News Of Son Death In Canada, Depressed Mother Dies - Sakshi
Sakshi News home page

కెనడాలో కొడుకు మరణం.. తట్టుకోలేక భారత్‌లో ఆగిన తల్లి గుండె..

Published Sat, Jul 29 2023 6:30 PM | Last Updated on Sat, Jul 29 2023 6:41 PM

News Of Son Death In Canada Depressed Mother Dies - Sakshi

చంఢీగడ్‌: కన్న కొడుకు మరణవార్త వినలేకపోయింది. ఆ వార్త తన చెవిలో పడగానే కళ్లు తిరిగి పడిపోయింది. అంతే.. ఇగ తిరిగి మేల్కోలేదు. కొడుకుతోపాటు తాను అనంతలోకాలకు చేరింది. కొడుకు, తల్లికి ఒకేసారి అంత్యక్రియలు జరిపారు. ఈ బాధాకర ఘటన పంజాబ్‌లోని నవాన్‌షహర్ జిల్లాలో జరిగింది.

పంజాబ్‌కు చెందిన గుర్‌విందర్ నాథ్(24) చదువు కోసం కెనడా వెళ్లాడు. ఒంటారియో ప్రావిన్స్‌లో పిజ్జా డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నాడు. జూలై 9న కొందరు దుండగులు అతనిపై దాడి చేశారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ జులై 14న అక్కడే మృతి చెందాడు. ఈ విషయం తెలుసుకున్న కుటుంబ సభ‍్యులు ఈ విషయాన్ని గుర్‌విందర్ తల్లి నరీందర్ కౌర్‌కు చెప్పలేదు. 

గుర్‌విందర్ మృతదేహం శుక్రవారం ఢిల్లీ విమానాశ్రయానికి వచ్చిందనే విషయం అతని తల్లికి ఎట్టకేలకు తెలిసింది. ఇక కుమారుని మరణవార్త విన్న ఆమె తీవ్ర మనోవేదనకు గురైంది. దుఖిస్తూ కళ్లు తిరిగి పడిపోయింది. ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఆమెను స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లారు. తర్వాత ఆమెను లూథియానాలోని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాడు. తల్లి, కొడుకుకు ఒకేసారి శుక్రవారం ఉదయం 11 గంటలకు అంత్యక్రియలు జరిపారు. 

ఇదీ చదవండి: షాకింగ్..! ఆర్టీఐ ధరఖాస్తుకు 40 వేల పేజీల రిప్లై.. ఏకంగా ట్రక్కులోనే..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement