
నారాయణ మూర్తికి ఐసీఎస్‌ఐ ‘లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్’ అవార్డు...
ఎక్సలెన్స్ ఇన్ కార్పొరేట్ గవర్నెన్స్‌కు సంబంధించి ముంబైలో గురువారం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా (ఐసీఎస్‌ఐ) 15వ జాతీయ అవార్డుల కార్యక్రమం జరిగింది. ఇందులో నేషనల్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఎస్.రామదొరై చేతుల మీదుగా ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు ఎన్.ఆర్.నారాయణ మూర్తి ‘లైఫ్‌టైం అచీవ్‌మెంట్’ అవార్డును అందుకున్నారు. చిత్రంలో ఐసీఎస్‌ఐ చీఫ్ ఎగ్జిక్యూటివ్, అఫిసియేటింగ్ సెక్రటరీ సీఎస్ సుతాను సిన్హా, ఐసీఎస్‌ఐ కౌన్సిల్ మెంబర్ సీఎస్ వినీత్ చౌదరీ, ఐసీఎస్‌ఐ ప్రెసిడెంట్ సీఎస్ అతుల్ హెచ్ మెహ్‌తా (ఎడమ నుంచి కుడికి).