
‘‘కళారంగంలో శ్రీ వైఎస్ రాజశేఖర్ రెడ్డిగారి జీవిత సాఫల్య పురస్కారం కె. విశ్వనాథ్‌గారితో పాటు నాకూ దక్కినందుకు సంతోషంగా ఉంది. ఇందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డిగారికి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి «కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను’’ అని ప్రముఖ దర్శక– నిర్మాత, నటుడు ఆర్. నారాయణమూర్తి అన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ– ‘‘రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉత్పన్నమవుతున్న సమస్యలపై ‘అర్ధరాత్రి స్వతంత్రం’ నుంచి సినిమాలు తీస్తున్న నన్ను పీపుల్స్‌స్టార్ అని ప్రజలు అభిమానిస్తున్నందుకు ఆనందంగా ఉంది’’ అన్నారు.