Lifetime Achievement Award
-
సైయెంట్ మోహన్ రెడ్డికి లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఇంటెలిజెంట్ ఇంజనీరింగ్ సేవల సంస్థ సైయెంట్ వ్యవస్థాపక చైర్మన్ బీవీఆర్ మోహన్ రెడ్డికి ప్రతిష్టాత్మక లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ పురస్కారం లభించింది. ఇంజనీరింగ్, టెక్నాలజీ రంగాలకు ఆయన అందించిన సేవలకు గాను ఇన్స్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ (ఐవోడీ) నుంచి గోల్డెన్ పీకాక్ అవార్డును అందుకున్నారు. ఇటీవల లండన్‌లో జరిగిన ఐవోడీ వార్షిక సదస్సులో దీన్ని ప్రదానం చేశారు. మోహన్ రెడ్డి గతంలో నాస్కామ్ చైర్మన్‌గా వ్యవహరించారు. టీ–హబ్ ఫౌండింగ్ డైరెక్టర్లలో ఆయన ఒకరు కాగా, ఐఐటీ హైదరాబాద్, ఐఐటీ రూర్కీ గవర్నర్స్ బోర్డ్‌లకు చైర్మన్‌గా ఉన్నారు. కార్పొరేట్ రంగంలో అత్యుత్తమ ప్రమాణంగా గోల్డెన్ పీకాక్ అవార్డులకు అంతర్జాతీయంగా ప్రత్యేక గుర్తింపు ఉంది. -
ఆగిన హరికథా గంగా ప్రవాహం
హరి కథలు చెప్పడమంటే మాటలు కాదు..అందుకు అద్భుతమైన సంగీత, పాండిత్య ప్రతిభ అవసరం. అది అందరికీ అబ్బే విద్య కాదు. ఈ తరంలో చాలా మందికి హరికథ అంటే తెలియదు. హరికథ అనేది తెలుగువారి సాంప్రదాయంలో ఓ భాగం. సంగీత, సాహిత్య నృత్య, అభినయాల సమ్మేళనమే ఈ హరికథ..ఈ విశిష్ట కళలో తెలుగునాట ప్రసిద్ధి చెందిన హరికథకుడు కోట సచ్చిదానందశాస్త్రి. ఆయన కథ చెప్పే విధానం గంగా ప్రవాహంలా సాగిపోతుంది. తన అద్భుతమైన, అనర్గళమైన వాక్పటిమతో, శ్రావ్యమైన సంగీత, నాద, తాళ పాండిత్యంతో, శ్రోతలను రసమాధుర్యంలో ఓలలాడించే వారు ‘కోట’. ఆయన హరికథంటే జనం ఎడ్లబండ్లు కట్టుకుని వచ్చేవారు... తండోపతండాలుగా వచ్చిన వారితో అక్కడ హౌస్‌ఫుల్... ఆ రోజు సినిమా థియేటర్లలో సెకండ్ షోకు జనం నిల్... చిన్న పిట్టకథలు, చతురోక్తులతో ‘కోట’ కథాగానం జనరంజకంగా సాగేది..మధూకరం చేసుకుంటూ వేదవిద్యను నేర్చుకుని, హరికథను సాధన చేసి, ప్రఖ్యాత హరికథకుడిగా ‘కోట’ ఎదిగారు. 7 దశాబ్దాల సుదీర్ఘ కథాగానంతో భారత ప్రభుత్వంచే ‘పద్మశ్రీ’ స్వీకరించారు. హరికథకు తొలిసారిగా పద్మశ్రీ అందించిన తొలి భాగవతార్‌గా కీర్తిని పొందారు. రామాయణ, భారత, భాగవతాలను గానం చేస్తూ విశేష ప్రాచుర్యం కల్పించారు. 7 దశాబ్దాలుగా దేశవిదేశాల్లో వేలాది ప్రదర్శనలిచ్చారు. శతాధిక కథావారసులను తీర్చిదిద్దారు. 8 పదుల వయసులోనూ కథాగానం చేస్తూ వచ్చారు. అలసిపోయిన ఆ గానం ఇక శాశ్వతంగా మూగబోయింది. తెనాలి: సచ్చిదానంద శాస్త్రి స్వస్థలం ప్రకాశం జిల్లా అద్దంకి. తల్లిదండ్రులు వెంకట శివయ్య, సుబ్బమ్మ. పురోహితుడైన తండ్రి దగ్గరే శాస్త్రి చిన్నతనంలో వేదవిద్య అభ్యసించారు. బ్రాహ్మణ కోడూరులో మధూకర వృత్తితో పమిడిమర్రు సుబ్బావధానులు దగ్గర వేద విద్య నేర్చారు. 14 ఏళ్ల వయసులో తండ్రి మరణంతో అయిదుగురు ఆడపిల్లలు, ఇద్దరు మగబిడ్డల్లో పెద్దవాడైన సచ్చిదానందశాస్త్రిపై కుటుంబ బాధ్యతలు పడ్డాయి. బంధువర్గంలో కళాకారులు, హరికథకులు ఉండటంతో సహజంగానే ఆసక్తి కలిగిన శాస్త్రి..ఒకపక్క పౌరోహిత్యం చేస్తూనే..పరిమి సుబ్రహ్మణ్య భాగవతుల రచనలు చదివి స్వయంగా కథాగానం సాధన చేశారు. తర్వాత అదే జీవనాధారమైంది. విజయవాడలో ఓగిరాల గోపాలం, తణుకులో ముసునూరు సూర్యనారాయణమూర్తి భాగవతులు, తెనాలిలో భాగవతుల అన్నపూర్ణయ్య దగ్గర తన కథాగానాన్ని మెరుగుపరుచుకుంటూ, ప్రదర్శనలిస్తూ వచ్చారు. విజయనగరంలో ఏడేళ్లపాటు ఉండి ఆంధ్ర, ఒడిశా పరిసరాల్లో కథాగానం చేశారు.హరికథను జనరంజకం చేసిన కోట..57 ఏళ్ల క్రితం గుంటూరు చేరుకుని అక్కడే స్థిరపడ్డారు. ఆసక్తి కలిగిన శిష్యులకు శిక్షణనిస్తూ వచ్చారు. చతురోక్తులు, సరస సంభాషణలతో ప్రేక్షకుల మనసు తనపై లగ్నమయ్యేవరకు కాలక్షేపం చేసి, కథాంశంతో హరికథను ఆరంభించేవారు. భక్తిరస సినిమా పాటలు, సున్నితమైన హాస్య సంభాషణలను చొప్పించటం, నృత్యాలు, అభినయం, నాటకీయతను చేర్చి హరికథను జనరంజకం చేశారు. ఈ ప్రత్యేకతతో వారికి ఎంతో డిమాండ్ ఏర్పడింది. ఒక్కరోజు విరామం లేకుండా హరికథలు చెప్పేవారు. బొత్తిగా చదువులేని వారికీ విద్య నేర్పారు. ఎలాంటి ప్రతిఫలం తీసుకోలేదు. వారంతా హరికథ వృత్తిగా స్థిరపడినవారే. ఆకాశవాణిలో ఆయన టాప్ ఏ గ్రేడ్ ఆరి్టస్టు. ముఖ్యమైన పట్టణాలు, పుణ్యక్షేత్రాలు, లండన్, మారిషస్ వంటి దేశాల్లోనూ ప్రదర్శనలిచ్చారు. కంచిలోని పరమాచార్యులు చంద్రశేఖర సరస్వతి, శృంగేరీ పీఠాధిపతి, త్రిదండి చినజీయర్‌స్వామి, కుర్తాళం పీఠాధిపతుల సమక్షంలో కథాగానం చేశారు. టంగుటూరి ప్రకాశం పంతులు, ఆచార్య రంగా, నీలం సంజీవరెడ్డి, బ్రహా్మనందరెడ్డి, తెన్నేటి విశ్వనాథం వంటి ప్రముఖులు సచ్చిదానందశాస్త్రి కథాగానానికి పరవశులయ్యారు. కోట్ల విజయభాస్కరరెడ్డి వీణను బహూకరిస్తే, ఎస్పీ బాలు చేతులమీదుగా అభిమానులు స్వర్ణకంకణం తొడిగారు. రాష్ట్ర ప్రభుత్వం ‘కళారత్న’తో గౌరవించింది. విజయనగరం మహారాజా కళాశాల శతజయంతి ఉత్సవాల్లో హరికథా పితామహ ఆది¿¶భట్ల నారాయణదాసు పురస్కారంతో సచ్చిదానందను సత్కరించారు. హరికథా త్రిమూర్తులుగా పేరొందిన ఆదిభట్ల నారాయణదాసు, పెద్దింటి సూర్యనారాయణ దీక్షిత్, పరిమి సుబ్రహ్మణ్యం భాగవతులు ఆరాధన ఉత్సవాలను గత 26 ఏళ్లుగా నిర్వహిస్తున్నారు సచ్చిదానందశాస్త్రి. కోట హరికథాగాన కళాపీఠం పేరుతో జరిపే ఆ ఉత్సవాల్లో 25–30 ప్రోగ్రాములు, ప్రతిరోజూ అన్నదానం, ఏడు పదులు పైబడిన హరికథకులను సత్కరిస్తూ వస్తున్నారు. ‘హరికథ సజీవకళ. దీనిని ఉద్ధరించాలి’ అనేది సచ్చిదానందశాస్త్రి ఆశయం. ‘ఆదిభట్ల’తో సహా ఏ ఒక్క హరికథకుడిì కీ దక్కని పద్మశ్రీ గౌరవం తనకు దక్కటం అదృష్టమని చెప్పారు. ప్రతి దేవస్ధానంలో ఒక హరికథకుడిని నిర్ణయించటం, సంప్రదాయ కళారూపాల కోసం ఒక విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయగలిగితే కళలు పదికాలాలపాటు నిలిచి ఉంటాయని చెప్పేవారు..గుంటూరులోసచ్చిదానందశాస్త్రి తుదిశ్వాసనగరంపాలెం: ప్రముఖ హరికథా భాగవతార్, పద్మశ్రీ అవార్డు గ్రహీత కోట సచ్చిదానందశాస్త్రి (90) కన్నుమూశారు. వృద్ధాప్యంతో బాధపడుతోన్న ఆయన సోమవారం రాత్రి గుంటూరు అమరావతిరోడ్లోని ఆయన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఆయనకు భార్య సీతాదేవి, కుమారులు శివశాస్త్రి, శ్రీరామచంద్రమూర్తి, కృష్ణ మోహన్, కుమార్తె దుర్గవెంకటసుబ్బలక్ష్మీ ఉన్నారు. ఆయన భార్య గతంలోనే చనిపోయారు. సోమవారం సాయంత్రం అంత్యక్రియలను గుంటూరు బొంగరాల బీడు శ్మశానవాటికలో నిర్వహించినట్లు పెద్ద కుమారుడు శివశాస్త్రి తెలిపారు. సచ్చిదానందశాస్త్రి గతేడాది జనవరిలో పద్మశ్రీ అవార్డు, 2022లో సంగీతనాటక అకాడమి అవార్డు, 2023 నవంబర్‌లో వైఎస్సార్ లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డు, 2015లో హంసా పురస్కారం, 2009లో కొప్పరపు కవుల పురస్కారాలను అందుకున్నారు. -
ప్రియా సిస్టర్స్‌కు జీవన సాఫల్య పురస్కారం...
ప్రముఖ సంగీత విద్వాంసులు, ప్రియా సిస్టర్స్‌గా పేరొందిన అక్కాచెల్లెళ్లు హరిప్రియా, షణ్ముఖప్రియలకు జీవన సాఫల్య పురస్కార ప్రదానం చేస్తున్నారు. శ్రీ వాసవీ ఆర్ట్స్ ఆధ్వర్యంలో దివంగత మాజీ ముఖ్యమంత్రి, కె.రోశయ్య 91వ జయంతి సందర్భంగా నగరంలోని రవీంద్రభారతిలో సాయంత్రం 5.45గంటల నుంచి ఈ కార్యక్రమం జరుగనుంది. పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు పాల్గొంటున్నారని నిర్వాహకులు తెలిపారు. -
గుర్నానీకి హైసియా పురస్కారం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: టెక్ మహీంద్రా మాజీ సీఈవో, ఎండీ సి.పి.గుర్నానీ హైదరాబాద్ సాఫ్ట్వేర్ ఎంటర్ప్రైసెస్ అసోసియేషన్ (హైసియా) నుంచి జీవిత కాల సాఫల్య పురస్కారం అందుకున్నారు. హైసియా 31వ జాతీయ సదస్సు, అవార్డుల కార్యక్రమం బుధవారం హైదరాబాద్‌లో జరిగింది. 2022–23 సంవత్సరానికిగాను వివిధ విభాగాల్లో మొత్తం 36 కంపెనీలు, వ్యక్తులు హైసియా అవార్డులు అందుకున్నారు. తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. -
రవిశాస్త్రికి జీవిత సాఫల్య పురస్కారం
సాక్షి, హైదరాబాద్: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) మాజీ కెప్టెన్ , మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రికి జీవిత సాఫల్య పురస్కారాన్ని అందజేసింది. 1983లో భారత్ నెగ్గిన తొలి వన్డే ప్రపంచకప్ విజేత సభ్యుడైన రవిశాస్త్రి అంతర్జాతీయ కెరీర్ అనంతరం టీవీ వ్యాఖ్యతగా బుల్లితెర ప్రేక్షకుల్ని అలరించారు. తదనంతరం భారత పురుషుల టీమ్ డైరెక్టర్‌గా, హెడ్ కోచ్‌గా విజయవంతమయ్యారు. టెస్టులు, వన్డేలు, టి20ల్లో జట్టును మరో దశకు తీసుకెళ్లారు. ఓ ఆటగాడిగా, కోచ్‌గా రవిశాస్త్రి దేశానికి చేసిన సేవల్ని గుర్తించిన బీసీసీఐ 2019–20 సీజన్‌కుగాను ‘సీకే నాయుడు లైఫ్‌టైమ్ అచీవ్మెంట్’ (జీవిత సాఫల్య) అవార్డుతో సత్కరించింది. ఆయనతో పాటు ఫరూఖ్ ఇంజినీర్‌కు జీవిత సాఫల్య పురస్కారాన్ని అందజేసింది. పురుషుల విభాగంలో అంతర్జాతీయ క్రికెట్లో రాణించిన ఆటగాళ్లకు ఇచ్చే ‘పాలీ ఉమ్రీగర్ బెస్ట్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్’ అవార్డుల్ని 2019–20 సీజన్‌కుగాను షమీ, అశి్వన్ (2020–21), జస్ప్రీత్ బుమ్రా (2021–22), శుబ్‌మన్ గిల్ (2022–23) అందుకున్నారు. మహిళల కేటగిరీలో బెస్ట్ క్రికెటర్ అవార్డుల్ని దీప్తి శర్మ (2019–20, 2022–23), స్మృతి మంధాన (2020–21, 2021–22) గెలుచుకున్నారు. ఓపెనింగ్‌లో చిచ్చర పిడుగల్లే రాణిస్తున్న యశస్వి జైస్వాల్ 2022–23 సీజన్‌కు ఉత్తమ అంతర్జాతీయ అరంగేట్రం అవార్డు చేజిక్కించుకున్నాడు. ఈ విభాగంలో మయాంక్ అగర్వాల్ (2019, 20), అక్షర్ పటేల్ (2020–21), శ్రేయస్ అయ్యర్ (2021–22)లకు అవార్దులు దక్కాయి. కరోనా మహమ్మారి వల్ల 2019–20, 2020–21, 2021–22, 2022–23 సీజన్లలో బీసీసీఐ వార్షిక అవార్డులు ప్రదానం చేయలేకపోయారు. దీంతో మంగళవారం ఓ స్టార్ హోటల్లో నిర్వహించిన వేడుకలో నాలుగు సీజన్లకు సంబంధించిన పురుషులు, మహిళల, దేశవాళీ క్రికెటర్లకు అవార్డుల్ని ఒకేసారి ప్రదానం చేశారు. -
నీ కోసం కథలు రాసి
‘ఇంటి మూలన వంట గది’ ‘అడవిలో హరిణి’ ‘సంధ్య వెలుతురు’... సి.ఎస్.లక్ష్మి అనే చిత్తూరు సుబ్రహ్మణ్యం లక్ష్మి కథల సంపుటాల పేర్లు ఇవి. ‘అంబై’ కలం పేరుతో తమిళంలో స్త్రీల పారంపరిక బంధనాలను ప్రశ్నించే కథలు రాస్తున్న సి.ఎస్.లక్ష్మికి ప్రతిష్టాత్మక ‘టాటా లిటరేచర్ లైఫ్‌టైమ్ అవార్డు’ ఈ సంవత్సరానికి ప్రకటించారు. ‘స్పారో’ అనే సంస్థను స్థాపించి మహిళా సాహిత్యకారుల చరిత్రను నిక్షిప్తం చేస్తున్న లక్ష్మి పరిచయం... ఆలోచనలు... ‘నన్ను మహిళా రచయిత అని ప్రత్యేకంగా పిలవొద్దు. పురుషులు ఏం రాసినా వారిని పురుష రచయిత అంటున్నారా? మమ్మల్ని మాత్రం మహిళా రచయితలు అనడం ఎందుకు? మమ్మల్ని కూడా రచయితలు అనే పిలవండి’ అంటారు సి.ఎస్.లక్ష్మి. ‘అంబై’ కలం పేరుతో తమిళ పాఠకులకు సుదీర్ఘకాలంగా అభిమాన రచయిత్రిగా ఉన్న సి.ఎస్.లక్ష్మి ఒకటీ రెండు నవలలు రాసినా ఎక్కువగా అంకితమైంది కథలకే. అదీ స్త్రీల కథలకి. తమిళంలో స్త్రీవాద దృక్పథంతో రాసి ఒక కదలిక తేగలిగిన రచయితల్లో సి.ఎస్.లక్ష్మి ప్రముఖులు. సుదీర్ఘ కాలంగా తాను ఆశించిన స్త్రీ వికాసం కోసం కలాన్ని అంకితం చేయడం వల్లే ఆమెకు ‘టాటా లిటరేచర్ లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డు’ 2023 సంవత్సరానికి ప్రకటించారు. టాటా సన్స్ ప్రతినిధి హరీష్ భట్ ఈ విషయాన్ని తెలియచేస్తూ ‘స్త్రీలు తాము మోయక తప్పని మూసలను లక్ష్మి తన కథల ద్వారా బద్దలు కొడుతూనే వచ్చారు’ అని వ్యాఖ్యానించారు. ఈ ప్రతిష్టాత్మక అవార్డును గతంలో అందుకున్న వారిలో వి.ఎస్.నైపాల్, మహాశ్వేతా దేవి, రస్కిన్ బాండ్, గిరిష్ కర్నాడ్ తదితరులు ఉన్నారు. ఊరు కోయంబత్తూరు కోయంబత్తూరులో జన్మించిన అంబై ఢిల్లీలోని జె.ఎన్.యు నుంచి పిహెచ్.డి పట్టా పొందారు. తమిళనాడులో అధ్యాపకురాలిగా పని చేస్తూ కథలు రాశారు. డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్ విష్ణు మాథూర్‌ని వివాహం చేసుకుని తర్వాతి కాలంలో ముంబైలో స్థిరపడ్డారు. 18 ఏళ్ల వయసులో తొలిసారి పిల్లల కోసం ‘నందిమలై చరలిలె’ (నందిమల కొండల్లో) అనే డిటెక్టివ్ నవలతో ఆమె రచనా జీవితం మొదలైనా 1967లో రాసిన ‘సిరగుగల్ మురియుమ్’(రెక్కలు విరిగిపోతాయి) అనే కథతో సిసలైన బాట పట్టారు. స్త్రీ స్వేచ్ఛ, సమానత్వం, స్త్రీవాద దృక్పథం గురించి తమిళంలో తొలిసారి గొంతు విప్పిన రచయిత్రి ఆమేనని విమర్శకులు అంటారు. సంప్రదాయం, ఆచారాలు మహిళల్ని ప్రత్యక్షంగా పరోక్షంగా అణచివేస్తున్నాయో ఆమె తన కథల్లో వివరించే ప్రయత్నం చేశారు. తప్పక చదవాల్సిన తమిళ కథల్లో అంబై రాసిన ‘వీట్టిన్ మూలై ఒరు సమేలరై’, ‘అమ్మా ఒరు కొలై సెయ్దల్’, ‘కరుప్పు కుదిరై చతుక్కుమ్’ కథలు ఉంటాయని రచయిత జయమోహన్ పేర్కొన్నారు. 2021లో అంబైకు సాహిత్య అకాడెమీ పురస్కారం దక్కింది. కలం పేరు వెనుక కథ తన కలం పేరు ‘అంబై’గా మార్చుకోవడానికి వెనకున్న కథను గతంలో వెల్లడించారామె. శుక్రవారం పుట్టే ఆడపిల్లలకు ‘లక్ష్మి’ అనే పేరు పెడతారని, తనకూ అదే పేరు పెడితే ఆ పేరుతోనే కథలు రాయాలపించలేదని చెప్పారు. తమిళ సీనియర్ రచయిత దేవన్ రాసిన ‘పార్వతిన్ సంగల్పం (పార్వతి సంకల్పం)’ నవలలో భర్త చేత అణచివేతకు గురైన ఓ భార్య తన పేరును అంబైగా మార్చుకొని రాయడం మొదలు పెడుతుందని, అదే తనకు స్ఫూర్తినిచ్చి కలం పేరును అంబైగా మార్చుకున్నానని తెలిపారు. సాహితీ కార్యకర్త సి.ఎస్.లక్ష్మి కేవలం రాయడమే కాదు చాలా సాహితీ కార్యక్రమాలు చేస్తారు. తమిళంలో మహిళా సాహిత్యం గురించి ఆమె చేసిన పరిశోధన ముఖ్యమైనది. 1994లో చెన్నైలో స్థాపించిన రోజ ముత్తయ్య రీసెర్చ్ లైబ్రరీ ఏర్పాటు వెనుక అంబై కీలకంగా నిలిచారు. ప్రపంచంలోని అతి పెద్ద ప్రైవేటు లైబ్రరీల్లో ఇదీ ఒకటి కావడం విశేషం. ప్రస్తుతం ఇక్కడ మూడు లక్షల పుస్తకాల దాకా ఉన్నాయి. అలాగే 1988లో SPARROW (Sound and Picture Archives for Research on Women) అనే ఎన్జీవో ప్రారంభించారు. మహిళా రచయితలు, మహిళా కళాకారుల రచనలు, ప్రతిభ, వారి కృషిని డాక్యుమెంట్ చేయడం, నిక్షిప్తం చేయడం ఆ సంస్థ లక్ష్యం. ప్రస్తుతం ఆమె ఆ సంస్థకు అధ్యక్షురాలిగా ఉన్నారు. తన సంస్థ తరఫున అనేక పుస్తకాలు ప్రచురించారు. -
బిజినెస్ లీడర్ 'అట్లూరి'కి లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డు
అమెరికాలోని భారతీయ తెలుగు కమ్యూనిటీ వ్యాపార ప్రముఖులలో ఒకరైన 'అట్లూరి'కి ఇండియా స్టార్టప్ ఫెస్ట్-2023 (ఐఎస్ఎఫ్ 2023) ఈవెంట్లో 'లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డు' లభించింది. దశాబ్దాలుగా వ్యాపార ఆలోచనలతో అనేక ఔత్సాహిక స్టార్టప్ ఆలోచనలకు వేదికగా పనిచేసిన CXO ఫోరమ్ రూపశిల్పిగా ఉన్నందుకు ఈ అవార్డును అందుకున్నట్లు సమాచారం. స్టార్టప్‌లలో చాలా మంది ఒకే విధమైన ఆలోచనను కలిగి ఉంటారు. కానీ కొత్త సాంకేతికతలు, మార్కెట్ పోకడలను అవలంబించడం ద్వారా వారు అభివృద్ధి చెందాలని అట్లూరి ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో శివకుమార్ సూరంపూడి (ఐటీసీ లిమిటెడ్‌లోని అగ్రి & ఐటీ బిజినెస్ గ్రూప్ హెడ్), డా.డి నాగేశ్వర్ రెడ్డి (ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ & ఏఐజీ హాస్పిటల్స్‌లో గ్యాస్ట్రో ఎంటరాలజీ ఛైర్మన్ & చీఫ్), వినీత్ రాయ్ (ఆవిష్కార్ గ్రూప్ వ్యవస్థాపకుడు & ఛైర్మన్) డా.గల్లా రామచంద్ర నాయుడు (అమర రాజా గ్రూప్ వ్యవస్థాపక చైర్మన్), డా.పి రాజ మోహన్ రావు (యునైటెడ్ టెలికామ్స్ గ్రూప్ చైర్మన్) మొదలైన వారికి కూడా అవార్డులు అందించినట్లు సమాచారం. -
పర్యావరణ విధ్వంసంతోనే వాతావరణ మార్పులు
సాక్షి, న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పర్యావరణ విధ్యంసం కారణంగానే వాతావరణంలో అనూహ్య మార్పులు చోటు చేసుకుంటున్నాయని ప్రముఖ పర్యావరణవేత్త ప్రొఫెసర్ కె.పురుషోత్తంరెడ్డి తెలిపారు. వాతావరణ మార్పుల కారణంగా అతి తక్కువ సమయంలో భారీ వర్షాలు, తీవ్రమైన తుపానులు వంటి వాతావరణ పరిస్థితులు ఏర్పడుతున్నాయన్నారు. ఇప్పటి నుంచి రేయింబవళ్లు యుద్ధప్రాతిపదికన శ్రమిస్తే తప్ప పర్యావరణానికి జరిగిన నష్టాన్ని పూడ్చలేని పరిస్థితి ఉందని... తక్షణమే శిలాజ ఇంధనాల వినియోగాన్ని తగ్గించి, ప్రత్యామ్నాయ ఇంధన వనరుల వినియోగం పెరగాలని పురుషోత్తమ్‌రెడ్డి సూచించారు. ఆదివారం ఢిల్లీలోని ఇండియా ఇస్లామిక్ కల్చరల్ సెంటర్లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో కేపిటల్ ఫౌండేషన్ సంస్థ ప్రొఫెసర్ పురుషోత్తమ్‌రెడ్డికి లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డ్‌ను అందించింది. పశ్చిమ బెంగాల్ గవర్నర్ డా. సీవీ ఆనందబోస్ చేతుల మీదుగా ఈ అవార్డు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్, అటార్నీ జనరల్ ఆర్.వెంకట రమణి, జస్టిస్ ఏకే పట్నాయక్ తదితరులు అతిథులుగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పురుషోత్తంరెడ్డితో పాటు సామాజికంగా వివిధ రంగాల్లో సేవలు అందించిన పలువురికి అవార్డులు అందించారు. ఈ సందర్భంగా పురుషోత్తమ్‌రెడ్డి మాట్లాడుతూ, పర్యావరణం, సుస్థిరాభివృద్ధి రంగంలో గత 50 ఏళ్లుగా తాను చేస్తున్న కృషికి గుర్తింపుగా ఈ అవార్డు లభించిందన్నారు. మన దేశంలో పర్యావరణ చట్టాలు బాగున్నప్పటికీ... వాటి అమలు మాత్రం సరిగా జరగడం లేదని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వాలు స్థానిక యంత్రాంగాలను నిర్వీర్యం చేస్తున్నాయని.. ఇసుక వంటి ప్రకృతి వనరుల దోపిడీని అరికట్టాల్సింది స్థానిక యంత్రాంగాలేనని తెలిపారు. భారత్‌లో అంతులేని సౌరశక్తి ఉందని, దానిని ఉపయోగించుకోవడం ద్వారా సంప్రదాయ ఇంధన వినియోగాన్ని తగ్గించుకోవాలని ఆయన సూచించారు. -
కమల్ హాసన్ ఖాతాలో మరో అరుదైన అవార్డు
నటుడు కమల్‌హాసన్ గురించి ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. నటుడు నిర్మాత దర్శకుడు గాయకుడు రచయిత ఇలా పలు ముఖాలు కలిగిన అరుదైన కళాకారుడు కమలహాసన్. తమిళం తెలుగు మలయాళం హిందీ వంటి పలు భాషల్లో కథానాయకుడిగా విజయాలను సాధించిన నటుడు ఈయన. అంతేకాకుండా పలు సరికొత్త విషయాలను సినిమాకు పరిచయం చేసిన ఘనత కూడా కమలహాసన్‌కే చెందుతుంది. (చదవండి: విడిపోవద్దురా అన్నాడు.. కన్నీళ్లు పెట్టుకున్న కోటి) పలు భాషల్లో ఇప్పటికే 232 చిత్రాల్లో నటించిన కమలహాసన్ ఇటీవల తన సొంత బ్యానర్లో నిర్మించి కథానాయకుడిగా నటించిన విక్రమ్ చిత్రం సంచలన విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో నటిస్తున్న ఇండియన్– 2 ఈయనకు 233వ చిత్రం అవుతుంది. తదుపరి తన 234 చిత్రాన్ని మణిరత్నం దర్శకత్వంలో చేయడానికి సిద్ధమవుతున్నారు. ఇక నిర్మాతగాను నటుడు ధనుష్, శింబు, శివకార్తికేయన్ వంటి స్టార్ హీరోలతో చిత్రాలు నిర్మిస్తున్నారు. ఇకపోతే ఈయన ఇప్పటికే పలు రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలను అందుకున్నారు. కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ, పద్మ విభూషణ్ వంటి అత్యున్నత అవార్డులతో సత్కరించింది. కాగా తాజాగా ఈ విశ్వనటుడు విశ్వ వేదికపై జీవిత సాఫల్య అవార్డును అందుకోబోతున్నారు. ఈ నెల 27వ తేదీన అబుదాబిలో జరగనున్న అంతర్జాతీయ భారతీ య చలనచిత్రోత్సవ వేడుకల్లో కమల్‌కు లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డును ప్రదానం చేయనున్నట్లు నిర్వాహకులు ప్రకటించడం గమనార్హం. -
చరిత్ర సృష్టించబోతున్న సంగీత దర్శకుడు కోటి
తెలుగు సినిమా చరిత్రలో మొట్టమొదటి సారి ఒక సంగీత దర్శకుడికి పర దేశ (ఆస్ట్రేలియాలోని న్యూ సౌత్ వేల్స్) పార్లమెంట్లో గౌరవ జీవిత సాఫల్య పురస్కారం లభించబోతోంది. అది మరెవరికో కాదు, మూడున్నర దశాబ్దాల పాటు తెలుగు పాటల ప్రపంచాన్ని ఉర్రూతలూగించి, మన అభిమాన హీరోల సినిమాకి అద్భుతమైన సంగీతాన్ని అందించి, మన గుండెల్లో ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకున్న సాలూరి రాజేశ్వరరావు గారి అబ్బాయి కోటికి! కోటి తెలుగు సినిమా సంగీతానికి చేసిన సేవలకు గాను గుర్తింపుగా ఆస్ట్రేలియా ఇండియన్ స్పోర్ట్స్ ఎడ్యుకేషన్ అండ్ కల్చరల్ సొసైటీ ఈ జీవిత సాఫల్య పురస్కారాన్ని అందించనుంది. అంతే కాకుండా కోటి అక్కడ ఉన్న మన తెలుగు గాయనితో ఒక పాట కూడా పాడించబోతున్నారు. ఆ గాయని మరెవరో కాదు, తన మొదటి పాటతోనే ఆసియా రికార్డు పుస్తకంలో స్థానం దక్కించుకున్న మన తెలుగింటి ఆడపడుచు సుస్మిత రాజేష్. హరుడే వరుడై, హర హర శంభో తర్వాత మరో వినూత్నమైన పాటతో, కొత్త కలయికతో మన ముందుకు వస్తున్నారు సుస్మిత. ఈ సందర్భంగా ఆస్ట్రేలియాలోని AISECS అడ్వైజర్ రాజేష్ ఉప్పల మాట్లాడుతూ.. ఇటువంటి కార్యక్రమాలు ఇరుదేశాల మధ్య సాంస్కృతిక సంబంధాలు మరింత పెంపొందించడానికి దోహదపడతాయన్నారు. 4 వేల పాటల మైలురాయిని దాటిన కోటిని ఆస్ట్రేలియాలోని పార్లమెంట్లో గెస్ట్ ఆఫ్ హానర్‌గా పిలవడం తమకెంతో ఆనందంగా ఉందని తెలియజేశారు. చదవండి: పెళ్లికి ముందు, నాకూ, నా భర్తకు వేరేవాళ్లతో ఎఫైర్లు: ప్రియాంక చోప్రా -
ఆస్ట్రేలియాలో సంగీత దర్శకుడు కోటికి గౌరవ పురస్కారం
-
Artist Vijaya Lakshmi: సంకల్పానికి చిత్రరూపం
ఆమె చిత్రలేఖనంలో మనకు కనిపించేది ఒక రూపం కాదు... అనేకం. బుద్ధుడి బొమ్మలో కేవలం బుద్ధుడు మాత్రమే కాదు... బ్రష్ పట్టుకుని... తదేక దీక్షతో బుద్ధుడి బొమ్మ వేస్తున్న ఓ టీనేజ్ అమ్మాయి కూడా ఉంటుంది. రవివర్మ కుంచెకు అందిన అందం... విజయలక్ష్మి చిత్రాల్లో ద్యోతకమవుతుంది. తెలంగాణ రాష్ట్రం, మేడ్చల్– మల్కాజ్గిరి జిల్లా, శామిర్ పేట మండలంలో ఉంది తుర్కపల్లి. ఆ ఊరిలో అత్యంత సాధారణ కుటుంబంలో పుట్టిన అమ్మాయి చిత్రలేఖనంతో ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డు అందుకుంది. కళారత్న, అబ్దుల్ కలామ్ అవార్డులతోపాటు లెక్కలేనన్ని పురస్కారాలు, ప్రశంసలు ఆమె సొంతమయ్యాయి. తన రంగుల ప్రస్థానాన్ని, ఒక చిత్రంలో లెక్కకు మించిన వివరాలను పొందుపరచడంలో తన అభిరుచిని, బొమ్మల పట్ల తన ఇష్టాన్ని సాక్షితో పంచుకున్నారు విజయలక్ష్మి. అసాధారణమైన ప్రతిభ ‘‘నా జీవితంలో బొమ్మలు ఎప్పుడు ప్రవేశించాయో స్పష్టంగా చెప్పలేను. ఎందుకంటే నా దృష్టిని ఆకర్షించిన దృశ్యాలకు చిత్రరూపం ఇవ్వడం నా బాల్యంలోనే మొదలైంది. నన్ను స్కూల్‌కి మా అన్న తీసుకు వెళ్లి, తీసుకువచ్చేవాడు. నాకు చదువంటే చాలా ఇష్టం. ఇంటికి వచ్చిన తర్వాత కూడా పుస్తకాలే నా లోకం. అందులోని బొమ్మలే నా స్నేహితులు. అందరి పిల్లల్లా ఆడుకోవడం నాకు కుదరదు కదా. అందుకే చదువుకుంటూ, బొమ్మలేసుకుంటూ పెరిగాను. టెన్త్‌క్లాస్ తర్వాత కాలేజ్కెళ్లడం కష్టమైంది. కొన్నేళ్ల విరామంలో సైకాలజీ, ప్రముఖుల బయోగ్రఫీలు, భగవద్గీత... అదీ ఇదీ అనే తేడా లేకుండా నాకు దొరికిన ప్రతి పుస్తకాన్నీ చదివాను. ఆ తర్వాత డిస్టెన్స్ ఎడ్యుకేషన్‌లో డిగ్రీ చేశాను. చదివేకొద్దీ నా ఆలోచన పరిధి విస్తృతం కాసాగింది. నా గురించి నేను ఆలోచించడమూ ఎక్కువైంది. ఒక వ్యక్తి అసాధారణమైన నైపుణ్యాలను సాధించినప్పుడు ఆ వ్యక్తిని ఆ ప్రత్యేకతలతోనే గుర్తిస్తారు. ఇతర లోపాలున్నా సరే అవి తొలుత గుర్తుకురావు. నాకు ఎడమ చెయ్యి మాత్రమే మామూలుగా పని చేస్తుంది. రెండు కాళ్లు, కుడి చెయ్యి చిన్నప్పుడే పోలియో భూతం బారిన పడ్డాయి. నా పేరు విన్న వెంటనే కాన్వాస్ మీద అద్భుతాలు సృష్టించగలిగిన ఒక చిత్రకారిణి గుర్తుకురావాలి. సమాజం ఒక సాధారణ వ్యక్తిని సాధారణంగానే గుర్తిస్తుంది. ఒక నైపుణ్యమో, వైకల్యమో ఉన్నప్పుడు వ్యక్తిగా గుర్తించడానికంటే ముందు నైపుణ్యం, వైకల్యాలతోనే పరిగణనలోకి తీసుకుంటుంది. పోలియో బాధితురాలిగా ఐడెంటిఫై కావడం కంటే విజయలక్ష్మి అంటే చిత్రలేఖనం గుర్తుకు వచ్చేటంతగా రాణించాలనుకున్నాను. అందుకోసమే అహర్నిశలూ శ్రమించాను. నేను చూసిన దృశ్యాల నుంచి నా బొమ్మల పరిధిని విస్తరించాను. నేను చదివిన పుస్తకాల నుంచి ఇతివృత్తాలను రూపుదిద్దుకున్నాను. అన్నింటికీ మించి రాజా రవివర్మ నుంచి స్ఫూర్తి పొందాను. రవీంద్రభారతిలో పురస్కారాలు చిత్రకారిణిగా గుర్తింపు రావడమే కాదు, పురస్కారాలను రవీంద్రభారతిలో అందుకోగలిగాను. రవీంద్రభారతిలో అందుకోవడం కూడా ఒక పురస్కారంగానే భావిస్తాను. 2019లో నా చిత్రాలను తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ప్రదర్శించే అవకాశం వచ్చింది. అలాగే హైదరాబాద్‌లోని స్టేట్ ఆర్ట్ గ్యాలరీ, సాలార్జంగ్ మ్యూజియంతోపాటు ఢిల్లీలోనూ ప్రదర్శితమయ్యాయి. మనలో ఆత్మవిశ్వాసం, అకుంఠిత దీక్ష, సంకల్పబలం ఉంటే భగవంతుడు అవకాశం ఇచ్చి తీరుతాడని నమ్ముతాను. ఓ సంస్థ నా అవసరాన్ని గుర్తించి డెబ్బై వేల విలువ చేసే ఎలక్ట్రానిక్ వీల్‌చైర్ విరాళంగా ఇచ్చింది. అది కూడా భగవంతుడు పంపినట్లే. స్ఫూర్తిప్రదాతగా... నేను రాజా రవివర్మ నుంచి స్ఫూర్తి పొందితే, నన్ను స్ఫూర్తిగా తీసుకుంటున్న కొత్తతరం ఉండడం నాకు సంతోషంగా ఉంది. నేను చదువుకున్న స్కూల్లో నా బొమ్మలను ప్రదర్శించినప్పుడు నాకా సంగతి తెలిసింది. జీవితాన్ని నిస్సారంగా గడిపేయకూడదు, స్ఫూర్తిమంతంగా ఉండాలని కోరుకుంటాను. సోషల్ మీడియాను నూటికి నూరుశాతం వినియోగించుకున్నాననే చెప్పాలి. సోషల్ మీడియా వేదికగానే ఇన్‌ఫ్లూయెన్సర్‌ని కాగలిగాను. తలసేమియా వ్యాధిగ్రస్థులకు రక్తం కోసం ఏడాదికి మూడుసార్లు బ్లడ్ డొనేషన్ క్యాంపులు నిర్వహిస్తున్నాను. మా ఊరి కుర్రాళ్లు ‘ఏం చేయాలో చెప్పక్కా, మేము చేసి పెడతాం’ అని ఉత్సాహంగా సహాయం చేస్తున్నారు. ‘వీల్‌చైర్ నుంచి నేను ఇన్ని చేస్తుంటే హాయిగా నడవగలిగిన వాళ్లు ఎందుకు చేయలేరు. స్థిరచిత్తం ఉంటే ఏదైనా సాధ్యమే’నని వీడియోల్లో చెబుతుంటాను’’ అని సంతోషంగా తన బొమ్మలలోకాన్ని వివరించింది విజయలక్ష్మి. బుద్ధుడి వెనుక యువతి విజయలక్ష్మి చిత్రలేఖనంలో ఉన్న అమ్మాయి అచ్చమైన తెలుగుదనంతో ఒత్తైన జడ వేసుకుని ఉంటుంది. ఆ జడను అలంకరించి పూలు కూడా అచ్చం పూలను పోలినట్లే తెల్లటి పువ్వులో పసుపువర్ణంలో పువ్వు మధ్యభాగం కూడా స్పష్టంగా కనిపిస్తుంది. ఆ అమ్మాయి చెవి జుంకీలకున్న నగిషీలు కూడా. అలాగే మరో చిత్రలేఖనం ఇంకా అద్భుతం... మన దృష్టి అభయ ముద్రలో ఉన్న బుద్ధుడి మీద కేంద్రీకృతమవుతుంది. బుద్ధుని పాదాల వద్దనున్న కమలం మీద, బుద్ధుడి శిఖ, శిఖ వెనుకనున్న కాంతివలయాన్ని కూడా చూస్తాం. ఆ తర్వాత మన దృష్టికి వస్తుందో అద్భుతం. ఆ బుద్ధుడి బొమ్మ ఉన్నది కేవలం కాన్వాస్ మీద కాదు. ఒక యువతి వీపు మీద. అటువైపు తిరిగి కూర్చుని ఉన్న యువతిని చిత్రీకరించిన తర్వాత ఆమె వీపు మీద చూపరులకు అభిముఖంగా ఉన్న బుద్ధుడిని చిత్రించింది విజయలక్ష్మి. – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
పుప్పాల శ్రీనివాస్‌కు లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డు
సాక్షి, హైదరాబాద్: రోడ్డు ప్రమాదాల నియంత్రణ కోసం విస్తృతమైన సేవలందిస్తున్న రహదారి భద్రతా నిపుణుడు, డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ పుప్పాల శ్రీనివాస్‌కు లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ లభించింది. శనివారం అహ్మదాబాద్‌లో జరిగిన ఓహెచ్ఎస్ఎస్ఏఐ ఫౌండేషన్ 7వ వార్షికోత్సవం సందర్భంగా ఆరోగ్యం, భద్రత, పర్యావరణం, సుస్థిరత అంశాల్లో విశేష సేవలందించిన ప్రముఖులకు అవార్డులను అందజేశారు. ఈ సందర్భంగా రహదారి భద్రతపై విస్తృతంగా పని చేయడంతో పాటు, పలు జాతీయ, అంతర్జాతీయ సదస్సుల్లో పాల్గొని రోడ్డు భద్రతపై పరిశోధన పత్రాలను అందజేసినందుకుగాను పుప్పాల శ్రీనివాస్‌కు ఈ పురస్కారం దక్కింది. రోడ్డు ప్రమాదాల నియంత్రణ కోసం యువతను, విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని అనేక అవగాహన కార్యక్రమాలను నిర్వహించారు. మూడు దశాబ్దాలుగా ఈ రంగంలో పుప్పాల చేస్తున్న సేవలు అభినందనీయమని, దేశంలో రహదారిభద్రతా ఉద్యమానికి ఎంతో దోహదం చేశాయని ఈ సందర్భంగా ప్రశంసించారు. -
ఏపీ ముఖ్యమంత్రి జగన్‌గారికి కృతజ్ఞతలు
‘‘కళారంగంలో శ్రీ వైఎస్ రాజశేఖర్ రెడ్డిగారి జీవిత సాఫల్య పురస్కారం కె. విశ్వనాథ్‌గారితో పాటు నాకూ దక్కినందుకు సంతోషంగా ఉంది. ఇందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిగారికి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి «కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను’’ అని ప్రముఖ దర్శక– నిర్మాత, నటుడు ఆర్. నారాయణమూర్తి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ– ‘‘రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉత్పన్నమవుతున్న సమస్యలపై ‘అర్ధరాత్రి స్వతంత్రం’ నుంచి సినిమాలు తీస్తున్న నన్ను పీపుల్స్‌స్టార్ అని ప్రజలు అభిమానిస్తున్నందుకు ఆనందంగా ఉంది’’ అన్నారు. -
వైఎస్సార్ అవార్డులకు దరఖాస్తుల స్వీకరణ
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రావతరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందిస్తున్న ‘వైఎస్సార్ లైఫ్‌టైమ్ అచీవ్మెంట్, వైఎస్సార్ అచీవ్మెంట్–2022’ అత్యున్నత పురస్కారాల కోసం వివిధ రంగాలు, విభాగాల్లో విశిష్ట సేవలు అందించిన వ్యక్తులు లేదా సంస్థల నుంచి ఈ నెల 30 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అర్హత కలిగిన వ్యక్తులు, సంస్థలను ఎంపిక చేయడానికి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి అధ్యక్షతన ఏర్పాటుచేసిన హైపవర్ స్క్రీనింగ్ కమిటీ శుక్రవారం విజయవాడలో సమావేశమైంది. ఈ కమిటీలో సభ్యులుగా ప్రభుత్వ జాతీయ మీడియా సలహాదారు దేవులపల్లి అమర్, ప్రభుత్వ సలహాదారు (కమ్యూనికేషన్స్) జీవీడి కృష్ణమోహన్, సీఎం ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి, ప్రిన్సిపల్ సెక్రటరీలు రేవు ముత్యాలరాజు, అనూరాధ రాజారత్నం, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్, పౌర సరఫరాల శాఖ స్పెషల్ సెక్రటరీ, కమిషనర్ హెచ్.అరుణ్‌కుమార్, సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ తుమ్మా విజయ్‌కుమార్‌రెడ్డి, సాధారణ పరిపాలన శాఖ ఉప కార్యదర్శి బాలసుబ్రహ్మణ్యంరెడ్డి ఉన్నారు. ఈ సందర్భంగా విజయ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ వివిధ రంగాలలో అసాధారణ నైపుణ్యాలు, ప్రతిభా పాటవాలు కలిగి సమాజాన్ని విశేషంగా ప్రభావితం చేసిన వ్యక్తులకు, సంస్థలకు అవార్డులు ఇవ్వనున్నట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే అత్యున్నత భారతరత్న, పద్మశ్రీ తదితర పురస్కారాల తరహాలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ పురస్కారాలను అందిస్తోందన్నారు. అవార్డు ఎంపిక కోసం విద్య, వైద్య, వ్యవసాయ, మహిళాభ్యు దయం, సామాజిక న్యాయం, దేశ–విదేశాల్లో గుర్తింపు పొందిన సామాజిక, సాహిత్య, సాంస్కృతిక తదితర రంగాల్లో రాణిస్తున్న వ్యక్తులు, సంస్థల నుంచి∙దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని, వారి బయోడేటాను secy&political@ap.gov.in కు మెయిల్ చేయాలని తెలిపారు. గతేడాది 59 మందిని సత్కరించినట్లు గుర్తుచేశారు. ఇక వైఎస్సార్ లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ కింద రూ.10 లక్షల నగదు, వైఎస్సార్ కాంస్య విగ్రహం, జ్ఞాపిక, ప్రశంసాపత్రం ఇస్తారన్నారు. వైఎస్సార్ అచీవ్మెంట్ అవార్డు కింద రూ.5 లక్షల నగదు, జ్ఞాపిక, ప్రశంసాపత్రాన్ని అందిస్తారని తెలిపారు. -
సీఐడీ అదనపు డీజీ సునీల్‌కు లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డు
సాక్షి, అమరావతి: సైబర్ నేరాల కట్టడిలో రాష్ట్ర పోలీసులకు జాతీయస్థాయిలో గుర్తింపు లభించింది. జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మక సంస్థ ‘సెంటర్ ఫర్ రిసెర్చ్ ఆన్ సైబర్ ఇంటెలిజెన్స్ అండ్ డిజిటల్ ఫోరెన్సిక్స్ (సీఆర్‌సీఐడీఎఫ్) రాష్ట్ర సీఐడీ విభాగం అదనపు డీజీ పీవీ సునీల్‌కుమార్‌కు లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డును, ఎస్పీ (సైబర్ క్రైమ్స్) జీఆర్ రాధికకు సైబర్ స్టార్ అవార్డులను ప్రకటించాయి. ఐఎస్ఈఏ, సీపీఎఫ్, ఐజీఎం, ఫ్రో డిస్కవర్, పీఎస్ఎం సంస్థలతో కలసి సీఆర్‌సీఐడీఎఫ్ ‘ఉత్తమ సైబర్ విధానాలు’ అనే అంశంపై మూడో జాతీయ స్థాయి సదస్సు నిర్వహించింది. వర్చువల్ విధానంలో ఆదివారం నిర్వహించిన ఈ సదస్సు ముగింపు సమావేశంలో రాష్ట్ర సీఐడీ విభాగం అదనపు డీజీ పీవీ సునీల్‌కుమార్‌కు లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డును ప్రదానం చేసింది. సైబర్ పోలీసింగ్, సైబర్ నేరాల పరిష్కారంలో వినూత్న విధానాలను ప్రవేశపెట్టినందుకు 2021కు గాను ఆయనకు ఈ అవార్డును ప్రకటించినట్లు సీఆర్‌సీఐడీఎఫ్ తెలిపింది. సైబర్ నేరాల కట్టడి కోసం తగిన రీతిలో వ్యవస్థను బలోపేతం చేసినందుకు సీఐడీ విభాగం ఎస్పీ (సైబర్ క్రైమ్స్) జీఆర్ రాధికను ‘సైబర్ స్టార్’ అవార్డుకు ఎంపిక చేసినట్లు పేర్కొంది. సైబర్ నేరాల నియంత్రణ కోసం రాష్ట్ర సీఐడీ విభాగం అనుసరిస్తోన్న విధానాలను ఈ జాతీయ సదస్సులో వక్తలు ప్రశంసించారు. దేశంలో అత్యధికంగా సైబర్ సేఫ్ లాగిన్స్‌ను తయారు చేసిన ఘనత ఏపీ సీఐడీ విభాగానిదేనని పేర్కొన్నారు. సైబర్ బుల్లీషీట్స్, 4ఎస్4యు పోర్టల్, ఫ్యాక్ట్ చెక్, యూట్యూబ్ వెబినార్స్ మొదలైన వినూత్న విధానాలను పీవీ సునీల్‌కుమార్ ప్రవేశపెట్టారు. వాటిని సైబర్ క్రైమ్స్ విభాగం సమర్థంగా నిర్వహిస్తూ సైబర్ నేరాలకు అడ్డుకట్ట వేస్తోంది. రాష్ట్ర సీఐడీ విభాగం అనుసరిస్తోన్న విధానాలు, వ్యూహాలను సీఆర్‌సీఐడీఎఫ్ ప్రత్యేకంగా ప్రశంసించింది. -
YSR Awards: సేవలకు సత్కారం
‘సామాన్యుల్లా కనిపించే అసామాన్యుల సేవలకు వందనం.. వెలకట్టలేని మీ ప్రతిభకు సలాం చేస్తూ వైఎస్సార్ అవార్డులు ప్రకటించాం. ఎందరికో స్ఫూర్తినిస్తున్న మహోన్నత వ్యక్తులు, సంస్థలను పురస్కారాలతో సత్కరిస్తున్నాం. తెలుగువారికి, రాష్ట్రానికి బ్రాండ్ అంబాసిడర్లుగా నిలిచిన సంస్కృతి, కళలకు అవార్డుల్లో పెద్దపీట వేశాం..’ – సీఎం వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఇక నుంచి ఏటా నవంబర్ 1వ తేదీన వైఎస్సార్ అవార్డులను ప్రదానం చేస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం మొదటిసారిగా ప్రవేశపెట్టిన ప్రతిష్టాత్మక వైఎస్సార్ లైఫ్‌టైమ్ అచీవ్మెంట్, వైఎస్సార్ అచీవ్మెంట్ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమాన్ని సోమవారం విజయవాడలో ఘనంగా నిర్వహించారు. అమరజీవి పొట్టి శ్రీరాములు, దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాలకు గవర్నర్ విశ్వభూషణ్ , సీఎం వైఎస్ జగన్ నివాళులు అర్పించారు. అనంతరం 2021 సంవత్సరానికిగాను 29 వైఎస్సార్ లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డులు, 30 వైఎస్సార్ అచీవ్మెంట్ అవార్డులు కలిపి మొత్తం 59 అవార్డులను గవర్నర్, ముఖ్యమంత్రి ప్రదానం చేశారు. వైఎస్సార్ అవార్డులను నెలకొల్పడం వెనుక ఉద్దేశం, ఎంపికలో పాటించిన పారదర్శకత, అవార్డు గ్రహీతల గొప్పతనం గురించి ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ వివరించారు. సీఎం జగన్ ప్రసంగంలో ముఖ్యాంశాలు ఇవీ.. పద్మ అవార్డుల తరహాలో... కేంద్ర ప్రభుత్వం ఏటా వివిధ రంగాలలో సేవలందించిన గొప్పవారిని దేశంలో అత్యున్నత అవార్డులైన భారతరత్న, పద్మశ్రీ, పద్మభూషణ్ తదితర అవార్డులతో సత్కరిస్తోంది. మనందరి ప్రభుత్వం కూడా ఇటువంటి కార్యక్రమమే చేపట్టి రాష్ట్రం తరపున అవార్డులు ఇస్తే బాగుంటుందని పలువురు సూచించిన నేపథ్యంలో వైఎస్సార్ అవార్డులను నెలకొల్పాం. మహామనిషి పేరుతో అత్యున్నత పురస్కారాలు మహానేత, నాన్న వైఎస్సార్ పేరు చెబితే అందరికీ ఎన్నో విషయాలు గుర్తుకొస్తాయి. నిండైన తెలుగుదనం తన పంచెకట్టులో కనిపిస్తుంది. తన ప్రతి అడుగులోనూ వ్యవసాయం మీద మమకారం కనిపిస్తుంది. పల్లెలు, పేదల మీద అభిమానం తనను చూడగానే గోచరిస్తాయి. ప్రతి ఒక్కరి ప్రాణాన్ని నిలబెట్టాలన్న ఆరాటం, అందరినీ పెద్ద చదువులు చదివించాలన్న తపన.. ఇవన్నీ నాన్నను చూడగానే గుర్తొచ్చే విషయాలు. ఆకాశమంత ఎత్తుకు ఎదిగిన ఆ మహామనిషి ఈరోజు మన మధ్య లేకపోయినా.. అంత గొప్పవాడు, మహానుభావుడి పేరుమీద రాష్ట్ర స్ధాయిలో అత్యున్నత పౌర పురస్కారాలను వైఎస్సార్ లైఫ్‌టైం అచీవ్మెంట్, వైఎస్సార్ అచీవ్మెంట్ అవార్డుల పేరుతో ప్రకటించాం. లైఫ్‌టైం అచీవ్మెంట్ అవార్డులు ప్రకటించిన వారికి రూ.10 లక్షలు, కాంస్య విగ్రహం, మెమెంటో, యోగ్యతా పత్రం ఇస్తున్నాం. వైఎస్సార్ అచీవ్మెంట్ అవార్డులు పొందినవారికి రూ.5 లక్షలు, కాంస్య విగ్రహం, మెమెంటో, యోగ్యతా పత్రం ఇస్తున్నాం. పారదర్శకంగా ఎంపిక ఈ రోజు గర్వంగా ఇంకో విషయం చెబుతున్నా. మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గ్రామ, వార్డు సచివాలయాల్లో 1.30 లక్షల మందికి ఉద్యోగాలు ఇవ్వడం దగ్గరనుంచి ప్రతి సంక్షేమ పథకాన్నీ పేదలకు అత్యంత పారదర్శకంగా ఇవ్వగలిగే వ్యవస్ధని తెచ్చాం. ఈ అవార్డుల ఎంపికలో కూడా కులం, మతం, ప్రాంతం చూడలేదు. పార్టీలు, రాజకీయ భావాలను కూడా చూడలేదు. మనిషిని మనిషిగానే చూశాం. విభేదించే భావాలున్నా మనుషుల్లో కూడా మహామనుషులను చూశాం. రాష్ట్ర చరిత్రలోనే అత్యంత పారదర్శకంగా అవార్డులను ఇస్తున్నాం. ఎందరో మహానుభావులు... మన తెలుగు సంస్కృతి, కళలు, మానవతామూర్తులకు ఇస్తున్న గొప్ప అవార్డులుగా వీటిని భావిస్తున్నాం. ఎందరెందరికో స్ఫూర్తినిస్తున్న మహోన్నత వ్యక్తులు, సంస్థలకు ఈ అవార్డులు ఇస్తున్నాం. తెలుగువారికి, ఆంధ్రప్రదేశ్‌కి బ్రాండ్ అంబాసిడర్లైన కళలు, సంస్కృతికి ఈ అవార్డుల్లో పెద్దపీట వేశాం. ఒక డప్పు కళాకారుడికి, ఒక తోలుబొమ్మలాటకు, పొందూరు ఖాదీకి, జానపద గీతానికి, బొబ్బిలి వీణకు, రంగస్థల పద్యానికి, థింసా నృత్యానికి, సురభి నాటకానికి, సవర చిత్రకళకు, వీధి నాటకానికి, హరికథకు, బుర్రకథకు, వెంకటగిరి జాంధానీ చీరకు, మనదైన కలంకారీకి, చెక్కమీద చెక్కే శిల్పానికి, నాదస్వరానికీ, మనదైన కూచిపూడికి ఇస్తున్న అవార్డులు ఇవి. వందేళ్ల చరిత్ర ఉన్న ఎంఎస్ఎన్ ఛారిటీస్, సీపీ బ్రౌన్ లైబ్రరీ, వేటపాలెం గ్రంథాలయం, ఆర్డీటీ సంస్థ, సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్.. ఇలాంటి గొప్ప సంస్థలు చేస్తున్న సేవలకు ఇస్తున్న అవార్డులు ఇవి. పండించే రైతన్నకు మనదైన వ్యవసాయానికి, ఉద్యానవన ఉద్యమానికి, వ్యవసాయ అనుబంధ రంగాల్లో వస్తున్న విప్లవానికి ఇస్తున్న అవార్డులు ఇవి. కలం యోధులైన కవులకు, స్త్రీవాద ఉద్యమానికి, సామాజిక స్పృహను మేల్కొల్పడంలో మేరుపర్వత సమానులైన రచయితలకు, విశ్లేషక పాత్రికేయులకు ఇస్తున్న అవార్డులు ఇవి. కోవిడ్ సమయంలో అయినవారే దగ్గరకు రాని పరిస్థితుల్లో ఆస్పత్రుల్లో అన్నీ తామై వారాలు, నెలలు పాటు కుటుంబాలకు దూరమై ప్రాణాలకు తెగించి అసామాన్యమైన సేవలందించిన మానవతామూర్తులకు ఈ అవార్డులు ఇస్తున్నాం. మీ అందరి కుటుంబ సభ్యుడిగా, మీవాడిగా తెలుగుజాతి మాణిక్యాలను, మకుటాలను, మహానుభావుల్ని ఈ రకంగా సత్కరించడాన్ని దేవుడు నాకిచ్చిన అదృష్టంగా భావిస్తున్నా. విశిష్ట సేవలు.. ప్రతిభకు గుర్తింపు – గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ వివిధ రంగాల్లో విశిష్ట సేవలందించిన వ్యక్తులు, సంస్థల సేవలకు గుర్తింపుగా రాష్ట్ర ప్రభుత్వం వైఎస్సార్ అవార్డులను ప్రదానం చేయడం సంతోషదాయకమని గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ పేర్కొన్నారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి రైతులు, పేదల కోసం విశేషంగా కృషి చేసి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచారన్నారు. ఆ మహానేత మహోన్నత వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తూ ఆయన పేరిట ఏటా అవార్డులను అందించాలన్న నిర్ణయం సామాజిక, కళ, సాంస్కృతిక రంగాలకు ప్రోత్సాహానిస్తుందని చెప్పారు. సామాజిక, సేవా, సాంస్కృతిక రంగాల్లో విశేష కృషి చేస్తూ కూడా ఎలాంటి గుర్తింపునకు నోచుకోనివారిని ఎంపిక చేసి అవార్డులు ప్రదానం చేయడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఓ మంచి ఒరవడిని సృష్టించిందన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్దేశించిన అత్యున్నత ప్రమాణాలను పాటిస్తూ అవార్డులకు ఎంపిక చేయడం ముదావహమన్నారు. అమరజీవి పొట్టి శ్రీరాములు ఆత్మార్పణంతో ఏర్పడ్డ రాష్ట్ర అవతవరణ దినోత్సవం రోజు ఏటా వైఎస్సార్ అవార్డులను ఇవ్వడం సముచిత నిర్ణయమని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అభివృద్ధి చెందిన రాష్ట్రంగా నిలుస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. తొమ్మిది సంస్థలకు పురస్కారం వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన మహోన్నత వ్యక్తులు, సంస్థలకు ఈ అవార్డులను ప్రదానం చేశారు. అవార్డు గ్రహీతల్లో 9 సంస్థలు ఉండగా వ్యవసాయ అనుబంధ రంగాలకు చెందిన వారు 11 మంది ఉన్నారు. కళలు, సంస్కృతి రంగాల నుంచి 20 మంది, సాహిత్యరంగంలో ఏడుగురు, పాత్రికేయ రంగానికి చెందినవారు ఆరుగురు, కోవిడ్ సేవలు అందించిన ఆరుగురు ప్రభుత్వ వైద్యాధికారులు/సిబ్బంది అవార్డులకు ఎంపికయ్యారు. మరణించిన ఐదుగురు అవార్డు గ్రహీతల తరపున వారి కుటుంబ సభ్యులు అవార్డులను స్వీకరించారు. అనివార్య కారణాలతో పాత్రికేయ దిగ్గజం ఏబీకే ప్రసాద్ ఈ కార్యక్రమానికి హాజరు కాకపోవడంతో తరువాత ప్రత్యేకంగా అవార్డు అందించాలని నిర్ణయించారు. ప్రముఖ రచయిత్రి ఓల్గా తరపున ఆమె కుమార్తె అవార్డు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి, ఉప ముఖ్యమంత్రులు ధర్మాన కృష్ణదాస్, నారాయణస్వామి, మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, కన్నబాబు, ఆదిమూలపు సురేశ్, వెలంపల్లి శ్రీనివాసరావు, ఎం.శంకర్ నారాయణ, ముత్తంశెట్టి శ్రీనివాసరావు, తానేటి వనిత, జి.జయరాం, ప్రభుత్వ కార్యక్రమాల కన్వీనర్ తలశిల రఘురాం, పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌శర్మ, ముఖ్యమంత్రి మీడియా సలహాదారు, వైఎస్సార్ అవార్డుల కమిటీ కన్వీనర్ జీవీడీ కృష్ణమోహన్, తెలుగు అకాడమీ చైర్పర్సన్ నందమూరి లక్ష్మీపార్వతి, మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ప్రశంసలందుకున్న సీఎం జగన్ వినమ్రత వీల్ చెయిర్లో ఉన్న కత్తి పద్మారావు నిలుచునేందుకు సహాయం చేస్తున్న సీఎం జగన్ ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలని తరచూ చెప్పే మాటను సీఎం వైఎస్ జగన్ ఆచరణలో మరోసారి నిరూపించారు. ముఖ్యమంత్రి అనే భేషజం, హోదాను ఏమాత్రం ప్రదర్శించకుండా తన వినమ్రతను చాటుకున్నారు. సోమవారం విజయవాడలో నిర్వహించిన ‘వైఎస్సార్’ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమ వేదికపై సాక్షాత్కరించిన ఆ దృశ్యం అందరి ప్రశంసలు అందుకుంది. ప్రముఖ అభ్యుదయ కవి కత్తి పద్మారావు ఇటీవల అనారోగ్యం బారినపడటంతో అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమానికి వీల్ చెయిర్లో వచ్చారు. సహాయకులు ఆయన్ను వీల్ చెయిర్లో వేదిక మీదకు తీసుకొస్తున్న దృశ్యాన్ని దూరం నుంచి చూడగానే సీఎం జగన్ లేచి ముందుకు వచ్చి సాదరంగా ఆహ్వానించారు. వీల్ చెయిర్ ఫుట్ రెస్ట్ మీద ఉన్న కత్తి పద్మారావు కాలును సీఎం జగన్ స్వయంగా పట్టుకుని ఫుట్ రెస్ట్ నుంచి పక్కకు జరిపి నేలపై ఉంచారు. ఆయన చేతులు పట్టుకుని నిల్చునేందుకు ఆసరా అందించారు. వైఎస్సార్ లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డు ప్రదానం చేసిన తరువాత కత్తి పద్మారావు తిరిగి వీల్ చెయిర్లో కూర్చునేందుకు సాయం చేశారు. ఆయన కాళ్లను వీల్ చెయిర్ ఫుట్ రెస్ట్ మీద ఉంచి సరి చేశారు. కత్తి పద్మారావుపట్ల గౌరవంతో, వాత్సల్యంతో ముఖ్యమంత్రి స్పందించిన తీరు సర్వత్రా ప్రశంసలు అందుకుంది. ఆ వీడియో క్లిప్, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. -
‘వైఎస్సార్’ అవార్డు గ్రహీతల స్పందన..
రాష్ట్ర ప్రభుత్వం మొదటిసారిగా ప్రవేశపెట్టిన ప్రతిష్టాత్మక వైఎస్సార్ లైఫ్‌టైమ్ అచీవ్మెంట్, వైఎస్సార్ అచీవ్మెంట్ అవార్డులు పొందిన ప్రముఖుల అభిప్రాయాలు.. సీఎం అభినందనీయులు కళాకారులు, వృత్తి నైపుణ్య తదితర రంగాల వారిని ఎంపిక చేయటం గొప్ప విషయం. ఇన్ని రంగాలవారికి పురస్కారాలు అందించటం తెలుగు రాష్ట్రాల్లోనే ప్రథమం. 1వ తరగతి నుంచి పీజీ స్థాయి వరకు పాఠ్యాంశాల రూపకల్పన, భాషా పరిశోధన, సామాజిక రంగాలలో నా కృషిని గుర్తించి వైఎస్సార్ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు ఇచ్చినందుకు సంతోషంగా ఉంది. - కేతు విశ్వనాథరెడ్డి, సాహితీవేత్త, కడప జిల్లా గొప్ప ఔదార్యం సాహిత్యం, విద్య, సామాజిక రంగాల్లో నా కృషికి వైఎస్సార్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ పురస్కారం అందించినందుకు సంతోషంగా ఉంది. ఇందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు. ఇంతమందిని ప్రోత్సహించటం గొప్ప ఔదార్యంతో కూడిన సందర్భం. - ఆచార్య కొలకలూరి ఇనాక్, గుంటూరు కళల అభివృద్ధికి ప్రోత్సాహం దేశంలో కళలు అభివృద్ధి చెందటానికి ప్రోత్సాహం చాలా అవసరం. రాష్ట్రంలో కళలు, వ్యవసాయం వంటి వివిధ రంగాల అభివృద్ధికి కృషిచేస్తున్న వారిని సత్కరించిన ముఖ్యమంత్రి జగన్ అభినందనీయులు. తద్వారా ఆయన అనేక రంగాలకు చేయూత ఇచ్చారు. నాకు వైఎస్సార్ లైఫ్‌టైం అచీవ్మెంట్ అవార్డు ఇవ్వడం సంతోషంగా ఉంది. - పొన్నాల రామసుబ్బారెడ్డి, రంగస్థలనటుడు, నెల్లూరు దేశంలో ఎక్కడా లేనివిధంగా దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ప్రభుత్వం పురస్కారాలు ప్రకటించడం హర్షణీయం. సాహిత్య రంగంలో ఏడుగురిని ఎన్నుకున్నారు. అందులో నేను ఒకడిని కావడం నా అదృష్టం. నా సాహిత్య కృషికి ఇదొక మంచి పురస్కారం. ఇనుమడించిన ఉత్సాహంతో మరిన్ని రచనలు రాయడానికి కృషి చేస్తాను. – ప్రొ. రాచపాలెం చంద్రశేఖర్‌రెడ్డి, కవి, అనంతపురం జిల్లా ఏపీ ప్రజలకు సన్మానం తరిమెల నాగిరెడ్డి గారితో కలిసి పనిచేశాం. వైఎస్సార్‌తో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఇలాంటి కార్యక్రమాలు ఎప్పుడూ జరగలేదు. విశాల దృక్పథం కనిపించింది. వైఎస్సార్ అచీవ్మెంట్ అవార్డు ఇచ్చారు. అన్ని రంగాలవారికీ అవకాశం కల్పించారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు జరిగిన సన్మానం ఇది. - ఇమామ్, పాత్రికేయుడు, కదలిక, అనంతపురం సాంస్కృతిక విప్లవానికి ప్రోత్సాహం 60 ఏళ్లుగా తెలుగు తత్వశాస్త్రంలో కృషిచేస్తూ ఇప్పటివరకు 95కు పైగా పుస్తకాలు రాశాను. ఇందులో 75 పుస్తకాలు ప్రచురించబడ్డాయి. ప్రపంచవ్యాప్తంగా అస్పృశ్యుని యుద్ధగాధ అనే దళితుని జీవనగాధ రాజకీయ, సామాజిక, ఆర్థికశాస్త్రంగా ముందుకు వచ్చింది. ఈ గ్రంధానికి చాలా అవార్డులు వచ్చాయి. భారత రాజకీయాలపై డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ మార్గదర్శకంలో వెయ్యి పేజీలతో రాసిన పుస్తకం కూడా బాగా ప్రాచుర్యం పొందింది. బౌద్ధం నుంచి జ్ఞానం, ప్రతిభ తీసుకుని అంబేడ్కర్ ఎలా రాజ్యాంగం రంచించారు వంటి గ్రంథాలు రాయడం జరిగింది. ఈ రోజు వైఎస్సార్ జీవన సాఫల్య పురస్కారం రావడం ఆనందంగా భావిస్తున్నా. ఇలాంటి ప్రోత్సాహకాలు రాజ్యాంగం ప్రకారం సాంస్కృతిక విప్లవాన్ని ముందుకు తీసుకెళ్లాయి. కవులను, కళాకారులను, ట్రస్ట్‌లను, గ్రంథాలయాలను, విద్యాసంస్థలను ప్రోత్సహించడం ద్వారా మనలో ఒక సాంస్కృతిక భావజాలం ఏర్పడుతుంది. అది జ్ఞానాన్ని పెంచుతుంది. - కత్తి పద్మారావు ఎంతో సంతోషించేవారు.. మా నాన్న వంగపండు ప్రసాదరావు ఏ ఒక్కరి నుంచీ పైసా తీసుకోకుండా జీవితాన్ని కళకే అంకితం చేశారు. ఈ రోజు జగనన్న నా తండ్రి గొప్పతనాన్ని గుర్తించి వైఎస్సార్ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు అందించారు. ఇప్పుడు నా తండ్రి బతికుంటే ఎంతో సంతోషించేవారు. జగనన్న నన్ను, నా తండ్రిని ఎంతగానో అభిమానిస్తారు. అటువంటి నాయుకుడిని ఎక్కడా చూడలేం. కృతజ్ఞతగా ఆయన అడుగుజాడల్లో పార్టీ కోసం ఎప్పుడూ శ్రమిస్తూనే ఉంటాను. – వంగపండు ఉష సాహిత్య సౌరభ వికాసం.. సీపీ బ్రౌన్ లైబ్రరీ సీపీ బ్రౌన్ గ్రంథాలయానికి వైఎస్సార్ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు దక్కడం సంతోషకరం. సీపీ బ్రౌన్ నివసించిన ప్రాంతంలో గ్రంథాలయం కట్టారు. ఇటీవల సీఎం జగన్ ఈ గ్రంథాలయాన్ని సందర్శించారు. గ్రంథాలయం అభివృద్ధికి రూ.5.50 కోట్లు కేటాయించారు. ట్రస్టు కింద గ్రంథాలయాన్ని వైఎస్సార్ తొలుత ఎస్వీ యూనివర్సిటీకి ఇచ్చారు. అనంతరం వైవీ యూనివర్సిటీ పరిధిలోకి తీసుకువచ్చారు. అవార్డు ద్వారా గ్రంథాలయానికి మంచి గుర్తింపు లభించింది. - సూర్యకళావతి, వైస్ చాన్సలర్, యోగివేమన యూనివర్సిటీ అరుదైన గౌరవం సారస్వత నికేతన్ రెండేళ్ల కిందటే శతాబ్ది ఉత్సవాలు చేసుకుంది. ఇప్పుడు వైఎస్సార్ లైఫ్‌టైం అచీవ్మెంట్ అవార్డు లభించింది. కళాకారులను, సాహితీవేత్తలను, వివిధ సంస్థలను గుర్తించి ఒకేసారి గౌరవించడం చాలా గొప్ప విషయం. - వెంకటేశ్వర్లు, సారస్వత నికేతన్ కార్యదర్శి సేవా నిరతికి నిదర్శనం వైఎస్సార్ లైఫ్‌టైం అచీవ్మెంట్ అవార్డు ఇచ్చినందుకు సత్యసాయి సెంట్రల్ ట్రస్టు తరఫున, భక్తుల తరఫున అందరికీ ధన్యవాదాలు. లక్షలాదిమంది ఆన్లైన్లో ఈ కార్యమ్రమాన్ని చూశారు. నాకు చాలామంది మెసేజ్‌లు కూడా పంపారు. 50-60 సంవత్సరాలుగా రాష్ట్రంలోను, దేశంలోను అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. బాబా చూపిన మార్గంలో నడుస్తున్నాం. ప్రభుత్వం తరఫున ఒక గుర్తింపు రావడంతో చాలామంది సంతోషిస్తున్నారు. - రత్నాకర్, మేనేజింగ్ ట్రస్టీ, సత్యసాయి సెంట్రల్ ట్రస్టు వందేళ్ల చరిత్రకు గుర్తింపు మా తాతగారు మల్లాడి సత్యలింగం నాయకర్ ప్రతి ఒక్కరికీ విద్య అందాలని ఆరాటపడ్డారు. తన ఆస్తులన్నింటినీ మార్చి ట్రస్టుగా పెట్టారు. వందేళ్ల చరిత్ర ఉన్న మా ట్రస్టుకు వైఎస్సార్ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు రావడం చాలా ఆనందంగా ఉంది. - మల్లాడి కార్తీక్ నాయకర్, ఎంఎస్ఎన్ చారిటీస్ రాష్ట్రానికి తెలిసింది.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు ప్రత్యేక వందనాలు. వైఎస్సార్ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు ఇవ్వడం వల్ల గ్రంథాలయానికి రాష్ట్రవ్యాప్త గుర్తింపు వచ్చింది. ఎంతోమందికి గ్రంథాలయం కల్పవృక్షంలా ఉంది. 123 ఏళ్లుగా సేవలందిస్తోంది. - ఆర్.సి.హెచ్.వెంకట్రావు, గెజిటెడ్ లైబ్రేరియన్, గౌతమీ గ్రంథాలయం, రాజమండ్రి సేవకు సత్కారం అనేక రంగాల్లో ఆర్డీటీ సేవలందిస్తోంది. ఆర్టీడీ సేవలను గుర్తించి ప్రభుత్వం వైఎస్సార్ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు ఇచ్చింది. సీఎం జగన్‌కి కృతజ్ఞతలు. - డాక్టర్ వై.వి.మల్లారెడ్డి, ట్రస్టీ, ఆర్డీటీ, అనంతపురం జన్మకు ఇది చాలు వైఎస్సార్ అచీవ్మెంట్ అవార్డు.. జీవితంలో ఇలాంటి గౌరవం దక్కుతుందని ఊహించలేదు. ఇలాంటి వేడుక ఒకటి చూస్తానని అనుకోలేదు. ఈ జన్మకు ఇది చాలు. ముఖ్యమంత్రిని దేవుడు చల్లగా చూడాలి. - గోచిపాత గాలీబు, డప్పు కళాకారుడు నైపుణ్యానికి సత్కారం ముఖ్యమంత్రికి వందనాలు. నేను అరటి రైతును. 1995లో మొట్టమొదటగా టిష్యూ కల్చర్‌ను ప్రవేశపెట్టాను. అరటిసాగులో నాకృషిని గుర్తించి వైఎస్సార్ అచీవ్మెంట్ అవార్డు ఇచ్చారు. అవార్డుల ద్వారా వివిధ రంగాల్లోని వ్యక్తుల నైపుణ్యాలను వెలికి తీశారు. - బలరామిరెడ్డి నల్లపురెడ్డి, అరటిరైతు, పులివెందుల చాలా సంతోషం ఆర్గానిక్ పద్ధతిలో ఉద్యాన పంటలను సాగుచేస్తాను. వైఎస్సార్ అచీవ్మెంట్ అవార్డు రావడం మాకు చాలా సంతోషం. వైవిధ్య భరితంగా పంటలను సాగు చేయడంపై నేను దృష్టిపెడుతున్నాను. మహానుభావుడు, రైతు బాంధవుడైన వైఎస్సార్ పేరుపై అవార్డు రావడం మాకు సంతోషంగా ఉంది. - కొట్యాడ శ్రీనివాసరావు, ఉద్యాన రైతు, నిమ్మలపాలెం, విజయనగరం జిల్లా జగన్ ప్రభుత్వం గుర్తించింది ఈ రీతిలో ఏ ప్రభుత్వం కూడా గుర్తించలేదు. ఇలాంటి అవార్డులు ఇవ్వలేదు. 1984 నుంచి నేను కాఫీ సాగుచేస్తున్నాను. అనేక ప్రభుత్వాలు వచ్చాయి. కానీ ఎవ్వరూ గుర్తించలేదు. ఇప్పుడు ఈ ప్రభుత్వం గుర్తించింది. వైఎస్సార్ అచీవ్ మెంట్ అవార్డు ఇచ్చింది. ఇంకా ఆసక్తితో కృషితో సాగు చేస్తాను. 2018 నుంచి సొసైటీ కూడా ఏర్పాటు చేశాం. ఇతర దేశాలకు ఎగుమతి చేస్తున్నాం. - సెగ్గె కొండలరావు, కాఫీ రైతు, చింతపల్లి, విశాఖపట్నం జిల్లా కోవిడ్ సేవలకు గుర్తింపు కోవిడ్‌లో రోగులకు సేవచేయడం దేవుడు ఇచ్చిన అవకాశం. దీన్ని ప్రభుత్వం గుర్తించి వైఎస్సార్ అచీవ్మెంట్ అవార్డు ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. - డాక్టర్ నీతిచంద్ర, పల్మనాలజిస్ట్, నెల్లూరు ప్రభుత్వ మెడికల్ కాలేజీ దేవుడిచ్చిన అవకాశం విప్తతు సమయంలో సేవ చేయడం దేవుడు మాకు కల్పించిన అవకాశంగా భావిస్తున్నాం. మేమే కాదు చాలామంది నర్సులు బంధువులను పోగొట్టుకున్నారు. సంకల్పంతో రోగులకు సేవలందించారు. వైఎస్సార్ అచీవ్మెంట్ అవార్డు రావడం సతోషంగా ఉంది. ప్రభుత్వానికి కృతజ్ఞతలు. - కె.జ్యోతిర్మయి, స్టాఫ్‌నర్సు, అనంతపురం ప్రభుత్వాస్పత్రి గొప్ప గౌరవం.. మా సేవలను ప్రభుత్వం గుర్తించడం చాలా సంతోషకరం. కోవిడ్ డ్యూటీ చేసినప్పుడు ధైర్యంతో ముందుకు వెళ్లాం. నాలో ఏ ధైర్యం ఉందో.. అదే ధైర్యాన్ని పేషెంట్లకు ఇచ్చా. నా విధిని నేను నిర్వర్తించాను. దీనికి వైఎస్సార్ అచీవ్మెంట్ అవార్డు ఇచ్చేంత గొప్ప గౌరవం దక్కుతుందని ఊహించలేదు. - పోతంశెట్టి లక్ష్మి, స్టాఫ్‌నర్సు, విజయవాడ ప్రభుత్వాస్పత్రి ఆయన జీవితం సాహిత్యం కోసమే మా నాన్న, ప్రముఖ సాహితీవేత్త కాళీపట్నం రామారావు పేరిట వైఎస్సార్ లైఫ్‌టైం అచీవ్మెంట్ అవార్డు ఇచ్చారు. ఆయన మరణానంతరం ఇచ్చారు. ఆయన జీవితం సాహిత్యం కోసం అంకితం చేశారు. సాహిత్యం మీద వచ్చిందంతా సాహిత్యానికే ఖర్చు చేసేవారు. ఆయన స్థాపించిన సంస్థకే ఖర్చు పెట్టాలని మా కుటుంబం నిర్ణయించింది. మా నాన్నగారికి ఈ అవార్డు ఇవ్వడం పట్ల మా కుటుంబం చాలా ఆనందంగా ఉంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి రుణపడి ఉంటాం. - కాళీపట్నం సుబ్బారావు మహానేత వైఎస్సార్ పొందూరు ఖద్దరే కట్టేవారు పొందూరు ఖద్దరు ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి కూడా పొందూరు ఖద్దరు పంచెలే కట్టుకునేవారు. 73 ఏళ్ల చేనేత సహకార సంఘ చరిత్రలో ఇన్నాళ్లకు గుర్తింపు లభించింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేతుల మీదుగా పొందూరు ఖాదీ సంస్థ తరఫున ఈ అవార్డు అందుకోవడం పట్ల చాలా ఆనందంగా ఉంది, ఈ అవార్డు కింద రూ.10 లక్షలు ఇస్తున్నారు. ఈ నగదు సంస్థను బలోపేతం చేసేందుకు ఎంతగానో ఉపయోగపడుతుంది. - డి.వెంకటరమణ, పొందూరు ఖాదీ బోర్డు కార్యదర్శి సంగీత ప్రపంచానికి గర్వకారణం 103 సంవత్సరాల చరిత్ర కలిగిన మహారాజా ప్రభుత్వ నృత్య సంగీత కళాశాలకు వైఎస్సార్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు రావడం ఎంతో గర్వకారణంగా ఉంది. ఎంతోమంది మహానుభావులు ఈ కళాశాల నుంచి వచ్చి కళాశాల ఖ్యాతిని ఖండాంతరాలకు వ్యాపింపజేశారు. ఇటువంటి అవార్డు కళాశాలకు రావడం యావత్ సంగీత ప్రపంచమంతా గర్వించదగినది. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చేతుల మీదుగా ప్రిన్సిపల్ హోదాలో నేను అవార్డు అందుకోవడం సంతోషంగా ఉంది. భావితరాలకు ఇది ప్రోత్సాహకరంగా ఉండి, మరింతమంది కళాకారులను తీర్చిదిద్దడానికి దోహదపడుతుంది. - ఆర్వి ప్రసన్నకుమారి మహానేత జ్ఞాపకం పాతికముఫ్పై ఏళ్లుగా ప్రజాగాయకుడిగా, ప్రజాకళాకారుడిగా రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతూ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాన్ని కూడా విడిచిపెట్టాను. గత ప్రభుత్వ హయాంలో 275 కేసులు నాపై ఉన్నాయి. ఈరోజు జగన్న నన్ను గుర్తుపెట్టుకుని ఈ పేదకళాకారునికి వైఎస్సార్ అచీవ్మెంట్ అవార్డు ఇవ్వడం గొప్ప విషయం. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరెడ్డి నన్ను హైదరాబాద్ రవీంద్రభారతికి పిలిచి ఆ రోజుల్లోనే రూ.లక్ష ఇవ్వడం మామూలు విషయం కాదు. ఆ మహానేత చనిపోయినపుడు నేను రాసిన పాట ఎప్పుడు పాడినా కన్నీళ్లు వస్తాయి. ఈరోజు ఆ రుషి పేరుమీద ఆయన తనయుడు నాకు వీధి నాటకం విభాగంలో అవార్డు ఇచ్చినందుకు శతకోటి నమస్కారాలు. – మజ్జి శ్రీనివాసరావు (దేవీశ్రీ) 30 ఏళ్ల కళ.. ఆర్ట్ అండ్ కల్చర్ విభాగంలో కాలిగ్రాఫీకి వైఎస్సార్ అచీవ్మెంట్ అవార్డు అభించింది. ఈ కళ అత్యంత అద్భుతమైన, అరుదైన కళ. దీన్ని నేర్చుకోవాలంటే 20 నుంచి 30 ఏళ్లు శ్రమించాలి. కానీ నేర్చుకుంటే ఆ కళాకారునికి ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది. దానికి ఇదే నిదర్శనం. ఈ రోజు నా శ్రమను, కళను గుర్తించి అవార్డు అందించిన సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి కృతజ్ఞతలు. – పరమేశ్వరరాజు. బొబ్బిలి వీణకు సన్మానం తరతరాలుగా దాదాపు రెండొందల శతాబ్దాలుగా విజయనగరంలో బొబ్బిలి వీణ తయారు చేస్తున్నాం. నేను మూడోతరం. ప్రస్తుతం మాలో ఐదోతరం వారు కూడా వీణల తయారీలో ఉన్నారు. యాభై ఏళ్లుగా బొబ్బిలి వీణను తయారు చేస్తూ మరికొంత మందికి నేర్పిస్తున్నాను. ఎనిమిది రకాల మెమెంటో వీణలు తయారు చేయడం ఇప్పుడు ప్రధానంగా మారింది. మన సంస్కృతి, సంప్రదాయాలకు చిహ్నంగా భావించే బొబ్బిలి వీణకు వైఎస్సార్ లైఫ్‌టైం అచీవ్మెంట్ అవార్డు రావడం మాకు ఎంతో సంతోషంగా ఉంది. – సర్వసిద్ధి అచ్యుతనారాయణ మాకో గుర్తింపు.. నా పేరు సురభి వేణుగోపాల్. మాది శ్రీవినాయక నాట్యమండలి సురభి థియేటర్. సురభి అనేది 1880లో వైఎస్సార్ కడప జిల్లాలో ప్రారంభమైంది. అప్పటి నుంచి నేటివరకు నాటకరంగాన్ని వృత్తిగా భావిస్తూ సేవ చేసుకుంటున్నాం. ఇది ఏకైక కుటుంబసంస్థ. ఇటువంటి సంస్థను గుర్తించి అవార్డు ఇవ్వడం ఆనందంగా గర్వకారణంగా ఉంది. ఈ రోజు కళాకారుడిగా ప్రత్యేకించి గుర్తించి ఇక్కడ పిలవడం జరిగింది. 2019లో ఆంధ్రా అవతరణ సందర్భంగా ప్రదర్శించిన మాయాబజార్ నాటకాన్ని గవర్నర్, ముఖ్యమంత్రి వీక్షించండం సంతోషంగా ఉంది. ముఖ్యంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కళాదృష్టికి ధన్యవాదాలు తెలియచేస్తున్నాను. ఒక కళాకారుడిగా ఆనందం, అభిమానం, కృతజ్ఞతలు ఒకేసారి తెలియచేస్తున్నాను. వైఎస్సార్ హయాంలో ఆరి మారాఠీలను బీసీలుగా గుర్తించారు. ఒకరు కులం ఇచ్చారు. ఒకరు అవార్డు ఇచ్చారు. - సురభి నాట్యమండలి 50 ఏళ్ల సేవకు.. బుర్రకథ కళారంగంలో 50 సంవత్సరాలుగా సేవచేస్తున్నా. ప్రభుత్వం వృత్తిని గౌరవించి గుర్తించినందుకు కృతజ్ఞతలు తెలియచేస్తున్నాం. జగన్మోహన్రెడ్డికి ఎటువంటి కష్టాలు లేకుండా కలకాలం జీవించాలంటూ అప్పటికప్పుడు పద్యాన్ని పాడి వినిపించారు. - మిరియాల అప్పారావు -
వైఎస్సార్ జీవిత సాఫల్య పురస్కారాల ప్రదానోత్సవం
-
వైఎస్ఆర్ లైఫ్‌టైం ఎచీవ్మెంట్ అవార్డ్: శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్
-
వైఎస్ఆర్ లైఫ్‌టైం ఎచీవ్మెంట్ అవార్డ్: రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్
-
నేలపై ఉండి ఆకాశమంత ఎదిగిన వ్యక్తి వైఎస్సార్: సీఎం జగన్
-
YSR Awards: ఘనంగా వైఎస్సార్ అవార్డుల ప్రదానోత్సం
సాక్షి, అమరావతి: నేలపై ఉండి ఆకాశమంత ఎదిగిన వ్యక్తి దివంగత మహానేత వైఎస్సార్ అని.. అలాంటి వ్యక్తి వైఎస్సార్ పేరుమీద అవార్డులు ఇచ్చేందుకు నిర్ణయించామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. కులం, మతం, రాజకీయ పార్టీలకు అతీతంగా అవార్డుల ఎంపిక జరిగిందన్నారు. విజయవాడలోని ఏ–కన్వెన్షన్ సెంటర్లో వైఎస్సార్ జీవిత సాఫల్య పురస్కారాలు, వైఎస్సార్ సాఫల్య పురస్కారాలను గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం ప్రదానం చేశారు. అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమానికి వైఎస్ విజయమ్మ హాజరయ్యారు. ఈ ప్రదానోత్సవ కార్యక్రమంలో సీఎం మాట్లాడుతూ, కేవలం సేవలను పరిగణనలోకి తీసుకుని అవార్డులకు ఎంపిక చేశామన్నారు. సామాన్యులుగా ఉండే అసమాన్యుల ప్రతిభకు పట్టం కట్టామన్నారు. కళలు, సంస్కృతికి అవార్డుల్లో పెద్దపీట వేశామన్నారు. రైతులు, రచయితలు, జర్నలిస్టులు, ఫ్రంట్‌లైన్ వారియర్స్‌ను ఎంపిక చేశామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున తెలుగుజాతికి శుభాకాంక్షలు. సామాన్యులుగా ఉన్న అసామాన్యుల మధ్య సమయం గడపడం నా అదృష్టం. కేంద్రం తరహాలో రాష్ట్ర ప్రభుత్వం అవార్డులు ఇవ్వాలని పలు సూచనలు వచ్చాయి. ఆ సూచనలను పరిగణనలోకి తీసుకుని వైఎస్సార్ ప్రదానోత్సవం నిర్వహిస్తున్నాం. నిండైన పంచెకట్టుతో వైఎస్సార్ ప్రజల గుండెల్లో నిలిచారు. వైఎస్సార్ ఆకాశమంత ఎత్తు ఎదిగిన మహా మనీషి’’ అని సీఎం కొనియాడారు. ప్రతి సంవత్సరం నవంబర్ 1న వైఎస్సార్ అవార్డులు ప్రదానం చేస్తామని సీఎం వెల్లడించారు. లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డుకు రూ.10 లక్షలు, కాంస్య విగ్రహం, యోగ్యతాపత్రం అందజేస్తామన్నారు. అచీవ్మెంట్ అవార్డు పొందిన వారికి రూ.5 లక్షలు కాంస్య విగ్రహం, యోగ్యతాపత్రం అందజేయనున్నట్లు సీఎం వైఎస్ జగన్ తెలిపారు. ఏపీ సంస్కృతి, సంప్రదాయాలు ఎంతో విశిష్టమైనవి: గవర్నర్ వైఎస్సార్ వైద్య వృతి చేసినా.. వ్యవసాయం, విద్యారంగాలకు విశేష కృషి చేశారని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. ‘‘ఏపీ రాష్ట్ర చరిత్రలో వైఎస్సార్ గొప్ప వ్యక్తిగా నిలిచారు. వైఎస్సార్‌కు విద్య, వైద్యం, అంటే ఎంతో మక్కువ. పేదల నాడి తెలిసిన డాక్టర్ వైఎస్సార్.. వారి కోసం ఆరోగ్యశ్రీని తీసుకొచ్చారు. సామాన్యులకు నాణ్యమైన వైద్యం అందించి ప్రజల హృదయాలను గెలిచారని’’ గవర్నర్ అన్నారు. ఇక్కడి సంస్కృతి, సంప్రదాయాలు ఎంతో విశిష్టమైనవన్నారు. వ్యవసాయం, ఆక్వా, ఉత్పత్తుల ఎగుమతుల్లో ఏపీ అగ్రస్థానం ఉందన్నారు. కరోనా వ్యాక్సినేషన్లోనూ ఏపీ క్రియాశీలకంగా ఉందన్నారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని జగన్నాథుడుని ప్రార్థిస్తున్నానని గవర్నర్ అన్నారు. వైఎస్సార్ అవార్డులు అందుకున్నవారికి ఆయన అభినందనలు తెలిపారు. ట్రస్టులు 1. ఎంఎస్ఎన్ చారిటీస్ ట్రస్ట్ – కాకినాడ(తూర్పుగోదావరి) 2. సీపీ బ్రౌన్ లైబ్రరీ – వైఎస్సార్ జిల్లా 3. సారస్వత నికేతన్ లైబ్రరీ – వేటపాలెం(ప్రకాశం) 4. సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ – పుట్టపర్తి(అనంతపురం) 5. ఆర్సీ రెడ్డి స్టడీ సర్కిల్ – వైఎస్సార్ జిల్లా 6. రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్(ఆర్డీటీ) – అనంతపురం 7. గౌతమి రీజనల్ లైబ్రరీ – తూర్పుగోదావరి 8. మహారాజా గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ మ్యూజిక్ అండ్ డ్యాన్స్ – విజయనగరం రైతులు 9. స్వర్గీయ పల్లా వెంకన్న – కడియం(తూర్పుగోదావరి) 10. మాతోట ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ – శ్రీకాకుళం 11. ఎంసీ రామకృష్ణారెడ్డి – అనంతపురం 12. కొట్యాడ శ్రీనివాసరావు – విజయనగరం 13. విఘ్నేశ్వర ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ – కృష్ణా జిల్లా 14. ఎం.బలరామి రెడ్డి – వైఎస్సార్ జిల్లా 15. ఎస్.రాఘవేంద్ర – చిత్తూరు 16. సెగ్గె కొండలరావు – విశాఖపట్నం 17. ఆంధ్ర కశ్మీర్ ట్రైబల్ ఫ్మారింగ్ ప్రొడ్యూసర్ కంపెనీ – విశాఖపట్నం 18. వల్లూరు రవికుమార్ – కృష్ణా జిల్లా 19. శివ అభిరామిరెడ్డి – నెల్లూరు జిల్లా కళలు–సంస్కృతి 20. పొందూరు ఖద్దర్(ఆంధ్రాపైన్ ఖాదీ కార్మికాభ్యుదయ సంఘం) – శ్రీకాకుళం 21. స్వర్గీయ వంగపండు ప్రసాదరావు(జానపద గేయం) – విజయనగరం 22. అచ్యుత నారాయణ(బొబ్బిలి వీణ కేంద్రం) – విజయనగరం 23. పొన్నాల రామసుబ్బారెడ్డి(రంగస్థలం) – నెల్లూరు 24. వినాయక నాట్యమండలి(సురభి నాటకం) – వైఎస్సార్ జిల్లా 25. సిద్ధేంద్ర యోగి కళాక్షేత్రం(కూచిపూడి నాట్యం) – కృష్ణా 26. దాలవాయి చలపతిరావు(తోలు బొమ్మలాట) – అనంతపురం 27. కిల్లు జానకమ్మ(థింసా నృత్య బృందం) – విశాఖ 28. సవర రాజు(సవర పెయింటింగ్స్) – శ్రీకాకుళం 29. మజ్జి శ్రీనివాసరావు(వీధి నాటకం) – విశాఖపట్నం 30. ధర్మాడి సత్యం(డిజాస్టర్ మేనేజ్మెంట్) – తూర్పుగోదావరి 31. సర్వారాయ హరికథ పాఠశాల (మహిళలు) – తూర్పుగోదావరి 32. మిరియాల అప్పారావు(బుర్రకథ) – పశ్చిమగోదావరి 33. కూరెళ్ల వెంకటాచారి(కొండపల్లి బొమ్మలు) – కృష్ణా 34. గోచిపాత గాలేబు(డప్పు కళాకారుడు) – కృష్ణా 35. జి.రమణయ్య(వెంకటగిరి జాంధానీ చీరలు) – నెల్లూరు 36. శివప్రసాద రెడ్డి(కళంకారీ పెయింటింగ్స్) – కర్నూలు 37. బాలాజీ ఉడ్ కార్వింగ్ ఆర్టిజన్స్ సొసైటీ – చిత్తూరు 38. డా.వి.సత్యనారాయణ(నాదస్వరం) – చిత్తూరు 39. పూసపాటి పరమేశ్వర్‌రాజు(కాలిగ్రఫీ) – విజయనగరం సాహిత్యం 40. స్వర్గీయ కాళీపట్నం రామారావు(కారా మాస్టర్) – శ్రీకాకుళం 41. కత్తి పద్మారావు – గుంటూరు 42. రాచపాలెం చంద్రశేఖర్ రెడ్డి – వైఎస్సార్ జిల్లా 43. బండి నారాయణ స్వామి – అనంతపురం 44. కేతు విశ్వనాథరెడ్డి – వైఎస్సార్ జిల్లా 45. కొలకలూరి ఇనాక్ – గుంటూరు 46. లలితా కుమారి(ఓల్గా) – గుంటూరు జర్నలిజం 47. ఏబీకే ప్రసాద్ – కృష్ణా 48. స్వర్గీయ పొత్తూరి వెంకటేశ్వరరావు – గుంటూరు 49. స్వర్గీయ ఖాజా హుస్సేన్ (దేవీప్రియ) – గుంటూరు 50. స్వర్గీయ కె.అమరనాథ్ – పశ్చిమగోదావరి 51. సురేంద్ర (కార్టునిస్ట్) – వైఎస్సార్ జిల్లా 52. ఇమామ్ – అనంతపురం వైద్య–ఆరోగ్య విభాగం 53. డాక్టర్ నీతి చంద్ర(ఊపిరితిత్తుల వ్యాధుల ప్రొఫెసర్) – నెల్లూరు 54. డాక్టర్ కె.కృష్ణ కిషోర్(ఈఎన్టీ ప్రొఫెసర్) – తూర్పుగోదావరి 55. లక్ష్మి(స్టాఫ్ నర్స్) – విజయవాడ 56. కె.జోతిర్మయి(స్టాఫ్ నర్స్) – అననంతపురం 57. తురబిల్లి తేజస్వి(స్టాఫ్ నర్స్) – విశాఖపట్నం 58. ఎం.యోబు(మేల్ నర్స్) – వైఎస్సార్ జిల్లా 59. ఆర్తి హోమ్స్ – వైఎస్సార్ జిల్లా -
వైఎస్సార్ అవార్డుల ప్రదానోత్సవం వాయిదా
సాక్షి, అమరావతి: వైఎస్సార్ జీవిత సాఫల్య పురస్కారాలు, వైఎస్సార్ ఎచీవ్మెంట్ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం వాయిదా పడింది. ఆగష్టు 13న నిర్వహించాల్సిన ఈకార్యక్రమాన్ని అక్టోబరు లేదా నవంబరు నెలల్లో నిర్వహించనున్నట్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలిపింది. అవార్డు గ్రహీతల్లో పెద్ద వయస్సు ఉన్నవారు ఉండడటంతో పాటు, 150 మందికి మించి ఎక్కడా కూడా ప్రజలు గుమికూడదన్న వైద్య ఆరోగ్య శాఖ ఉత్తర్వులు నేపథ్యంలో అవార్డుల కార్యక్రమాన్ని వాయిదావేస్తున్నట్లు పేర్కొంది. అవార్డు గ్రహీతల వయస్సు, వారి ఆరోగ్యం.. అదే విధంగా వైద్య ఆరోగ్యశాఖ ఉత్తర్వులను దృష్టిలో ఉంచుకుని కార్యక్రమాన్ని వాయిదా వేశామని, వచ్చే అక్టోబరు లేదా నవంబరు నెలలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు వెల్లడించింది. చదవండి: Huzurabad Bypoll: టీఆర్ఎస్ అభ్యర్థిని ప్రకటించిన సీఎం కేసీఆర్ -
13న వైఎస్సార్ జీవిత సాఫల్య పురస్కారాలు
సాక్షి, అమరావతి బ్యూరో: వివిధ రంగాల్లో ప్రతిభ కనపరిచిన విశిష్ట వ్యక్తులకు ఏపీ ప్రభుత్వం ప్రకటించిన వైఎస్సార్ జీవిత సాఫల్య, సాఫల్య పురస్కారాలను ఆగస్టు 13న సీఎం వైఎస్ జగన్ ప్రదానం చేయనున్నట్లు రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు చెప్పారు. విజయవాడ బందరు రోడ్డులోని ఏ–1 కన్వెన్షన్ హాలును సీఎం కార్యక్రమాల సమన్వయకర్త తలశిల రఘురామ్, కృష్ణా జిల్లా కలెక్టర్ జె.నివాస్, విజయవాడ నగర పోలీస్ కమిషనర్ బత్తిన శ్రీనివాసులు, నగరపాలక సంస్థ కమిషనర్ వి.ప్రసన్న వెంకటేష్‌లతో కలిసి మంత్రి గురువారం పరిశీలించారు. అవార్డుల ప్రదానోత్సవానికి వేదిక, ఇతర ఏర్పాట్లకు సంబంధించి ఏ–1 కన్వెన్షన్ హాలు ఏ మేరకు అనువుగా ఉంటుందో పరిశీలించి, కార్యక్రమాల ఏర్పాట్లపై సమీక్షించారు. వెలంపల్లి మాట్లాడుతూ.. దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతిని పురస్కరించుకొని ఏపీ ప్రభుత్వం వివిధ రంగాల్లో ప్రతిభ కనపరిచిన విశిష్ట వ్యక్తులకు జూలై 7న వైఎస్సార్ జీవిత సాఫల్య, సాఫల్య పురస్కారాలను ప్రకటించిందని గుర్తు చేశారు. వైఎస్సార్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డుకు రూ.10 లక్షల నగదు, జ్ఞాపిక, వైఎస్సార్ అచీవ్మెంట్ అవార్డుకు రూ.5 లక్షల నగదు, జ్ఞాపికను అందిస్తామన్నారు.