టీటీ చాంప్స్ అమన్, నిఖత్ బాను | aman, nikhat banu won table tennis titles | Sakshi
Sakshi News home page

టీటీ చాంప్స్ అమన్, నిఖత్ బాను

Published Sun, Sep 4 2016 11:30 AM | Last Updated on Mon, Sep 4 2017 12:18 PM

aman, nikhat banu won table tennis titles

స్టేట్ ర్యాంకింగ్ టోర్నమెంట్

సాక్షి, హైదరాబాద్: స్టేట్ ర్యాంకింగ్ టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్‌లో అమన్, నిఖత్ బాను టైటిళ్లను దక్కించుకున్నారు. బండ్లగూడలోని మహావీర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్‌‌స అండ్ టెక్నాలజీ ప్రాంగణంలో శనివారం జరిగిన పురుషుల ఫైనల్లో అమన్ (ఐటీ) 11-6, 11-4, 11-6, 11-5తో ఎస్‌ఎఫ్‌ఆర్ స్నేహిత్ (జీటీటీఏ)పై గెలుపొందగా... మహిళల ఫైనల్లో నిఖత్ బాను (ఐటీ) 11-5, 11-5, 11-4, 7-11, 11-5తో మోనికా (జీఎస్‌ఎం)ను ఓడించింది. ఇతర బాలికల ఫైనల్ మ్యాచ్‌ల్లో క్యాడెట్ విభాగంలో పలక్ (జీఎస్‌ఎం) 11-7, 11-6, 11-5తో ఫాతిమా (డాన్‌బాస్కో)పై, సబ్ జూనియర్ విభాగంలో ఆయుషి (జీఎస్‌ఎం) 11-7, 12-10, 13-11, 11-9తో శ్రీవల్లి రమ్య (స్టాగ్ అకాడమీ)పై, జూనియర్ కేటగిరీలో ప్రతిమ (హెచ్‌వీఎస్) 9-11, 14-12, 9-11, 12-10, 12-10, 6-11, 11-3తో లాస్య (ఏడబ్ల్యుఏ)పై, యూత్ విభాగంలో లాస్య (ఏడబ్ల్యుఏ) 11-9, 11-7, 14-12, 7-11, 3-11, 10-12, 11-8తో సస్య (ఏడబ్ల్యుఏ)పై విజయం సాధించారు.

మరోవైపు క్యాడెట్ బాలుర విభాగంలో రిత్విక్ (స్టాగ్ అకాడమీ) 12-10, 11-5, 3-11,11-8 తో త్రిశూల్ మెహ్రా (ఎల్‌బీఎస్)పై, సబ్ జూనియర్ బాలుర విభాగంలో వరుణ్ శంకర్ (జీజీటీఏ) 11-3, 11-5, 11-8, 5-11, 11-5తో కార్తీక్ (ఏడబ్ల్యుఏ)పై, జూనియర్ బాలుర విభాగంలో స్నేహిత్ (జీజీటీఏ) 11-8, 13-11, 11-9, 6-11, 9-11, 11-7తో హరికృష్ణ (జీజీటీఏ)పై, యూత్ బాలుర విభాగంలో హరికృష్ణ (జీటీటీఏ) 11-9, 11-5, 11-5, 11-4తో మొహమ్మద్ అలీ (ఎల్‌బీఎస్)పై గెలుపొంది విజేతలుగా నిలిచారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement