![Ninne Pelladatha movie unit has released the second lyrical song launch - Sakshi](/styles/webp/s3/article_images/2020/06/22/ninne.jpg.webp?itok=T6Wm0s4h)
అమన్, సిద్ధిక
నాగార్జున, టబు జంటగా కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన ‘నిన్నే పెళ్లాడతా’ సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో తెలిసిందే. ఇప్పుడు ఇదే టైటిల్‌తో ఓ సినిమా తెరకెక్కుతోంది. ఇందులో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ హీరోగా నటిస్తున్నారు. వైకుంఠ బోను దర్శకత్వం వహిస్తున్నారు. అంబికా ఆర్ట్స్, ఈశ్వరి ఆర్ట్స్ పతాకాలపై బొల్లినేని రమ్య, వెలుగోడు శ్రీధర్ బాబు నిర్మిస్తున్నారు.
సిద్ధిక కథానాయికగా నటిస్తోంది. ‘నేనే నీ నీడై వెంటాడనా.. వేసే అడుగుల్లో తారాడనా...’ అంటూ సాగే ఈ చిత్రంలోని రెండో పాటను విడుదల చేశారు. ఈ పాటను చైతన్య ప్రసాద్ రచించగా, చిన్మయి ఆలపించారు. బొల్లినేని రమ్య, వెలుగోడు శ్రీధర్ బాబు మాట్లాడుతూ– ‘‘ మా చిత్రం టైటిల్‌ను నాగార్జునగారే విడుదల చేసి, మాకు ఎంతో ధైర్యాన్నిచ్చారు. ఈ చిత్రంలో ప్రతి పాత్రకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. చివరి షెడ్యూల్ చిత్రీకరణ జరపాల్సి ఉంది’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment