పెళ్లి బంధంలోకి అడుగుపెట్టిన కోహ్లీ.. రకుల్‌ ప్రీత్ సింగ్‌తో మొదటి సినిమా! | Actor Himansh Kohli Married FIRST Photos From Wedding Goes Viral | Sakshi
Sakshi News home page

Himansh Kohli: పెళ్లి చేసుకున్న కోహ్లీ.. రకుల్‌ ప్రీత్ సింగ్‌తో మొదటి సినిమా!

Published Tue, Nov 12 2024 8:01 PM | Last Updated on Tue, Nov 12 2024 8:21 PM

Actor Himansh Kohli Married FIRST Photos From Wedding Goes Viral

ప్రముఖ బాలీవుడ్ నటుడు హిమాన్షు కోహ్లీ వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ఢిల్లీలోని ఓ ఆలయంలో ఆయన పెళ్లి వేడుక ఘనంగా జరిగింది. తన పెళ్లికి సంబంధించిన ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు హిమాన్ష్ కోహ్లీకి కంగ్రాట్స్ చెబుతున్నారు.అయితే చిన్ననాటి స్నేహితురాలైన బంధువుల అమ్మాయినే పెళ్లాడినట్లు తెలుస్తోంది. కోహ్లి తన పెళ్లికి సంబంధించిన ఫోటోలు షేర్ చేస్తూ మీ అందరీ దీవెనలు పుష్కలంగా ఉన్నాయని రాసుకొచ్చాడు.

అంతకుముందు ప్రీ వెడ్డింగ్‌ వేడుకలను గ్రాండ్‌గా నిర్వహించారు.  మెహందీ వేడుకకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరలయ్యాయి. ఈ వేడుకల్లో హిమాన్ష్ కోహ్లీ కూడా డ్యాన్స్‌ చేస్తూ కనిపించారు.

కాగా.. హిమాన్ష్ కోహ్లీ మొదటి హమ్‌ సే లైఫ్ సీరియల్‌తో కెరీర్ ప్రారంభించాడు. ఆ తర్వాత రకుల్ ప్రీత్‌ సింగ్‌తో యారియాన్‌ అనే చిత్రంలో నటించారు. ఈ సినిమాతోనే హిమాన్ష్ బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. ఈ చిత్రానికి దివ్య ఖోస్లా కుమార్ దర్శకత్వం వహించారు. హిమాన్ష్ ప్రస్తుతం జూలియా అండ్ కలియా చిత్రంలో కనిపించనున్నారు

నేహా కక్కర్‌తో డేటింగ్..

కాగా.. హిమాన్ష్ గతంలో బాలీవుడ్ సింగర్‌ గాయని నేహా కక్కర్‌తో రిలేషన్‌షిప్‌లో ఉన్నారు. ఇండియన్ ఐడల్ 10 సందర్భంగా తమ రిలేషన్‌ను అధికారికంగా ప్రకటించారు. దాదాపు ఏడాది పాటు డేటింగ్‌లో ఉన్న వీరిద్దరు డిసెంబర్ 2018లో విడిపోయారు.  ఆ తర్వాత నేహా.. రోహన్‌ప్రీత్ సింగ్‌ను వివాహం చేసుకుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement