
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సంగీత నాటక అకాడమీ చైర్‌పర్సన్‌గా నృత్య కళాకారిణి దీపికారెడ్డి నియమితులయ్యారు. ఈమేరకు సాంస్కృతిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కూచిపూడి కళాకారిణిగా గుర్తింపు తెచ్చుకున్న దీపికారెడ్డి.. 2017లో కేంద్ర సంగీత నాటక అకాడమీ పురస్కారాన్ని పొందారు. తెలుగు రాష్ట్ర ప్రభుత్వాల పురస్కారాలు, పలు ప్రైవేటు సంస్థల నుంచి కూడా అవార్డులు అందుకున్నారు. ఆమె దీపాంజలి పేరుతో నృత్య శిక్షణ సంస్థను నిర్వహిస్తున్నారు. కాగా, ఈ పోస్టులో దీపికారెడ్డి రెండేళ్ల పాటు కొనసాగనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment