‘ప్రణయ గోదారి’ మూవీ రివ్యూ | Pranayagodari Movie Review And Rating In Telugu | Sakshi
Sakshi News home page

‘ప్రణయ గోదారి’ మూవీ రివ్యూ

Published Fri, Dec 13 2024 7:32 PM | Last Updated on Fri, Dec 13 2024 7:56 PM

Pranayagodari Movie Review And Rating In Telugu

టైటిల్‌: ప్రణయ గోదారి
నటీనటులు: సదన్‌, ప్రియాంక ప్రసాద్‌, సాయి కుమార్‌, పృథ్వి, సునిల్‌, జబర్థస్త్‌ రాజమౌళి తదితరులు
నిర్మాణ సంస్థ: పీఎల్వీ క్రియేషన్స్
నిర్మాత: పారమళ్ల లింగయ్య
దర్శకత్వం: పీఎల్‌ విఘ్నేష్‌
సంగీతం: మార్కండేయ
ఎడిటర్‌: కొడగంటి వీక్షిత వేణు
విడుదల తేది: డిసెంబర్‌ 13, 2024

కథేంటంటే..
గోదారికి చెందిన పెదకాపు(సాయి కుమార్‌) వెయ్యి ఎకరాల ఆసామి. చుట్టూ ఉన్న 40 గ్రామాలకు ఆయనే పెద్ద. ఆయన చెప్పిందే న్యాయం. ప్రేమ వివాహం చేసుకున్న పెదకాపు చెల్లి..భర్త చనిపోవడంతో కొడుకు శ్రీను(సదన్‌ హాసన్‌)తో కలిసి అన్నయ్య దగ్గరకు వస్తుంది. తన కూతురు లలిత(ఉష శ్రీ)ని మేనల్లుడు శ్రీనుకి ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటాడు పెదకాపు. కానీ శ్రీను ఆ ఊరి జాలరి అమ్మాయి గొయ్య లక్ష్మి ప్రసన్న అలియాస్‌ గొయ్యని(ప్రియాంక ప్రసాద్‌)ఇష్టపడతాడు. గోచిగాడు(సునిల్‌)తో కలిసి రోజు గోదారి ఒడ్డుకు వెళ్లి గొయ్యని కలుస్తుంటాడు. వీరిద్దరి ప్రేమ విషయం పెదకాపుకు తెలుస్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది? పరువు కోసం ప్రాణాలు ఇచ్చే పెదకాపు మేనల్లుడి ప్రేమను అంగీకరించాడా లేదా? గొయ్య, శ్రీనులను కలిపేందుకు గోచి తీసుకున్న సంచలన నిర్ణయం ఏంటి? చివరకు గొయ్య, శ్రీనులు కలిశారా లేదా? అనేదే మిగతా కథ.

ఎలా ఉందంటే.. 
పరువు హత్యల నేపథ్యంలో ఇప్పటికే చాలా సినిమాలు వచ్చాయి. ప్రణయ గోదారి కూడా ఆ కోవకు చెందిన చిత్రమే. ' పునర్జన్మ నేపథ్యంతో  హృద్యమైన ప్రేమకథగా ఈ చిత్రాన్ని దర్శకుడు పీఎల్‌ విఘ్నేష్‌. దర్శకుడు ఎంచుకున్న పాయింట్‌ బాగున్నప్పటికీ..దాన్ని తెరపై చూపించడంలో కొంతవరకు మాత్రమే సఫలం అయ్యాడు.  సినిమా ప్రారంభం రొటీన్‌గా ఉంటుంది. ప్లాష్‌బ్యాక్‌ స్టోరీ స్టార్ట్‌ అయిన తర్వాత కథపై ఆసక్తి పెరుగుతుంది. . గొయ్యతో శ్రీను ప్రేమలో పడడం.. తన ప్రేమ విషయాన్ని చెప్పడం శ్రీను చేసే ప్రయత్నాలు ఆకట్టుకుంటాయి. మధ్య మధ్య గోచి పాత్ర చేసే కామెడీ సీన్లు నవ్వులు పూయిస్తాయి. ఫస్టాఫ్‌ మొత్తం గొయ్య, శ్రీనుల ప్రేమ చుట్టునే కథనం సాగుతుంది. ఇంటర్వెల్‌ ట్విస్ట్‌ ఆకట్టుకుంటుంది. ఇక సెకండాఫ్‌లో కథనం కాస్త ఎమోషనల్‌గా సాగుతుంది.  ప్రేమ విషయం పెద కాపుకు తెలియడం.. మరోవైపు గొయ్యకి వేరే వ్యక్తితో పెళ్లికి చేసేందుకు రెడీ అవ్వడంతో ఏం జరుగుతుందనే క్యూరియాసిటీ ప్రేక్షకుల్లో కలుగుతుంది. గోచి పాత్ర ఇచ్చే ట్విస్ట్‌ ఆకట్టుకుంటుంది. ఇక క్లైమాక్స్‌లో సాయి కుమార్‌ చెప్పే డైలాగ్స్‌ ఆలోచింపజేస్తాయి.  స్క్రీన్‌ప్లేని ఇంకాస్త బలంగా రాసుకొని, తెలిసిన నటీనటులను పెట్టుకొని ఉంటే సినిమా ఫలితం మరోలా ఉండేవి. 

ఎవరెలా చేశారంటే..
సదన్‌, ప్రియాంక ప్రసాద్‌ కొత్తవాళ్లే అయినా.. చక్కగా నటించారు. సిటీ యువకుడు, పల్లెటూరి అబ్బాయిగా రెండు విభిన్నమైన పాత్రలు పోషించిన సదన్‌.. ప్రతి పాత్రలోనూ వేరియేషన్‌ చూపించి ఆకట్టుకున్నాడు. ఇక గొయ్యగా ప్రియాంత తెరపై అందంగా కనిపించింది. ఈమె పాత్ర సినిమా మొత్తం ఉంటుంది.  వీరిద్దరి తర్వాత ఈ సినిమాలో బాగా పండిన పాత్ర సాయి కుమార్‌ది. పెదకాపు పాత్రలో ఆయన జీవించేశాడు. ఆయన పాత్ర సినిమాకు స్పెషల్‌ అట్రాక్షన్‌.  సినిమా చూసిన వారు గోచి పాత్రను మరచిపోరు. ఆ పాత్రలో సునిల్‌ ఒదిగిపోయాడు. సినిమా మొత్తం నవ్విస్తూ.. చివరిలో ఎమోషనల్‌కు గురి చేస్తాడు. జబర్థస్త్‌ రాజమౌళి తనదైన కామెడీతో నవ్వించాడు. పృథ్వి తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. 

సాంకేతికంగా సినిమా బాగుంది. మార్కండేయ అందించిన పాటలు సినిమాకు ప్రధాన బలం. అన్ని పాటలు వినసొంపుగా ఉన్నాయి. నేపథ్య సంగీతం పర్వాలేదు. సినిమాటోగ్రఫీ బాగుంది. గోదావరి అందాలను తెరపై చక్కగా చూపించాడు. ప్రతి ఫ్రేమ్‌ని చాలా రిచ్‌గా చూపించే ప్రయత్నం చేశాడు. ఎడిటింగ్‌ పర్వాలేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి. 
రేటింగ్‌: 2.5/5

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement