r narayanamurthy
-
జమునను పద్మ అవార్డుతో సత్కరించాలి: నారాయణమూర్తి
సీనియర్ నటి జమున శుక్రవారం ఉదయం తుదిశ్వాస విడిచింది. ఆమె మరణంపై సినీప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఆర్ నారాయణమూర్తి మాట్లాడుతూ.. 'సినీ ఇండస్ట్రీలో జమున ఒక మహానటి. అగ్రహీరోలతో ఆమె నటించి మెప్పించారు. యావత్ భారతీయ సినీపరిశ్రమకు ఆమె మరణం తీరని లోటు. మూగమనసు సినిమాలో ఆమె నటన అద్భుతం. సినిమా మొత్తం ఆమెతోనే నడుస్తుంది. ఎన్టీఆర్, ఏఎన్నార్, ఎంజీఆర్, శివాజీ గణేశన్ సహా ఎంతోమంది నటులతో ఆమె నటించారు. అన్ని భాషల్లో ఆమె ఒక సూపర్ స్టార్. కళాకారులకు పెన్షన్ ఇవ్వాలని తను ఎంతగానో పోరాడింది. ప్రభుత్వ లాంఛనాలతో జమున అంత్యక్రియలు జరపాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌కు విజ్ఞప్తి చేస్తున్నా. అలాగే కేంద్రం ఆమెకు పద్మ అవార్డ్ ఇవ్వాలని కోరుకుంటున్నా' అన్నారు నారాయణమూర్తి. చదవండి: ఎన్టీఆర్‌ను జమున కాలితో తన్నడంపై వివాదం తెలుగు సినీ ఇండస్ట్రీ మహారాణి.. జమున మరణంపై సెలబ్రిటీల సంతాపం -
అన్ని ప్రాంతాలపై సీఎం జగన్ సమదృష్టి
అనంతపురం కల్చరల్: సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి అన్ని ప్రాంతాల పట్ల సమాన భావన ఉందని సినీనటుడు, దర్శకుడు ఆర్.నారాయణమూర్తి అన్నారు. ప్రముఖ కథా రచయిత డాక్టర్ శాంతి నారాయణ రచించిన ‘సాధన’ నవలావిష్కరణ సభ ఆదివారం అనంతపురంలోని జెడ్పీ సమావేశ మందిరంలో జరిగింది. ఆత్మీయ అతిథిగా పాల్గొన్న ఆర్.నారాయణమూర్తి మాట్లాడుతూ రాయలసీమ గొప్ప సంస్కృతీ సంప్రదాయాలకు నెలవన్నారు. కానీ సినీ పరిశ్రమలోని కొందర స్వార్థపరులు సీమ సంస్కృతిని కించపరిచేలా ఫ్యాక్షన్ ముద్ర వేసి చూపించడం తనకు వేదన కల్గిస్తోందని చెప్పారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని తనతోపాటు కొంతమంది కలసి వెనుకబడిన ఉత్తరాంధ్ర పరిస్థితుల గురించి వివరించిన వెంటనే తాండవ రిజర్వాయర్, ఏలూరు కాలువ ఎత్తిపోతల పథకానికి రూ.470 కోట్లతో అనుమతులివ్వడం సంతోషదాయకమన్నారు. అంతకుముందు నారాయణమూర్తిని ఏపీ నాటక అకాడమీ చైర్మన్ రాగే హరిత, వైఎస్సార్సీపీ నాయకులు చామలూరు రాజగోపాల్ వైఎస్సార్ జీవిత సాఫల్య పురస్కార గ్రహీతలు బండి నారాయణస్వామి, డాక్టర్ శాంతినారాయణ ఘనంగా సత్కరించారు. ఈ సభకు ఉప్పరపాటి వెంకటేశు అధ్యక్షత వహించగా, రాయలసీమ ఉద్యమ నాయకులు బొజ్జా దశరథరామిరెడ్డి, మాలపాటి అశోకవర్ధనరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇదీ చదవండి: చకచకా సదుపాయాలు.. జోరుగా ‘నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు’ -
ఏపీ ముఖ్యమంత్రి జగన్‌గారికి కృతజ్ఞతలు
‘‘కళారంగంలో శ్రీ వైఎస్ రాజశేఖర్ రెడ్డిగారి జీవిత సాఫల్య పురస్కారం కె. విశ్వనాథ్‌గారితో పాటు నాకూ దక్కినందుకు సంతోషంగా ఉంది. ఇందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిగారికి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి «కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను’’ అని ప్రముఖ దర్శక– నిర్మాత, నటుడు ఆర్. నారాయణమూర్తి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ– ‘‘రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉత్పన్నమవుతున్న సమస్యలపై ‘అర్ధరాత్రి స్వతంత్రం’ నుంచి సినిమాలు తీస్తున్న నన్ను పీపుల్స్‌స్టార్ అని ప్రజలు అభిమానిస్తున్నందుకు ఆనందంగా ఉంది’’ అన్నారు. -
సినీనటుడు నారాయణమూర్తికి మాతృవియోగం
సాక్షి, కాకినాడ: సినీ నటుడు ఆర్.నారాయణమూర్తి తల్లి రెడ్డి చిట్టెమ్మ (93) మంగళవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. వృద్దాప్య సంబంధ అనారోగ్యంతో ఆమె కొద్దికాలంగా బాధపడుతున్నారు. కాకినాడ జిల్లా కాకినాడలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్సపొందుతూ మృతి చెందారు. విజయనగరం జిల్లాలో సినిమా షూటింగ్లో ఉన్న ఆమె కుమారుడు ఆర్.నారాయణమూర్తి ఈ విషయం తెలుసుకున్న వెంటనే బుధవారం స్వస్థలం రౌతులపూడి మండలం మల్లంపేట చేరుకున్నారు. తల్లి పార్థివదేహాన్ని సందర్శించి కన్నీటి పర్యంతమయ్యారు. మల్లంపేటలో మధ్యాహ్నం అంత్యక్రియలు నిర్వహించారు. చిట్టెమ్మకు ఏడుగురు సంతానం. ఐదుగురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు వీరిలో మూడో కుమారుడు నారాయణమూర్తి. చిట్టెమ్మ మరణం గ్రామానికి, చుట్టుప్రక్కల గ్రామాల ప్రజలకు తీరనిలోటని పలువురు పేర్కొన్నారు. చదవండి👉కామెడీ, లవ్, సెంటిమెంట్‌గా... అంతేనా.. ఇంకేం కావాలి’ -
రాజ్యాంగ పరిరక్షణకు ఉద్యమం చేపట్టాలి
అగనంపూడి (గాజువాక): కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ హక్కులను కాలరాస్తోందని సినీ నటుడు, దర్శక, నిర్మాత ఆర్.నారాయణమూర్తి అన్నారు. రాజ్యాంగేతర శక్తిగా మారి ప్రజా, కార్మిక వ్యతిరేక విధానాలను అవలంభిస్తోందన్నారు. ఉక్కు పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం చేపట్టిన జైల్ భరో కార్యక్రమం కూర్మన్నపాలెం కూడలి నుంచి ప్రారంభమైంది. ఈ సందర్భంగా నారాయణమూర్తి మాట్లాడుతూ .. రాజ్యాంగ పరిరక్షణకు ఉద్యమం చేపట్టాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. విశాఖ ఉక్కు పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఏడాది నుంచి ఉద్యమాలు చేపడుతున్నా కేంద్రం స్పందించకపోవడం తగదన్నారు. ఇప్పటికే విద్య, వైద్య, రక్షణ, బ్యాంకింగ్ రంగాలను ప్రైవేటీకరించిన కేంద్రం కొరియన్ సంస్థ పోస్కోకు విశాఖ స్టీల్‌ను అమ్మేస్తే భవిష్యత్‌లో తెలుగు ప్రజలకు ఉపాధి, ఉద్యోగావకాశాలు మృగ్యం అవుతాయన్నారు. విశాఖ జోలికి రావద్దని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పోస్కో యాజమాన్య ప్రతినిధులకు చెప్పారని, అవసరమైతే కడప స్టీల్‌ప్లాంట్ అప్పగిస్తామని చెప్పినా అవసరం లేదని వారు తేల్చి చెప్పేశారన్నారు. కేవలం విశాఖ ఉక్కు భూములు, ఇక్కడ సహజ నౌకాశ్రయం ద్వారా దేశ సంపదను తరలించిపోడానికి పన్నిన పన్నాగమన్నారు. దీనిని ప్రజలు గ్రహించి మేల్కొనాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సీపీఎం నాయకుడు సీహెచ్.నరసింగరావు, ఉక్కు పరిరక్షణ కమిటీ నాయకులు మంత్రి రాజశేఖర్, వై.మస్తానప్ప, డి.ఆదినారాయణ పాల్గొన్నారు. 239 మంది కార్మికుల అరెస్ట్ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆదివారం నిర్వహించిన జైల్ భరో కార్యక్రమంలో గాజువాకలో 239 మంది కార్మికులు, కార్మిక సంఘాల నేతలు స్వచ్ఛందంగా అరెస్టయ్యారు. జీవీఎంసీ గాంధీ బొమ్మ వద్ద, తగరపువలసలో కూడా జైల్‌భరో నిర్వహించారు. ఆయా ప్రాంతాల్లో పలువురు స్వచ్ఛందంగా అరెస్టయ్యారు. -
మహానుభావుడు జగన్ సినిమాను బ్రతికిస్తాడు
-
ప్రభాస్, బన్నీలపై ఆర్ నారాయణమూర్తి ఆసక్తికర వ్యాఖ్యలు
పీపుల్ స్టార్ ఆర్.నారాయణ మూర్తి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సినిమాలే ఆయనకు ప్రపంచం. డబ్బుల కోసం కాకుండా సమాజం కోసం మంచి సందేశాత్మక సినిమాలు తీస్తూ దర్శకుడిగా.. నిర్మాతగా.. నటుడుగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగు చిత్ర పరిశ్రమ అంటే ఆయనకు అమితమైన ప్రేమ. టాలీవుడ్‌కి చెందిన హీరోలు కానీ, దర్శకులు కానీ మంచి స్థాయిలో రాణిస్తే.. ఆయన మురిసిపోతాడు. బహిరంగంగానే వారిని అభినందిస్తాడు. తాజాగా ప్రభాస్, అల్లు అర్జున్లపై ఆర్ .నారాయణ మూర్తి ప్రశంసల వర్షం కురిపించాడు. నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన శ్యామ్ సింగ రాయ్ డిసెంబర్ 24న విడుదలై పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్తున్న విషయం తెలిసిందే. సినిమాను నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద ప్రొడక్షన్ నెంబర్ వన్‌గా వెంకట్ బోయనపల్లి నిర్మించిన ఈ చిత్రంలో సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్లు హీరోయిన్లుగా నటించారు. తాజాగా ఈ మూవీ యూనిట్ హైదరాబాద్‌లో సక్సెస్ మీట్‌ని ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన ఆర్.నారాయణ మూర్తి.. ప్రభాస్, బన్నీలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రపంచం గర్వించదగ్గ గొప్ప హీరోలు ప్రభాస్, అల్లు అర్జున్ అని కొనియాడాడు. ‘మంచి సినిమాలు వస్తే కరోనాను సైతం లెక్కచేయకుండా థియేటర్స్‌కి వస్తామని తెలుగు ప్రేక్షకులు ‘అఖండ’తో మరోసారి నిరూపించారు. కరోనా టైం లో కూడా ‘అఖండ’, ‘పుష్ప’, ‘శ్యామ్ సింగ రాయ్’ తో థియేటర్స్ కళ కళ లాడాయి. యావత్ భారత దేశంలో నంబర్ వన్ సినీ ఇండస్ట్రీ తెలుగు ఇండస్ట్రీ, సెల్యూట్ గర్వించదగిన విషయం. గత రోజుల్లో తమిళనాడు నుంచి కానీ, ముంబై నుంచి కానీ దర్శకులు, హీరోలు వస్తుంటే ఇక్కడ తెలుగు మీడియా బాగా కవర్ చేసేది. ఆ దశ మన తెలుగు వారికి ఎప్పుడు వస్తుందో అనుకునేవాడిని. కానీ ఇప్పుడు యావత్ యావత్ భారత దేశంలో నంబర్ వన్ సినీ ఇండస్ట్రీ తెలుగు ఇండస్ట్రీ. తెలుగు రచయితలు, తెలుగు దర్శకుడు, హీరోలు ప్రపంచాన్ని ఏలుతున్నారు. మనవాళ్లు ఎక్కడికి వెళ్లిన మీడియా వస్తుంది. కే విశ్వనాథ్ శంకరాభరణం తీసి ప్రపంచ సినీ చిత్రపటం మీద తెలుగు చిత్ర పరిశ్రమ గొప్పతనం చెప్పాడు. తర్వాత ఒక బాహుబలి తీసి మన రాజమౌళి తెలుగువారి సత్తా చాడాడు. ఆల్ ఓవర్ ఇండియాలో మన తెలుగు హీరోలెవరూ స్టాండ్ కాలేదు. ఇంతకుముందు ఒకరు అయ్యారు. దటీజ్ పైడి జయరాజ్. బాలీవుడ్లో తన సత్తాను చాటుకోవడమే కాకుండా దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును దక్కించుకొన్నారు. ఆ తర్వాత రేఖ, వైజయంతి మాలా, శ్రీదేవి లాంటి వాళ్లు హీరోయిన్లు సక్సెస్ అయ్యారు. కానీ హీరోలు ఎవరూ అక్కడ జెండా ఎగురవేయలేకపోయారు. కానీ బాహుబలి దెబ్బకు ప్రభాస్ దుమ్ముదులుపుతున్నాడు. ఇప్పుడు ప్యాన్ ఇండియా స్థాయికి వచ్చినందుకు ప్రభాస్‌కు మనంతమంతా సపోర్ట్ ఇవ్వాలి అల్లు అర్జున్‌కి మలయాళంలో ఎంతో క్రేజ్ వుంది. ఇటీవల కేరళకు వెళ్లి చాలా చిన్న హోటల్ దిగాను. అప్పుడు ఇక్కడ టాప్ హీరోలు ఎవరు అని అడిగితే.. మోహన్ లాల్, మమ్ముట్టి, అల్లు అర్జున్ అని చెప్పారు. మలయాళంలో మన తెలుగువాడి సత్తా ఇది. ఒకప్పుడు షోలో, జంజీర్, భాషా సినిమాల్లో అమితాబ్, రజనీకాంత్ డైలాగ్స్ చెప్పుకొనే వారు. కానీ పుష్ప తర్వాత దేశవ్యాప్తంగా అల్లు అర్జున్ చెప్పిన ‘తగ్గేదే లా’ అనే మాటని ప్రపంచం అనుకరిస్తూ ఉంది. అది మన తెలుగు హీరోల ఘనత’ అని నారాయణ మూర్తి చెప్పుకొచ్చారు. -
రైతు పక్షపాతిగా సీఎంలు జగన్, కేసీఆర్: ఆర్.నారాయణమూర్తి
సత్తుపల్లి: ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు వైఎస్.జగన్మోహన్రెడ్డి, కె.చంద్రశేఖర్‌రావు రైతు పక్షపాతిగా అనేక పథకాలు అమలు చేస్తున్నారని సినీ నటుడు, దర్శక నిర్మాత ఆర్.నారాయణమూర్తి కొనియాడారు. వీరి తరహాలోనే ఢిల్లీ, కేరళ సీఎంలు కూడా వ్యవహరిస్తున్నారని తెలిపారు. ఇటీవల ఆయన నటించి, నిర్మించిన రైతన్న సినిమా విడుదల సందర్భంగా గురువారం భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో నారాయణమూర్తి పర్యటించారు. ఈ మేరకు ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. రైతుబీమా, రైతుబంధు, ఉచిత విద్యుత్ వంటి మంచి పథకాలతో రైతులకు మేలు చేస్తున్న సీఎంలను ఎవరూ మరువలేరని తెలిపారు. కాగా, ముప్ఫైఆరేళ్లుగా తాను అనేక సినిమాలు తీశానని తన సినిమాలను చూడాలని ఎప్పుడూ కోరలేదని తెలిపారు. అయితే, కేంద్రప్రభుత్వం తెచ్చిన నూతన వ్యవసాయ చట్టాలు వరాలు కాదు..శాపాలని చెప్పేందుకే రైతన్న సినిమా తీశానని వెల్లడించారు. ఈ సినిమా ప్రజల్లో వెళ్లాలని, రైతుల కష్టాలను అందరూ గుర్తించాలనే భావనతో ప్రచారం చేస్తున్నట్లు ఆయన తెలిపారు. -
‘రైతన్న’..వారి కష్టాలు కళ్లకు కట్టినట్లు..
‘‘కేంద్ర ప్రభుత్వం తెచ్చిన రైతు వ్యతిరేక చట్టాలను వెంటనే రద్దు చెయ్యాలి. దేశానికి రైతే వెన్నెముఖ అంటారు. కానీ అన్నదాత ప్రస్తుతం ఏ పరిస్థితుల్లో ఉన్నాడు? అనే కథాంశంతో ‘రైతన్న’ సినిమా తీశా. ఈ సినిమాలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, వంగపండు ప్రసాదరావుగార్లు పాటలు పాడారు.. వారికి నా నివాళులు’’ అని ఆర్. నారాయణ మూర్తి అన్నారు. ఆయన ప్రధాన పాత్రలో నటించి, స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ‘రైతన్న’ సినిమా త్వరలో విడుదల కానుంది. ఈ సందర్భంగా పలువురు రైతు నాయకుల కోసం హైదరాబాద్‌లో ‘రైతన్న’ సినిమాని ప్రదర్శించారు. ఈ సందర్భంగా వ్యవసాయశాఖ మాజీ మంత్రి వడ్డే శోభ నాద్రీశ్వరరావు మాట్లాడుతూ– ‘‘ఈ రోజు రైతులు ఎదుర్కొంటున్న కష్టాలు, వారి బాధలు, కేంద్ర ప్రభుత్వం తెచ్చిన రైతు చట్టాల వల్ల ఎలాంటి కష్టాలు వస్తాయో ‘రైతన్న’ చిత్రంలో కళ్లకు కట్టినట్లు చూపించారు నారాయణ మూర్తి. స్వామినాథన్ కమిషన్ నివేదికను వెంటనే అమలు పరచాలి’’ అన్నారు. కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం, టీఆర్ఎస్ నాయకులు కోదండ రెడ్డి, చాడ వెంకట్ రెడ్డి, మధు, శ్రీనివాసరెడ్డి, ప్రజాకవి గద్దర్, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న, కవి అందె శ్రీ, రైతు నాయకులు వెంకట రామయ్య, మల్లారెడ్డి, గోవర్ధన్, సాగర్, పద్మ తదితరులు పాల్గొన్నారు. -
May Day: కార్మికుల హక్కులు, కష్టాలను తెలియజేసే పాటలు
కార్మికులు తమ హక్కుల కోసం రక్తం చిందించి పోరాడి సాధించిన రోజు నేడు(మే 01). ఈ రోజును మేడేగా కార్మికులు ఎంతో ఘనంగా జరుపుకుంటూ ఉంటారు. సమాజ గతిని, పురోగతిని శాసించేది, నిర్ధేశించేది శ్రామిక వర్గం. అలాంటి వర్గాన్ని మనమంతా గౌరవించాల్సింది. శ్రామిక వర్గం కష్టాలు, హక్కులపై తెలుగు చాలా సినిమాలు వచ్చాయి. ముఖ్యంగా ఆర్ నారాయణ మూర్తి సినిమాలన్నీ శ్రామికుల హక్కులకు సంబంధించినవే. ఆయన పాటలకు కూడా వారి కష్టాలను తెలియజేసేవిగా ఉంటాయి. మేడే సందర్భంగా శ్రామిక వర్గాలకు సంబంధించిన తెలుగు సినిమా పాటలు మీకోసం. > -
దయచేసి టికెట్ ధర పెంచొద్దు
‘‘థియేటర్‌కు మళ్లీ ప్రేక్షకులు వస్తారు. సినిమాను ఆదరిస్తారనే నమ్మకంతో విడుదల చేసిన ‘సోలో బ్రతుకే సో బెటర్’ టీమ్‌ను అభినందిస్తున్నాను. ముఖ్యంగా కేసీఆర్‌గారు, వైఎస్ జగన్‌గారు థియేటర్స్ ఓపెన్ చేయడమే కాకుండా రాయితీలు కూడా ప్రకటించడం చాలా ఆనందంగా ఉంది. జనవరి 1న, సంక్రాంతి సందర్భంగా విడుదలయ్యే సినిమాలకు ‘సోలో బ్రతుకే సో బెటర్’ మార్గదర్శిగా నిలిచింది. ఈ సమయంలో ఎవరూ టికెట్ ధర పెంచవద్దని నా మనవి. రేట్లు పెంచేస్తే సామాన్య ప్రేక్షకుడు సినిమాను ఏం చూస్తాడు? టికెట్ ధర పెంచడానికి కేసీఆర్‌గారు, వైఎస్ జగన్‌గారు ఒప్పుకోవద్దని కోరుతున్నాను’’ అన్నారు నటుడు–దర్శక–నిర్మాత ఆర్. నారాయణమూర్తి. సాయితేజ్, నభా నటేశ్ జంటగా సుబ్బు దర్శకత్వంలో బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించిన చిత్రం ‘సోలో బ్రతుకే సో బెటర్’. ఇటీవల విడుదలైన ఈ సినిమా థ్యాంక్స్ మీట్లో ఆర్. నారాయణమూర్తి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ‘‘సాయితేజ్‌గారు ఓ సోదరుడిలా నాకు అండగా నిలబడి ఎంతగానో సపోర్ట్ చేశారు. ఆర్. నారాయణమూర్తిగారు ఇచ్చిన ఇంటర్వ్యూని వాడుకున్నాను. ఆయన పెద్ద మనసుతో అంగీకరించారు. నిర్మాతలు బీవీఎస్ఎన్ ప్రసాద్, బాపినీడుగార్లకు జీవితాంతం రుణపడి ఉంటాను’’ అన్నారు సుబ్బు. ‘‘ఈ సినిమా రిలీజ్ అనేది ఇండియన్ సినిమా ఇండస్ట్రీకే ఓ మార్గదర్శకంగా కనిపిస్తోంది. ఎందుకంటే ఈ సినిమాకు ఇండస్ట్రీ మొత్తం చేసిన సపోర్ట్‌కి అందరూ అభినందిస్తున్నారు’’ అన్నారు బీవీఎస్ఎన్ ప్రసాద్. సాయితేజ్ మాట్లాడుతూ – ‘‘కోవిడ్ ప్రభావంతో అందరూ టీవీలు, ఓటీటీలకు అలవాటు పడిపోతారేమోనని భయపడ్డాం. అదే సమయంలో జీ స్టూడియో వారు అడిగితే, ప్రొడ్యూసర్‌గారికి లాభాలు రావాలనే ఉద్దేశంతో సినిమాను వారికి ఇచ్చేశాం. అయితే థియేటర్స్ ఓపెన్ అయ్యి.. అప్పటికి సినిమా ఓటీటీలో విడుదల కాలేదంటే అప్పుడు థియేటర్స్‌లోనే విడుదల చేద్దామనే అనుకున్నాం. థియేటర్స్‌ను ఓపెన్ చేసుకోవచ్చని అనుమతి ఇచ్చిన రెండు తెలుగు ప్రభుత్వాలకు మా టీమ్ తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రేక్షకులు వస్తారో, రారోనని టెన్షన్ పడ్డాం. కానీ వచ్చి మా సినిమాను ఆశీర్వదించారు. అందరికీ ధన్యవాదాలు’’ అన్నారు. -
శిరస్సు వంచి నమస్కరిస్తా.. రద్దు చేయండి
కృష్ణలంక (విజయవాడ తూర్పు) : కోట్లాది మంది రైతుల పక్షాన ప్రధాని మోదీకి శిరస్సు వంచి నమస్కారం చేస్తా, దయచేసి రైతు వ్యతిరేక మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయండని ప్రముఖ సినీ దర్శకుడు ఆర్.నారాయణమూర్తి వేడుకున్నారు. గవర్నర్‌పేటలోని మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రంలో అంతర్జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘాల సమన్వయ సమితి రాష్ట్ర కన్వీనర్ వడ్డే శోభనాద్రీశ్వరరావు అధ్యక్షతన బుధవారం వ్యవసాయ సంక్షోభం–పరిష్కారం అనే అంశంపై రైతు సంఘీభావ సభ నిర్వహించారు. నారాయణమూర్తి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం వెంటనే రైతు వ్యతిరేక మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని, విద్యుత్ ప్రైవేటీకరణ బిల్లును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. రైతులు, కౌలు రైతులు, వ్యవసాయ కార్మికులతో సహా అన్ని రంగాల ప్రజల మద్దతును కూడగట్టి విజయాలను సాధించగలగడమే స్వర్గీయ చరణ్‌సింగ్‌కు ఇచ్చే ఘనమైన నివాళులన్నారు. వడ్డే శోభనాద్రీశ్వరరావు మాట్లాడుతూ రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయకపోతే రైతాంగ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఆలిండియా కిసాన్ సభ జాతీయ ఉపాధ్యక్షుడు రావుల వెంకయ్య మాట్లాడుతూ రైతుల రుణ విమోచన చట్టం తీసుకువచ్చి రైతులను, కౌలు రైతులను అప్పుల ఊబి నుంచి రక్షించాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వై.కేశవరావు మాట్లాడారు. అనంతరం రైతాంగ ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్ళడానికి కార్యాచరణ ప్రకటించారు. ఈ నెల 24న మండల కేంద్రాల్లో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు రిలే నిరాహార దీక్షలు చేపట్టాలని, 27, 28 తేదీలలో మాకీబాత్ కార్యక్రమానికి నిరసనగా డప్పులు, పళ్లేలు మోగించి నిరసన తెలపాలని, ఆదాని, అంబానీ వస్తువులను బహిష్కరించాలని, ఉద్యమాన్ని కొనసాగించాలని పిలుపునిచ్చారు. అనంతరం వి.శ్రీనివాసరావు రాసిన వ్యవసాయ చట్టాలతో రైతుకు మరణ శాసనం పుస్తకాన్ని ఆవిష్కరించారు. సభలో ఏపీ కౌలు రైతు సంఘం ప్రధాన కార్యదర్శి పి.జమలయ్య, రైతు కూలీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సింహాద్రి ఝాన్సీ, రైతు సంఘం ప్రధాన కార్యదర్శి సూర్యనారాయణ, ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్లు, వివిధ రైతు, కార్మిక సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
సీఎం జగన్‌కు పూర్తి మద్దతు: నారాయణ మూర్తి
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంచి పనులు చేస్తున్నారని సినీ నటుడు ఆర్.నారాయణ మూర్తి అన్నారు. తనకు రాజకీయ పార్టీలతో ప్రమేయం లేదని, ప్రజల కోసం పని చేసే ముఖ్యమంత్రికి పూర్తి మద్దతు ప్రకటిస్తున్నానని తెలిపారు. ఆయన ఆదివారం విశాఖలో మీడియాతో మాట్లాడుతూ.. దేశంలోని ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్న వ్యక్తి సీఎం జగన్ అని కొనియాడారు. సీఎం జగన్ హయాంలో ఉత్తరాంధ్ర మరింత అభివృద్ధి చెందుతుందని తెలిపారు. ఇప్పటి వరకు విశాఖపట్నం, తూర్పుగోదావరి సరిహద్దులోని మెట్ట ప్రాంతాల్లో ఒక పంట పండటమే కష్టంగా ఉండేదన్నారు. ఏలేరు, తాండవ రిజర్వాయర్లు ఉన్నా పరిస్థితిలో ఎటువంటి మార్పు రాలేదని గుర్తుచేశారు. కానీ, ఈ సమస్యలను గుర్తించిన ముఖ్యమంత్రి ఏలేరు నీటిని తాండవకు అనుసంధానం చేసి భవిష్యత్తులో సాగు నీటికి ఇబ్బంది లేకుండా చేశారని పేర్నొన్నారు. ప్రజల సమస్యలను గుర్తించి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టే సీఎం జగన్‌కు ఎల్లప్పుడూ తన సంపూర్ణ మద్దతు ఉంటుందని వ్యాఖ్యానించారు. -
‘అప్పుడు మేం చాలా ఇబ్బందులు పడ్డాం’
సాక్షి, తూర్పుగోదావరి: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆంగ్లమాధ్యమాన్ని ప్రవేశ పెట్టడం అభినందనీయమని సినీ నటుడు ఆర్ నారాయణమూర్తి పేర్కొన్నారు. జిల్లాలోని అనపర్తి జీబీఆర్ కళాశాలలో గురువారం జరిగిన ఒ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మేము చదువుకునే సమయంలో ఉచిత ఆంగ్ల మాధ్యమాం లేక ఇబ్బందులు పడ్డామని, సీఎం జగన్ నిర్ణయాన్ని తాను స్వాగతిస్తున్నానని అన్నారు. పరిపాలన వికేంద్రీకరణ అన్ని చోట్ల ఉంటేనే అభివృద్ధి జరుగుతుందని, మూడు రాజధానులే ముద్దని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆనాడే చెప్పారని అన్నారు. చిన్న చిన్న రాష్ట్రాలతోనే అభివృద్ధి జరుగుతుందని, శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం కర్నూలు రాజధాని అవ్వాలని ఆనాడే పెద్దలు చెప్పారని పేర్కొన్నారు. అమ్మ తెలుగు భాష, నాన్న ఇంగ్లీష్ భాష అని అమ్మానాన్న కలయికే భాష అని ఆయన వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు సినీ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రీ, మెట్రో ఎండీ ఎంవిఎస్ రెడ్డి, అనపర్తి ఎమ్మెల్యే సూర్యానారాయణ తదితరులు పాల్గొన్నారు. -
రాజధానులపై నిర్ణయాన్ని స్వాగతిస్తున్నా
-
సీఎం జగన్‌కు హ్యాట్సాఫ్: ఆర్. నారాయణమూర్తి
సాక్షి, కాకినాడ: ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టడాన్ని ప్రముఖ నటుడు ఆర్. నారాయణమూర్తి స్వాగతించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని ఆయన ప్రశంసించారు. ఆర్. నారాయణమూర్తి బుధవారమిక్కడ మీడియాతో మాట్లాడుతూ...‘ ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టిన సీఎం జగన్‌కు హ్యాట్సాఫ్. తెలుగు భాష కాపాడమంటున్న వారి ఇళ్లలో ఇంగ్లీష్ మాట్లాడుకుంటున్నారు. మాతృభాషలో విద్యాబోధన జరగాలంటూ మరోవైపు వాళ్ల పిల్లల్ని మాత్రం కార్పొరేట్ సూళ్లలో చదవిస్తున్నారు. మా తరంలో ఇంగ్లీష్ మీడియంలో చదివినవాళ్లు ఇప్పుడు కలెక్టర్లుగా పని చేస్తున్నారు. తెలుగు మీడియంలో చదివితే బడుగు, బలహీన వర్గాల పిల్లలు ప్యూన్లు, బంట్రోతులు మాత్రమే అవుతారు’ అని వ్యాఖ్యలు చేశారు. -
వసూళ్లు పెరిగాయి
ఆర్.నారాయణమూర్తి నటించి, స్వీయ దర్శకత్వంలో స్నేహచిత్ర పిక్చర్స్ పతాకంపై నిర్మించిన చిత్రం ‘మార్కెట్లో ప్రజాస్వామ్యం’. గత శుక్రవారం విడుదలైన మా సినిమా మంచి విజయం సాధించింది అంటున్నారు నారాయణమూర్తి. ఇంకా ఆయన మాట్లాడుతూ– ‘‘క్యాడర్ వర్సెస్ లీడర్’ అనే కా¯ð ్సప్ట్‌తో తెరకెక్కిన మా సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. మొదటి రోజు కంటే రెండో రోజు, రెండోరోజు కంటే మూడోరోజు వసూళ్లు పెరిగాయి. సినిమాలోని కొన్ని కీలక సన్నివేశాలు చూసి కుటుంబ కథా చిత్రం అంటున్నారు. సినిమా బాగుందంటూ ప్రేక్షకులు ఫోన్‌చేసి చెబుతుంటే చాలా ఆనందంగా ఉంది. ప్రజా ప్రతినిధుల ఫిరాయింపులను అడ్డుకోవాలని చూపించిన పాయింట్‌ను జనం అభినందిస్తున్నారు. మా సినిమాని ఆదరిస్తున్న ప్రేక్షకులకు కృతజ్ఞతలు’’అన్నారు. -
వసూళ్లు పెరిగాయి
ఆర్.నారాయణమూర్తి నటించి, స్వీయ దర్శకత్వంలో స్నేహచిత్ర పిక్చర్స్ పతాకంపై నిర్మించిన చిత్రం ‘మార్కెట్లో ప్రజాస్వామ్యం’. గత శుక్రవారం విడుదలైన మా సినిమా మంచి విజయం సాధించింది అంటున్నారు నారాయణమూర్తి. ఇంకా ఆయన మాట్లాడుతూ– ‘‘క్యాడర్ వర్సెస్ లీడర్’ అనే కా¯ð ్సప్ట్‌తో తెరకెక్కిన మా సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. మొదటి రోజు కంటే రెండో రోజు, రెండోరోజు కంటే మూడోరోజు వసూళ్లు పెరిగాయి. సినిమాలోని కొన్ని కీలక సన్నివేశాలు చూసి కుటుంబ కథా చిత్రం అంటున్నారు. సినిమా బాగుందంటూ ప్రేక్షకులు ఫోన్‌చేసి చెబుతుంటే చాలా ఆనందంగా ఉంది. ప్రజా ప్రతినిధుల ఫిరాయింపులను అడ్డుకోవాలని చూపించిన పాయింట్‌ను జనం అభినందిస్తున్నారు. మా సినిమాని ఆదరిస్తున్న ప్రేక్షకులకు కృతజ్ఞతలు’’అన్నారు. -
లీడర్ వర్సెస్ క్యాడర్
‘‘ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం మన భారతదేశం. అలాంటి మన దేశం ఈ రోజు ప్రజాస్వామ్యంతో మనగలుగుతుందా? అనే ప్రశ్న మనకు మనం వేసుకుంటే లేదనే చెప్పాలి. ఎందుకంటే ఈ రోజు నోటుకు ఓటు అన్నట్లు అయింది. ఈ రకంగా చేయటం వల్ల విత్తు ముందా చెట్టు ముందా అన్నట్టుగా నాయకుల తప్పా, ప్రజల తప్పా? అనే ప్రశ్న తలెత్తుతోంది’’ అన్నారు ఆర్. నారాయణమూర్తి. స్నేహచిత్ర పతాకంపై స్వీయదర్శకత్వంలో ఆర్. నారాయణమూర్తి నటించి, రూపొందించిన చిత్రం ‘మార్కెట్లో ప్రజాస్వామ్యం’ ఈ శుక్రవారం విడుదల కానుంది. ఈ సందర్భంగా ఆర్. నారాయణమూర్తి చెప్పిన విశేషాలు. ► గతంలో ఓటర్లు ఎలాంటి ప్రలోభాలకు లోను కాకుండా మంచి నాయకుడిని తమకు అండదండలుగా ఉండే నాయకుడిని ఎన్నుకొనేవారు. తర్వాతి కాలంలో ఆ వాతావరణాన్ని పూర్తిగా నాశనం చేశారు ఈ రోజు వచ్చిన నాయకులు. ఎందుకు ఆ మాట అంటున్నానంటే ఈ రోజు ఎవరైతే నాయకుడు ఎన్నికల్లో పోటీ చేస్తున్నాడో అతనికి తను పోటీచేసే నియోజకవర్గం ఎల్లలు కూడా తెలియటం లేదు. కారణం వారు ఏదో ఒక వ్యాపారంలో కోట్లు గడించి రాజకీయాల్లోకి వస్తున్నారు. పోటీ చేస్తున్నవారు లోకల్ వాళ్లు కాకపోతే అక్కడి ప్రజలకు ఏ సమస్యలు ఉన్నాయో వారికెలా తెలుస్తుంది. రాజకీయం అనేది సర్వీస్ మోటో, అది కాస్తా ఇప్పుడు బిజినెస్ మోటోగా మారిపోయింది. కోట్లు ఖర్చు పెట్టి మరీ రాజకీయాల్లోకి వస్తున్నారు. వారు పెట్టిన డబ్బును తిరిగి సంపాదించటానికి తప్పుదోవలో ప్రయాణిస్తున్నారు. అప్పుడు ఇది ప్రజాస్వామ్యం ఎట్లా అవుతుంది. ధనస్వామ్యం అవుతుంది కానీ... అలా కాకూడదు అని చెప్పేదే నా ఈ ‘మార్కెట్లో ప్రజాస్వామ్యం’. ► ఈ సినిమాని ప్రేక్షకులు ఎందుకు చూడాలి అంటే కారణం ఉంది. ఆ రోజుల్లో మొదటగా రాచరికం ఉండేది, తర్వాత నియంతృత్వం వచ్చింది. ఆ దశ నుండి మిలటరీ రూల్, అక్కడినుండి కమ్యూనిస్ట్ రూల్ (కొంతమంది కలిసి పరిపాలించటం) తర్వాత వచ్చిందే ప్రజాస్వామ్యం. అన్నింటిలోకి గొప్పది గవర్నమెంట్ పరిపాలించే బెస్ట్ రూల్ ప్రజాస్వామ్యం. అది అత్యంత శాంతియుతమైనది. చదువుకున్నవాడు, చదువు లేనివాడు, ఉన్నవాడు, లేనివాడు.. అందరికీ ఒకేరకమైన హక్కు మన ప్రజాస్వామ్యం మనకు కలిగించింది. అందరి ఓటు విలువ ఒక్కటే. 100 కోట్లు పెట్టగలిగే వారు భారతదేశంలో 10 శాతం మాత్రమే. 90 శాతం మందికి అంత స్తోమత లేదు. ఆ కారణంగా ఈ పదిశాతం మందే మనల్ని పాలిస్తామంటే కుదరదు. 10 శాతం ఉన్నవాళ్లు పరిపాలించే దౌర్భాగ్య స్థితి నుంచి 90 శాతం ప్రజలు పరిపాలించే రోజు వస్తేనే ఇది ప్రజాస్వామ్యం అవుతుంది. ఈ విషయాన్నే సినిమాలో చూపించాను. ► ఈ సినిమాలో నా పాత్ర పేరు అంజిబాబు. ఓ రాజకీయ పార్టీకి క్యాడర్లో 40 సంవత్సరాలుగా సపోర్ట్ చేసే నాయకునిగా ఉండే పాత్ర నాది. ఈ సినిమాలో ఇసుక మాఫియాని అరికట్టే ప్రయత్నంలో లీడర్నే ఎదిరించే పాత్రను చేశాను. సినిమా కథ ఒక్క మాటలో చెప్పాలంటే లీడర్ వర్సెస్ కేడర్. ఓ రకంగా ఇది రామాంజనేయ యుద్ధం లాంటి కథ ఇది. మంచి డ్రామా ఉంటుంది. సినిమాలో మొత్తం ఆరు పాటలు ఉన్నాయి. 4 పాటలు పెద్ద హిట్ అయ్యాయి. గద్దర్ అన్న రాసిన పాటను విమలక్క పాడారు. సుద్దాల అశోక్ తేజ గారు ఓ పాట రాశారు. ఆ పాటను మనో పాడారు. గశికంటి రాజలింగం ఓ పాట రాశారు. ఆ పాటను ‘వందేమాతరం’ శ్రీనివాస్ పాడారు. గోరేటి వెంకన్న రెండు పాటలు రాశారు, అందులో ఓ పాటను ఆయనే పాడారు. హ్యాట్సాఫ్ టు వై.ఎస్. జగన్ నేను ఈ రోజు మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్. జగన్మోహన్ రెడ్డి గారిని అభినందిస్తున్నాను. చాలామంది నాయకులు మీ పార్టీలోకి వస్తామంటే ఆయన ‘ముందుగా మీరు మీ పదవులకు రాజీనామాలు చేయండి. అప్పుడు పార్టీలో చేరండి. అంతేగానీ ఫిరాయింపులు మాత్రం వద్దు’ అని తేల్చి చెప్పారు. నా సినిమా కూడా ఫిరాయింపులకు వ్యతిరేకంగా తీసిన సినిమానే. అందుకే హ్యాట్సాఫ్ టు జగన్మోహన్రెడ్డి గారు. అదేవిధంగా కె.సి.ఆర్ గారు కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ప్రారంభించిన రోజున ఎగువన ఉన్న మహారాష్ట్ర సీయంను దిగువన ఉన్న ఆంధ్రప్రదేశ్ సీయంను ఆహ్వానించి ఇరు రాష్ట్రాల సీయంలతో పాటు శంకుస్థాపన చేయటం రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు మహదానందకరమైన విషయం. అలాగే కె.సి.ఆర్‌గారు, జగన్‌గారు కూర్చొని రెండు రాష్ట్రాల్లో నీరు వృథాగా పోకుండా ఎక్కడెక్కడ డ్యామ్‌లు నిర్మించవచ్చో చర్చించినందుకు హ్యాట్సాఫ్ టూ బోత్ చీఫ్ మినిస్టర్స్. -
‘మార్కెట్లో ప్రజాస్వామ్యం’ ఆడియో ఫంక్షన్
-
సినిమా అంటే మూర్తికి పిచ్చి
-
మూర్తి కోసమే ఫంక్షన్‌కి వచ్చా : చిరంజీవి
సాక్షి, హైదరాబాద్ : పీపుల్స్ స్టార్ ఆర్.నారాయణమూర్తి నటించి స్వీయ దర్శకత్వంలో సొంత నిర్మాణ సంస్థ స్నేహచిత్ర పిక్చర్స్ పతాకంపై తెరకెక్కించిన సినిమా ‘మార్కెట్లో ప్రజాస్వామ్యం’. ఈ సినిమా ఆడియో ఫంక్షన్ మంగళవారం సాయంత్రం మే 21న ప్రసాద్ ల్యాబ్స్‌లో జరిగింది. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మెగాస్టార్ చిరంజీవి నారాయణమూర్తితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఆయన నికార్సయిన మనిషని ప్రశంసలు కురిపించారు. ‘నా మిత్రుడికి ఆనందాన్ని కలిగించేందుకే నేను ఈ ఫంక్షన్‌కి వచ్చా. నారాయణమూర్తితో నాలుగున్నర దశాబ్దాల పరిచయం నాది. ఈ ఆడియో వేడుకకు రావడం సంతోషంగా ఉంది. సినిమా అంటే మూర్తికి పిచ్చి. కమర్షియల్ అయిపోతున్న ఈరోజుల్లో తన కమిటిమెంట్‌తో ముందుకు సాగుతున్నాడు. అప్పటి నారాయణమూర్తి ఇప్పటి నారాయణమూర్తి ఒక్కడే. ఆస్తులు, అంతస్తులు కాదు సినిమానే ప్రాణం అనుకున్నాడు. సినిమానే ప్రేమించాడు, సినిమానే పెళ్లి చేసుకున్నాడు, సినిమాతోనే సంసారం చేస్తున్నాడు. దేశంలో ప్రజాస్వామ్యం అస్తవ్యస్తం అవుతోంది. నారాయణమూర్తి చిత్రం ఇందుకు నిదర్శనం’అన్నారు. సినిమా అంటే మూర్తికి పిచ్చి -
శ్రీదేవి గొప్పతనం అది
‘‘ఈ ఇండస్ట్రీ ఆ ఇండస్ట్రీ అన్న తేడా లేకుండా ఇండియాలోనే ఒక నంబర్ 1 స్టార్‌గా ఎదిగిన శ్రీదేవిగారిపై రామారావుగారు పుస్తకం రాయడం చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి మూమెంట్స్ రామారావుగారితోనే ఆగిపోతాయేమో అనిపించింది. ఎందుకంటే ఈ రోజుల్లో అందరూ కమర్షియల్ అయిపోయారు’’ అన్నారు నిర్మాత ‘దిల్’ రాజు. సీనియర్ పాత్రికేయులు పసుపులేటి రామారావు రచించిన ‘అతిలోకసుందరి శ్రీదేవి కథ’ పుస్తకావిష్కరణ బుధవారం జరిగింది. రకుల్‌ప్రీత్ సింగ్ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ప్రథమప్రతిని మాదాల రవి అందుకున్నారు. తొలిప్రతిని శివాజీరాజా కొనుగోలు చేశారు. యువకళావాహిని–సియోటెల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ‘‘అతిలోకసుందరి అనే టైటిల్ ఒక్క శ్రీదేవిగారికే సూట్ అవుతుంది. ఇండియాలో సూపర్‌స్టార్ శ్రీదేవిగారు. దురదృష్టవశాత్తు ఆమె మనకు దూరమయ్యారు. కానీ ఎప్పటికీ గుర్తు ఉంటారు. శ్రీదేవిగారిపై పుస్తకం రాసిన రామారావుగారికి శుభాకాంక్షలు’’ అన్నారు రకుల్. దర్శక–నిర్మాత– నటుడు ఆర్. నారాయణమూర్తి మాట్లాడుతూ– ‘‘శ్రీదేవిగారు మరణించినప్పుడు ప్రపంచమంతా కన్నీరు కార్చింది. ఆమె గొప్పతనం అలాంటిది. ఆమెపై పుస్తకం రాసిన పసుపులేటి రామారావుగారికి సెల్యూట్’’ అన్నారు. సినిమాల సెన్సార్ విషయంలో ఇటీవల జరుగుతున్న పరిణామాలపై ఆయన మాట్లాడుతూ– ‘‘నా సినిమా సెన్సార్ సమస్య వల్ల ఓసారి ముంబై వెళ్లాను. శ్రీదేవిగారు ఏ తెలుగువారు అక్కడ కనిపించినా ఆత్మీయంగా మాట్లాడేవారు. నన్ను అక్కడ చూశారు. ‘బాగున్నారా? ఏంటి.. ఇలా వచ్చారు’? అన్నారు. ‘సెన్సార్ ఇబ్బందుల్లో పడ్డాను’ అన్నాను. ‘మీ విప్లవ సినిమాలు బాగుంటాయి. నాకు కూడా అలాంటి సినిమాల్లో నటించాలని ఉంది’ అన్నారు. ఇప్పుడు ఆ శ్రీదేవిగారు ఉంటే.. సెన్సార్ పరంగా ఇప్పుడు ఏవేం జరుగుతున్నాయో చూసి కన్నీరు పెట్టుకునేవారు. ఎంత దుర్మార్గమండి.. రామ్‌గోపాల్ వర్మగారు ఓ సినిమా (‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ను ఉద్దేశించి) తీశారు. సెన్సార్ చేయరా? ఎవరెవరో వచ్చి ఎగిరిపడితే ఆపేస్తారా? పోసానిగారు ఓ సినిమా (‘ముఖ్యమంత్రిగారూ మీరు మాట ఇచ్చారు’ చిత్రాన్ని ఉద్దేశించి) చేశారు. దాన్ని సెన్సార్ చేయరా? అసలేం జరుగుతోంది. ఏం ప్రజాస్వామ్యం ఇది? సెన్సార్‌బోర్డ్ వాళ్లు చెబుతారా ఏ సినిమా చూడచ్చో, ఏది చూడకూడదో. ఇలా నిర్మాతలను ఇబ్బంది పెడితే ఎలా? ఎన్.టీ రామారావుగారి మీద ‘మండలాదీశుడు’ సినిమా తీస్తే... ‘రామారావుగారూ.. మీ గురించి ఇలా తీశారు’ అంటే.. ‘మా గురించి గొప్పగా చెప్పినా చూస్తారు. తిట్టినా చూస్తారు బ్రదర్’ అన్నారు. అదీ ఆయన సంస్కారం. 1962లో మనకు, చైనాకు యుద్ధం వచ్చిన సమయంలో నెహ్రూగారి విధానాలను తప్పుపడుతూ జర్నలిస్ట్, కార్టూనిస్ట్ ఆర్కే లక్ష్మణ్ కార్టూన్లు వేశారు. కొందరు రాజకీయనాయకులు ఆర్కే లక్ష్మణ్‌పై వ్యాఖ్యలు చేశారు. అప్పుడు ‘‘కళాకారులు, జర్నలిస్టులు ప్రజలపక్షం. మనం వారి వాదనలను వినాలి. వారి అభిప్రాయాలను గౌరవించాలి’’ అని నెహ్రూ అన్నారు. ఇప్పుడేంటండీ.. మనం సినిమా తీస్తాం. సెన్సార్ ఆగిపోవడమా? అమరావతి వెళ్లి వివరణ ఇచ్చుకోవడమా? ఎవరో కోర్టుకు వెళితే సినిమాను ఆపేయాలా? అలాంటప్పుడు సెన్సార్ బోర్డ్ పర్పస్ ఏంటి? ఇలాంటి సెన్సార్ విధానాన్ని ముక్తకంఠంతో ఖండించాలి’’ అన్నారు. ‘‘శ్రీదేవిగారు పాత్రికేయులను బాగా గౌరవించేవారు’’ అన్నారు పసుపులేటి రామారావు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. -
రైతులు బంద్ ప్రకటిస్తే?
