిచి 16 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ముందుగా ఈస్ట్‌జోన్ 46 ఓవర్లలో 229 పరుగులకు ఆలౌటైంది. విరాట్ సింగ్ (49; 4 ఫోర్లు, 1 సిక్స్), శుభ్రాన్షు సేనాపతి (44; 5 ఫోర్లు), ఆకాశ్‌దీప్ (44; 3 ఫోర్లు, 4 సిక్స్‌లు), ముక్తార్ హుస్సేన్ (33; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు) రాణించారు. సౌత్‌జోన్ బౌలర్లు సాయికిశోర్ (3/45), వాసుకి కౌశిక్ (3/37), విద్వత్ కావేరప్ప (2/40) ప్రత్యర్థి జట్టును కట్టడి చేశారు. అనంతరం సౌత్‌జోన్ 44.2 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 230 పరుగులు చేసి గెలిచింది. కెప్టెన్ మయాంక్ అగర్వాల్ (88 బంతుల్లో 84; 6 ఫోర్లు, 1 సిక్స్), సాయి సుదర్శన్ (67 బంతుల్లో 53; 4 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీలు సాధించి సౌత్‌జోన్ విజయంలో కీలకపాత్ర పోషించారు. ఇతర మ్యాచ్‌ల్లో సెంట్రల్‌జోన్ ఎనిమిది వికెట్ల తేడాతో నార్త్ఈస్ట్ జోన్ జట్టుపై, వెస్ట్‌జోన్ ఆరు వికెట్ల తేడాతో నార్త్‌జోన్‌పై విజయం సాధించాయి. -
Wrestling: ఎట్టకేలకు భారత్ ఖాతాలో తొలి స్వర్ణం.. అమన్ ‘పసిడి పట్టు’
Asian Wrestling Championships 202- అస్తానా (కజకిస్తాన్): ఆసియా సీనియర్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో ఎట్టకేలకు భారత్ ఖాతాలో తొలి స్వర్ణ పతకం చేరింది. ఈ టోర్నీ ఐదో రోజు గురువారం పురుషుల ఫ్రీస్టయిల్ 57 కేజీల విభాగంలో అమన్ సెహ్రావత్ భారత్‌కు తొలి పసిడి పతకాన్ని అందించాడు. ఫైనల్లో అమన్ 9–4 పాయింట్ల తేడాతో అల్మాజ్ సమన్బెకోవ్ (కిర్గిస్తాన్)పై గెలుపొందాడు. అప్పుడు రవి దహియా నేరుగా క్వార్టర్ ఫైనల్ బౌట్ ఆడిన అమన్ 7–1తో రికుటో అరాయ్ (జపాన్)పై, సెమీఫైనల్లో 7–4తో వాన్హావో జు (చైనా)పై విజయం సాధించాడు. అమన్ ప్రదర్శనతో వరుసగా నాలుగో ఏడాది 57 కేజీల విభాగంలో భారత్ ఖాతాలోనే స్వర్ణ పతకం చేరడం విశేషం. 2020, 2021, 2022లలో రవి కుమార్ దహియా ఈ విభాగంలో విజేతగా నిలిచాడు. గాయం కారణంగా ఈసారి రవి ఈ టోర్నీకి దూరంగా ఉన్నాడు. అమన్‌కిది రెండోది ఢిల్లీలోని విఖ్యాత ఛత్రశాల్ స్టేడియంలో ప్రాక్టీస్ చేసే అమన్ గత ఏడాది అండర్–23 ప్రపంచ చాంపియన్‌షిప్‌లోనూ స్వర్ణ పతకం సాధించాడు. ఈ ఏడాది అమన్‌కిది రెండో పతకం. ఫిబ్రవరిలో జాగ్రెబ్ ఓపెన్ ర్యాంకింగ్ టోర్నీలో అమన్ కాంస్య పతకం గెలిచాడు. మూడింట నిరాశ గురువారం జరిగిన ఇతర నాలుగు వెయిట్ కేటగిరీల్లో మూడింట భారత రెజ్లర్లకు నిరాశ ఎదురైంది. 79 కేజీల విభాగంలో దీపక్ కుక్నా కాంస్య పతకం నెగ్గగా... 97 కేజీల విభాగంలో దీపక్ నెహ్రా కాంస్య పతక బౌట్లో ఓడిపోయాడు. దీపక్ కుక్నా 12–1తో షురాత్ బొజొరోవ్ (తజికిస్తాన్)పై గెలుపొందగా... దీపక్ నెహ్రా 9–12తో మక్సూద్ వెసలోవ్ (ఉజ్బెకిస్తాన్) చేతిలో పోరాడి ఓడిపోయాడు. అనూజ్ (65 కేజీలు) క్వార్టర్ ఫైనల్లో, ములాయం యాదవ్ (70 కేజీలు) క్వాలిఫయింగ్ రౌండ్లో ఓటమి పాలయ్యారు. హైదరాబాద్ ఎఫ్‌సీ మ్యాచ్ ‘డ్రా’ సూపర్ కప్ టోర్నీలో హైదరాబాద్ ఫుట్‌బాల్ క్లబ్ (ఎఫ్‌సీ) తొలి ‘డ్రా’ నమోదు చేసింది. కేరళలో జరుగుతున్న ఈ టోర్నీలో ఈస్ట్ బెంగాల్ జట్టుతో జరిగిన గ్రూప్ ‘బి’ రెండో లీగ్ మ్యాచ్‌ను హైదరాబాద్ 33తో ‘డ్రా’గా ముగించింది. సోమవారం జరిగే తమ చివరి లీగ్ మ్యాచ్‌లో ఒడిశాతో హైదరాబాద్ ఆడుతుంది. భారత్‌కు తొలి ఓటమి తాష్కెంట్ (ఉజ్బెకిస్తాన్): బిల్లీ జీన్ కింగ్ కప్ ఆసియా ఓసియానియా జోన్ గ్రూప్–1 మహిళల టీమ్ టెన్నిస్ టోర్నీలో భారత జట్టుకు తొలి ఓటమి ఎదురైంది. చైనా జట్టుతో గురువారం జరిగిన మూడో లీగ్ మ్యాచ్‌లో టీమిండియా 0–3తో పరాజయం చవిచూసింది. తొలి సింగిల్స్‌లో రుతుజా భోస్లే 3–6, 5–7తో జియాంగ్ జిన్యు చేతిలో ఓడిపోగా... రెండో సింగిల్స్‌లో భారత నంబర్‌వన్ అంకిత రైనా 5–7, 1–6తో యువాన్ యు చేతిలో ఓటమి పాలైంది. దాంతో భారత పరాజయం ఖరారైంది. నామమాత్రంగా జరిగిన డబుల్స్ మ్యాచ్‌లో శ్రీవల్లి రష్మిక–వైదేహి చౌదరీ ద్వయం 0–6, 1–6తో జియాంగ్ జిన్యు–యాంగ్ జావోజువాన్ జోడీ చేతిలో ఓడిపోయింది. నేడు జరిగే నాలుగో లీగ్ మ్యాచ్‌లో జపాన్‌తో భారత్ తలపడుతుంది. ఈ టోర్నీలో జపాన్ ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ గెలిచి అజేయంగా ఉంది. -
ఆగంతకుడి దాడి, రక్తసిక్తమైన నటుడు.. వీడియో వైరల్
కాలిఫోర్నియా: జోధా అక్బర్సహా పలు హిందీ, పంజాబీ సినిమాల్లో నటించిన యువ పంజాబీ నటుడు అమన్ ధలివాల్‌పై అమెరికాలో ఒక ఆగంతకుడు కత్తితో దాడికి తెగబడ్డాడు. ఛాతీ, మెడ, తల, భుజంపై పలు చోట్ల తీవ్రంగా గాయపరిచాడు. ఘటన తర్వాత అమన్‌ను ఆస్పత్రిలో చేర్పించారు. ప్రాణాపాయం ఏమీలేదని వైద్యులు తెలిపినట్లు మీడియాలో వార్తలొచ్చాయి. గురువారం ఉదయం కాలిఫోర్నియా నగరంలోని గ్రాండ్ ఓక్స్ ప్రాంతంలోని ఒక జిమ్‌లో కసరత్తు చేస్తున్న అమన్పైకి ఒక ఆగంతకుడు కత్తితో దాడి చేసి బందీగా పట్టుకున్నాడు. తాగడానికి నీళ్లు కావాలని అక్కడి వారిని ఆగంతకుడు బెదిరించిన సమయంలో ఒక్కసారిగా అమన్ ఎదురుతిరిగి అతడిని పట్టుకోబోయాడు. ఈ ఘర్షణలో అమన్ గాయాలపాలై రక్తసిక్తమయ్యాడు. వెంటనే అప్రమత్తమైన జిమ్‌లోని తోటివారు ఆ ఆగంతకుడిని పట్టుకుని పోలీసులకు అప్పజెప్పారు. అమన్‌పై ఆగంతకుడు దాడి దృశ్యం ప్రస్తుతం వైరల్‌గా మారింది. వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి: https://twitter.com/ShekharPujari2/status/1636306115502931968 -
నా పెళ్లి గురించి క్లారిటీ ఇచ్చావా..? తమ్ముడిని ప్రశ్నించిన రకుల్
ఒకప్పుడు టాలీవుడ్లో వరుస సినిమాలతో దూసుకెళ్లిన స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్.. ప్రస్తుతం తెలుగు తెరకు కాస్త దూరంగా ఉంటుంది. ‘కొండపొలం’ తర్వాత ఆమె తెలుగు తెరపై కనిపించలేదు. దీంతో రకుల్ ఇక టాలీవుడ్లో సినిమాల్లో నటించదా? అని అభిమానులు చర్చించుకుంటున్నారు. అయితే తాను మాత్రం కచ్చితంగా మళ్లీ టాలీవుడ్ సినిమాల్లో నటిస్తానని చెబుతోంది రకుల్. త్వరలోనే తెలుగు తెరపై సందడి చేస్తానని, టాలీవుడ్ ప్రేక్షకుల ప్రేమను ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేసుకొనని చెబుతోంది. (చదవండి: అది మన దురదృష్టం..మనుషుల్లో అది కూడా ఒక భాగమే) ఇదిలా ఉంటే.. త్వరలోనే రకుల్ పెళ్లి చేసుకోబోతుందనే వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. బాలీవుడ్ నటుడు, నిర్మాత జాకీ భగ్నానీతో రకుల్ ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. వీరిద్దరు త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారంటూ రకుల్ ప్రీత్ తమ్ముడు అమన్ ప్రీత్ చెప్పినట్లు ఓ జాతీయ పత్రికలో వార్తలు వచ్చాయి. దీనిపై రకుల్ కాస్త వ్యంగ్యంగా స్పందించింది. ‘అమన్.. నా పెళ్లి గురించి నిజంగానే నువ్వు క్లారిటీ ఇచ్చావా? నా పెళ్లి గురించి నాక్కూడా చెప్పాలి కదా బ్రో..! నా జీవితం గురించి నాకే తెలియకపోవడం హాస్యాస్పదంగా ఉంది’అని రకుల్ ట్వీట్ చేసింది. కాగా, రకుల్ నటించిన బాలీవుడ్ చిత్రం ‘డాక్టర్ జీ’ ఈ నెల 14న విడుదల కాబోతుంది. ప్రస్తుతం ‘థ్యాంక్ గాడ్, ఛత్రివాలి, ఇండియన్-2 చిత్రాల్లో నటిస్తోంది. 😂 @AmanPreetOffl you confirmed ? Aur mujhe bataya bhi nahi bro .. it’s funny how I don’t have news about my life .. https://t.co/ZSZgNjW2BW — Rakul Singh (@Rakulpreet) October 12, 2022 -
Indian Air Force: సవాలుకు సై
‘ఎగిరించకు లోహ విహంగాలను’ అన్నారు శ్రీశ్రీ ‘సాహసి’ కవితలో. ఈ సాహసులు మాత్రం రకరకాల లోహవిహంగాలను ఎగిరించడంలో తమ సత్తా చాటుతున్నారు. చండీగఢ్, అస్సాంలోని మోహన్బరీ చినూక్ హెలికాప్టర్ యూనిట్లలో తొలిసారిగా ఇద్దరు మహిళా ఫైటర్ పైలట్లు విధులు నిర్వహించబోతున్నారు.... మూడు సంవత్సరాల క్రితం... ‘ఇది చిరకాలం గుర్తుండే పోయే శుభసందర్భం’ అనే ఆనందకరమైన మాట ఫ్లైట్ లెఫ్టినెంట్ పారుల్ భరద్వాజ నోటి నుంచి వినిపించింది. రష్యా తయారీ ఎంఐ–17వీ5 హెలికాప్టర్‌ను నడిపిన తొలి ‘ఆల్ ఉమెన్ క్రూ’లో పారుల్ భరద్వాజ్ ఒకరు. ఆమెతోపాటు ఫ్లైట్ లెఫ్టినెంట్ హీన జైస్వాల్, ఫ్లైయింగ్ ఆఫీసర్ అమన్ నిధి ఉన్నారు. ‘ఆల్ ఉమెన్ క్రూ’కు ఎంపిక కావడం అంత తేలికైన విషయం కాదు. రకరకాల పరీక్షలలో విజయం సాధించి దీనికి ఎంపికయ్యారు. మొదట సికింద్రాబాద్‌లోని హకీంపేట్ హెలికాప్టర్ ట్రైనింగ్ సెంటర్లో, ఆ తరువాత బెంగళూరులో ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు. ‘ఎంఐ–17వీ5 నడిపే మహిళా బృందంలో నేను భాగం అయినందుకు గర్వంగా ఉంది. దేశం కోసం ఏదైనా చేయాలనుకునేవారికి స్ఫూర్తినిచ్చే విషయం ఇది’ అంటూ తన ఆనందాన్ని పంచుకుంది పారుల్ భరద్వాజ్. పంజాబ్‌లోని ముకేరియన్ పట్టణానికి చెందిన పారుల్ రకరకాల హెలికాప్టర్లను నడపడంలో సత్తా చాటింది. తాజాగా... అధిక బరువు ఉన్న ఆయుధాలు, సరుకులను వేగంగా మోసుకెళ్లే మల్టీ–మిషన్ ‘చినూక్’ సారథ్య బాధ్యతను తొలిసారిగా ఇద్దరు మహిళలకు అప్పగించింది ఇండియన్ ఎయిర్‌ఫోర్స్. వారు... పరుల్ భరద్వాజ్, స్వాతీ రాథోడ్. చండీగఢ్, అస్సాంలోని మోహన్బరీలో ఈ ఇద్దరు విధులు నిర్వహిస్తారు. గత సంవత్సరం రిపబ్లిక్ డే పరేడ్‌లో ‘ఫ్లై– పాస్ట్’ లీడ్ చేసిన తొలి మహిళగా రికార్డ్ సృష్టించిన స్వాతి రాథోడ్ రాజస్థాన్‌లోని నగౌర్ జిల్లాలో జన్మించింది. పైలట్ కావాలనేది తన చిన్నప్పటి కల. ఎన్సీసీ ఎయిర్‌వింగ్‌లో చేరడం తనను మరోస్థాయికి తీసుకువెళ్లింది. 2014లో పైలట్ కావాలనే తన కోరికను నెరవేర్చుకుంది స్వాతి రాథోడ్. ‘ఎం–17 నుంచి చినూక్లోకి అడుగుపెట్టడం ముందడుగుగా చెప్పుకోవాలి. వాయుసేనలో పనిచేస్తున్న మహిళలు తాము ఉన్నచోటే ఉండాలనుకోవడం లేదు. తమ ప్రతిభను నిరూపించుకొని ఉన్నతస్థాయికి చేరాలనుకుంటున్నారు. ఇది గొప్ప విషయం’ అంటున్నారు ఎయిర్ మార్షల్ అనీల్ చోప్రా. ఎంఐ–17వీ5తో పోల్చితే చినూక్ పనితీరు పూర్తిగా భిన్నం. దీనికితోడు కొన్ని భయాలు కూడా! అమెరికాకు చెందిన ఏరో స్పెస్ కంపెనీ ‘బోయింగ్’ తయారుచేసిన చినూక్ భద్రతపై ఇటీవల కాలంలో రకరకాల సందేహాలు వెల్లువెత్తాయి. వీటి ఇంజన్లో మంటలు చెలరేగే ప్రమాదం ఉందనేది వాటిలో ఒకటి. అయితే దీన్ని ‘బోయింగ్’ సంస్థ ఖండించింది. ఎలాంటి సమస్యా ఉండదని స్పష్టం చేసింది. అనుమానాలు, వాదోపవాదాల సంగతి ఎలా ఉన్నప్పటికీ... చినూక్‌ను నడపడం అనేది సవాలుతో కూడుకున్న పని. ఆ పనిని ఇష్టంగా స్వీకరించి సత్తా చాటడానికి సిద్ధం అయ్యారు పరుల్ భరద్వాజ్, స్వాతీ రాథోడ్‌లు. వీరికి అభినందనలు తెలియజేద్దాం. అనుమానాలు, వాదోపవాదాల సంగతి ఎలా ఉన్నప్పటికీ... చినూక్‌ను నడపడం అనేది సవాలుతో కూడుకున్న పని. ఆ పనిని ఇష్టంగా స్వీకరించి సత్తా చాటడానికి సిద్ధం అయ్యారు పరుల్ భరద్వాజ్, స్వాతీ రాథోడ్‌లు. వీరికి అభినందనలు తెలియజేద్దాం. -
UWW Ranking Series: అమన్ పసిడి పట్టు.. భారత్‌కు 12 పతకాలు!
కజకిస్తాన్‌లో జరిగిన యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ ర్యాంకింగ్ సిరీస్ టోర్నమెంట్లో భారత రెజ్లర్ అమన్ 57 కేజీల విభాగంలో స్వర్ణం సాధించాడు. ఫైనల్లో అమన్ 10–9తో మెరెయ్ బజర్బయెవ్ (కజకిస్తాన్)ను ఓడించాడు. టోక్యో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత బజరంగ్ పూనియా (65 కేజీలు) కాంస్యంతో సరిపెట్టుకున్నాడు. కాంస్య పతక పోరులో బజరంగ్ 7–0తో రిఫత్ సైబొతలొవ్ (కజకిస్తాన్)పై గెలుపొందాడు. ఈ ఈవెంట్లో భారత్ 12 పతకాలు గెలుపొందగా, మహిళా రెజ్లర్లే 5 స్వర్ణాలు సహా 8 పతకాలు గెలిచారు. చదవండి: Rafael Nadal: సాటిరారు నీకెవ్వరు.. మట్టికోర్టుకు రారాజు నాదల్.. పలు అరుదైన రికార్డులు! -
తెరవెనుక ఎన్నో జరుగుతున్నాయ్!
‘‘కరోనా లాక్‌డౌన్‌కి ముందే ‘తెరవెనుక’ సినిమా పూర్తయింది. థియేటర్లు మూతపడటంతో ఓటీటీలో విడుదల చేద్దామని దర్శక–నిర్మాతలకు చెప్పాను. క్రైమ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రానికి రీ రికార్డింగ్, సౌండ్ చాలా ముఖ్యం. థియేటర్లో అయితేనే ప్రేక్షకులు ఆ అనుభూతిని ఆస్వాదించగలుగుతారు. అందుకని థియేటర్లోనే విడుదల చేద్దామన్నారు’’ అన్నారు అమన్. హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ కథానాయకుడిగా నెల్లుట్ల ప్రవీణ్ చందర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘తెరవెనుక’. జయలక్ష్మి మురళి మచ్చ సమర్పణలో మురళి జగన్నాథ్ మచ్చ నిర్మించిన ఈ సినిమా నేడు థియేటర్లలో విడుదలవుతోంది.(చదవండి: శ్రీవారి ముచ్చట్లు @40) ఈ సందర్భంగా అమన్ మాట్లాడుతూ– ‘‘నేటి సమాజంలో మనకు తెలియకుండా తెరవెనుక ఎన్నో అన్యాయాలు జరుగుతున్నాయి. మహిళలపై లైంగిక దాడులు పెరిగిపోతున్నాయి. ఇలాంటి వాటిని ఎలా అరికట్టాలి? అనే నేపథ్యంలో మా సినిమా రూపొందింది. ఇందులో కథే హీరో. ఈ సినిమాకి మా అక్క రకుల్‌తో పాటు మంచు లక్ష్మి, మంచు మనోజ్, సందీప్ కిషన్, సిద్ధు జొన్నలగడ్డ... వంటి వారు సపోర్ట్ చేశారు.. ఇందుకు వారికి థ్యాంక్స్. తొలిసారి నా సినిమాను బిగ్స్క్రీన్పై ప్రేక్షకులతో కలిసి చూడటం చాలా చాలా ఎగ్జైటింగ్‌గా ఉంది. ప్రస్తుతానికి నా ధ్యాసంతా తెలుగు సినిమాలపైనే. మరో రెండు తెలుగు చిత్రాల చర్చలు పూర్తయ్యాయి. ఈ నెలలో అవి ప్రారంభమవుతాయి’’ అన్నారు. -
ఆలోచింపజేసే చిత్రం
‘‘తెరవెనుక’ సినిమా ట్రైలర్ బాగుంది. ఒక ఆడపిల్ల తండ్రి తన కూతురికి జరిగిన అన్యాయం గురించి ఫిర్యాదు ఇవ్వడానికి పోలీస్ స్టేషన్‌కు వచ్చినప్పుడు, ఓ లేడీ పోలీస్ వివరించే విధానం బాగుంది. మహిళలపై జరుగుతున్న అంశాలను ఈ సినిమాలో చూపించినట్లు తెలుస్తోంది’’ అని తెలంగాణ పోలీసు ఉన్నతాధికారిణి సుమతి (డీఐజీ – ఉమెన్ సేఫ్టీ వింగ్) అన్నారు. హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ కథానాయకుడిగా, విశాఖ ధిమాన్, దీపికా రెడ్డి కథానాయికలుగా తెరకెక్కిన చిత్రం ‘తెర వెనుక’. నెల్లుట్ల ప్రవీణ్ చంద్ర దర్శకత్వంలో జయలక్ష్మి మురళి మచ్చ సమర్పణలో మురళీ జగన్నాథ్ మచ్చ నిర్మించారు. ఈ సినిమా ఆడియోను డీఐజీ సుమతి విడుదల చేయగా, దర్శకుడు ఎన్.శంకర్, సుచిర్ ఇండియా లయన్ కిరణ్, నిర్మాత గురురాజ్, సంఘసేవకుడు రేగొండ నరేష్, నటుడు శివారెడ్డి తదితరులు పాటలను విడుదల చేశారు. ఈ నెల 25న ఈ చిత్రం థియేటర్స్‌లో విడుదల కానుంది. నెల్లుట్ల ప్రవీణ్ చంద్ర మాట్లాడుతూ– ‘‘సమాజంలో జరుగుతున్న సంఘటనలను తీసుకొని ఈ సినిమా చేశాను. సామాజిక స్పృహ కలిగిన క్రైమ్ థ్రిల్లర్ కథాంశంతో రూపొందించాం’’ అన్నారు. ‘‘ప్రేక్షకులను ఆలోచింపజేసే చిత్రమిది’’ అన్నారు మురళీ జగన్నాథ్ మచ్చ. -
తెరవెనుక థ్రిల్
హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘తెరవెనుక’. విశాఖ ధిమాన్, దీపిక రెడ్డి హీరోయిన్లుగా, ఆనంద చక్రపాణి , నిట్టల శ్రీరామమూర్తి , టీఎన్నార్, శ్వేతా వర్మ, సంపత్ రెడ్డి ముఖ్య పాత్రలు చేస్తున్నారు. విజయలక్ష్మి మురళి మచ్చ సమర్పణలో మురళి జగన్నాథ్ మచ్చ నిర్మించిన ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్‌ను ప్రముఖ దర్శకులు ఎన్. శంకర్ విడుదల చేసి, మాట్లాడుతూ –‘‘ఈ చిత్రదర్శకుడు ప్రవీణ్ చంద్ర నాకు 25 ఏళ్లుగా తెలుసు. ఈ సినిమాతో తను మంచి దర్శకుడిగా పేరు తెచ్చుకోవాలని కోరుకుంటున్నాను’’ అన్నారు. నెలుట్ల ప్రవీణ్ చంద్ర మాట్లాడుతూ –‘‘సామాజిక స్పహ కలిగిన క్రైమ్ థ్రిల్లర్ కథాంశంతో ఈ చిత్రాన్ని రూపొందించాం. నిర్మాత మురళి జగన్నాథ్ గారు నన్ను నమ్మి ఈ సినిమా నాకు ఇవ్వడంతో బాధ్యత పెరిగింది. త్వరలో ఈ సినిమా టీజర్ ను విడుదల చేస్తాం’’ అని తెలిపారు. ఈ చిత్రానికి కథ–మాటలు: బాబా, కెమెరా: రాము కంద, సంగీతం: రఘురామ్. -
రాఖీ పౌర్ణమి స్పెషల్
తోబుట్టువుల పండగ రాఖీ. ఏడాదంతా ఎంత ఆటపట్టించుకున్నా, మనిద్దరం ఒకటే జట్టు అన్న శాంతి ఒప్పందమే రాఖీ. వీళ్లకు చిన్నప్పటి గొడవలే ప్రస్తుత జ్ఞాపకాలు. నేనున్నా అని ఒకరికొకరు చెప్పుకునే భరోసాయే రాఖీ. మా అన్నయ్య బెస్ట్ అని సూపర్ సిస్టర్ ప్రసీద, మా సిస్టర్ సూపర్ అని హ్యాండ్సమ్ బ్రదర్ అమన్, మా అక్క బంగారు తల్లి అంటూ సిక్స్‌ప్యాక్ కార్తికేయ వాళ్ల రాఖీ బంధం గురించి ఇలా చెప్పారు. అన్నయ్య చిన్నప్పటి నుంచే బాహుబలి – సాయిప్రసీద తండ్రి కృష్ణంరాజు, అన్నయ్య ప్రభాస్‌తో సాయిప్రసీద ► నేను ప్రస్తుతం ప్రభాస్ అన్నయ్య (సాయిప్రసీదకు ప్రభాస్ కజిన్ బ్రదర్) హీరోగా చేస్తున్న ‘రాధేశ్యామ్’ చిత్రానికి గోపీకృష్ణ మూవీస్ తరపున నిర్మాతగా చేస్తున్నాను. తెలుగు వెర్షన్‌కు యూవీ క్రియేషన్స్ వంశీ, ప్రమోద్‌లతో కలిసి సహనిర్మాతగా వ్యవహరిస్తున్నాను. ► ప్రభాస్ అన్నయ్య అనగానే నాకు బెస్ట్‌ఫ్రెండ్ గుర్తుకు వస్తాడు. ఫ్రెండ్ అని ఎందుకు అంటున్నానంటే.. అన్ని విషయాలు షేర్ చేసుకునేంత బెస్ట్ ఫ్రెండ్ నాకు. నా కెరీర్‌కి ఆయనే మెంటర్. రాఖీ పండగ రోజున నేను, చెల్లెళ్లు కలసి అన్నయ్యతో టైమ్ స్పెండ్ చేస్తాం. బోలెడన్ని కబుర్లు చెప్పుకుంటాం. ఈరోజు (సోమవారం) తప్పనిసరిగా ప్రభాస్ అన్నయ్యను కలుస్తాం. ► మా ఫ్యామిలీ అంతా ఫుడ్ లవర్సే. మేము అన్నయ్య దగ్గరికెళ్లగానే ౖహె దరాబాద్‌లో ఉన్న బెస్ట్ ఫుడ్ తెప్పిస్తారు (నవ్వుతూ). చిన్నప్పటి నుంచి రాఖీ పండగరోజు అన్నయ్య మాకు బెస్ట్ గిఫ్ట్స్ ఇస్తుంటాడు. ప్రతి ఏడాది లేటెస్ట్ ట్రెండ్‌లో ఏది ఉంటే అది మా ముందుండేది. అన్నీ బెస్ట్ గిఫ్ట్స్ ఇచ్చేవారు. ఇప్పుడంటే అన్నయ్య ‘బాహుబలి’ అయ్యారు కానీ, మాకు మాత్రం చిన్నప్పటి నుంచే ‘బాహుబలి’. ► మొదట్లో నేను చాలా కన్ఫ్యూజన్లో ఉండేదాన్ని. వ్యాపారం చేద్దామనుకుని లండన్‌లో బిజినెస్ కోర్స్ చదివాను. ఆ కోర్స్ చివరిలో ప్రాజెక్ట్ చేయాల్సి వచ్చింది.. అప్పుడు నేను ప్రొడక్షన్ చేశాను. మొదట్లో సినిమా వ్యాపారం ఎందుకు? ఇది రిస్కీ బిజినెస్ కదా? అనుకున్నాను. లండన్‌లో ప్రాజెక్ట్ తర్వాత నాకు నమ్మకం పెరిగింది. తర్వాత ఖాళీగా ఉండటం ఎందుకు అని అమెరికాలోని న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీలో ప్రొడక్షన్లో ఏడాది కోర్స్‌లో జాయిన్ అయ్యాను. ఆ కోర్స్ జరుగుతుండగానే ‘రాధేశ్యామ్’ కి పనిచేస్తున్నా. ► ప్రొడక్షన్ విషయంలో అన్నయ్య నాకు చాలా సహాయం చేస్తున్నారు. ‘ప్రొడక్షన్లోకి రావటానికి నీకు ఆసక్తి ఉందా? అని అడిగారు. ఆసక్తి ఉంటే నాకు తెలిసినదంతా నీకు నేర్పిస్తాను. కంగారు పడాల్సిన పనేంలేదు, నీకు నేనున్నాను’ అంటూ చాలా సపోర్ట్ చేశారు. అప్పుడు నాన్నకి, అన్నయ్యకి చెప్పి ప్రొడక్షన్లోకి వచ్చాను. ఇద్దరక్కలు నాకుఅమ్మలాంటివాళ్లు – అమన్ లక్ష్మీమంచు, రకుల్‌ప్రీత్ సింగ్‌తో అమన్ ► రాఖీ పండగ వస్తోందంటే అక్క (రకుల్‌ప్రీత్‌సింగ్)కి ఏ గిఫ్ట్ ఇవ్వాలా అని ఆలోచిస్తుంటాను. నేను చిన్నప్పటి నుండి ఖరీదైన వస్తువులు ఇచ్చేవాణ్ని కాదు. కానీ, నేను ఏమిచ్చినా చాలా సంతోషంగా తీసుకుంటుంది అక్క. ► గతేడాది మాత్రం ‘బర్బరీ’ బ్రాండ్ హ్యాండ్‌బ్యాగ్ కొనిచ్చాను. తను చాలా ఆనందపడింది. ఈ రాఖీకి నేను హీరోగా నటించిన ‘నిన్నే పెళ్లాడుతా’ సినిమా విడుదలవుతుందేమో అనుకున్నాను. నేను నటునిగా కావడమే ఈ ఏడాది అక్కకి ఇచ్చే బహుమతి అని చెబుదాం అనుకున్నాను. కానీ కరోనా వల్ల మా సినిమా విడుదల కాలేదు. 180 థియేటర్లలో సినిమా విడుదలకు సిద్ధమైన తర్వాత లాక్డౌన్ వచ్చింది. అందుకే, ఈ రాఖీ పండక్కి ఏమివ్వాలా అని ఆలోచిస్తున్నాను. ► రాఖీ కట్టించుకున్న తర్వాత సర్ప్రైజ్ గిఫ్ట్ ప్లాన్ చేశాను.. అది ఇచ్చిన తర్వాత అక్కతో కలిసి సినిమా చూస్తాను. లక్ష్మీమంచును కూడా నేను అక్కలానే భావిస్తాను. ఆమెతో కూడా రాఖీ కట్టించుకుంటాను. ఈ ఇద్దరక్కలు నా లైఫ్‌లో అమ్మలాంటివాళ్లు. త్వరలోనే నా సినిమా ఓటీటీ ప్లాట్ఫామ్లో విడుదలవుతుంది. ఏ నిర్ణయం అయినా అక్కదే! – కార్తికేయ అక్క శుక్లతో కార్తికేయ ► మా అక్క శుక్లా అమెరికాలో ఉంటుంది. చిన్నప్పుడు ఆమె వస్తువులు ఎవరన్నా ముట్టుకుంటే చాలా కోప్పడేది. తన వస్తువుల్ని నేను పనికిరాకుండా చేసి, నాకు తెలియదు అనేవాణ్ణి. ఇద్దరం ఫుల్‌గా ఫైట్ చేసేవాళ్లం. కానీ, రాఖీ పండగకి మాత్రం మంచి బహుమతులు ఇచ్చేవాణ్ని. ► అక్క, నేను ఇద్దరం కలసి చిన్నప్పటి నుండి సినిమాలు చూసేవాళ్లం. సినిమా చూసిన తర్వాత దాని గురించి చర్చించుకోవడంతో పాటు హీరోల గురించి మాట్లాడుకునేవాళ్లం. చిన్నప్పటి నుండి అక్క డ్యాన్స్ బాగా చేసేది. నేను కూడా తన దగ్గర డ్యాన్స్ నేర్చుకునేవాణ్ని. ► నాకు సంబంధించి ఏ చిన్న నిర్ణయమైనా అక్కే ఫైనలైజ్ చేసేది. ఉదాహరణకు.. కాలేజీలో అడ్మిషన్ తీసుకోవాలన్నా కూడా.. ఇప్పుడు ఏదన్నా సినిమా ఫైనలైజ్ చేయాలన్నా అక్కతో మాట్లాడి కన్ఫర్మ్ చేస్తాను. తర్వాతి అడుగు ఎలా వేయాలి? ఎంత జాగ్రత్తగా ఉండాలి అనేది అక్క, నేను మాట్లాడుకుంటుంటాం. ► నా మొదటి సినిమా ‘ఆర్ఎక్స్ 100’ విడుదలైనప్పుడు అక్క అమెరికాలోనే ఉంది. తనకి పాప పుడితే అన్నప్రాసనకు నేను వెళ్లాను. అక్కడ ఓ భారతీయ సూపర్ మార్కెట్‌కి వెళితే కొంతమంది నన్ను గుర్తుపట్టి ఫొటోలు దిగారు. అది చూసి మా అక్క సర్ప్రైజ్ అయింది. నాకు బాగా సంతోషంగా అనిపించింది. ► గత ఏడాది అక్క ఇండియాలో ఉన్నప్పుడే నేను నటించిన ‘గుణ 369’ విడుదలైంది.. ఇద్దరం కలిసి చూశాం. ఆ సినిమా విడుదలైన టైమ్‌లో రాఖీ పండగ రావటం, అక్క ఇండియాలో ఉండటం.. ఇలా అన్నీ హ్యాపీ మూమెంట్స్ అదే రోజు జరిగాయి. ఆ సినిమా క్లైమాక్స్‌లో నా నటన చూసి నన్ను పట్టుకొని ఏడ్చింది.. చాలా గర్వంగా ఫీలవుతున్నాను అని చెప్పింది. ‘నాకు జీవితంలో ఇంతకంటే ఏం కావాలి’ అని ఆ క్షణం అనిపించింది. -
నీ నీడై వెంటాడనా..
నాగార్జున, టబు జంటగా కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన ‘నిన్నే పెళ్లాడతా’ సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో తెలిసిందే. ఇప్పుడు ఇదే టైటిల్‌తో ఓ సినిమా తెరకెక్కుతోంది. ఇందులో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ హీరోగా నటిస్తున్నారు. వైకుంఠ బోను దర్శకత్వం వహిస్తున్నారు. అంబికా ఆర్ట్స్, ఈశ్వరి ఆర్ట్స్ పతాకాలపై బొల్లినేని రమ్య, వెలుగోడు శ్రీధర్ బాబు నిర్మిస్తున్నారు. సిద్ధిక కథానాయికగా నటిస్తోంది. ‘నేనే నీ నీడై వెంటాడనా.. వేసే అడుగుల్లో తారాడనా...’ అంటూ సాగే ఈ చిత్రంలోని రెండో పాటను విడుదల చేశారు. ఈ పాటను చైతన్య ప్రసాద్ రచించగా, చిన్మయి ఆలపించారు. బొల్లినేని రమ్య, వెలుగోడు శ్రీధర్ బాబు మాట్లాడుతూ– ‘‘ మా చిత్రం టైటిల్‌ను నాగార్జునగారే విడుదల చేసి, మాకు ఎంతో ధైర్యాన్నిచ్చారు. ఈ చిత్రంలో ప్రతి పాత్రకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. చివరి షెడ్యూల్ చిత్రీకరణ జరపాల్సి ఉంది’’ అన్నారు. -
మళ్లీ నిన్నే పెళ్లాడతా
నాగార్జున–కృష్ణవంశీ కాంబినేషన్లో వచ్చిన బ్లాక్‌బస్టర్ చిత్రం ‘నిన్నే పెళ్లాడతా’. ప్రస్తుతం ఈ టైటిల్‌తోనే ఓ చిత్రం తెరకెక్కుతోంది. రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ హీరోగా వైకుంఠ బోను దర్శకత్వం వహిస్తున్నారు. బొల్లినేని రాజశేఖర్ చౌదరి, వెలుగోడు శ్రీధర్‌బాబు నిర్మాతలు. ఈ చిత్రం టైటిల్ లోగోను నాగార్జున రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు వైకుంఠ బోను మాట్లాడుతూ – ‘‘లోగో రిలీజ్ చేసిన నాగార్జునగారికి కృతజ్ఞతలు. మంచి కథాంశంతో ఈ చిత్రం చేస్తున్నాం. ఇప్పటికి 50 శాతం షూటింగ్ పూర్తయింది. ఆగస్ట్‌లో కొత్త షెడ్యూల్ ప్రారంభిస్తాం. అక్టోబర్‌లో రిలీజ్ ప్లాన్ చేస్తున్నాం’’ అన్నారు. ‘‘కథ చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. వైజాగ్, కులుమనాలిలో ఓ షెడ్యూల్ చేస్తాం’’ అన్నారు నిర్మాతలు. ఈ చిత్రానికి కెమెరా: ఈదర ప్రసాద్, సంగీతం: నవనీత. -
రకుల్ సోదరుడు అమన్ కొత్త చిత్రం ప్రారంభం
-
ప్యాషన్ ఉంటేనే ఇండస్ట్రీలోకి రావాలి – రకుల్ ప్రీత్‌సింగ్
ప్రముఖ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ కథానాయకుడిగా పరిచయమవుతున్నారు. దాసరి లారెన్స్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో మోనికా శర్మ కథానాయికగా నటిస్తున్నారు. షేక్ షావలి సమర్పణలో రజిని ఫిలిం కార్పొరేషన్ పతాకంపై మావురం రజిని నిర్మిస్తున్న కొత్త చిత్రం ఆదివారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి హీరో సందీప్ కిషన్ కెమెరా స్విచ్చాన్ చేయగా, రకుల్ ప్రీత్‌సింగ్ క్లాప్ ఇచ్చారు. నటి మంచు లక్ష్మి గౌరవ దర్శకత్వం వహించారు. రకుల్ ప్రీత్ సింగ్ మాట్లాడుతూ– ‘‘నా సోదరుడు అమన్ హీరోగా సినిమా ప్రారంభం కావడం ఎంతో ఆనందంగా ఉంది. రెండేళ్ల క్రితం నాకు హీరో కావాలనుందని చెప్పగానే.. ప్యాషన్ ఉందా? ఉంటేనే ఇండస్ట్రీలోకి రావాలి అన్నాను. ఎంతో పట్టుదలగా తెలుగు నేర్చుకుని తన ప్యాషన్ ఏంటో చూపించాడు’’ అన్నారు. ‘‘లవ్, యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కనున్న చిత్రమిది. అమన్ పాత్ర ఆసక్తికరంగా సాగుతుంది. కథలో భాగంగా మంచి కామెడీ ఉంటుంది. మార్చి మొదటి వారంలో తొలి షెడ్యూల్ షూటింగ్ ప్రారంభం కానుంది’’ అని దాసరి లారెన్స్ అన్నారు. ‘‘సంతోషంతో మాటలు రావడం లేదు. చాలా నెర్వస్‌గా, టెన్షన్‌గా ఉంది. తెలుగులో హీరోగా ఎంట్రీ ఇస్తుండటం వెరీ హ్యాపీ’’ అన్నారు అమన్. ‘‘మార్చి ఫస్ట్ వీక్‌లో మా సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేస్తాం’’ అని మావురం రజిని అన్నారు. నటుడు రావు రమేష్, మోనికా శర్మ పాల్గొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: జి.ఎల్.ఎన్.బాబు, సంగీతం: మోహిత్ రెహమానిక్, సహ నిర్మాత: పి.వెంకటేశ్వర్లు. -
ప్రారంభమైన రకుల్ సోదరుడి సినిమా
ప్రముఖ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ కథానాయకుడిగా దాసరి లారెన్స్ దర్శకత్వంలో సినిమా ప్రారంభమైంది. ఈ సినిమాను షేక్ షా వలి సమర్పణలో రజిని ఫిలిం కార్పొరేషన్ పతాకంపై మావురం రజిని నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఆదివారం అన్నపూర్ణ స్టూడియోలో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి రకుల్ ప్రీత్ సింగ్ క్లాప్ కొట్టగా, హీరో సందీప్ కిషన్ కెమెరా స్విచ్ఛాన్ చేశారు. మంచు లక్ష్మి గౌరవ దర్శకత్వం వహించారు. ఈ ప్రారంభోత్సవ వేడుకలో విలక్షణ నటుడు రావు రమేష్ సహా చిత్ర యూనిట్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన పాత్రికేయ సమావేశంలో... రకుల్ ప్రీత్ సింగ్ మాట్లాడుతూ ‘నా సోదరుడు అమన్ హీరోగా సినిమా ప్రారంభం కావడం ఎంతో ఆనందంగా ఉంది. రెండేళ్ల క్రితం తనకు హీరో కావాలనుందని చెప్పగానే.. ప్యాషన్ ఉందా? ఉంటేనే ఇండస్ట్రీలోకి రావాలని తనతో అన్నాను. తను ప్యాషన్ ఉందని చెప్పాడు. ఎంతో పట్టుదలగా తెలుగు నేర్చుకుని తన ప్యాషన్ ఏంటో చూపించాడు. నాకు హైదరాబాద్ హోం టౌన్ ఎలా అయ్యిందో.. అమన్‌కు కూడా ఇప్పుడు హైదరాబాద్ హోం టౌన్‌లా మారింది. తను మంచి హీరోగా పేరు తెచ్చుకుంటాడని భావిస్తున్నాను’ అన్నారు. దర్శకుడు దాసరి లారెన్స్ మాట్లాడుతూ ‘లవ్, యాక్షన్ ఎంటర్టైనర్ కథాంశంతో రూపొందే సినిమాలో అమన్ హీరోగా పరిచయం అవుతున్నారు. తన పాత్ర ఆసక్తికరంగా సాగుతుంది. మంచి కామెడీ కథలో భాగంగా ఉంటుంది. మార్చి మొదటి వారంలో తొలి షెడ్యూల్ షూటింగ్ ప్రారంభం కానుంది’ అన్నారు. హీరో సందీప్ కిషన్ మాట్లాడుతూ ‘అమన్ నాకు తమ్ముడితో సమానం. తను పెద్ద హీరోగా ఎదగాలని కోరుకునే వాళ్లలో నేను ముందుంటాను. తను హీరోగా ఎంట్రీ ఇవ్వాలనుకుంటున్నాడని ఏడాదిన్నర క్రితం తెలిసింది. తను అందుకు తగ్గట్టు కష్టపడ్డాడు. తెలుగు భాష నేర్చుకుని సినిమా చేయబోతుండటం గొప్ప విషయం’ అన్నారు. హీరో అమన్ మాట్లాడుతూ ‘సంతోషంతో మాటలు రావడం లేదు. చాలా నెర్వస్‌గా, టెన్షన్‌గా ఉంది. తెలుగులో హీరోగా ఎంట్రీ అవుతుండటం చాలా సంతోషంగా ఉంది. మంచి కథ, స్క్రీన్‌ప్లేతో దర్శకుడు దాసరి లారెన్స్‌గారు చెప్పిన విధానం నచ్చింది. అందరికీ నచ్చుతుంది. అలాగే నిర్మాత రజినిగారికి థాంక్స్’ అన్నారు. హీరోయిన్ మోనికా శర్మ మాట్లాడుతూ ‘చాలా మంచి పాత్ర చేస్తున్నాను. నా నిజ జీవితానికి దగ్గరగా ఉండే హ్యపీ అండ్ లక్కీ అమ్మాయి పాత్రలో మెప్పిస్తాను. అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్’ అన్నారు. -
హీరోగా ఎంట్రీ ఇస్తున్న రకుల్ సోదరుడు
ఇండస్ట్రీలో వారసుల ఎంట్రీ కామనే. అయితే ఎక్కువగా హీరోల సోదరులు, కుమారులు వారసులుగా ఎంట్రీ ఇస్తుంటారు. తాజాగా ఓ హీరోయిన్ కూడా తన వారసుణ్ని వెండితెరకు పరిచయం చేస్తున్నారు. తెలుగు, తమిళ్‌తో పాటు బాలీవుడ్‌లోనూ హీరోయిన్గా ఆకట్టుకుంటున్న రకుల్ ప్రీత్ సింగ్ తన సోదరుడు అమన్‌ను హీరోగా లాంచ్ చేస్తున్నారు. రాజానే ఫిలిం కార్పోరేషన్ నిర్మాణంలో దాసరి లారెన్స్ దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమాతో అమన్ సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇవ్వనున్నాడు. ఇప్పటికే రాక్ అండ్ రోల్ అనే షార్ట్ ఫిలింలో నటించిన అమన్, హీరోగా ఏ మేరకు ఆకట్టుకుంటాడో చూడాలి. ఆదివారం ఉదయం పది గంటలకు అమన్ హీరోగా తెరకెక్కనున్న సినిమా అన్నపూర్ణ స్టూడియోస్‌లో లాంచనంగా ప్రారంభమవుతుంది.