రకుల్ ప్రీత్ సింగ్ టాలీవుడ్ అభిమానులకు పరిచయం అక్కర్లేని పేరు. కెరటం సినిమాతో ఎంట్రీ ఇచ్చిన దిల్లీ భామ తెలుగులో స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. టాలీవుడ్ వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ మూవీతో అభిమానుల్లో పేరు సంపాదించుకుంది. ఆ తర్వాత లౌక్యం, కరెంటు తీగ, కిక్ -2, సరైనోడు, నాన్నకు ప్రేమతో, ధృవ, స్పైడర్ సినిమాల్లో స్టార్ హీరోలతో నటించింది. అయితే గత రెండేళ్లుగా బాలీవుడ్‌కు మకాం మార్చింది. అక్కడ అటాక్, రన్ వే -34, ఛత్రీవాలీ, ఐ లవ్ యూ లాంటి సినిమాలు చేసింది.
అయితే గత కొన్నాళ్లుగా నటుడు-నిర్మాత జాకీ భగ్నానీతో ప్రేమాయణం కొనసాగిస్తోంది ముద్దుగుమ్మ. ఇప్పటికే ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకుంది. ఇక త్వరలోనే అతన్ని పెళ్లి చేసుకొని కొత్త జీవితంలోకి అడుగుపెట్టబోతోంది భామ. ఈ జంట తమ వివాహా వేడుక కోసం డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేశారు. విదేశాల్లో పెళ్లి చేసుకోవాలని ఇప్పటికే నిర్ణయించుకున్నారు.
గోవాకు మారిన వెడ్డింగ్..
అయితే రకుల్ ప్రీత్ సింగ్ సడన్‌గా యూ టర్న్ తీసుకుంది. తన పెళ్లి కోసం విదేశాలకు వెళ్లడం లేదని తెలుస్తోంది. పెళ్లి వేదికను ఇండియాలోని గోవాకు మార్చుకుంది. ఫిబ్రవరి 22న వీరిద్దరి వివాహా వేడుక గోవాలో జరగనుంది. అయితే చివరి నిమిషంలో లొకేషన్‌ను ఇండియాకు మార్చడానికి నిర్ణయం తీసుకోవడానికి అదే కారణమా అంటూ నెటిజన్స్ తెగ చర్చించుకుంటున్నారు. అదేంటో తెలుసుకుందాం.
మోదీ పిలుపే కారణమా?
రకుల్ ప్రీత్ సింగ్, జాకీ భగ్నాని మొదట్లో విదేశాల్లో డెస్టినేషన్ వెడ్డింగ్‌ని ప్లాన్ చేశారు. కానీ సడన్‌గా ఈ నిర్ణయం మార్చుకోవడం వెనుక మన ప్రధాని మోదీనే కారణమని వార్త నెట్టింట వైరలవుతోంది. ఎందుకంటే గతేడాది డిసెంబర్‌లో ధనిక, వ్యాపార, సెలబ్రిటీల కుటుంబాలు తమ పెద్ద పెద్ద ఈవెంట్లకు భారతదేశాన్ని వేదికగా ఎంచుకోవాలని పీఎం పిలుపునిచ్చారు. అందువల్లే రకుల్, జాకీ విదేశాల్లో డెస్టినేషన్ వెడ్డింగ్ ఆలోచనను విరమించుకున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఇటీవలే లక్షద్వీప్ వెళ్లిన మోదీ చేసిన ఫొటోషూట్ తర్వాత మాల్దీవుల మంత్రులు చేసిన కామెంట్స్‌తో వివాదం మొదలైంది. ఆ తర్వాత చాలామంది సెలబ్రిటీలు అక్కడి వెకేషన్లను సైతం రద్దు చేసుకున్న సంగతి తెలిసిందే.
కాగా.. ఇటీవలే ఈ జంట ముంబైలోని రామమందిరంలో ప్రార్థనలు చేశారు. ఈ విషయాన్ని తమ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పంచుకున్నారు. గోవాలో ఫిబ్రవరి 22న జరగబోయే వీరి వివాహానికి బాలీవుడ్‌తో పాటు సౌత్ ఇండస్ట్రీకి చెందిన సన్నిహితులు హాజరుకానున్నారు.
Comments
Please login to add a commentAdd a comment