'Bhari Taraganam' Movie Review and Rating In Telugu - Sakshi
Sakshi News home page

Bhari Taraganam Movie: ‘భారీ తారాగణం’ మూవీ రివ్యూ

Published Fri, Jun 23 2023 9:41 PM | Last Updated on Sat, Jun 24 2023 10:35 AM

Bhari Taraganam Movie Review and Rating In Telugu - Sakshi

టైటిల్‌: భారీ తారాగణం
నటీ నటులు: సదన్, దీపికా రెడ్డి, రేఖ నిరోష, తదితరులు
దర్శకత్వం: శేఖర్‌ ముత్యాల
నిర్మాత: బి.వి.రెడ్డి
కెమెరా: ఎం.వి గోపి
ఎడిటర్‌: మార్తండ్‌ కె. వెంకటేశ్‌
సంగీతం: సుక్కు
నేపథ్య సంగీతం: సాహిత్య సాగర్‌
కో-ప్రొడ్యూసర్‌: చంద్రశేఖర్‌ గౌడ్‌.వి
కొరియోగ్రాఫర్‌: శ్రీవీర్‌ దేవులపల్లి
పాటలు: సుక్కూ, సాహిత్య, కమల్‌ విహాస్‌, శేఖర్‌ 
బ్యానర్‌: బివిఆర్‌ పిక్చర్స్‌

బివిఆర్ పిక్చర్స్ బ్యానర్‌పై సదన్, దీపికా రెడ్డి, రేఖ నిరోష ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం భారీ తారాగణం. శేఖర్ ముత్యాల దర్శకత్వం వహించిన ఈ సినిమాను బి.వి రెడ్డి నిర్మించాడు. ఈ నెల 23న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.

కథ
ఒక కూతురు , ఒక వైఫ్, ఒక లవర్, ఒక పి.ఎ, ఒక ఫ్రెండ్.. ఇలా ఐదుగురు అమ్మాయిలు వారి వారి జీవితాలో ఎటువంటి సమస్యలు ఎదుర్కొన్నారు? ఆ ప్రాబ్లం నుంచి వారు ఎలా బయట పడ్డారు? ఒకరికి హెల్ప్ చేస్తే అది ఎలాగైనా తిరిగి మనదగ్గరకు వస్తుందనేదే కథ. విశ్వనాధ్ (కేదార్ శంకర్), రఘు (తోటమల్లి మధు) మంచి స్నేహితులు. అయితే విశ్వనాధ్ కొడుకు సదన్(హీరో), రఘు కూతురు ధనలక్ష్మి,(రేఖ నిరోషా)లు చిన్నప్పటి నుంచి ఒకే స్కూల్‌లో చదువుతూ ఎంతో ఆప్యాయంగా ఉన్న వీరిద్దరినీ చూసి పెద్దయిన తరువాత వీరిద్దరికీ పెళ్లి చేయాలనుకుంటారు. అయితే ఉన్నత చదువుల కోసం పట్నం వచ్చి బి.టెక్ లో జాయిన్ అవుతాడు సదన్.

అదే కాలేజీలో చదువుతూ ఎదుటివారికి సహాయం చేయడంలో ముందున్న తార (దీపిక రెడ్డి) ను చూసిన మొదటి చూపులోనే ప్రేమలో పడతాడు. సదన్ చేసే పనులతో ఆ తార కూడా సదన్‌ను ఇష్టపడుతుంది. అయితే తారకు అనుకొని సంఘటనలు ఎదురుకావడంతో సదన్‌కు దూరంగా ఉంటుంది. తన ప్రేమను రిజెక్ట్ చేసిందనే భావనతో అమ్మాయిలు అందరూ అంతే అని తిరిగి తన విలేజ్‌కు వస్తాడు. అయితే రఘు తన కూతురు ధనలక్ష్మి కి పెళ్లి చేయాలని ఎన్ని సంబంధాలు చూసినా ఆమె రిజెక్ట్ చేస్తుంది. చివరికి చిన్నప్పటి ఫ్రెండ్ సదన్‌ను కూడా పెళ్లి చేసుకోను అంటుంది.

మరో వైపు చిట్టెమ్మ దాబా నడుపుతున్న చిట్టెమ్మ (సరయు) కూడా ఎన్నో ఇబ్బందులు పడుతుంటుంది. ఇలా శాంతి (సాహితీ దాసరి), ధనలక్ష్మి,(రేఖ నిరోషా) పరిమళ (స్మైళీ ) అనే ఐదుగురు అమ్మాయిల వారి వారి జీవితాలలో వేరే వేరే సందర్భాల్లో వారు పడుతున్న ప్రాబ్లమ్స్‌ నుంచి తెలివిగా ఎలా బయట పడ్డారు? అనుకోని విధంగా హీరో వీరందరికీ ఎలాంటి సహాయం చేశాడు? సదన్ కు ఈ ఐదుగురు అమ్మాయిలతో ఉన్న లింకేమిటి? అనేది తెలుసుకోవాలి అంటే కచ్చితంగా "భారీ తారాగణం" సినిమా చూడాల్సిందే..

నటీ నటుల పనితీరు
సదన్ పాత్రలో నటించిన అలీ అన్న కొడుకు సదన్ కు ఇది మెదటి చిత్రమైనా నటుడిగా ప్రూవ్‌ చేసుకున్నాడు. హీరోయిన్ పాత్రల్లో నటించిన తార (దీపిక రెడ్డి) తన గ్లామర్‌తో ఆకట్టుకుంది. సెకెండ్ హీరోయిన్‌గా నటించిన ధనలక్ష్మి(రేఖ నిరోషా) కూడా తన నటనతో పర్వాలేదనిపించింది. చిట్టెమ్మ పాత్రలో సరయు, డాక్టర్‌కు పీఏ పాత్రలో నటించిన పరిమళ (స్మైళీ )లు తమ పాత్రల మేర మెప్పించారు. సైకాలజీ డాక్టర్ గా శశిధర్ పాత్రలో సమీర్, చిట్టెమ్మ దాబా ఓనర్‌గా శ్రీను పాత్రలో (ఛత్రపతి శేఖర్), హీరోహీరోయిన్స్‌ తల్లిదండ్రులు విశ్వనాధ్ (కేదార్ శంకర్), రఘు (తోటమల్లి మధు), ఇలా అందరూ తమ నటనతో మెప్పించారు. హీరోకు ఫ్రెండ్స్ గా నటించిన సన్నీ, సత్యలు చాలా చోట్ల నవ్వించే ప్రయత్నం చేశారు. ఇందులో ఆలీ ఒక పాటలో నటించడం విశేషం. పొలిటీషియన్‌గా పోసాని పాత్ర చిన్నదే అయినా కథకు చాలా ఇంపార్టెన్స్ ఉంది.

సాంకేతిక నిపుణుల పనితీరు
ఆడవారు వారి వారి జీవితాలో ఎటువంటి సమస్యలతో ఇబ్బంది పడుతుంటారు? వాటి నుంచి ఎలా బయట పడాలి? అనే కాన్సెప్ట్‌ను సెలెక్ట్ చేసుకొని దీనికి లవ్,కామెడీ థ్రిల్లర్ ను జోడించాడు డైరెక్టర్‌ శేఖర్‌ ముత్యాల. సినిమాకు కావాల్సిన డైలాగ్స్ కొత్త రకంగా ఉండేలా స్క్రీన్ ప్లే రాసుకున్నాడు. తాను రాసుకున్న కథ కథనాలు తెర మీద చూపించడంలో కొంతమేర సక్సెస్‌ అయ్యాడనే చెప్పాలి. కానీ కొన్ని సన్నివేశాలు మరీ సాగదీసినట్లుగా అనిపించక మానవు. సాహిత్య సాగర్ నేపథ్య సంగీతం పర్వాలేదు. సినిమాటోగ్రాఫర్ ఎం.వి గోపి తన కెమెరాతో మంచి విజువల్స్ అందించాడు. దేవరాజ్‌ స్టంట్స్ ఓ మోస్తరుగా ఉన్నాయి. మార్తండ్‌ కె. వెంకటేశ్‌. ఎడిటింగ్ ఇంకాస్త మెరుగ్గా ఉండాల్సింది. బి.వి.రెడ్డి నిర్మాణ విలువలు బాగున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Rating:
Advertisement
 
Advertisement
 
Advertisement