
రకుల్ ప్రీత్ సింగ్ టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. తెలుగులో స్టార్ హీరోల సరసన మెప్పించింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ భారతీయుడు-2 మూవీతో ప్రేక్షకుల ముందుకు రానుంది. కమల్ హాసన్- శంకర్ కాంబోలో వస్తోన్న ఈ చిత్రంలో కీలక పాత్రలో కనిపించనున్నారు. తాజాగా మూవీ ప్రమోషన్లలో భాగంగా సోషల్ మీడియా వేదికగా అభిమానులతో ముచ్చటించారు.
అయితే వారిలో ఒకరు రకుల్‌కు ఆసక్తికర ప్రశ్న వేశారు. మీ పెళ్లి ఎప్పుడు అని హీరోయిన్‌ను ప్రశ్నించాడు. దీంతో అతని ప్రశ్నకు షాక్‌కు గురైంది ముద్దుగుమ్మ. దీనిపై స్పందిస్తూ.. పెళ్లి ఎన్ని సార్లు చేసుకోవాలి? అంటూ ఫన్నీగా రిప్లై ఇచ్చారు. కాగా.. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆమె వివాహ బంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ నిర్మాత జాకీ భగ్నానీని రకుల్ పెళ్లాడింది. తన పెళ్లి వేడుక ఫొటోను షేర్ చేస్తూ నెటిజన్‌కు రకుల్ సమాధానమిచ్చింది. ప్రస్తుతం వీరిద్దరి సంభాషణ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Comments
Please login to add a commentAdd a comment