రకుల్ ప్రీత్ సింగ్ తెలుగువారికి పరిచయం అక్కర్లేని పేరు. అగ్ర హీరోలతో పాటు చాలా చిత్రాల్లో నటించింది. అయితే ఇటీవలే ఓ ఇంటర్వ్యూకు హాజరైన ముద్దుగుమ్మ సినీరంగంపై ఆసక్తికర కామెంట్స్ చేసింది. సినిమా బయట వాళ్లకి అందమైన ప్రపంచం అందులోకి దిగితేనే లోతు ఎంతనేది తెలుస్తుందని అన్నారు. ఈ రంగంలో రాణించడం అంత సులభం కాదు.. ముఖ్యంగా నటీమణులు ఎన్నో అగాధాలను అధిగమించిన తర్వాతే అందమైన సినిమా లోకాన్ని అనుభవించడం సాధ్యమవుతుందన్నారు. తన పరిస్థితి అలాంటిదే అని నటి రకుల్‌ప్రీత్‌సింగ్ పేర్కొంది.
కోలీవుడ్‌లో తడయార చిత్రంతో ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత ఎన్నమో ఏదో, ధీరన్ అధికారం ఒండ్రు, దేవ్, ఎన్‌జీకే చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం శివకార్తికేయన్‌కు జంటగా అయిలాన్, కమలహాసన్ కథానాయకుడిగా ఇండియన్–2 చిత్రాల్లో నటిస్తోంది. వీటిలో అయిలాన్ చిత్రం సంక్రాంతికి తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది.
(ఇది చదవండి: 'బిగ్‌బాస్ 7' ఫస్ట్ కెప్టెన్‌గా రైతుబిడ్డ.. కానీ అతడిని గాయపరిచాడు!)
దక్షిణాదిలో అగ్రకథానాయకగా రాణిస్తున్న రకుల్‌ప్రీత్‌సింగ్ సినిమాలో నటిగా ఎదగడానికి చాలా కష్టాలు ఎదుర్కొన్నట్టు ఇంటర్వ్యూలో పేర్కొంది. అందులో చిన్న తనంలోనే సినీ రంగప్రవేశం చేయాలని కలలు కన్న అమ్మాయినని పేర్కొంది. అయితే సినిమా ఇండస్ట్రీ గురించి ఏమి తెలియని రోజుల్లో మోడలింగ్ రంగంలోకి ప్రవేశించాను. ఆ తర్వాత మిస్ ఇండియా పోటీలు, అలా గట్టిగా రంగప్రవేశం చేసినట్లు చెప్పింది.
చాలామంది మాదిరిగానే ఈ రంగంలో ఉన్న ఎత్తుపల్లాలను, నిరాకరింపులను చవి చూశానని చెప్పింది. సినిమాల్లో నటించాలన్న బలమైన కోరిక కారణంగా తల్లిదండ్రులను వదిలి ముంబయికి చేరుకుని ఒంటరి జీవితాన్ని ప్రారంభించినట్లు తెలిపింది. అదే తాను ధైర్యంగా తీసుకున్న నిర్ణయం అని పేర్కొంది. ఆదిలో అందరి మాదిరిగానే ఆ విషయం కోసం క్యూలో నిలబడి అవకాశాల కోసం కాస్టింగ్ ఏజెంట్‌లకు, దర్శకులకు ఫోన్ చేసేదానని చెప్పింది. అలా ఎంపికైన చిత్రాల్లో చివరికి వేరే వాళ్లు నటించిన అనుభవాలు ఎన్నో ఉన్నాయని తెలిపింది. పయనంలో ఎదురైన సమస్యలు తనకు మంచి పాఠాన్ని నేర్పించాలని కుటుంబ ప్రోత్సాహం లేకపోతే తానీ స్థాయికి చేరుకోవడం సాధ్యం కాదని అంటోది రకుల్ ప్రీత్ సింగ్.
(ఇది చదవండి: టీడీపీ సత్యనారాయణపై నటి రాధిక సీరియస్.. మంత్రి రోజాకు మద్దతు)
Comments
Please login to add a commentAdd a comment