ప్రముఖ దేవాలయంలో స్టార్ హీరోయిన్ సంయుక్త.. కారణం అదేనా? | Actress Samyuktha Menon Visited Kamakhya Temple | Sakshi
Sakshi News home page

Samyuktha Menon: కామాఖ్య దేవాలయంలో సంయుక్త.. ఇదంతా దాని కోసమేనా?

Apr 28 2024 7:31 AM | Updated on Apr 28 2024 7:31 AM

Actress Samyuktha Menon Visited Kamakhya Temple

హీరోయిన్లు హిట్ కొట్టడం కాస్త కష్టమైన విషయం. కానీ హీరోయిన్ సంయుక్త మేనన్ మాత్రం తెలుగులో వరస సినిమాలతో సక్సెస్ అందుకుంది. కానీ ఇప్పుడు కొత్తగా మూవీస్ ఏం చేయట్లేదు. దానికి కారణమేంటి తెలియదు గానీ సడన్‌గా ఈ మధ్య దేవాలయాలని సందర్శిస్తూ కనిపించింది. అయితే అసలు ఇలా ఎందుకు చేస్తుంది? ఏంటనేది ఇప్పుడు చూద్దాం.

(ఇదీ చదవండి: సీతగా సాయిపల్లవి.. ఎంత ముద్దుగా ఉందో? ఫొటోలు వైరల్)

మలయాళ బ్యూటీ సంయుక్త మేనన్.. 2016లోనే నటిగా ఇండస్ట్రీలోకి వచ్చింది. 2022లో 'భీమ్లా నాయక్' మూవీతో తెలుగులోకి అడుగుపెట్టింది. బింబిసార, సర్, విరూపాక్ష చిత్రాలతో వరసగా హిట్స్ కొట్టింది. కానీ గతేడాది వచ్చిన 'డెవిల్' మూవీతో ఈమెకు దెబ్బపడింది. ఈ సినిమా వచ్చి నాలుగు నెలలు పైనే అవుతున్న కొత్త ప్రాజెక్టులైతే ఒప్పుకోలేదు.

కొన్నిరోజుల ముందు తిరుపతిలో కనిపించిన సంయుక్త.. ఇప్పుడు అసోంలోని ప్రముఖమైన కామాఖ్య దేవాలయంలో కనిపించింది. అయితే ఈ గుడికి పెళ్లి కావాల్సిన అమ్మాయిలు, పెళ్లయిన తర్వాత పిల్లలు కోసం చూసే తల్లులు మాత్రమే ఇక్కడికి వెళ్తుంటారు. దీంతో సంయుక్త పెళ్లి కావాలని ఏమైనా వెళ్లిందా అని మాట్లాడుకుంటున్నారు. అలానే బాలీవుడ్‌కి వెళ్లే ప్రయత్నాల్లో ఉందని, అందుకే ఈ గుడికి వెళ్లిందని మరో కామెంట్ కూడా వినిపిస్తుంది. ఇన్నాళ్లు సినిమాలు అంటూ తిరిగిన సంయుక్త ఇలా పూజలు, భక్తి మోడ్ లోకి మారిపోవడం చూసిన ఆమె ఫ్యాన్స్.. ఇలా మారిపోయిందేంటి అని అనుకుంటున్నారు. అసలు నిజమేంటనేది సంయుక్తనే చెప్పాలి.

(ఇదీ చదవండి: 'ఫ్యామిలీ స్టార్' పరువు తీస్తున్న దోశ.. ఆ వార్నింగ్ సీన్ కూడా!)

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement