
Rakul Preet Singh Full Information About Her Relationship With Jackky Bhagnani: బాలీవుడ్ హీరో, నిర్మాత జాకీ భగ్నానితో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ప్రేమలో మునిగితేలుతున్న సంగతి తెలిసిందే. చాలా కాలం పాటు సీక్రెట్ డేటింగ్ చేసిన వీరిద్దరూ ఈ ఏడాది తమ రిలేషన్‌ను సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించారు. ఎట్టకేలకు తన రిలేషన్‌ను బయటకు రీవిల్ చేయడంలో అందరూ రకుల్-జాకీ భగ్నానీ పెళ్లి చేసుకోబోతున్నారంటూ ప్రచారం మొదలు పెట్టారు. ఇదిలా ఉంటే తమ రీలేషన్‌ను ప్రకటించినప్పటి నుంచి రకుల్ కానీ, జాకీ కానీ ఇంతవరకు మీడియా ముందుకు రాలేదు.
చదవండి: మరో వివాదంలో హీరో సిద్ధార్థ్, మహిళా కమిషన్ ఎంట్రీ
అంతేకాదు వీరిద్దరూ కలిసి విందులు వినోదాలకు వెళ్లినట్లు ఎక్కడ కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో తొలిసారి మీడియాతో రకుల్ తన ప్రేమ, పెళ్లిపై ప్రస్తావించింది. తాజాగా ఓ ఇంటర్య్వూలో నేరుగా స్పందిస్తూ తను, జాకీ భగ్నానీ ప్రేమలో ఉన్నామంటూ రకుల్ ఫుల్ క్లారిటీ ఇచ్చింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘మేమిద్దరం చాలా కాలంగా డేటింగ్‌లో ఉన్నాం. నా జీవితంలో జాకీతో పరిచయం, ప్రేమ అద్భుతమైన ఫేజ్. మా ప్రేమ గురించి మా ఇంటి సభ్యులకు, స్నేహితులందరికీ తెలుసు. ఇద్దరిది ఒకే రంగం. మా ఆహారపు ఆలవాట్లు కూడా ఒకేలా ఉంటాయి.
చదవండి: ఒంటరిగా ఉండటం నచ్చడం లేదు.. షాకింగ్ న్యూస్ చెప్పిన నటి
ఆరోగ్యకరమైన ఆహారాన్ని స్వీకరించడానికే నాలాగే, జాకీ కూడా ప్రాధాన్యత ఇస్తాడు. మా ఇద్దరికీ కూడా కుటుంబాలు చాలా ముఖ్యం.అయితే ఇప్పట్లో మేము పెళ్లి చేసుకునే అవకాశం లేదు. ఎందుకంటే ప్రస్తుతం నేను పలు ప్రాజెక్ట్స్ ఫుల్ బిజీగా ఉన్నా. వాటిని పూర్తి చేసిన తర్వాతే పెళ్లి’ అంటూ రకుల్ చెప్పుకొచ్చింది. ఇక తన ప్రేమ గురించి అందరికీ తానే చెప్పానని, పెళ్లి గురించి కూడా అందరికీ తానే చెపుతానంది. అంతేకానీ ఎవరికి తెలియకుండా మాత్రం పెళ్లి చేసుకొనని చెప్పింది. ఇప్పటికైన తమ పెళ్లిపై ఎలాంటి రూమర్లు సృష్టించవద్దంటూ రకుల్ వ్యాఖ్యానించింది.
Comments
Please login to add a commentAdd a comment