Rakul Preet Singh Reacts On Her Marriage Rumours, Deets Inside - Sakshi
Sakshi News home page

Rakul Preet Singh: త్వరలోనే రకుల్‌ పెళ్లి.. ‘నాక్కుడా చెప్పాలి కదా బ్రో’అంటూ హీరోయిన్‌ ట్వీట్‌

Published Thu, Oct 13 2022 12:08 PM | Last Updated on Thu, Oct 13 2022 1:06 PM

Rakul Preet Singh Responds On Her Marriage - Sakshi

ఒకప్పుడు టాలీవుడ్‌లో వరుస సినిమాలతో దూసుకెళ్లిన స్టార్‌ హీరోయిన్‌ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌.. ప్రస్తుతం తెలుగు తెరకు కాస్త దూరంగా ఉంటుంది. ‘కొండపొలం’ తర్వాత ఆమె తెలుగు తెరపై కనిపించలేదు. దీంతో రకుల్‌ ఇక టాలీవుడ్‌లో సినిమాల్లో నటించదా? అని అభిమానులు చర్చించుకుంటున్నారు. అయితే తాను మాత్రం కచ్చితంగా మళ్లీ టాలీవుడ్‌ సినిమాల్లో నటిస్తానని చెబుతోంది రకుల్‌. త్వరలోనే తెలుగు తెరపై సందడి చేస్తానని, టాలీవుడ్‌ ప్రేక్షకుల ప్రేమను ఎట్టి పరిస్థితుల్లో మిస్‌ చేసుకొనని చెబుతోంది. 

(చదవండి: అది మన దురదృష్టం..మనుషుల్లో అది కూడా ఒక భాగమే)

ఇదిలా ఉంటే.. త్వరలోనే రకుల్‌ పెళ్లి చేసుకోబోతుందనే వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. బాలీవుడ్‌ నటుడు, నిర్మాత జాకీ భగ్నానీతో రకుల్‌ ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. వీరిద్దరు త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారంటూ రకుల్‌ ప్రీత్‌ తమ్ముడు అమన్‌ ప్రీత్‌ చెప్పినట్లు ఓ జాతీయ పత్రికలో వార్తలు వచ్చాయి. దీనిపై రకుల్‌ కాస్త వ్యంగ్యంగా స్పందించింది.

‘అమన్‌.. నా పెళ్లి గురించి నిజంగానే నువ్వు క్లారిటీ ఇచ్చావా? నా పెళ్లి గురించి నాక్కూడా చెప్పాలి కదా బ్రో..! నా జీవితం గురించి నాకే తెలియకపోవడం హాస్యాస్పదంగా ఉంది’అని రకుల్‌ ట్వీట్‌ చేసింది. కాగా, రకుల్‌ నటించిన బాలీవుడ్‌ చిత్రం ‘డాక్టర్‌ జీ’ ఈ నెల 14న విడుదల కాబోతుంది. ప్రస్తుతం ‘థ్యాంక్‌ గాడ్‌, ఛత్రివాలి, ఇండియన్‌-2 చిత్రాల్లో నటిస్తోంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement