World University Games: ప్రపంచ విశ్వ విద్యాలయాల క్రీడల్లో భారత్‌కు నాలుగో స్వర్ణ పతకం లభించింది. ఆదివారం జరిగిన ఆర్చరీ ఈవెంట్‌లో కాంపౌండ్ మిక్స్‌డ్ టీమ్ విభాగంలో అమన్ సైని–ప్రగతి (భారత్) జోడీ పసిడి పతకం సాధించింది.
ఫైనల్లో అమన్ సైని–ప్రగతి ద్వయం 157–156తో సువా చో–సెయుంగ్‌హున్ పార్క్ (కొరియా) జోడీపై గెలిచింది. కాంపౌండ్ పురుషుల టీమ్ విభాగంలో భారత్‌కు కాంస్యం, మహిళల టీమ్ విభాగంలో భారత్‌కు రజత పతకం లభించాయి.
ఎదురులేని సౌత్‌జోన్
పుదుచ్చేరి: దేవధర్ ట్రోఫీ దేశవాళీ జోనల్ వన్డే క్రికెట్ టోర్నీ లో సౌత్‌జోన్ జట్టు వరుసగా నాలుగో విజయం సాధించింది. ఈస్ట్‌జోన్ జట్టుతో ఆదివారం జరిగిన నాలుగో లీగ్ మ్యాచ్‌లో సౌత్‌జోన్ ఐదు వికెట్ల తేడాతో గెలిచి 16 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ముందుగా ఈస్ట్‌జోన్ 46 ఓవర్లలో 229 పరుగులకు ఆలౌటైంది. విరాట్ సింగ్ (49; 4 ఫోర్లు, 1 సిక్స్), శుభ్రాన్షు సేనాపతి (44; 5 ఫోర్లు), ఆకాశ్‌దీప్ (44; 3 ఫోర్లు, 4 సిక్స్‌లు), ముక్తార్ హుస్సేన్ (33; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు) రాణించారు.
సౌత్‌జోన్ బౌలర్లు సాయికిశోర్ (3/45), వాసుకి కౌశిక్ (3/37), విద్వత్ కావేరప్ప (2/40) ప్రత్యర్థి జట్టును కట్టడి చేశారు. అనంతరం సౌత్‌జోన్ 44.2 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 230 పరుగులు చేసి గెలిచింది. కెప్టెన్ మయాంక్ అగర్వాల్ (88 బంతుల్లో 84; 6 ఫోర్లు, 1 సిక్స్), సాయి సుదర్శన్ (67 బంతుల్లో 53; 4 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీలు సాధించి సౌత్‌జోన్ విజయంలో కీలకపాత్ర పోషించారు. ఇతర మ్యాచ్‌ల్లో సెంట్రల్‌జోన్ ఎనిమిది వికెట్ల తేడాతో నార్త్‌ఈస్ట్ జోన్ జట్టుపై, వెస్ట్‌జోన్ ఆరు వికెట్ల తేడాతో నార్త్‌జోన్‌పై విజయం సాధించాయి.
Comments
Please login to add a commentAdd a comment