
సాక్షి, కాకినాడ: సినీ నటుడు ఆర్.నారాయణమూర్తి తల్లి రెడ్డి చిట్టెమ్మ (93) మంగళవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. వృద్దాప్య సంబంధ అనారోగ్యంతో ఆమె కొద్దికాలంగా బాధపడుతున్నారు. కాకినాడ జిల్లా కాకినాడలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్సపొందుతూ మృతి చెందారు. విజయనగరం జిల్లాలో సినిమా షూటింగ్‌లో ఉన్న ఆమె కుమారుడు ఆర్.నారాయణమూర్తి ఈ విషయం తెలుసుకున్న వెంటనే బుధవారం స్వస్థలం రౌతులపూడి మండలం మల్లంపేట చేరుకున్నారు.
తల్లి పార్థివదేహాన్ని సందర్శించి కన్నీటి పర్యంతమయ్యారు. మల్లంపేటలో మధ్యాహ్నం అంత్యక్రియలు నిర్వహించారు. చిట్టెమ్మకు ఏడుగురు సంతానం. ఐదుగురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు వీరిలో మూడో కుమారుడు నారాయణమూర్తి. చిట్టెమ్మ మరణం గ్రామానికి, చుట్టుప్రక్కల గ్రామాల ప్రజలకు తీరనిలోటని పలువురు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment