ఆధ్యాత్మిక బాటలో రకుల్ ప్రీత్ సింగ్.. పెళ్లి తర్వాత తొలిసారిగా! | Rakul Preet Singh Visits Temples After Marriage With Bhagnani, Pictures Goes Viral On Social Media- Sakshi
Sakshi News home page

Rakul Preet Singh Latest Photo: ఫ్యామిలీతో కలిసి ఆలయాన్ని సందర్శించిన రకుల్ ప్రీత్..!

Published Thu, Mar 7 2024 3:57 PM | Last Updated on Thu, Mar 7 2024 4:45 PM

Rakul Preet Singh Visits Temples After Marriage With Bhagnani goes Viral - Sakshi

టాలీవుడ్ హీరోయిన రకుల్ ప్రీత్ సింగ్ ఇటీవలే వివాహాబంధంలోకి అడుగుపెట్టింది. నటుడు, నిర్మాత  అయిన తన ప్రియుడు జాకీ భగ్నానీతో ఏడడుగులు వేసింది. గోవాలో జరిగిన వీరి పెళ్లికి పలువురు సినీ తారలు కూడా హాజరయ్యారు. ఫిబ్రవరి 21 వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఆనంద్‌ కరాజ్‌ అనే పంజాబీ సాంప్రదాయ పద్ధతిలో వీరి పెళ్లిబంధంతో ఒక్కటయ్యారు. వరుడి సాంప్రదాయం ప్రకారం సింధి పద్ధతిలోనూ ముచ్చటగా పెళ్లి చేసుకున్నారు.

అయితే పెళ్లి తర్వాత రకుల్, భగ్నానీ జంట బిజీగా మారిపోయింది. తన భర్తతో కలిసి ఆధ్యాత్మిక బాట పట్టింది. కుటుంబసభ్యులతో పాటు దేవుళ్ల ఆశీర్వాదాలు తీసుకుంటోంది. తాజాగా అస్సాం గువహటిలోని కామాఖ్య దేవి అమ్మవారిని రకుల్ దర్శించుకున్నారు. కొత్త జీవితం ప్రారంభించిన నూతన దంపతులు అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. తాజాగా దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement