'చూసిన ప్రతి అమ్మాయిని హేట్ చేస్తున్నాడు'.. ఆసక్తిగా 'భారీ తారాగణం' ట్రైలర్ | Bhari Taraganam Movie Trailer Released Today | Sakshi
Sakshi News home page

Bhari Taraganam Trailer: 'ఆ అమ‍్మాయిలనే మళ్లీ ఇష్టపడుతున్నాడు'.. ఆసక్తిగా ట్రైలర్

Published Sat, Mar 11 2023 9:32 PM | Last Updated on Sat, Mar 11 2023 9:34 PM

Bhari Taraganam Movie Trailer Released Today - Sakshi

సదన్, దీపికా రెడ్డి, రేఖ నిరోష నటీ నటులుగా శేఖర్ ముత్యాల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'భారీ తారాగణం’.  బీవీఆర్ పిక్చర్స్ బ్యానర్‌పై  బీవీ రెడ్డి నిర్మించారు.  ఇప్పటికే విడుదలైన  టీజర్, పాటలకు మంచి ప్రేక్షకాదరణ లభించింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని విడుదలకు సిద్దమైన సందర్బంగా చిత్ర ట్రైలర్‌ను రిలీజ్‌ చేశారు మేకర్స్. ఈ కార్యక్రమానికి ప్రముఖ దర్శకులు ఎస్వీ కృష్ణా రెడ్డి, నిర్మాత అచ్చిరెడ్డి, కమెడియన్ ఆలీ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. 

 ఎస్వీ కృష్ణారెడ్డి మాట్లాడుతూ..' దర్శకుడు శేఖర్, నిర్మాత బివి.రెడ్డి మంచి కథను తెరకెక్కించారు..ఈ సినిమాకు సుక్కు అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు అలీ ఏ పాత్ర ఇచ్చినా ఒదిగిపోతారు. నాకు ఇష్టమైన  బాబా కుమారుడు  హీరోగా చేయడం చాలా సంతోషం. ఈ చిత్రంలో అందరూ కూడా చాలా బాగా నటించారు. ఈ సినిమా హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా.' అని అన్నారు. 

నిర్మాత అచ్చిరెడ్డి మాట్లాడుతూ.. 'ట్రైలర్ చూస్తుంటే చాలా అట్రాక్టివ్‌గా కనిపిస్తోంది. ఆలీ ఈ సినిమాలో చాలా  చక్కగా నటించాడు. దర్శక నిర్మాతలకు ఈ చిత్రం ద్వారా మంచి పేరు వస్తుంది. ప్రతి ఒక్కరూ చాలా చక్కగా నటించారు. త్వరలో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా బిగ్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా.' అని అన్నారు
 
ఆలీ మాట్లాడుతూ.. 'మంచి కంటెంట్‌తో తీసిన  ఈ సినిమా బిగ్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అలాగే ఈ చిత్రంలో మా అన్న తమ్ముడు సదన్ హీరోగా చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇందులో నాకు మంచి పాత్ర లభించింది. ఇలాంటి మంచి సినిమాలో నటించినందుకు చాలా హ్యాపీగా ఉంది.' అని అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement