రాఖీ పౌర్ణమి స్పెషల్‌ | Sakshi Special Story on Rakhi Festival | Sakshi
Sakshi News home page

రాఖీ పౌర్ణమి స్పెషల్‌

Published Mon, Aug 3 2020 12:31 AM | Last Updated on Mon, Aug 3 2020 4:20 AM

Sakshi Special Story on Rakhi Festival

తోబుట్టువుల పండగ రాఖీ. ఏడాదంతా ఎంత ఆటపట్టించుకున్నా, మనిద్దరం ఒకటే జట్టు అన్న శాంతి ఒప్పందమే రాఖీ. వీళ్లకు చిన్నప్పటి గొడవలే ప్రస్తుత జ్ఞాపకాలు.   నేనున్నా అని ఒకరికొకరు చెప్పుకునే భరోసాయే రాఖీ. మా అన్నయ్య బెస్ట్‌ అని సూపర్‌ సిస్టర్‌ ప్రసీద, మా సిస్టర్‌ సూపర్‌ అని హ్యాండ్‌సమ్‌ బ్రదర్‌ అమన్, మా అక్క బంగారు తల్లి అంటూ సిక్స్‌ప్యాక్‌ కార్తికేయ వాళ్ల రాఖీ బంధం గురించి ఇలా చెప్పారు.

అన్నయ్య చిన్నప్పటి నుంచే బాహుబలి
– సాయిప్రసీద

తండ్రి కృష్ణంరాజు, అన్నయ్య ప్రభాస్‌తో సాయిప్రసీద

► నేను ప్రస్తుతం ప్రభాస్‌ అన్నయ్య (సాయిప్రసీదకు ప్రభాస్‌ కజిన్‌ బ్రదర్‌) హీరోగా చేస్తున్న ‘రాధేశ్యామ్‌’ చిత్రానికి గోపీకృష్ణ మూవీస్‌ తరపున నిర్మాతగా చేస్తున్నాను. తెలుగు వెర్షన్‌కు యూవీ క్రియేషన్స్‌ వంశీ, ప్రమోద్‌లతో కలిసి సహనిర్మాతగా వ్యవహరిస్తున్నాను.

► ప్రభాస్‌ అన్నయ్య అనగానే నాకు బెస్ట్‌ఫ్రెండ్‌ గుర్తుకు వస్తాడు. ఫ్రెండ్‌ అని ఎందుకు అంటున్నానంటే.. అన్ని విషయాలు షేర్‌ చేసుకునేంత బెస్ట్‌ ఫ్రెండ్‌ నాకు. నా కెరీర్‌కి ఆయనే మెంటర్‌. రాఖీ పండగ రోజున నేను, చెల్లెళ్లు కలసి అన్నయ్యతో టైమ్‌ స్పెండ్‌ చేస్తాం. బోలెడన్ని కబుర్లు చెప్పుకుంటాం. ఈరోజు (సోమవారం) తప్పనిసరిగా ప్రభాస్‌ అన్నయ్యను కలుస్తాం.

► మా ఫ్యామిలీ అంతా ఫుడ్‌ లవర్సే. మేము అన్నయ్య దగ్గరికెళ్లగానే ౖహె దరాబాద్‌లో ఉన్న బెస్ట్‌ ఫుడ్‌ తెప్పిస్తారు (నవ్వుతూ). చిన్నప్పటి నుంచి రాఖీ పండగరోజు అన్నయ్య మాకు బెస్ట్‌ గిఫ్ట్స్‌ ఇస్తుంటాడు. ప్రతి ఏడాది లేటెస్ట్‌ ట్రెండ్‌లో ఏది ఉంటే అది మా ముందుండేది. అన్నీ బెస్ట్‌ గిఫ్ట్స్‌ ఇచ్చేవారు. ఇప్పుడంటే అన్నయ్య ‘బాహుబలి’ అయ్యారు కానీ, మాకు మాత్రం చిన్నప్పటి నుంచే ‘బాహుబలి’.

► మొదట్లో నేను చాలా కన్‌ఫ్యూజన్‌లో ఉండేదాన్ని. వ్యాపారం చేద్దామనుకుని లండన్‌లో బిజినెస్‌ కోర్స్‌ చదివాను. ఆ కోర్స్‌ చివరిలో ప్రాజెక్ట్‌ చేయాల్సి వచ్చింది.. అప్పుడు నేను ప్రొడక్షన్‌ చేశాను. మొదట్లో సినిమా వ్యాపారం ఎందుకు? ఇది రిస్కీ బిజినెస్‌ కదా? అనుకున్నాను. లండన్‌లో ప్రాజెక్ట్‌ తర్వాత నాకు నమ్మకం పెరిగింది. తర్వాత ఖాళీగా ఉండటం ఎందుకు అని అమెరికాలోని న్యూయార్క్‌ ఫిల్మ్‌ అకాడమీలో ప్రొడక్షన్‌లో ఏడాది కోర్స్‌లో జాయిన్‌ అయ్యాను. ఆ కోర్స్‌ జరుగుతుండగానే ‘రాధేశ్యామ్‌’ కి పనిచేస్తున్నా.

► ప్రొడక్షన్‌ విషయంలో అన్నయ్య నాకు చాలా సహాయం చేస్తున్నారు. ‘ప్రొడక్షన్‌లోకి రావటానికి నీకు ఆసక్తి ఉందా? అని అడిగారు. ఆసక్తి ఉంటే నాకు తెలిసినదంతా నీకు నేర్పిస్తాను. కంగారు పడాల్సిన పనేంలేదు, నీకు నేనున్నాను’ అంటూ చాలా సపోర్ట్‌ చేశారు. అప్పుడు నాన్నకి, అన్నయ్యకి చెప్పి ప్రొడక్షన్‌లోకి వచ్చాను.


ఇద్దరక్కలు నాకుఅమ్మలాంటివాళ్లు
అమన్‌

లక్ష్మీమంచు, రకుల్‌ప్రీత్‌ సింగ్‌తో అమన్‌

► రాఖీ పండగ వస్తోందంటే అక్క (రకుల్‌ప్రీత్‌సింగ్‌)కి ఏ గిఫ్ట్‌ ఇవ్వాలా అని ఆలోచిస్తుంటాను. నేను చిన్నప్పటి నుండి ఖరీదైన వస్తువులు ఇచ్చేవాణ్ని కాదు. కానీ, నేను ఏమిచ్చినా చాలా సంతోషంగా తీసుకుంటుంది అక్క.

► గతేడాది మాత్రం ‘బర్బరీ’ బ్రాండ్‌ హ్యాండ్‌బ్యాగ్‌ కొనిచ్చాను. తను చాలా ఆనందపడింది. ఈ రాఖీకి నేను హీరోగా నటించిన ‘నిన్నే పెళ్లాడుతా’ సినిమా విడుదలవుతుందేమో అనుకున్నాను. నేను నటునిగా కావడమే ఈ ఏడాది అక్కకి ఇచ్చే బహుమతి అని చెబుదాం అనుకున్నాను. కానీ కరోనా వల్ల మా సినిమా విడుదల కాలేదు. 180 థియేటర్లలో సినిమా విడుదలకు సిద్ధమైన తర్వాత లాక్‌డౌన్‌ వచ్చింది. అందుకే, ఈ రాఖీ పండక్కి ఏమివ్వాలా అని ఆలోచిస్తున్నాను.

► రాఖీ కట్టించుకున్న తర్వాత సర్‌ప్రైజ్‌ గిఫ్ట్‌ ప్లాన్‌ చేశాను.. అది ఇచ్చిన తర్వాత అక్కతో కలిసి సినిమా చూస్తాను. లక్ష్మీమంచును కూడా నేను అక్కలానే భావిస్తాను. ఆమెతో కూడా రాఖీ కట్టించుకుంటాను. ఈ ఇద్దరక్కలు నా లైఫ్‌లో అమ్మలాంటివాళ్లు. త్వరలోనే నా సినిమా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో విడుదలవుతుంది.


ఏ నిర్ణయం అయినా అక్కదే!
– కార్తికేయ

అక్క శుక్లతో కార్తికేయ

► మా అక్క శుక్లా అమెరికాలో ఉంటుంది. చిన్నప్పుడు ఆమె వస్తువులు ఎవరన్నా ముట్టుకుంటే చాలా కోప్పడేది. తన వస్తువుల్ని నేను పనికిరాకుండా చేసి, నాకు తెలియదు అనేవాణ్ణి. ఇద్దరం ఫుల్‌గా ఫైట్‌ చేసేవాళ్లం. కానీ, రాఖీ పండగకి మాత్రం మంచి బహుమతులు ఇచ్చేవాణ్ని.

► అక్క, నేను ఇద్దరం కలసి చిన్నప్పటి నుండి సినిమాలు చూసేవాళ్లం. సినిమా చూసిన తర్వాత దాని గురించి చర్చించుకోవడంతో పాటు హీరోల గురించి మాట్లాడుకునేవాళ్లం. చిన్నప్పటి నుండి అక్క డ్యాన్స్‌ బాగా చేసేది. నేను కూడా తన దగ్గర డ్యాన్స్‌ నేర్చుకునేవాణ్ని.

► నాకు సంబంధించి ఏ చిన్న నిర్ణయమైనా అక్కే ఫైనలైజ్‌ చేసేది. ఉదాహరణకు.. కాలేజీలో అడ్మిషన్‌ తీసుకోవాలన్నా కూడా.. ఇప్పుడు ఏదన్నా సినిమా ఫైనలైజ్‌ చేయాలన్నా అక్కతో మాట్లాడి కన్‌ఫర్మ్‌ చేస్తాను. తర్వాతి అడుగు ఎలా వేయాలి? ఎంత జాగ్రత్తగా ఉండాలి అనేది అక్క, నేను మాట్లాడుకుంటుంటాం.

► నా మొదటి సినిమా ‘ఆర్‌ఎక్స్‌ 100’ విడుదలైనప్పుడు అక్క అమెరికాలోనే ఉంది. తనకి పాప పుడితే అన్నప్రాసనకు నేను వెళ్లాను. అక్కడ ఓ భారతీయ సూపర్‌ మార్కెట్‌కి వెళితే కొంతమంది నన్ను గుర్తుపట్టి ఫొటోలు దిగారు. అది చూసి మా అక్క సర్‌ప్రైజ్‌ అయింది. నాకు బాగా సంతోషంగా అనిపించింది.

► గత ఏడాది అక్క ఇండియాలో ఉన్నప్పుడే నేను నటించిన ‘గుణ 369’ విడుదలైంది.. ఇద్దరం కలిసి చూశాం. ఆ సినిమా విడుదలైన టైమ్‌లో రాఖీ పండగ రావటం, అక్క ఇండియాలో ఉండటం.. ఇలా అన్నీ హ్యాపీ మూమెంట్స్‌ అదే రోజు జరిగాయి. ఆ సినిమా క్లైమాక్స్‌లో నా నటన చూసి నన్ను పట్టుకొని ఏడ్చింది.. చాలా గర్వంగా ఫీలవుతున్నాను అని చెప్పింది. ‘నాకు జీవితంలో ఇంతకంటే ఏం కావాలి’ అని ఆ క్షణం అనిపించింది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement