
టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ గతేడాది వివాహాబంధంలోకి అడుగుపెట్టింది. తన ప్రియుడు, నిర్మాత అయిన జాకీ భగ్నానీని పెళ్లాడింది ముద్దుగుమ్మ. గతేడాది ఫిబ్రవరి 2024లో గోవాలో ఓ ప్రైవేట్ వేడుకలో వీరి పెళ్లి వేడుక జరిగింది. ఈ గ్రాండ్ వెడ్డింగ్‌లో సన్నిహితులు, కుటుంబ సభ్యులు, స్నేహితులు పాల్గొన్నారు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన రకుల్ ప్రీత్ సింగ్ ఆసక్తికర విషయాలు పంచుకుంది. ముఖ్యంగా తన పెళ్లికి సంబంధించిన మధురమైన జ్ఞాపకాలను షేర్ చేసుకుంది. మీ పెళ్లిని ఎందుకు ప్రైవేట్‌గా ఉంచారన్న ప్రశ్నపై రకుల్ స్పందించింది.
రకుల్ ప్రీత్ సింగ్ మాట్లాడుతూ..'మేము ఎల్లప్పుడూ చాలా సింపుల్‌గా ఉండాలని కోరుకుంటా. మేము సౌకర్యంగానే ఉండటానికి ఇష్టపడతాం.. కానీ ఎక్కువ లగ్జరీగా ఉండాలని ఎప్పుడూ కోరుకోలేదు. అన్నిటికంటే ఎక్కువగా ఆ మధురమైన క్షణాలు, సంతోషంగా ఉండేందుకే ఎక్కువ విలువ ఇస్తాం. అందుకే మా పెళ్లిని అతిథులతో కలిసి ఆస్వాదించాలనుకున్నాం. ఆ మూడు రోజులు మా జీవితంలో గుర్తుండిపోవాలని ఆశించాం. అందువల్లే నో-ఫోన్ పాలసీ పెట్టాం. అంతే తప్ప ఫోటోలు లీక్ చేస్తారని కాదు. మా పెళ్లి చిత్రాలను మేమే మొదట బయట పెట్టాలకున్నాం. అలాగే పెళ్లిలో డ్యాన్స్ చేస్తూ ఎంజాయ్ చేశాం. నా పెళ్లి దుస్తుల్లో కూడా డ్యాన్స్ చేశాను.' అని తెలిపింది. కాగా.. రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం మేరే హస్బెండ్ కి బివి చిత్రంలో కనిపించనుంది. ఈ చిత్రంలో అర్జున్ కపూర్, భూమి పెడ్నేకర్ నటించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఫిబ్రవరి 22న విడుదల కానుంది.
Comments
Please login to add a commentAdd a comment