
ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌కు ముందు టీమిండియా ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ అస్సాంలోని గౌహతిలో ఉన్న కామాఖ్య ఆలయాన్ని సందర్శించాడు. సోమవారం ఆలయానికి చేరుకున్న గంభీర్‌కు ఆర్చకులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు.
గంభీర్ కొన్ని ప్రత్యేక పూజలు చేసినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. కాగా కామాఖ్య ఆలయం దేశంలోని అత్యంత ప్రముఖ శక్తి పీఠాలలో ఒకటి. ఈ ఆలయాన్ని ప్రతీ రోజు వేల సంఖ్యలో భక్తులు దర్శించుకుంటారు.
గంభీర్ ఇటీవల తిరుమల శ్రీవారిని కూడా దర్శించుకున్నాడు. ఇక భారత్- ఇంగ్లండ్ మధ్య టెస్టు సిరీస్‌కు సమయం అసన్నమవుతోంది. జూన్ 20 నుంచి ఈ సిరీస్ ప్రారంభం కానుంది. ఇప్పటికే ఈ సిరీస్‌కు భారత జట్టును బీసీసీ సెలక్షన్ కమిటీ ప్రకటించింది. భారత టెస్టు జట్టు కొత్త కెప్టెన్‌గా శుబ్‌మన్ గిల్ ఎంపికయ్యాడు.
అదేవిధంగా సాయిసుదర్శన్, అర్ష్‌దీప్ సింగ్ వంటి యువ ఆటగాళ్లకు తొలిసారి టెస్టు జట్టులో చోటు దక్కింది. అదేవిధంగా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి వంటి సీనియర్లు టెస్టులకు వీడ్కోలు పలకడంతో యువ ఆటగాళ్లతో కూడిన భారత జట్టు ఇంగ్లండ్‌తో తలపడనుంది. కాగా ఈ సిరీస్ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ 2025-27లో భాగంగా జరగనుంది. ఈ సిరీస్ భారత జట్టుకు చాలా కీలకం.
ఇంగ్లండ్‌తో టెస్టులకు భారత జట్టు
శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రిషబ్ పంత్ (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, కెఎల్ రాహుల్, సాయి సుదర్శన్, అభిమన్యు ఈశ్వరన్, కరుణ్ నాయర్, నితీష్ రెడ్డి, రవీంద్ర జడేజా, ధృవ్ జురెల్, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, జస్‌ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, ప్రసిద్ద్ కృష్ణ, కుల్దీప్ యాదవ్, సిరాజ్
📍 Assam — Gautam Gambhir offered prayers at Maa Kamakhya Mandir.
Jai Mata Di 🚩 pic.twitter.com/975Wfj67ko— Megh Updates 🚨™ (@MeghUpdates) May 26, 2025