
సాక్షి, హైదరాబాద్: నగరంలోని ఏషియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ చైర్మన్ డాక్టర్ డి.నాగేశ్వర్‌రెడ్డికి ‘ఐఎంఏ డాక్టర్ ఎంజీ గార్గ్ జీవిత సాఫల్య పురస్కారం’లభించింది. ముంబైలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎంఏ) జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కె.కె.అగర్వాల్ చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు.
పురస్కార ప్రదాన కార్యక్రమానికి వెయ్యిమంది ప్రసిద్ధ వైద్యులు హాజరయ్యారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో వైద్యరంగంలో ఆయన చేస్తున్న విశేష కృషికి గుర్తింపుగా ఈ పురస్కారం అందజేసినట్లు ఐఎంఏ తెలిపింది.