ప్రభాస్‌తో ఛాన్స్‌ వస్తే.. నన్ను తొలగించి కాజల్‌ను తీసుకున్నారు: రకుల్‌ | Rakul Preet Singh Comments On Prabhas And Kajal Agarwal | Sakshi
Sakshi News home page

ప్రభాస్‌తో ఛాన్స్‌ వస్తే.. నన్ను తొలగించి కాజల్‌ను తీసుకున్నారు: రకుల్‌

Published Mon, Oct 14 2024 7:01 PM | Last Updated on Mon, Oct 14 2024 7:28 PM

Rakul Preet Singh Comments On Prabhas And Kajal Agarwal

టాలీవుడ్‌ నటి రకుల్ ప్రీత్ సింగ్ కొద్దిరోజుల క్రితం నెపోటిజం (బంధుప్రీతి) గురించి మాట్లాడి సంచలనం రేపారు. అయితే, తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ప్రభాస్‌తో వచ్చిన ఒక సినిమా ఛాన్స్‌ ఎలా కోల్పోయిందో చెప్పుకొచ్చారు. ప్రభాస్‌తో ఒక ప్రాజెక్ట్‌ ప్రారంభమయ్యాక తనకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే తొలగించారని రకుల్‌ పేర్కొన్నారు. ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే తన స్థానంలో మరో హీరోయిన్‌ను తీసుకున్నారని తెలిపారు.

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ ఎలాంటి సినీ నేపథ్యం లేకుండానే మొదట కన్నడ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చారు. ఆపై తన నటనతో ప్రేక్షకులను మెప్పించి స్వశక్తితో అవకాశాలు దక్కించుకున్నారు. అయితే, తన సినీ కెరియర్‌ ప్రారంభంలోనే ప్రభాస్‌ సరసన సినిమా ఛాన్స్‌ వచ్చినట్లు గుర్తుచేసుకున్నారు. ఆ ప్రాజెక్ట్‌లో తను కొంత భాగం షూటింగ్‌లో కూడా పాల్గొన్నట్లు తెలిపారు. ఆ సినిమా మొదటి షెడ్యూల్‌ పూర్తి చేసిన తర్వాత తాను కాలేజీకి వెళ్లినట్లు చెప్పారు. అయితే, రెండో షెడ్యూల్‌ పిలుపు కోసం ఎదురు చూసిన తనకు నిరాశే మిగిలిందన్నారు. షూటింగ్‌ కోసం చిత్ర యూనిట్‌ నుంచి తనకు ఎలాంటి కబురు రాలేదని ఆమె అన్నారు. తన స్థానంలో కాజల్‌ను తీసుకున్నారని మరోకరి ద్వారా తనకు తెలిసినట్లు చెప్పుకొచ్చారు. 

అయితే, కనీసం సమాచారం కూడా ఇవ్వకుండా తనను తొలగించడంతో కాస్త బాధ అనిపించినట్లు తెలిపారు.  వారిద్దరి కాంబినేషన్‌లో అప్పటికే వచ్చిన సినిమా హిట్‌ కావడంతో అదే జోడీని రిపీట్‌ చేస్తే బాగుంటుందని చిత్ర యూనిట్‌ భావించినట్లు తర్వాత తెలిసిందన్నారు. కొత్తగా సినిమా పరిశ్రమలోకి వచ్చే హీరోయిన్లకు ఇలాంటివి జరగడం సర్వసాధారణమని ఆమె అన్నారు. ఇలాంటి ఘటనలు ఆమెకు చాలానే ఎదురయ్యాయని అన్నారు. కాజల్‌ అగర్వాల్‌, ప్రభాస్‌ కాంబినేషన్‌లో రెండు సినిమాలు డార్లింగ్‌ (2010), Mr పర్‌ఫెక్ట్‌ (2011) వచ్చాయి. రకుల్‌ చెబుతున్న ప్రకారం  'Mr పర్‌ఫెక్ట్‌' చిత్రంలో తనకు వచ్చిన అవకాశం కోల్పోయినట్లు తెలుస్తోంది.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement