నేడు ప్యూర్టోరికో రెజ్లర్ దరియన్ క్రూజ్‌తో బౌట్
పారిస్: ఒలింపిక్స్‌లో పాల్గొంటున్న తొలి ప్రయత్నంలోనే పతకం సొంతం చేసుకునేందుకు భారత యువ రెజ్లర్ అమన్ సెహ్రావత్ ఒక విజయం దూరంలో నిలిచాడు. పురుషుల ఫ్రీస్టయిల్ 57 కేజీల విభాగంలో అమన్ సెమీఫైనల్లో ఓడిపోయి కాంస్య పతక పోరుకు అర్హత సాధించాడు. 2016 రియో ఒలింపిక్స్ రజత పతక విజేత రె హిగుచి (జపాన్)తో జరిగిన సెమీఫైనల్లో 21 ఏళ్ల అమన్ ‘టెక్నికల్ సుపీరియారిటీ’ పద్ధతిలో పరాజయం చవిచూశాడు.
మూడు నిమిషాల నిడివిగల తొలి భాగంలో 2 నిమిషాల 14 సెకన్లలో రె హిగుచి 10–0తో ఆధిక్యాన్ని సంపాదించడంతో రిఫరీ బౌట్‌ను ముగించాడు. ఇద్దరి రెజ్లర్ల మధ్య 10 పాయింట్ల తేడా వచ్చిన వెంటనే రిఫరీ బౌట్‌ను నిలిపి వేసి పది పాయింట్ల ఆధిక్యం సాధించిన రెజ్లర్‌ను ‘టెక్నికల్ సుపీరియారిటీ’ పద్ధతిలో విజేతగా ప్రకటిస్తారు. నేడు జరిగే కాంస్య పతక బౌట్‌లో ప్యూర్టోరికో రెజ్లర్ దరియన్‌తో అమన్ తలపడతాడు.
రెండు ఘనవిజయాలతో...
అంతకుముందు అమన్ రెండు వరుస ఘనవిజయాలతో సెమీఫైనల్లోకి దూసుకెళ్లాడు. తొలి రౌండ్‌లో అమన్ 3 నిమిషాల 59 సెకన్లలో 10–0తో ‘టెక్నికల్ సుపీరియారిటీ’ పద్ధతిలో వ్లాదిమిర్ ఇగొరోవ్ (నార్త్ మెసడోనియా)ను ఓడించాడు. క్వార్టర్ ఫైనల్లో అమన్ 3 నిమిషాల 56 సెకన్లలో 12–0తో ‘టెక్నికల్ సుపీరియారిటీ’ పద్ధతిలో అబాకరోవ్ జెలీమ్ ఖాన్ (అల్బేనియా)పై గెలుపొందాడు.
అబాకరోవ్ 2022 ప్రపంచ చాంపియన్‌షిప్‌లో 57 కేజీల విభాగంలో స్వర్ణం, 2023 ప్రపంచ చాంపియన్íÙప్‌లో కాంస్యం సాధించడం విశేషం. అమన్ తన సహజశైలిలో ఆడితే నేడు జరిగే కాంస్య పతక బౌట్‌లో దరియన్‌పై నెగ్గడం అంత కష్టమేమీ కాదు.
అన్షు తొలి రౌండ్‌లోనే...
మహిళల ఫ్రీస్టయిల్ 57 కేజీల విభాగంలో భారత రెజ్లర్ అన్షు మలిక్ తొలి రౌండ్‌లోనే నిష్క్రమించింది. హెలెన్ లూసీ మరూలిస్ (అమెరికా)తో జరిగిన బౌట్‌లో అన్షు 2–7 పాయింట్ల తేడాతో ఓడిపోయింది. అయితే హెలెన్ ఫైనల్ చేరుకోకపోవడంతో అన్షుకు రెపిచాజ్ రూపంలో కాంస్య పతకం కోసం పోటీ పడే అవకాశం చేజారింది.
భారత్ ః పారిస్ ఒలింపిక్స్
నాలుగో స్థానంలో నిలిచిన ప్లేయర్లు
లక్ష్య సేన్
బ్యాడ్మింటన్
పురుషుల సింగిల్స్
అంకిత భకత్–బొమ్మదేవర ధీరజ్
ఆర్చరీ
మిక్స్‌డ్ టీమ్
మహేశ్వరీ చౌహాన్–అనంత్‌జీత్ సింగ్
షూటింగ్
స్కీట్ మిక్స్‌డ్ టీమ్
అర్జున్ బబూతా
షూటింగ్ పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్
మనూభాకర్
షూటింగ్ మహిళల 25 మీటర్ల పిస్టల్
10 మీటర్ల వ్యక్తిగత, మిక్స్‌డ్ టీమ్ విభాగంలో రెండు కాంస్యాలు గెలిచింది.
మీరాబాయి చానూ
వెయిట్ లిఫ్టింగ్
మహిళల 49 కేజీలు
ఆ ఆరు వచ్చి ఉంటే ‘పది’ దాటేవాళ్లం...
పారిస్ ఒలింపిక్స్‌లో అదృష్టం కూడా కలిసి వచ్చి ఉంటే భారత్ పతకాల సంఖ్య రెండంకెలు దాటేది. ఇప్పటికే ఐదు పతకాలు నెగ్గిన భారత్ త్రుటిలో నాలుగు కాంస్య పతకాలను కోల్పోయింది. షూటర్లు అదరగొట్టగా... ఆర్చరీ, బ్యాడ్మింటన్, రెజ్లింగ్, వెయిట్‌లిఫ్టింగ్‌లో మనవాళ్లు నిరాశ పరిచారు. కచ్చితంగా పతకాలు సాధిస్తారనుకున్న ఆటగాళ్లు తడబడగా... మరో ఆరుగురు ప్లేయర్లు నాలుగో స్థానంలో నిలిచి త్రుటిలో మెడల్ చేజార్చుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment