Kamakhya Temple
-
మహిమాన్వితమైన శక్తిపీఠం..కామాఖ్యాలయం..!
శాక్తేయులకు అత్యంత ఆరాధనీయమైనది కామరూప లేదా కామాఖ్యాదేవి ఆలయం. ఇక్కడే దశమహావిద్యలనే పేరు గల కాళి, తార, భువనేశ్వరి, బగళాముఖి, ఛిన్నమస్త, భైరవి, ధూమావతి, కమలాంబిక, షోడశి, మాతంగి అనే పది వేర్వేలు ఆలయాలున్నాయి. ఒక్కో ఆలయమూ ఒక్కో విద్యకు ప్రసిద్ధమైనది. ప్రధాన ఆలయం కామాఖ్యాలయమే. సతీదేవి ఆత్మత్యాగానంతరం తీవ్రమైన వేదనతో తపస్సమాధిలో లీనమై ఉన్న పరమేశ్వరుని మనస్సును మార్చాలని దేవతలు సంకల్పిస్తారు. ఇందులో భాగంగా మన్మథుడు సమయం చూసుకుని, పూలబాణాలు వేసి, ఆయనకు తపోభంగం కలిగిస్తాడు. దాంతో ముక్కంటి తన మూడవకంటిని తెరచి మన్మథుణ్ణి మసి చేస్తాడు. మన్మథుడికే కాముడు అనే పేరు. కాముణ్ణి దహించిన ప్రదేశం కనుక దీనికి కామాఖ్య అనే పేరొచ్చిందంటారు. ఆ తర్వాత అమ్మవారి అనుగ్రహంతో మన్మథుడు తిరిగి రూపాన్ని పొందాడు. అయితే కేవలం ఆయన భార్య రతీదేవికి మాత్రమే రూపంతో కనిపిస్తాడు. ఇక్కడి బ్రహ్మపుత్రానదిలో భస్మకూటమనే పర్వతం ఉండటం శివుడు మన్మథుని భస్మం చేయడం, తిరిగి ఆయన రూపం పొందాడనడానికి ప్రతీకగా నిలుస్తుంది.ప్రత్యేకతలకు ఆలవాలం... ఎనిమిదవ శతాబ్దంలో నిర్మించినదిగా భావిస్తున్న ఈ ఆలయం 16వ శతాబ్దంలో అన్యమతస్థుల దాడుల్లో ధ్వంసం కాగా, 17వ శతాబ్దంలో కుచ్ బీహార్ రాజు నరనారాయణుడు పునర్నిర్మించాడని శాసనాధారాలున్నాయి. తేనెపట్టు ఆకారంలో ఉన్న ఆలయ శిఖరం గణేశుడు తదితర దేవీ దేవతల శిల్పాలతో కనువిందు చేస్తుంది. మాంత్రికులకు, తాంత్రికులకు, వామాచారులకు, క్షుద్రపూజలు చేసేవారికి ఈ ఆలయమే ఆధారం.కారణం ఇది సతీదేవి యోని భాగం పడిన ప్రదేశం. మూడు మంటపాలుగా నిర్మించి ఉంటుంది. అందులో మొదటి ప్రాకారంలో గుహలా ఉండే గర్భాలయంలో యోనిచిహ్నం ఉన్న నల్లటి బండరాయి ఉంటుంది. దానికే పూజలు జరుగుతాయి.అయితే ఆ రూపం కనిపించకుండా భక్తుల దర్శనానికి ముందే పూలతో నింపేస్తారు. ఆ గుహ లోపల రాతి మీద ఎప్పుడూ జల వూరుతూ ఉంటుంది. అందువల్ల మూలవిరాట్టు ఎప్పుడూ తడిగా ఉంటుంది. గర్భాలయం అంతా చిత్తడిగా, జారుడుగా ఉంటుంది. ఆలయం బయటే శీతలాదేవి సన్నిధి ఉంటుంది. దీర్ఘవ్యాధులు ఉన్నవారు ఈమెను సేవించుకుంటే వాటినుంచి విముక్తి కలుగుతుందని ప్రతీతి. పూజలు– ఉత్సవాలు... అమ్మవారికి రోజూ చేసే పూజలు గాక దేవీ నవరాత్రులలో ప్రత్యేకంగా దుర్గాపూజ జరిపిస్తారు. ఇవిగాక ఫాల్గుణ మాసంలో దుర్గాడియుల్ అని దుర్గాదేవికి ప్రత్యేక పూజ ఉంటుంది. అదేవిధంగా మానసాపూజ, పోహన్ బియా అంటే పుష్యమాసంలో కామేశ్వరుడికీ, కామేశ్వరీదేవికీ కల్యాణం జరిపిస్తారు. పసిపిల్లవానికి పాలు ఇస్తున్నట్లుగా ఉండే విగ్రహం పశ్చిమ ద్వారాన ఉంటుంది. అమ్మవారు భక్తులను ఎల్లప్పుడూ కన్నతల్లిలా కాపాడుతూ ఉంటుందని చెప్పేందుకు ప్రతీక ఇది. ఈ ఆలయంలో అమ్మవారు సంవత్సరానికి ఒకసారి జూన్ రెండవవారంలో బహిష్టు అవుతారు. స్థానికులు దీనిని అంబుబాషి సమయం అంటారు. ఈ నాలుగురోజులపాటు ఆలయాన్ని మూసి ఉంచి, అయిదోరోజున తలుపు తెరుస్తారు. అంబుబాషి రోజులలో అమ్మవారి ఆలయంతోపాటు మిగతా ఆలయాలన్నిటినీ కూడా మూసి ఉంచుతారు. గౌహతి నుంచి సుమారు 40 కిలోమీటర్ల దూరంలో చట్టగామ్లో శీతకుండం దగ్గర గల చంద్రశేఖర పర్వతంపై భగవతి అమ్మవారి ఆలయం ఉంది. కుండం లో నిత్యం అగ్ని ప్రజ్వరిల్లే శక్తి పీఠం ఇది. నరకాసురుడు కామాఖ్యాదేవిని ఆరాధించటం వల్లే అంతటి బలపరాక్రమాలు పొందగలిగాడని పెద్దలు చెబుతారు. అమ్మవారు, పరమేశ్వరుడు ఇక్కడ నిత్యం కామకేళిలో తేలియాడుతుంటారని, అందువల్లే అమ్మవారికి కామాఖ్య అనే పేరు వచ్చిందని చెబుతారు. అలాగే శివపార్వతులు ప్రతిరోజూ రాత్రిపూట ఆలయం అంతర్భాగంలో సర్పాల రూపంలో జూదం ఆడుతుంటారని విశ్వాసం. ఈ క్షేత్రంలోనే మరో ఐదు శైవాలయాలున్నాయి. అవి అఘోరేశ్వర, అమృతేశ్వర, కోటిలింగేశ్వర, సిద్ధేశ్వర, కామేశ్వరాలయాలు.కామాఖ్యలో ఇంకా ఏమేం చూడవచ్చు..?కామాఖ్యాలయం నీలాచలం కొండలపై ఉందని తెలుసుకదా, అక్కడే భువనేశ్వరీ ఆలయం, వనదుర్గాలయం ఉన్నాయి. పైన చెప్పుకున్న ఐదు శివాలయాలూ, దశమహావిద్యలకూ సంబంధించిన ఆలయాలూ ప్రధానాలయానికి చేరువలోనే ఉంటాయి. ఇవిగాక శుక్లేశ్వర కొండలపై జనార్దనాలయం, లక్ష్మీమందిరం, గ్రామదేవతా మందిరం, చక్రేశ్వరాలయం, విశ్వకర్మ మందిరం, కాళీపురంలో శివమందిరం, మహావీర్ అక్రాలయం, శని మందిరం, గోపాల మందిరం, కాళీమందిరం, హనుమాన్ మందిరం ఉన్నాయి. ఇంకా లోకనాథాలయం, శీతలామందిరం, నామ్ ఘర్ ఆలయం, గోశాల నేపాలీ మందిరం, రామ్ ఠాకూర మందిరం ఉన్నాయి. ఇవిగాక దిహింగ్ సరస్సు, బుద్ధ మందిరం, నౌకామందిరం, ఎల్విజిస్ మ్యూజియం, తోరుణామ్ ఫుకాన్ పార్క్, శ్రీ జలరామ్ మందిరాలను కూడా సందర్శించవచ్చు.ఆలయానికి ఎలా వెళ్లాలి..?దేశంలోని అన్ని ప్రధాన నగరాలనుంచి గువహతికి వెళ్లేందుకు, బస్సులు, రైళ్లు, విమానాలూ ఉన్నాయి. గువహతి రైల్వేస్టేషన్ నుంచి 6 కిలోమీటర్లు, ఏర్΄ోర్టునుంచి సుమారు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న కామాఖ్యాదేవి ఆలయానికి వెళ్లేందుకు ప్రైవేటు వాహనాలున్నాయి. పిలవని పేరంటానికి వెళ్లి, కన్నతండ్రి చేత ఘోరపరాభవం పొందిన సతీదేవి, ఆ అవమాన భారంతో ఆత్మత్యాగం చేస్తుంది. ఇది తెలిసి, అక్కడకు చేరుకున్న శివుడు ఆమె శరీరాన్ని భుజాలమీదకు ఎత్తుకుని రుద్రతాండవం చేస్తుంటాడు. సతీదేవి శరీరం అక్కడ ఉన్నంతసేపూ శివుడిని ఆప శక్యం కాదని తెలిసిన విష్ణువు తన చక్రాయుధాన్ని ఉపయోగించి, ఆమె శరీరాన్ని ఖండఖండాలు చేస్తాడు. అవి 108 ఖండాలుగా భూలోకంలోని వివిధ ప్రదేశాలలో పడతాయి. ఆమె శరీరంలోని కీలకమైన భాగాలు పడిన ప్రదేశాలలో తిరిగి అత్యంత కీలకమైన ప్రదేశాలను గుర్తించి, అలయాలు నిర్మించారు పూర్వులు. అవే అష్టాదశ శక్తిపీఠాలు. వాటిలో అమ్మవారి యోనిభాగం నీలాచలం కొండలపై పడింది. అదే కామాఖ్యా పీఠంగా గుర్తింపు పొంది, కామాఖ్యాదేవి ఆలయంగా ప్రసిద్ధికెక్కింది.ఇతర విశేషాలు..ఎగుడు దిగుడు కొండలు, గుట్టలు, లోయలు ఉండే ఈ ప్రదేశానికి అసమ దేశం అని పేరు. అసమ కాస్తా అస్సాంగా, అసోమ్గా రూపాంతరం చెందింది. శ్రీహరి కొలువై ఉన్న ప్రదేశం కాబట్టి దీనికి హరిక్షేత్రం అని కూడా పేరు. అందుకే అష్టాదశ శక్తిపీఠాల స్తోత్రం లో హరిక్షేత్రే కామరూపా అని ఉంటుంది. ఇక్కడ అమ్మవారి రూపం కానీ, విగ్రహం కానీ ఏమీ ఉండవు. కామాఖ్యాదేవికి నలుపు రంగంటే ప్రీతి. జంతు బలులు ఇక్కడ పరిపాటి. అదీ నల్లటి జంతువులనే బలివ్వాలి. ఆడ జంతువులను వధించరాదని నియమం. ఇది అమ్మవారి యోనిభాగం పడిన ప్రదేశం కావడం వల్ల శివుడు, అమ్మవారు నిత్యం కామకేళిలో మునిగి తేలుతూ ఉంటారని ప్రతీతి. – డి.వి.ఆర్. భాస్కర్(చదవండి: మహిమాన్వితమైన శక్తిపీఠం..కామాఖ్యాలయం..!) -
ప్రముఖ దేవాలయంలో స్టార్ హీరోయిన్ సంయుక్త.. కారణం అదేనా?
హీరోయిన్లు హిట్ కొట్టడం కాస్త కష్టమైన విషయం. కానీ హీరోయిన్ సంయుక్త మేనన్ మాత్రం తెలుగులో వరస సినిమాలతో సక్సెస్ అందుకుంది. కానీ ఇప్పుడు కొత్తగా మూవీస్ ఏం చేయట్లేదు. దానికి కారణమేంటి తెలియదు గానీ సడన్‌గా ఈ మధ్య దేవాలయాలని సందర్శిస్తూ కనిపించింది. అయితే అసలు ఇలా ఎందుకు చేస్తుంది? ఏంటనేది ఇప్పుడు చూద్దాం.(ఇదీ చదవండి: సీతగా సాయిపల్లవి.. ఎంత ముద్దుగా ఉందో? ఫొటోలు వైరల్)మలయాళ బ్యూటీ సంయుక్త మేనన్.. 2016లోనే నటిగా ఇండస్ట్రీలోకి వచ్చింది. 2022లో 'భీమ్లా నాయక్' మూవీతో తెలుగులోకి అడుగుపెట్టింది. బింబిసార, సర్, విరూపాక్ష చిత్రాలతో వరసగా హిట్స్ కొట్టింది. కానీ గతేడాది వచ్చిన 'డెవిల్' మూవీతో ఈమెకు దెబ్బపడింది. ఈ సినిమా వచ్చి నాలుగు నెలలు పైనే అవుతున్న కొత్త ప్రాజెక్టులైతే ఒప్పుకోలేదు.కొన్నిరోజుల ముందు తిరుపతిలో కనిపించిన సంయుక్త.. ఇప్పుడు అసోంలోని ప్రముఖమైన కామాఖ్య దేవాలయంలో కనిపించింది. అయితే ఈ గుడికి పెళ్లి కావాల్సిన అమ్మాయిలు, పెళ్లయిన తర్వాత పిల్లలు కోసం చూసే తల్లులు మాత్రమే ఇక్కడికి వెళ్తుంటారు. దీంతో సంయుక్త పెళ్లి కావాలని ఏమైనా వెళ్లిందా అని మాట్లాడుకుంటున్నారు. అలానే బాలీవుడ్‌కి వెళ్లే ప్రయత్నాల్లో ఉందని, అందుకే ఈ గుడికి వెళ్లిందని మరో కామెంట్ కూడా వినిపిస్తుంది. ఇన్నాళ్లు సినిమాలు అంటూ తిరిగిన సంయుక్త ఇలా పూజలు, భక్తి మోడ్ లోకి మారిపోవడం చూసిన ఆమె ఫ్యాన్స్.. ఇలా మారిపోయిందేంటి అని అనుకుంటున్నారు. అసలు నిజమేంటనేది సంయుక్తనే చెప్పాలి.(ఇదీ చదవండి: 'ఫ్యామిలీ స్టార్' పరువు తీస్తున్న దోశ.. ఆ వార్నింగ్ సీన్ కూడా!) View this post on Instagram A post shared by Samyuktha (@iamsamyuktha_) -
ఆధ్యాత్మిక బాటలో రకుల్ ప్రీత్ సింగ్.. పెళ్లి తర్వాత తొలిసారిగా!
టాలీవుడ్ హీరోయిన రకుల్ ప్రీత్ సింగ్ ఇటీవలే వివాహాబంధంలోకి అడుగుపెట్టింది. నటుడు, నిర్మాత అయిన తన ప్రియుడు జాకీ భగ్నానీతో ఏడడుగులు వేసింది. గోవాలో జరిగిన వీరి పెళ్లికి పలువురు సినీ తారలు కూడా హాజరయ్యారు. ఫిబ్రవరి 21 వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఆనంద్ కరాజ్ అనే పంజాబీ సాంప్రదాయ పద్ధతిలో వీరి పెళ్లిబంధంతో ఒక్కటయ్యారు. వరుడి సాంప్రదాయం ప్రకారం సింధి పద్ధతిలోనూ ముచ్చటగా పెళ్లి చేసుకున్నారు. అయితే పెళ్లి తర్వాత రకుల్, భగ్నానీ జంట బిజీగా మారిపోయింది. తన భర్తతో కలిసి ఆధ్యాత్మిక బాట పట్టింది. కుటుంబసభ్యులతో పాటు దేవుళ్ల ఆశీర్వాదాలు తీసుకుంటోంది. తాజాగా అస్సాం గువహటిలోని కామాఖ్య దేవి అమ్మవారిని రకుల్ దర్శించుకున్నారు. కొత్త జీవితం ప్రారంభించిన నూతన దంపతులు అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. తాజాగా దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. View this post on Instagram A post shared by Instant Bollywood (@instantbollywood) -
ఏ అవగాహనా లేదు!
గువాహటి: కాంగ్రెస్ పార్టీపై ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి విరుచుకుపడ్డారు. స్వాతంత్య్రానంతరం దేశాన్ని దశాబ్దాల పాటు పాలించిన వారికి పూజనీయ స్థలాల గొప్పదనంపై కనీసం అవగాహన కూడా లేకుండా పోయిందంటూ దుయ్యబట్టారు. రెండు రోజుల అసోం పర్యటనలో భాగంగా ఆదివారం రాష్ట్రంలో రూ.11,600 కోట్ల విలువైన పలు ప్రాజెక్టులకు ఆయన ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. అనంతరం గువాహటిలో జరిగిన భారీ ర్యాలీని ఉద్దేశించి మాట్లాడారు. అసోంలోని కామాఖ్య ఆలయ కారిడార్ సిద్ధమయ్యాక ఈ శక్తి పీఠాన్ని సందర్శించేందుకు భారీ సంఖ్యలో భక్తులు తరలి వస్తారన్నారు. ‘‘కామాఖ్య కారిడార్ ఈశాన్య పర్యాటకానికి గేట్వేగా మారనుంది. అక్కడి పర్యాటక రంగమంతటికీ ఊపునిస్తుంది’’ అని విశ్వాసం వెలిబుచ్చారు. ‘‘ఇలాంటి మహిమాని్వయ పూజనీయ స్థలాలెన్నో దేశవ్యాప్తంగా కొలువుదీరాయి. కానీ దశాబ్దాలపాటు దేశాన్నేలిన వారికి వాటి గొప్పదనం గురించిన అవగాహనే లేదు. పైగా వారి స్వార్థ, స్వీయ రాజకీయ లబ్ధి కోసం మన సంస్కృతీ సంప్రదాయాల పట్ల మనమే సిగ్గుపడే పరిస్థితులు కలి్పంచారు. తన మూలాలను, గతాన్ని విస్మరించిన ఏ దేశమూ అభివృద్ధి సాధించజాలదు. బీజేపీ పాలనలో గత పదేళ్లలో పరిస్థితులు మెరుగవుతూ వస్తున్నాయి. మన సంస్కృతీ సంప్రదాయాలను, వారసత్వాన్ని ఘనంగా గుర్తించుకుంటున్నాం. ఒక్క 2023లోనే కాశీకి ఏకంగా 8.5 కోట్ల మంది పర్యాటకులు పోటెత్తారు. ఉజ్జయినిని 5 కోట్లకు పైగా సందర్శించారు. అయోధ్యలో రామాలయం ప్రారంభమైన 12 రోజుల్లోనే పాతిక లక్షల మంది భక్తులు దర్శనాలు చేసుకున్నారు’’ అని మోదీ వివరించారు. గత దశాబ్ద కాలంలో ఈశాన్య భారతానికి కూడా పర్యాటకులు రికార్డు స్థాయిలో పెరిగారన్నారు. భక్తి పర్యాటకం వల్ల నిరుపేదలకు కూడా మంచి ఉపాధి దొరుకుతుందన్నారు. ‘‘బీజేపీ కార్యకర్తగా నేను అసోంలో పని చేశా. అప్పట్లో గువాహటిలో రోడ్ల దిగ్బంధం, బాంబు పేలుళ్లు నిత్యకృత్యంగా ఉండేవి. ఇప్పుడదంతా గతం’’ అన్నారు. గువాహటిలో పలు మౌలిక రంగ ప్రాజెక్టులను మోదీ ఈ సందర్భంగా ప్రారంభించారు. రూ.498 కోట్ల విలువైన కామాఖ్య ఆలయ కారిడార్‌తో పాటు మరికొన్నింటికి శంకుస్థాపనలు చేశారు. ఫోర్ లేన్ హైవేలు, మెడికల్ కాలేజీలు, ఆస్పత్రులు తదితరాలు ఇందులో ఉన్నాయి. విపాసన.. ఒత్తిళ్లపై దివ్యాస్త్రం: మోదీ ముంబై: నిరాశలు, ఒత్తిళ్లపై విపాసన ధ్యాన పద్ధతి దివ్యాస్త్రమని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ‘‘ప్రపంచానికి ప్రాచీన భారతదేశం అందించిన అత్యుత్తమ కానుకల్లో విపాసన ఒకటి. నేటి ఆధునిక జీవనశైలిలో భాగంగా మారిన ఒత్తిళ్లను దూరం చేసుకోవడానికి యువతతో పాటు అన్ని వయసుల వాళ్లకూ ఇదో చక్కని మార్గం’’ అని చెప్పారు. విపాసన బోధకుడు ఎస్.ఎన్.గోయంకా శత జయంత్యుత్సవాలను ఉద్దేశించి ఆయన వర్చువల్‌గా మాట్లాడారు. ‘‘విపాసన ధ్యానపద్ధతి ఒక శాస్త్రం. చక్కని వ్యక్తిత్వ వికాస మార్గం. గోయంకా తన జీవితాన్ని సమాజ సేవకు ధారపోశారన్నారు. ‘‘గోయంకా గురూజీతో నాకెంతో సాన్నిహిత్యముంది. ఆయన జీవితం బుద్ధుని స్ఫూర్తితో సాగింది. సమామూహికంగా ధ్యానం చేస్తే అద్భుత ఫలితాలుంటాయని ఆయన నొక్కిచెప్పేవారు. ఆయన కృషి వల్ల 80 దేశాల వాళ్లు ధ్యానం ప్రాధాన్యతను, ఆవశ్యకతను అర్థం చేసుకుని ఆచరిస్తున్నారు’’ అని వివరించారు. ఆదివారం గువాహటిలో జరిగిన ర్యాలీలో ప్రజలకు అభివాదం చేస్తున్న ప్రధాని మోదీ -
టెంపుల్స్ చుట్టూ తిరుగుతున్న తమన్నా
-
ఆధ్యాత్మిక సేవలో తమన్నా: ట్రెడిషనల్ లుక్ పిక్స్ వైరల్
#TamannabhatiavisitsKamakhyaTemple సౌత్‌లోనే కాకుండా బాలీవుడ్లో కూడా తన సత్తాను చాటుకున్న తమన్నా భాటియా ప్రస్తుతం ఆధ్యాత్మిక పర్యటనలు, సేవపై దృష్టిపెట్టినట్టు కనిపిస్తోంది. అందం, ఆకర్షణతో మిల్కీ బ్యూటీగా పాపులర్ అయిన తమన్నా పర్సనల్ లైఫ్‌కి కూడా ఎక్కువ ప్రయారిటీ ఇస్తోంది. రెండు రోజుల క్రితం రామమందిర ప్రాణ ప్రతిష్ట వేడుకల్లో పాల్గొన్న తమన్నా కుటుంబ సమేతంగా కామాఖ్య ఆలయానికి వెళ్లింది. తాజాగా తల్లి దండ్రులతో కలిసి తమన్నా గౌహతిలోని ప్రఖ్యాత కామఖ్య ఆలయాన్ని సందర్శించింది. ప్రత్యేకంగా పూజలు నిర్వహించి. మాతా రాణి ఆశీస్సులు తీసుకుకుంది. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.. ఈ సందర్భంగా తమన్నా లుక్, గెటప్ చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. View this post on Instagram A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks) పసుపు కాషాయ రంగు మేళవింపుతో కూడిన సాంప్రదాయ దుస్తులు, నుదుటిన తిలకం, మెడలో పూమాల, దేవుడి శాలువ ఇలా ప్రత్యేకంగాట్రెడిషనల్ లుక్‌లో అదరగొట్టేస్తోంది. శక్తిపీఠాల్లో ఒకటైన కామాఖ్య దేవాలయం నీలాచల్ కొండపై ఉంది. -
కామాఖ్య అమ్మవారి దర్శనంలో టీవీ రాముడు
టీవీ నటుడు గుర్మీత్ చౌదరి దుర్గాష్టమి రోజున అసోంలోని కామాఖ్య ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా గుర్మీత్ సోషల్ మీడియాలో పలు ఫోటోలు షేర్ చేశారు. ఈ ఫోటోలలో గుర్మీత్ కండువా కప్పుకుని, నుదుటన తిలకం ధరించడాన్ని చూడవచ్చు. గుర్మీత్ అమ్మవారి భక్తిలో మునిగిపోయినట్లు కనిపించారు. ఫోటోలు షేర్ చేసిన గుర్మీత్ చౌదరి క్యాప్షన్‌లో..‘జై మా కామాఖ్య. అందరికీ అష్టమి శుభాకాంక్షలు’ అని రాశారు. గుర్మీత్.. కామాఖ్య ఆలయాన్ని సందర్శించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఆయన ఆలయం వెలుపల అభిమానులతో ఫొటోలు కూడా దిగారు. కాగా ఈ ఫోటోల్లో గుర్మీత్ ఒంటరిగా కనిపిస్తున్నారు. భార్య డెబినా బెనర్జీ, కుమార్తెలు లియానా, దివిషా అతని వెంట లేరు. గుర్మీత్ టీవీలో ప్రసారమైన రామాయణం సీరియల్లో రాముడి పాత్రలో కనిపించారు. ఈ షో ద్వారా గుర్మీత్‌కు మంచి పేరు వచ్చింది. అతనిని అభిమానించేవారి సంఖ్య కూడా పెరిగింది. ప్రస్తుతం గుర్మీత్ పలు సినిమాల్లో బిజీగా ఉన్నారు. ఇది కూడా చూడండి: యూట్యూబ్‌లో మొదటి వీడియో ఏది? ఎంతమంది చూశారు? -
India Famous Durga Temples Images: భారతదేశంలోని ప్రసిద్ధ దుర్గా దేవాలయాలు (ఫొటోలు)
-
దీపావళి స్పెషల్ 2021: కామాఖ్య ఆలయం.. విహార విశేషాలు!
శుభ కామన దీపం అస్సాం రాష్ట్రం, గువాహటి. నీలాచల పర్వత శ్రేణులతో అందమైన ప్రదేశం. ఇక్కడే ఉంది కామాఖ్య ఆలయం. ఇది శక్తిపీఠాల్లో ఒకటి. ఈ ఆలయాన్ని పురాణకాలంలో నరకాసురుడు నిర్మించాడని చెబుతారు. పదహారవ శతాబ్దం నాటి పాలకులు ధ్వంసం చేయడంతో పదిహేడవ శతాబ్దంలో స్థానిక కూచ్‌బేహార్ పాలకుడు మహారాజా బిశ్వసింగ్ పునర్నిర్మించాడు. కామరూప రాజ్యానికి ప్రతీక దేవత కాబట్టి కామాఖ్య అనే పేరు వచ్చినట్లు మరో కథనం. ప్రధాన ఆలయానికి సమీపంలో సౌభాగ్య కుండం ఉంది. దీనిని దేవతల రాజు దేవేంద్రుడు తవ్వించాడని నమ్మకం. మరో ప్రధాన కుండం పేరు భైరవ్ కుండం. ఇందులో మనం ఊహించనంత పెద్ద సైజు తాబేళ్లుంటాయి. కటి బిహు పంటల వేడుక కూడా ఈ సమయంలో జరుగుతుంది. దీపాలు వెలిగించడమే ప్రధానం. తులసి చెట్టు దగ్గర మొదలు పెట్టి ఇంటి ఆవరణ అంతా దీపాలతో వెలుగులు నింపుతారు. ఇంటింటా వెలిగే దీపాలతోపాటు ఊరంతా సామూహికంగా వెలిగించే దీపాన్ని ఆకాశబంటి అంటారు. దీపం వెలిగిస్తూ ఏ కోరిక కోరితే అది తప్పక నెరవేరుతుందని నమ్ముతారు. బ్రహ్మపుత్రలో విహారం మూడు రోజుల కామాఖ్య టూర్ ప్యాకేజ్‌లో గువాహటి విమానాశ్రయంలో టూర్ ఆపరేటర్లు పికప్ చేసుకుంటారు. హోటల్లో చెక్ ఇన్ అయిన తరవాత సాయంత్రం బ్రహ్మపుత్ర నదిలో సన్‌సెట్ క్రూయిజ్ విహారం ఉంటుంది. మరుసటి రోజు ఉదయం కామాఖ్య దేవి దర్శనం, ఆ తర్వాత బాగలా ఆలయం, భువనేశ్వరి, ఉమానంద, నబగ్రహ, ఉగ్రతార, సుక్లేశ్వర్, బాలాజీ ఆలయాలు, భీమశంకర్ జ్యోతిర్లింగ క్షేత్రం, వశిష్ట ఆలయం, హస్తకళల ఎంపోరియమ్ సందర్శనం ఉంటాయి. మూడవ రోజు గువాహటి ఎయిర్‌పోర్టులో డ్రాప్ చేయడంతో టూర్ ప్యాకేజ్ పూర్తవుతుంది. ఈ సీజన్లో క్రూయిజ్ ప్యాకేజ్‌లో కటి బిహు వేడుకలను కూడా చూసే అవకాశం ఉంటుంది. కన్నడ తీరాన రాయల విడిది మడకశిరలో సత్యభామ సంతాన వేణుగోపాల స్వామితోపాటు దర్శనమిస్తుంది. అదే విగ్రహంలో రుక్మిణి కూడా ఉంటుంది. దీపావళి సందర్భంగా ఇక్కడ ఉత్తరాది రాష్ట్రాలతో సమానమైన వేడుకలు జరుగుతాయి. ఈ ఆలయాన్ని విజయనగర రాజు శ్రీకృష్ణ దేవరాయలు కట్టించాడు. కర్నాటక – ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల సరిహద్దు ప్రాంతం ఇది. ఇక్కడి ప్రకృతి రమణీయతకు ముగ్ధుడైన రాయలు ఇక్కడ ఆలయాన్ని కట్టించి, తన విహారకేంద్రంగానూ, విడిది కేంద్రంగానూ మలుచుకున్నాడు. ఆలయ ప్రాంగణంలో ఇప్పుడు వృద్ధాశ్రమం నిర్మించి అభాగ్యులైన వృద్ధులకు ఆశ్రయం కల్పించడమైంది. ఇక్కడ మరో విశిష్టత ఏమిటంటే... తులసీమాత ఆలయం. దేశంలో మరెక్కడా తులసీమాతకు ఆలయం లేదని ఇది మాత్రమే ఏకైక ఆలయం అని ఇస్కాన్ ధృవీకరించింది. దీపావళి పండుగతోపాటు దీపావళి తర్వాత పన్నెండు రోజులకు వచ్చే చిలకద్వాదశి కూడా వేడుకగా నిర్వహిస్తారు. ట్రావెల్ టిప్స్ ►మీరు వెళ్తున్న ప్రదేశంలో కరోనా కేసుల తీవ్రతలేదని నిర్ధారించుకున్న తరవాత మాత్రమే ప్రయాణానికి సిద్ధం కావాలి. అలాగే మీరు నివసిస్తున్న ప్రదేశంలో కూడా కరోనా తీవ్రత లేకపోతేనే ఇతర ప్రదేశాలకు వెళ్లాలి. ►మీ బస శానిటైజ్ అయినదీ లేనిదీ నిర్ధారించుకోవాలి. అవసరమైతే మరోసారి శానిటైజ్ చేయవలసిందిగా కోరాలి. ►మీరు కోవిడ్ వ్యాక్సిన్ రెండు డోసులు ఇంకా వేసుకోనట్లయితే పర్యటన ఆలోచనను వాయిదా వేసుకోవడం మంచిది. ►పర్యాటక ప్రదేశంలో పరిసరాల పరిశుభ్రత, ఆహార శుభ్రతతోపాటు భౌతిక దూరం తప్పనిసరిగా పాటించాలి. ►మీ ఇంట్లో కోవిడ్ హైరిస్క్ పీపుల్ ఉంటే మీ పర్యటన ఆలోచన మానుకోవడమే మంచిది. చదవండి: ఐదేళ్లుగా వెతుకులాట.. దొరికిన గోల్డ్ ఐలాండ్.. లక్షల కోట్ల సంపద! -
20 కేజీల బంగారం విరాళమిచ్చిన అంబానీ
గుహవాటి : ఆసియా కుబేరుడు, రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ భారీ విరాళమిచ్చారు. దేశంలోని సుప్రసిద్ధ అష్టాదశ శక్తిపీరాల్లో ఒకటైన కామాఖ్యాదేవి ఆలయం కోసం 20 కేజీల బంగారాన్ని కానుకగా ఇచ్చారు. అసోంలో ప్రాముఖ్యత గాంచిన ఈ దేవాలయ మూడు గోపుర కలశాలను బంగారంతో తీర్చిదిద్దనున్నారు. . నీలాచల్ హిల్స్‌లోని కామాఖ్యా ఆలయానికి దీపావళి బహుమతిగా రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్(ఆర్ఐఎల్) ఈ విరాళాన్ని ప్రకటించింది. దీనికి సంబంధించిన పనులు ఇప్పటికే ప్రారంభమైనాయని ఆలయ పూజారి దీప్ శర్మ వెల్లడించారు. సుమారు మూడు నెలల క్రితం అంబానీ ఇందుకోసం కామాఖ్యా ఆలయ నిర్వహణ కమిటీని సంప్రదించారని తెలిపారు. మూడు కలశాల బంగారం తాపడం ఖర్చులు తాము భరిస్తామని ఆలయ అధికారులకు హామీ ఇచ్చారని శర్మ వెల్లడించారు. రిలయన్స్ ఇంజనీర్లు, శిల్పకారుల ఆధ్వర్యంలో పనులు జరుగుతున్నాయన్నారు. వాతావరణ పరిస్థితులు అనుకూలిస్తే దీపావళికి ముందే బంగారం తాపడం పనులు పూర్తయ్యే అవకాశం ఉందన్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయిన తర్వాత అంబానీ దంపతులు ఈ ఆలయాన్ని సందర్శిస్తారని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. బంగారు తాపడంతో శక్తి పీఠం కొత్త శోభను సంతరించుకుంటుందని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. కాగా కరోనా వైరస్ కారణంగా ఈ దేవాలయాన్ని మూసివేయగా ప్రోటోకాల్ అనుగుణంగా అక్టోబర్ 12 నుంచి మళ్లీ ఆలయాన్ని తెరిచిన విషయం తెలిసిందే. -
తలలేని మహిళ మృతదేహం.. తీవ్ర కలకలం
గువాహటి : గువాహాటిలోని నీలాచల్ కొండ ప్రాంతంలో ఉన్న కామాఖ్య దేవీ దేవాలయంలో సమీపంలో తలలేని ఓ మహిళ మృతదేహం లభించడం తీవ్ర కలకలం రేపుతోంది. ఏటా ఇక్కడి ఆలయంలో జరిగే అంబుబాచి పండుగ ఉత్సవంలో భాగంగా మహిళను కొందరు దుండగులు నరబలి ఇచ్చి ఉంటారని, అందులో భాగంగానే మహిళ హత్య జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనపై ప్రజలు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని పోలీసులు తెలిపారు. మూఢ నమ్మకాలను నమ్మే దుర్మార్గులే ఈ ఘటనకు పాల్పడి ఉంటారని వారు అనుమానిస్తున్నారు. కామాఖ్యా ఆలయం పక్కన ఉన్న బనాదుర్గ దేవాలయం మెట్లపైన ఈ భీకరమైన మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. మృతదేహంతోపాటు పూజా సామాగ్రి కూడా లభ్యమైంది. సంఘటన స్థలాన్ని సందర్శించిన పోలీసు కమిషనర్ మృతదేహం ఉన్న స్థలానికి భద్రత కల్పించారు. అస్సాం ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్ ఈ నెల 22 నుంచి 25 తేదీ వరకు ఇక్కడ జరిగే ఆధ్మాత్మిక ఉత్సవాల సందర్భంగా ఈ ఆలయాన్నిమంగళవారం సందర్శించిన విషయం తెలిసిదే. -
ప్రాణత్యాగమా.. బలిచ్చారా
దిస్పూర్ : ప్రముఖ కామాఖ్యా దేవి ఆలయం సమీపంలో బుధవారం తలలేని మహిళ మృతదేహం(మొండెం) పడి ఉండటం స్థానికంగా కలకలం రేపుతోంది. క్షుద్ర పూజల్లో భాగంగా బలిచ్చారా లేక స్వయంగా ప్రాణ త్యాగం చేసి ఉంటారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆలయం సమీపంలో మృతదేహాన్ని కనుగొనడంతో ప్రాణత్యాగం చేశారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మృతదేహం చుట్టుపక్కల మట్టి ప్రమిద, కుండ, పూజ నిమిత్తం ఉపయోగించే ఎరుపు దారం, ఓ ప్లాస్టిక్ బాటిల్ వంటి వస్తువులను పోలీసులు గుర్తించారు. ఈ సందర్భంగా ఓ అధికారి మాట్లాడుతూ.. ‘మృత దేహం దగ్గర లభ్యమైన వస్తువులన్నింటిని పూజా కార్యక్రమాల కోసమే వినియోగిస్తారు. ప్లాస్టిక్ బాటిల్లో నూనె తీసుకువచ్చారేమో అనిపిస్తుంది. అంతేకాక మృతురాలి శరీరం మీద దాడి చేసినట్లు, పెనుగులాడినట్లు ఎలాంటి ఆనవాళ్లు లేవని ప్రాథమిక రిపోర్టులో తెలిసింది. ఇక ఈ ప్రాంతంలో అనుమానాస్పాదంగా ఎలాంటి కేకలు, అరుపులు వినపడలేదని స్థానికులు తెలిపారు. అంటే మృతురాలు స్వయంగా ప్రాణత్యాగం చేసి ఉండాలి.. లేదంటే ఎవరైనా ఆమెకు మత్తు మందు ఇచ్చి ఈ దారుణానికి ఒడిగట్టి ఉండాలి. ప్రస్తుతం ఈ కోణంలో దర్యాప్తు సాగుతుంది. త్వరలోనే అన్ని విషయాలు వెల్లడిస్తాం’ అని తెలిపారు. -
స్త్రీ శక్తికి... సృష్టి ఆవిర్భావానికీ సంకేతం...కామాఖ్యాదేవి ఆలయం
అష్టాదశ శక్తిపీఠాలలో అగ్రగణ్యమైనది, శాక్తేయులకు అత్యంత ఆరాధనీయమైనదీ కామరూపాదేవి ఆలయం. పిలవని పేరంటానికి వెళ్లి, కన్నతండ్రి చేత ఘోరపరాభవం పొందిన సతీదేవి, అవమాన భారంతో ఆత్మత్యాగం చేస్తుంది. ఇది తెలిసి, అక్కడకు చేరుకున్న శివుడు విచలిత మనస్కుడై, ఆమె శరీరాన్ని భుజాలమీదకు ఎత్తుకుని రుద్రతాండవం చేస్తుంటాడు. సతీదేవి శరీరం అక్కడ ఉన్నంతసేపూ శివుడిని ఆపశక్యం కాదని తెలిసిన విష్ణువు తన చక్రాయుధాన్ని ఉపయోగించి, ఆమె శరీరాన్ని ఖండఖండాలు చేస్తాడు. అవి 108 ఖండాలుగా భూలోకంలోని వివిధ ప్రదేశాలలో పడతాయి. ఆమె శరీరంలోని కీలకమైన భాగాలు పడిన ప్రదేశాలలో తిరిగి అత్యంత కీలకమైన ప్రదేశాలను గుర్తించి, ఆలయాలు నిర్మించారు పూర్వులు. అవే అష్టాదశ శక్తిపీఠాలుగా ప్రసిద్ధిచెందాయి. వాటిలో అమ్మవారి యోనిభాగం నీలాచలం కొండలపై పడింది. అదే కామాఖ్యా పీఠంగా గుర్తింపు పొంది, కామాఖ్యాదేవి ఆలయంగా ప్రసిద్ధికెక్కింది. ఇక్కడే దశమహావిద్యలనే పేరు గల కాళి, తార, భువనేశ్వరి, బగళాముఖి, ఛిన్నమస్త, భైరవి, ధూమావతి, కమలాంబిక, షోడశి, మాతంగి అనే పది వేర్వేలు ఆలయాలున్నాయి. ఒక్కో ఆలయమూ ఒక్కో విద్యకు ప్రసిద్ధమైనది. ప్రధాన ఆలయం కామాఖ్యాలయమే. మరో కథ: సతీదేవి ఆత్మత్యాగానంతరం తీవ్రమైన వేదనతో తపస్సమాధిలో లీనమై ఉన్న పరమేశ్వరుని మనస్సును మార్చాలని దేవతలు సంకల్పిస్తారు. ఇందులో భాగంగా మన్మథుడు సమయం చూసుకుని, పూలబాణాలు వేసి, ఆయనకు తపోభంగం కలిగిస్తాడు. దాంతో ముక్కంటి తన మూడవకంటిని తెరచి మన్మథుణ్ణి మసి చేస్తాడు. మన్మథుడికే కాముడు అనే పేరు. కాముణ్ణి దహించిన ప్రదేశం కనుక దీనికి కామాఖ్య అనే పేరొచ్చిందంటారు. ఆ తర్వాత అమ్మవారి అనుగ్రహంతో మన్మథుడు తిరిగి రూపాన్ని పొందాడు. అయితే కేవలం ఆయన భార్య రతీదేవికి మాత్రమే రూపంతో కనిపిస్తాడు. ఇక్కడి బ్రహ్మపుత్రానదిలో భస్మకూటమనే పర్వతం ఉండటం శివుడు మన్మథుని భస్మం చేయడం, తిరిగి ఆయన రూపం పొందాడనడానికి ప్రతీకగా నిలుస్తుంది. ప్రత్యేకతలకు ఆలవాలం: ఎనిమిదవ శతాబ్దంలో నిర్మించినదిగా భావిస్తున్న ఈ ఆలయం 16వ శతాబ్దంలో అన్యమతస్థుల దాడుల్లో ధ్వంసం కాగా, 17వ శతాబ్దంలో కుచ్ బీహార్ రాజు నరనారాయణుడు పునర్నిర్మించాడని శాసనాధారాలున్నాయి. తేనెపట్టు ఆకారంలో ఉన్న ఆలయ శిఖరం గణేశుడు తదితర దేవీ దేవతల శిల్పాలతో కనువిందు చేస్తుంది. మాంత్రికులకు, తాంత్రికులకు, వామాచారులకు, క్షుద్రపూజలు చేసేవారికి ఈ ఆలయమే ఆధారం. కారణం ఇది సతీదేవి యోని భాగం పడిన ప్రదేశం. కాబట్టి అమ్మవారు అనుగ్రహం లభిస్తుందని విశ్వాసం. మూడు మంటపాలుగా నిర్మించి ఉంటుంది. అందులో మొదటి ప్రాకారంలో గుహలా ఉండే గర్భాలయంలో యోనిచిహ్నం ఉన్న నల్లటి బండరాయి ఉంటుంది. దానికే పూజలు జరుగుతాయి. అయితే ఆ రూపం కనిపించకుండా భక్తుల దర్శనానికి ముందే పూలతో నింపేస్తారు. ఆ గుహలోపల రాతి మీద ఎప్పుడూ జల వూరుతూ ఉంటుంది. అందువల్ల మూలవిరాట్టు ఎప్పుడూ తడిగా ఉంటుంది. గర్భాలయం అంతా చిత్తడిగా, జారుడుగా ఉంటుంది. ఆలయం బయటే శీతలాదేవి సన్నిధి ఉంటుంది. దీర్ఘవ్యాధులు ఉన్నవారు ఈమెను సేవించుకుంటే వాటినుంచి విముక్తి కలుగుతుందని ప్రతీతి. రెండవ మండపం చతురస్రాకారంలో, సువిశాలంగా ఉంటుంది. అదే అమ్మవారు కొలువై ఉన్న గుహాంతర్భాగంలోకి దారితీస్తుంది. పూజలు– ఉత్సవాలు: అమ్మవారికి రోజూ చేసే పూజలు గాక దేవీ నవరాత్రులలో ప్రత్యేకంగా దుర్గాపూజ జరిపిస్తారు. ఇవిగాక ఫాల్గుణ మాసంలో దుర్గాడియుల్ అని దుర్గాదేవికి ప్రత్యేక పూజ ఉంటుంది. అదేవిధంగా మానసాపూజ, పోహన్ బియా అంటే పుష్యమాసంలో కామేశ్వరుడికీ, కామేశ్వరీదేవికీ కల్యాణం జరిపిస్తారు. అదేవిధంగా చైత్రమాసం రాగానే, వసంత రుతు ఆగమనానికి సంకేతంగా వసంతపూజ జరుగుతుంది. ఇదే మాసంలో మదన డియుల్ అంటే కామదేవతకీ, కామదేవుడికీ పూజ జరుగుతుంది. -
పరిశుభ్రతకు మారు పేరుగా 'కామాఖ్య'
గౌహతిః పరిశుభ్రతను పాటించడంలో మొదటి స్థానంలో కామాఖ్య నిలుస్తుందని అస్పాం ముఖ్యమంత్రి సర్వానంద సోనోవాల్ తెలిపారు. స్వచ్ఛత అభియాన్ పథకం అమలులో భాగంగా ఎన్నుకున్న పది గుర్తింపు పొందిన ప్రాంతాల్లో ఒకటైన కామాఖ్యలో.. అన్నింటికన్నా ముందుగా కార్యక్రమాన్ని ప్రారంభించడంపై ప్రధాని నరేంద్ర మోదీకి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలతో కలిసి ప్రభుత్వం చేపడుతున్న స్వచ్ఛత అభియాన్ పథకంతో గాంధీ మహాత్ముని 'క్లీన్ ఇండియా' కల నెరవేరుతుందని అస్పాం సీఎం సోనోవాల్ ఆశావాదాన్ని వ్యక్తం చేశారు. ముఖ్యంగా పరిశుభ్రమైన, ఆరోగ్యవంతమైన విధానాలను పాటించడంలో దేశంలోనే అస్పాం ముందుందన్న సోనోవాల్.. నీలాచల్ హిల్స్ లోని కామాఖ్య ఆలయం వద్ద స్వచ్ఛత అభియాన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. స్వచ్ఛ భారత్ అభియాన్ పథకం కింద పైలట్ ప్రాజెక్టుగా చేపట్టిన స్వచ్ఛత అభియాన్ ను ముందుగా దేశంలోని పది గుర్తింపు పొందిన, ధార్మిక, ఆధ్యాత్మిక కేంద్రాల్లో ప్రారంభిస్తున్నట్లు సోనోవాల్ తెలిపారు. మొదటిగా ఎంపిక చేసిన పది ప్రాంతాల్లో అస్సాం లోని కామాఖ్య ఆలయం, జమ్ము కశ్మీర్ లోని వైష్ణోదేవి ఆలయం, ఉత్తర ప్రదేశ్ లోని తాజ్ మహల్, ఆంధ్ర ప్రదేశ్ లోని తిరుపతి, పంజాబ్ లోని గోల్డెన్ టెంపుల్, రాజస్థాన్ లోని అజ్మీర్ షరీఫ్, ఒరిస్సాలోని జగన్నాథ ఆలయం, మహరాష్ట్రలోని ఛత్రపతి శివాజీ టెర్మినస్, ఉత్తర ప్రదేశ్ లోని మణికర్ణిక ఘాట్, తమిళనాడులోని మీనాక్ఖీ ఆలయం ఉన్నట్లు సీఎం వెల్లడించారు. స్వచ్ఛత అభియాన్ పథకం అమలు చేయనున్న దేశంలోని మొత్తం 100 ప్రాంతాల్లో ముందుగా పది కేంద్రాల్లో అమలు చేస్తున్నారని, అనంతరం మిగిలిన 90 ప్రాంతాల్లో కార్యక్రమాన్ని కొనసాగించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ ప్రత్యేక డ్రైవ్ ను విజయవంతంగా కొనసాగించేందుకు ప్రతి ఒక్కరికీ ఆ కామాఖ్య దేవి దీవెనలు అందిస్తుందని, అలాగే ప్రధాని పరిశుభ్ర భారతదేశం కలను నెరవేర్చేందుకు అస్సాం ప్రత్యేకంగా కృషి చేస్తుందని సోనోవాల్ తెలిపారు. -
కుప్పకూలిన కామాఖ్యాదేవి ఆలయం
భూకంపం ప్రభావంతో ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య ప్రాంతంలో గల కామాఖ్యాదేవి ఆలయం కుప్పకూలింది. ఆలయం పైకప్పు కూలిపోయింది. దాంతో భక్తులు ఒక్కసారిగా బయటకు పరుగులు తీశారు. ఇది పురాత భవనం కావడంతో భవనంలోని చాలా భాగాలు కూలిపోయాయి. భూకంప తీవ్రత ఎక్కువగా ఉండటానికి తోడు.. భవనం కూడా పాతబడిపోవడంతో దాని పైకప్పు కూలిపోయిందని భావిస్తున్నారు. తర్వాత కొంతసేపటికి లోపలకు వెళ్లి, నష్టం ఏమాత్రం వాటిల్లిందన్న విషయాన్ని భక్తులు, ఆలయ పూజారులు పరిశీలించారు.