‘‘రైతే రాజు అంటారు. ఆ రాజే లేకపోతే ప్రజలు ఏమవుతారు? ౖరైతులు ఆత్మహత్యలు చేసుకోకుండా ఉండాలన్నా.. వ్యవసాయం దండగ కాదు, పండగ కావాలన్నా డా.స్వామినాథన్ కమిటీ సిఫార్స్‌లను కేంద్ర ప్రభుత్వం వెంటనే అమలు చేయాలి’’ అని ఆర్. నారాయణమూర్తి అన్నారు. ఆయన నటించి, స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ‘అన్నదాత సుఖీభవ’ రేపు రిలీజ్ అవుతోంది. నారాయణమూర్తి మాట్లాడుతూ– ‘‘పంటలకు మద్దతు ధర లేకుంటే రైతులు సహనం కోల్పోతారు. అలుగుటయే ఎరుగని ధర్మరాజు అలిగితే ఎలా ఉంటుందో.. గంగిగోవులాంటి రైతు కోపోద్రిక్తుడై రైతు బంద్ ప్రకటిస్తే ప్రజల పరిస్థితి ఏంటì ? అన్నదే మా సినిమా. సుద్దాల అశోక్‌తేజ, గోరటి వెంకన్న, గద్దర్, వంగపండు మంచి పాటలిచ్చారు’’ అన్నారు. -
దర్శకులు మెచ్చిన ‘అన్నదాత సుఖీభవ’
ఆర్. నారాయణమూర్తి స్వీయ దర్శకత్వంలో స్నేహచిత్ర పిక్చర్స్ పతాకంపై నిర్మించిన చిత్రం ‘అన్నదాత సుఖీభవ’. సెప్టెంబర్ 7న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా తెలుగు చిత్ర పరిశ్రమలోని కొందరు ప్రముఖులకు ‘అన్నదాత సుఖీభవ’ చిత్రాన్ని ప్రత్యేకంగా ప్రదర్శించారు ఆర్. నారాయణమూర్తి. చిత్రాన్ని వీక్షించిన అనంతరం ప్రముఖులు ఈ విధంగా స్పందించారు. నగలు తాకట్టు పెట్టానన్నాడు: కోడి రామకృష్ణ ప్రతి రైతు, ప్రతి విద్యార్థి, ప్రతి టీచర్, ప్రతి రాజకీయ నాయకుడు.. ముఖ్యంగా మన భారత ప్రధాని ఈ సినిమా చూడాలి. సినిమా చూస్తున్నప్పుడు మనం రైతులను వెంటనే కాపాడాలనే ధైర్యం, ఆత్రుత కలిగాయి. నాకు కౌలు రైతులున్నారు. వారు నా దగ్గరికి కౌలు డబ్బులు ఇవ్వటానికి వచ్చినప్పుడల్లా ఈసారి గిట్టుబాటు ధర రానందున మా ఆవిడ నగలు తాకట్టు పెట్టి తెచ్చానండి అనేవాడు. మరో రైతు మా అబ్బాయి స్కూల్ ఫీజు కట్టలేదన్నాడు. ఇలా చెబుతున్నప్పుడు ఇప్పుడు మనం ఈ డబ్బులు తీసుకోవాలా, అలా తీసుకుంటే మనం రాక్షసులం అనే ఫీలింగ్ వచ్చేది నాకు. అందుకే నాలా ప్రతి ఒక్కరూ ఫీల్ అవ్వండి. పంటలు పండించే రైతును మనం సానుభూతితో చూద్దాం. రైతు లేనిదే దేశం లేదు: ముత్యాల సుబ్బయ్య ఈ చిత్రంలో ప్రతి పాటా మెసేజ్ ఓరియంటెడ్‌గా ఉంది. రైతు లేనిదే దేశం లేదు. గ్రామాలనుండి, పట్టణాల వరకు రైతు ప్రాముఖ్యతను తెలియజేస్తూ, రైతుల డిమాండ్‌ను పాలకులు పట్టించుకోకపోతే తిరగబడి రైతులందరూ సమ్మె చేస్తే.. ఈ సినిమాకు ఇది అద్భుతమైన ఫినిషింగ్. కల్తీ గురించి బాగా చూపించారు: కోదండ రామిరెడ్డి ప్రతిరోజు అందరం వింటున్నాం. పాలల్లో కల్తీ, నూనెల్లో కల్తీ, విత్తనాల్లో కల్తీ.. ఇలా ప్రతిదీ కల్తీనే. దీని గురించి సినిమాలో బాగా చూపించారు. ప్రతి సమస్యను చర్చించారు: తమ్మారెడ్డి భరధ్వాజ ఈ చిత్రంలో రైతుకి ఉండే ప్రతి సమస్యను చర్చించారు. వాటి పరిష్కార మార్గాల్ని చూపించారు. ఇంత ధైర్యంగా సినిమా తీసినోడు ఎవరూ లేరు. మంచి సినిమా తీశారు. ఈ సినిమా అందరూ చూడాలని.. చూస్తారని ఆశిస్తున్నా. ఆత్మహత్యలు లేని రైతు రాజ్యం రావాలి: యన్.శంకర్ ఇప్పుడున్న జనరేషన్‌కి వాళ్లు తింటున్న అన్నం ఎక్కడి నుండి వస్తుంది? అదెక్కడ పుడుతుంది? ఎవరు పుట్టిస్తారు అనేది తెలియదు. ఈ సినిమాను ఈ జనరేషన్ పిల్లలు చూడాలి. ఆత్మహత్యలు లేని రైతు రాజ్యం రావాలని, రైతు ఇంట్లో సంబంధం అంటే ఎంత గౌరవంగా ఉంటుందో అనే విధంగా సమాజంలో మార్పు రావాలని కోరుకుంటున్నా. రైతు సమస్యకు పరిష్కారం లేదు: ధవళ సత్యం ఈ దేశానికి కొరుకుడు పడని సమస్య రైతు సమస్య. ఆ సమస్యలకు పరిష్కారం లేనివాడు రైతే. రైతులందరూ ఈ సినిమా చూసి నేర్చుకోవాలి. తను పండించిన పంట గిట్టుబాటు ధర రానందుకు ఆత్మహత్య తప్ప వేరే మార్గమే లేదు అనుకునే సమయంలో ఒక రైతు ‘తిరగ బడదాం, గిట్టుబాటు ధర కోసం.. పోరుబాట చేద్దాం’ అనేదే ఈ చిత్రకథ. ఆర్. నారాయణమూర్తి మాట్లాడుతూ– ‘‘ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ స్వామినాథన్ కమిటీ ఏం సిఫారసు చేసిందంటే.. రైతు పండించే పంటకు, ఉత్పత్తి అయ్యే ఖర్చు ఏమైతే ఉందో, ఆ రైతు శ్రమ, రైతు కుటుంబ శ్రమ, పెట్టుబడి, వడ్డీ, కౌలు సమస్తం పోను అదనంగా 50 శాతం లాభం ఇవ్వాలి. దానిని ఇంప్లిమెంట్ చేయాలని ఈ ‘అన్నదాత సుఖీభవ’ చిత్రం ద్వారా కేంద్రానికి విజ్ఞప్తి చేస్తున్నాను’’ అన్నారు. ఇంకా ఈ చిత్రాన్ని వీక్షించిన దర్శకులు రేలంగి నరసింహారావు, వైవీయస్ చౌదరి, వీర శంకర్, రాంప్రసాద్, దేవీ ప్రసాద్, సంగీతం దర్శకుడు ఆర్పీ పట్నాయక్ తదితరులు ‘‘అన్నదాత సుఖీభవ’ అందరూ చూడాల్సిన సినిమా’’ అన్నారు.